scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అన్ని కష్టాలు భరించినా చివరికి ‘అమ్మే’ గెలిచింది!'

'కుటుంబాన్ని పోషించడం, ఇంటిని చక్కబెట్టడం, పిల్లల్ని పెంచడం.. మొదలైన విషయాల్లో భార్యభర్తల బాధ్యత సమానంగా ఉంటుంది. ఒకవేళ భర్త సంపాదించడం చేతకాని అసమర్థుడైతే ఆ బాధ్యతలను పూర్తిగా భార్యే స్వీకరిస్తుంది. కానీ, తను సంపాదించకపోగా భార్య సంపాదనను కూడా తన స్వార్థం కోసం వాడుకొనే భర్త ఉంటే.. ఇక ఆ ఇల్లాలు, పిల్లలు అనుభవించే వేదన మాటల్లో చెప్పలేం..! అలాంటి నరకాన్ని తన తల్లి కూడా అనుభవించిందని చెబుతోంది ఓ యువతి. అయినా వాటికి వెరవకుండా ఎన్నో కష్టాలకోర్చి ప్రస్తుతం సొంత గుర్తింపు సంపాదించుకున్న అమ్మే తనకు అన్ని విధాలా స్ఫూర్తి ప్రదాత అంటూ.. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తన హృదయరాగం మనందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

category logo

నేనెంతో ధనవంతురాలిని !

Latest Posts Of Celebrities On Social Media

కరోనా.. జాగ్రత్త!

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) on

కరోనా వైరస్‌ ప్రభావానికి సెలబ్రిటీలు సైతం తమ సినిమా షూటింగులను పక్కన పెట్టి బయటికి రాకుండా ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ఈ జాబితాలో మన బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ కూడా చేరిపోయింది. సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఈ అందాల భామ తాజాగా తన ఇంటి వద్ద తన ఫ్రెండ్స్‌తో సంతోషంగా గడుపుతున్న ఫొటోలను ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేసింది.. ‘అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటించండి. వ్యాయామం, ధ్యానం మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.. సంతోషంగా ఉండండి..’ అంటూ కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరికీ జాగ్రత్తలు చెప్పిందీ బాలీవుడ్‌ బేబ్‌.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) on

వారణాసి వీధుల్లో..!

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

తరచూ వెకేషన్లకు వెళ్లే సినీతారల్లో ముందు వరుసలో ఉంటుంది పటౌడీ ప్రిన్సెస్‌  సారా అలీ ఖాన్‌. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ లవ్లీ గర్ల్‌.. తన వెకేషన్‌ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం వారణాసిలో భక్తిభావంతో ఉప్పొంగిపోతోన్న ఈ భామ.. అక్కడి విశేషాలను పంచుకుంటూ తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియోని షేర్‌ చేసింది. ట్రెడిషనల్‌ దుస్తులు, మెడలో పూలమాలను ధరించిన సారా.. వారణాసి వీధుల్లో తిరుగుతూ రూపొందించిన ఈ వీడియోలో భాగంగా.. ‘అందరికీ నమస్కారం.. మనమిప్పుడు వారణాసి వీధుల్లో ఉన్నాం. ఇక్కడ ఎన్నో అందమైన రంగురంగుల గాజులు లభిస్తాయి.. ఇక్కడ కనిపించేది పెరుగు.. నిత్యం రద్దీగా ఉండే ఈ గల్లీల్లో వాహనాలు కూడా తిరుగుతాయి.. ఇక్కడ చూడండి.. విభిన్న రంగుల్లో ఎన్ని గాజులున్నాయో!’ అంటూ ఒక్కసారిగా వారణాసి టూరిస్ట్‌ గైడ్‌గా మారిపోయిందీ సుందరి. ఇక ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ..‘అందరికీ నమస్కారం.. వారణాసి వీధుల్లో.. ఈరోజెంత సరదాగా గడిచిందో.. తక్కువ ఖర్చుతోనే బోలెడంత ఆనందం పొందాలనుకునే వారు వారణాసికి వెళ్లాల్సిందే!’ అంటూ తన ఆనందాన్ని అక్షరీకరించిందీ అమ్మడు.

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా కుటుంబంతో కలిసి గంగా నదీ తీరానికి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే.

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఫిట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ..!

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

తన అందం, చక్కటి శరీరాకృతితో సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీలంకన్‌ బ్యూటీ.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌! ఎంతో కష్టమైన కసరత్తులను సైతం అలవోకగా చేసే ఈ బాలీవుడ్‌ బ్యూటీకి యోగా అంటే మహా ఇష్టమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హాట్‌ బ్యూటీ అప్పుడప్పుడూ తను చేసే వ్యాయామాల ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తను యోగా చేస్తున్న వీడియోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.
‘మంచి సంగీతం వింటూ యోగా చేయడంపై దృష్టి పెట్టండి..’ అని రాసుకొచ్చిందీ సిలోన్‌ సుందరి.

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

ఈ క్రమంలో మరొక యోగా వీడియోని పోస్ట్‌ చేస్తూ.. ‘యోగాతో మీ వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకోండి.. సంతోషంగా ఉండండి. ఎప్పుడైనా, ఎక్కడైనా యోగాసనాలు చేయడమంటే నాకిష్టం..!’ అని యోగాపై తనకున్న మక్కువను చాటుకుందీ లవ్లీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

నేనెంతో ధనవంతురాలిని..!

View this post on Instagram

A post shared by Lasya Manjunath (@lasyamanjunath) on

‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’ అనే టీవీ షోతో ఎంతో పాపులరైన బ్యూటిఫుల్‌ యాంకర్‌ లాస్య. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ఈ బుల్లితెర బ్యూటీ 2017లో పెళ్లిపీటలెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతూ.. ‘లాస్య టాక్స్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తూ బిజీగా ఉంటోన్న ఈ అందాల భామ సోషల్‌ మీడియాలో తెగ చురుగ్గా ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకునే ఈ భామ.. ఈరోజు తన భర్త మంజునాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. లాస్య తన భర్తతో దిగిన ఓ అందమైన ఫొటోను పంచుకుంటూ.. ‘నేనెంతో ధనవంతురాలిని.. ఎందుకంటే నాకెంతో గొప్ప మనసున్న భర్త దొరికాడు.. హ్యాపీ బర్త్‌డే మై లవ్‌..!’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమను అక్షరీకరించిందీ సూపర్బ్‌ యాంకర్‌.

View this post on Instagram

A post shared by Lasya Manjunath (@lasyamanjunath) on

ఇదే నీ మొదటి మైలురాయి..!

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.