scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

latest posts of celebrities on social media

ప్రతిరోజూ సెలవే అయినా...

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


ఎండలో ‘చందమామ’..!

View this post on Instagram

No. It’s not a headache.

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘చందమామ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. తెలుగు తెరకు పరిచయమై సుమారు 13 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళుతోందీ ముద్దుగుమ్మ. ఇక తాజాగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు-2’లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని ఇప్పటికీ యంగ్‌హీరోయిన్లకు పోటీనిస్తోందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ఇక ఇదిలా ఉంటే కాజల్ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఏదో ఫొటో షూట్‌లో భాగంగా దిగిన ఫొటోలను ‘త్రో బ్యాక్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేసిందీ చిన్నది. ఎండలో.. కాంతి కిరణాలు తనపై పడుతుండగా.. వయ్యారంగా నడుము తిప్పుతూ దిగిన ఫొటో అభిమానులను చూపు తిప్పుకోనివ్వట్లేదు. ముఖంపై ఎండ పడుతోన్న మరో ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘కాంతి (లైట్) సరిగ్గా ఉన్నప్పుడు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ ఫొటోలో గులాబీ రంగు గౌను, తెలుపు బ్లౌజ్‌తో కూడిన డ్రస్‌లో కాజల్ అచ్చంగా దివి నుంచి నేలకు దిగొచ్చిన దేవ కన్యలా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి కాజల్‌ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.




బ్యాక్ టు బేసిక్స్..

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on


అందమైన రూపం, ఆకట్టుకునే నటన.. ఇవీ నటి ప్రగ్యా జైస్వాల్ సొంతం. నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుందీ చిన్నది.
ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రెండీ లుక్‌లో దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘బ్యాక్ టు బేసిక్స్’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో పాటు, బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీని జోడించింది.

View this post on Instagram

Back to basics! 🖤🤍

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on


మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా..


తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్ కపూర్. 2007లో వచ్చిన ‘సావరియా’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సోనమ్.. అనతి కాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

ఇక నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సోనమ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేసింది. తండ్రి అనిల్ కపూర్, చెల్లి రేహా కపూర్‌లతో కలిసి చిన్నతనంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ బ్యూటీ. ఈ ఫొటోతో పాటు తండ్రి, చెల్లిని ఉద్దేశిస్తూ.. ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on


కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇంట్లోనే ఉంటూ ఎవరికి నచ్చిన తీరులో వారు సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార అను ఇమాన్యుయెల్. ఇంట్లో సోఫాలో పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఇంట్లో ఉంటూ.. పడుకోవడం, నెట్‌ఫ్లిక్స్లో సినిమాలు చూడడం కాకుండా.. మీరేం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఆనందంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media