scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

latest posts of celebrities on social media

బీచ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌..!

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on

‘హవా’ అనే హిందీ హారర్‌ సినిమాతో బాల నటిగా వెండితెరకు పరిచయమైంది నటి హన్సిక. ఇక ‘కోయి మిల్‌గయా’, ‘జాగో’ వంటి చిత్రాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన హన్సిక.. ‘దేశ ముదురు’ సినిమాతో తొలిసారి హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చేప కళ్ల చిన్నది.. అనంతరం వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇక ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో జయసుధ పాత్రలో తళుక్కుమన్న ఈ చిన్నది ప్రస్తుతం ‘మహా’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on

ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే హన్సిక.. తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మాల్దీవుల్లో హాలిడేని ఎంజాయ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఓ బీచ్‌ సైడ్‌ రిసార్ట్‌లో కూర్చొని, తలకు హ్యాట్‌ పెట్టుకొని సముద్రం వైపు చూస్తూ ఆ అందాలను ఆస్వాదిస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేసిన హన్సిక.. ‘సముద్ర తీరంలో బ్రేక్‌ఫాస్ట్‌..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

జలకాలాటలలో..!

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతోంది నటి కాజల్‌ అగర్వాల్‌. దక్షిణాది సినీ పరిశ్రమలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన కెరీర్‌లో ఎదుగుతూ తార స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలీవుడ్‌ చందమామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బ్లూ కలర్‌ స్ట్రాప్‌ డ్రస్‌లో ముస్తాబై స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నీటితో ఆడుకుంటూ క్లిక్‌మనిపించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుందీ చిన్నది. ఇలా జలకాలాటలలో తేలియాడుతున్న ఫొటోలు పోస్ట్‌ చేస్తూ.. ‘సంతోషంగా ఉండే అమ్మాయిలే అందంగా ఉంటారు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. మరి కాజల్‌ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

అది మీ నిర్ణయమే..!

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ పత్రిక కవర్‌పేజీ కోసం దిగిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

జార్జియా.. నేనొచ్చేశా!

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

ఈ ఏడాది ప్రారంభంలోనే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బోణీ కొట్టింది నటి పూజా హెగ్డే. ఇక ఈ అందాల తార ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో పాటు ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న కొత్త సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ఇందులో పాల్గొనడానికి పూజా హెగ్డే తాజాగా జార్జియాకు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో ముక్కుకు మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి క్లిక్‌మనిపించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘సినిమాలపై నాకున్న ప్రేమే నాతో ఈ పనులు చేయిస్తోంది. ‘జార్జియా’.. నేను వచ్చేశాను’ అని క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

ప్రస్తుతం కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పూజ కూడా మాస్కు, గ్లౌజులతో ఓవైపు జాగ్రత్తపడుతూనే.. మరోవైపు కెరీర్‌లో ముందుకు సాగడానికి ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొంటానని చెప్పకనే చెప్పిందీ బుట్టబొమ్మ.

గాల్లో కరోనా ఉంది.. జాగ్రత్త!

View this post on Instagram

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఇక ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ను ఓపెన్‌ చేసినా సరే కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన సమాచారంతో పాటు కరోనాపై జోకులు, మీమ్స్‌ కూడా అదే స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఆలోచింపజేసే క్యాప్షన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది అందాల నటి అనిత. భర్త రోహిత్‌ రెడ్డితో దిగిన ఓ రొమాంటిక్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అనిత.. ‘ఈ ఫొటోకు.. ‘మా చుట్టూ ఉన్నదంతా ప్రేమే’ అనే క్యాప్షన్‌ను పెడదామనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం గాల్లో కరోనా వైరస్‌ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’ అని తనదైన రీతిలో కరోనాపై అందరిలో అవగాహన పెంచుతోందీ బ్యూటీ.
‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది 2013లో వ్యాపారవేత్త రోహిత్‌ రెడ్డిని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Anita H Reddy (@anitahassanandani) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram