scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

వీళ్లే నా లడ్డూలు..!

Latest Posts Of Celebrities On Social Media

క్యూట్‌ కిడ్స్‌..!

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

అందాల నటి సమీరా రెడ్డి సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లవ్లీ మామ్.. తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలు, వీడియోలను సైతం అనునిత్యం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన క్యూట్‌ కిడ్స్‌.. హన్స్‌, నైరాల ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగా తన పాప.. నైరా లేటెస్ట్‌ ఫొటో, హన్స్‌ 2016లో దిగిన ఫొటోను కొలేజ్‌ చేసి పోస్ట్‌ చేస్తూ.. ‘నైరా 2020, హన్స్‌ 2016..! వీళ్లే నా లడ్డూలు..’ అంటూ సరదాగా క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ ఫొటోలో ఈ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకే పోలికలతో ఉండడం మనం చూడచ్చు.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

డ్యాన్సింగ్‌ బేబీ..!

13320socialpost650-3.jpg

తన క్రేజీ యాక్టింగ్‌తో యువతను ఆకట్టుకుంటూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌. తన లేటెస్ట్‌ ఫ్యాషన్‌ లుక్స్‌తో పాటు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తాను డ్యాన్స్‌ చేస్తున్న షార్ట్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోను పంచుకుంటూ.. ‘డ్యాన్సీ.. డ్యాన్సీ..’ అంటూ సరదాగా క్యాప్షన్‌ను జోడించిందీ అమ్మడు.
ఇటీవల విడుదలైన ‘డిస్కో రాజా’తో అలరించిన ఈ తార.. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ సరసన ‘సోలో బతుకే సో బెటర్‌’ చిత్రంలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on

వావ్‌.. అదితి!

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్‌ బ్యూటీ అదితీ రావ్‌ హైదరి. నటనతోనే కాకుండా, చూపు తిప్పుకోలేనంత అందంతో సినీ అభిమానులను కట్టిపడేస్తుందీ అందాల భామ. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటిఫుల్‌ లేడీ.. తాజాగా ఒక ఈవెంట్‌లో అద్భుతంగా మెరిసిపోయింది. రెడ్‌ కలర్‌ ఫ్లోరల్‌ గౌన్‌పై స్టైలిష్‌ బెల్ట్‌ను జతచేసిన అదితి.. వేవీ హెయిర్‌, భారీ ఇయర్‌రింగ్స్‌తో ట్రెండీగా కనిపించింది.

View this post on Instagram

A post shared by Roma Singh (@romasingh14) on

అదితి ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘V’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో న్యాచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు, నివేదా థామస్‌లు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది!

13320socialpost650-2.jpg

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.