scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ఈ ఫ్రేమ్‌ ఎంతో అపురూపం!

latest posts of celebrities on social media

సమయం దొరికితే ఇలా చేయాలి..!

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా కరోనాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని ఏదో ఒక కొత్త పనిని నేర్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదూ! ప్రస్తుతం ఇదే పనిచేస్తోంది నటి, నిర్మాత లక్ష్మీ మంచు. సినిమా షూటింగ్‌లు వాయిదా పడడం, స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో లక్ష్మి, ఆమె కూతురు విద్యా నిర్వాణ ఇంట్లోనే గడుపుతున్నట్లున్నారు. మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోనే దీనికి నిదర్శనమనిపిస్తోంది. విద్యతో కలిసి యోగా చేస్తోన్న ఓ ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిందీ అందాల అమ్మ. లక్ష్మీ యోగా ఆసనం వేయగా విద్య ఆమె వీపుపై కూర్చున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మీరు కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం దొరికినప్పుడు.. మీలోని సృజనాత్మకతను బయటికి తీయండి..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ సూపర్‌ మామ్‌.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

అపురూపమైన ఫొటో ఇది!

తమిళంలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌.. గతేడాది ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో ఆకట్టుకుంది. ఓవైపు ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూనే మరోవైపు గ్లామర్‌ పాత్రల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోన్న ఈ బ్యూటీ.. సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న ఫొటోను తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది ఐశ్వర్య. అలనాటి అందాల తార సిమ్రన్‌ ఒకవైపు, జ్యోతిక మరోవైపు ఉండగా.. మధ్యలో ఐశ్వర్య ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఎంతో అపురూపమైన ఫొటో ఇది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Aishwarya Rajessh (@aishwaryarajessh) on

కరోనా నా స్వేచ్ఛను హరించక ముందు..

సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ కరోనా గురించే చర్చిస్తున్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా బయట తిరగాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయాన్ని ఓ ఫొటో రూపంలో చెబుతోంది నటి లావణ్య త్రిపాఠి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ లవ్లీ గర్ల్‌. లూజ్‌ హెయిర్‌తో, ట్రెండీ అవుట్‌ఫిట్‌లో దిగిన ఓ అందమైన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘కరోనా నా స్వేచ్ఛను హరించక ముందు దిగిన ఫొటో ఇది’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ ‘అందాల రాక్షసి’.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) on

జీవితం అందమైంది ..!

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో పీవీ సింధు ఒక సంచలనం. తన అసమాన ఆటతీరుతో దేశానికి ఎన్నో పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఈ హైదరాబాదీ ప్లేయర్‌.. అనతి కాలంలోనే మంచి క్రీడాకారిణిగా పేరు సంపాదించుకుంది. ఇక కేవలం బ్యాడ్మింటన్‌ కోర్టులోనే కాకుండా బయట కూడా ఎంతో ఉత్సాహంగా ఉండే సింధు.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్‌ అవుట్‌ఫిట్స్‌లో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ స్టార్‌ ప్లేయర్‌కి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ట్రెండీ డ్రస్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘జీవితం అందమైంది.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని ఫ్రెంచ్‌ భాషలో రాసున్న క్యాప్షన్‌ను జోడించిందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.

View this post on Instagram

A post shared by sindhu pv (@pvsindhu1) on

ఒలీవర్‌తో స్వీయ నిర్బంధం ..

‘స్వీయ నిర్బంధం’.. ఇప్పుడీ పదం ఎక్కువగా వినిపిస్తోంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని విధించుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. మేం కూడా దీనికి అతీతులం కాదన్నట్లు సెలబ్రిటీలు కూడా షూటింగ్‌లు వాయిదా పడేసరికి ఇంట్లోనే గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా డాటర్‌ నిహారిక.. తన పెంపుడు కుక్కతో ఇంట్లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మిస్టర్‌ ఒలీవర్‌తో స్వీయ నిర్బంధంలో ఉన్నా’ అంటూ ఫన్నీగా క్యాప్షన్‌ పెట్టిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

మంచుతో వీడ్కోలు చెప్పింది..

పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పూజా ఇటీవలే జార్జియా వెళ్లింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ జార్జియా షెడ్యుల్‌ను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి పయనమైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది నటి పూజా హెగ్డే. జీన్స్‌ ప్యాంట్‌, బ్లూ కలర్‌ జర్కిన్‌ ధరించి మంచులో ఆడుతోన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ బుట్ట బొమ్మ.. ‘జార్జియాను వీడే ముందు దిగిన ఫొటో ఇది.. ఈ దేశం మాకు మంచుతో వీడ్కోలు పలికింది. ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media