scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

latest posts of celebrities on social media

నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌!

View this post on Instagram

Dancing is the language of my soul 💃🥰

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

మీరు నేననుకుంటోన్న వ్యక్తేనా..?

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on

‘కాంచనమాల కేబుల్‌ టీవీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి రాయ్‌ లక్ష్మి. తొలి సినిమాలోనే తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ.. నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఇక అనంతరం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో వరుస సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ‘అకీరా’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక ‘జూలీ-2’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు సినిమా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం లక్ష్మికి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా.. ఓ డిఫరెంట్‌ లుక్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిందీ అందాల తార. అంతా పింక్‌ బ్యాక్‌డ్రాప్‌లో, తానూ పింక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌లో ముస్తాబై, పింక్‌ ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిసీవర్‌ను చెవి దగ్గర పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హలో.. హలో.. హలో.. మీరు నేననుకుంటోన్న వ్యక్తేనా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో చెప్పుకోండి..?’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది.

మీలా మరొకరు ఉండరు..!

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

సోషల్‌ మీడియా పరిధి పెరిగినప్పటి నుంచి సినీ తారలు వారి అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను, ఇతర విశేషాలను తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘త్రో బ్యాక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో గతంలో దిగిన ఫొటోలను తిరిగి పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. మాధురి తన కెరీర్‌ తొలినాళ్లలో నటించిన ఓ సినిమాలోని స్టిల్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘మీలా మరొకరుండరు. అదే మీ అతిపెద్ద శక్తి’! అని అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on


ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్‌ క్వీన్‌గా ఎదిగిన మాధురీ దీక్షిత్‌. మధ్యలో కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయితే తాజాగా మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిందీ స్టార్‌ హీరోయిన్‌.

రంగుల విల్లును తీసి నీవైపు వంతెన వేసి..!

నాగ చైతన్య - సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలోని ‘ఏ పిల్లా’ అనే పాట లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ‘ఏ పిల్లా పరుగున పోదామా..?ఏవైపో జంటగా ఉందామా.? రా రా కంచె దుంకి చక చక ఉరుకుతూ.. ఆ రంగుల విల్లును తీసి నీవైపు వంతెన వేసి.. రావా’ అంటూ సాగే ఈ పాటలోని చరణాలు శ్రోతలకు వీనుల విందు చేస్తున్నాయి. ఇక హరిచరణ్‌ స్వరం ఈ పాటకు మరో హైలైట్‌ అని చెప్పచ్చు. మరి, ఈ మెలోడీ సాంగ్‌ను వింటూ మీరూ మీ ప్రేమలోకంలో విహరించండి.

నాన్నా.. ఇది కచ్చితంగా సమ్మర్‌ కటింగ్‌ కాదు!

‘కేజీఎఫ్‌’ చిత్రంతో ఒక్కసారిగా భారతీయ చిత్రపరిశ్రమను తనవైపు తిప్పుకున్నాడు హీరో యష్‌. అంతకుముందు కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినా.. ‘కేజీఎఫ్‌’ సినిమా యష్‌ రేంజ్‌ను ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హీరో ‘కేజీఎఫ్‌-2’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. యష్‌ దంపతులకు ఒక పాప, ఒక బాబు సంతానం. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ స్టార్‌ హీరో.. కుటుంబానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంటాడు. భార్యాపిల్లలతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఈ హీరో.. తాజాగా తన కూతురు ‘ఐరా’తో దిగిన ఓ క్యూట్‌ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కర్ణాటకలోని శ్రీ కంఠేశ్వర దేవస్థానంలో తన చిన్నారి తలనీలాలు సమర్పించి, అనంతరం తనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. తన వెర్షన్‌లోనే ఓ ఫన్నీ సంభాషణను రాసుకొచ్చాడు.
ఐరా: నాన్నా.. ఇది సమ్మర్‌ అని నాకు తెలుసు.. కానీ మీరు చేయించింది మాత్రం సమ్మర్‌ కటింగ్‌ కాదని నేను బల్లగుద్ది చెప్పగలను!
యష్‌: నువ్వు చెప్పింది నిజమే..! (నవ్వులు)
ఇక ఐరా తన తండ్రిని కోపంగా చూస్తున్నట్లున్న ఈ ఫొటో చూస్తుంటే యష్‌ రాసుకొచ్చిన సంభాషణ నిజమే అన్నట్లుగా ఉంది కదూ!

View this post on Instagram

Ayra : Dad I know its summer... but I'm damn sure THIS is NOT summer cut!!! Dad : Well... ahem!! 😬

A post shared by Yash (@thenameisyash) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సిస్టర్స్.. మీరే లేకుంటే ఈ మహమ్మారితో యుద్ధం చేయలేం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీనివల్ల ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అదే సమయంలో చాలామంది ఆసుపత్రుల్లో బెడ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ‘ఐఐఎంయుఎన్‌’ అనే విద్యార్థుల బృందం ‘ఫైండ్‌ ఏ బెడ్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థను యువతే ముందుండి నడిపిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ‘యువత ద్వారా.. దేశం కోసం’ (By the Youth, For the Country) అనే ట్యాగ్‌లైన్‌ని జోడించారు. 160 పట్టణాల్లో ఉన్న దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా www.Findabed.in అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్పిటల్‌ నంబర్లు, బెడ్ల వివరాలు, క్వారంటైన్‌ సెంటర్ల వివరాలు ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

పూలకుండీలతో పొట్ట చుట్టూ కొవ్వును ఇలా కరిగించండి..!

నటి సాక్షి అగర్వాల్‌ పూల కుండీలతో వ్యాయామం చేస్తోన్న తన వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నాలుగు పూల కుండీలను ఉపయోగించి ఈ అద్భుతమైన వ్యాయామాలను చేయండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉండేలా చూసుకోండి. అయితే నా దగ్గర ఇంత బరువున్న పూల కుండీలు లేవు. కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి..’ అని రాసుకొచ్చింది. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉంటుంది. మా ఇంట్లో ఈ వెయిట్స్ లేవు.. అందుకే కుండీలతో కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి..’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram