scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మీలో నాతో పాటు ఎవరొస్తారు?

latest posts of celebrities on social media

నాతో ఎవరొస్తారు..?

20320socialpost650-5.jpg

బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి అతియా శెట్టి. తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ చిన్నది. 2015లో వచ్చిన ‘హీరో’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పలు సినిమాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయగా మంచి పేరు సంపాదించుకుంటోందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే అతియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్నానని తెలుపుతూ తన చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. ‘నేను తిరిగి 90ల్లోకి వెళుతున్నాను. నాతో పాటు ఎవరొస్తారు?’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Athiya Shetty (@athiyashetty) on

అక్కాచెల్లెళ్ల కాలక్షేపం..

కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న అలజడికి అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడిన నేపథ్యంలో సినీ తారలకు బోలెడంత ఖాళీ సమయం దొరుకుతోంది. ఇలా అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి కూతురు, నటి జాన్వీ కపూర్‌ తన చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి ‘కరోనా హాలిడేస్‌’ని ఎంజాయ్‌ చేస్తోంది.

20320socialpost650-2.jpg
ఖుషీతో కలిసి చేసిన అల్లరి పనులను ‘ఇన్‌స్టా స్టోరీ’లో పోస్ట్‌ చేసిందీ చిన్నది. గజిబిజిగా పెయింట్‌ చేసిన ఒక ఆర్ట్‌ను పోస్ట్‌ చేసిన జాన్వీ దానికి.. ‘ప్రస్తుతం నా ఆలోచన ఇలా ఉంది’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఇక మరో స్టోరీలో చెల్లి ముఖంపై ఎవరో స్కెచ్‌ వేస్తున్న వీడియోను, ఇంకో స్టోరీలో.. ఖుషీ నూడుల్స్‌ తింటుండగా జాన్వీ చేతిలో పెయింట్‌ బ్రష్‌ పట్టుకున్న చిన్న వీడియోను పోస్ట్‌ చేసింది. మొత్తానికి జాన్వీ తన ఖాళీ సమయాన్ని చెల్లితో ఇలా జాలీగా ఎంజాయ్‌ చేస్తోందన్నమాట.

20320socialpost650-3.jpg


20320socialpost650-4.jpg

మీ సంతోషానికి రహస్యం అదే..!

20320socialpost650-6.jpg

‘ఆర్‌ఎక్స్‌-100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమాలో మంచి నటనను ప్రదర్శిస్తూనే మరోవైపు గ్లామర్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ. ఇక అనంతరం వచ్చిన ‘వెంకీమామ’ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకూ దగ్గరైందీ చిన్నది. ఇటీవల ‘డిస్కోరాజా’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాజ్‌పుత్‌.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలో నటిస్తోంది.
ఇక ఇదిలా ఉంటే తన తొలి చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుందీ హాట్‌ బ్యూటీ. ‘ఆర్‌ఎక్స్‌-100’ సినిమా చిత్రీకరణ సమయంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘త్రోబ్యాక్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మీతో మీరు ప్రేమలో పడడమే.. మీ సంతోషపు తొలి రహస్యం’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఇది చిన్న హెచ్చరిక మాత్రమే..!

20320socialpost650-8.jpg

ప్రస్తుతం కరోనా దెబ్బకు నగరాలు, పట్టణాలు ‘షట్‌డౌన్‌’ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. ఇదంతా మానవుడు చేసిన తప్పిదానికి ప్రతిఫలమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత బాధ్యత, శుభ్రత విస్మరించడం వల్లే ఇలాంటి వైరస్‌లు విజృంభిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార స్నేహా ఉల్లాల్‌. ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్‌ చేస్తూ మానవాళికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిందీ తార.
రెండు శాటిలైట్లు అంతరిక్షం నుంచి భూమివైపు వస్తున్నట్లు ఉండగా.. భూమిపై ‘సారీ వుయ్‌ ఆర్‌ క్లోజ్‌డ్‌’ అని పెద్ద అక్షరాలతో రాసున్నట్లుగా క్యాప్చర్‌ చేసిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘2020- ఇదొక చిన్న హెచ్చరిక మాత్రమే’ అని ఆలోచింపజేసే క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal) on

నేనూ టిక్‌టాక్‌లోకి వచ్చేశా!

20320socialpost650-7.jpg

సోషల్‌ మీడియా విస్తృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో అందరూ ఏ చిన్న విషయం పంచుకోవాలన్నా సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌ యాప్‌కు ఎంతటి ఆదరణ లభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారలు కూడా ఇందులో ఖాతాలు తెరిచి తమ ఫ్యాన్స్‌కు మరింత చేరువవుతోన్న విషయం తెలిసిందే.
తాజాగా అందాల తార శ్రియ కూడా టిక్‌టాక్‌లోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించిందీ ముద్దుగుమ్మ. భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ వీడియో తీస్తుండగా.. ‘నేను ఈ రోజు టిక్‌టాక్‌లో అడుగుపెట్టాను. ఎంతో ఆనందంగా ఉంది..’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘ఎట్టకేలకు నేనూ టిక్‌టాక్‌లోకి వచ్చేశాను’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-of-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media