scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అందుకే ఆ రోజు నాకు బాగా గుర్తుంది!

Latest Posts Of Celebrities On Social Media

అదొక మధుర జ్ఞాపకం..!

View this post on Instagram

Always Picture perfect with my @Fossil #FossilStyle

A post shared by @ shrutzhaasan on

అటు నటనలోనే కాకుండా సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్న అందాల భామ శృతి హాసన్‌. చిన్నప్పటి నుంచి సంగీతంపై తనకున్న ఆసక్తే తనను గొప్ప గాయనిగా మనందరికీ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడిన ఈ చిన్నది.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని కూడా రూపొందిస్తుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన సినిమా అప్‌డేట్లతో పాటు తాను పాల్గొనే లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ విశేషాలను కూడా షేర్‌ చేస్తుంటుంది.

ఈ క్రమంలో శృతి తన చిన్ననాటి ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ యూనిఫాం ధరించిన శృతి.. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ముందు కూర్చొని పాట పాడుతున్న ఫొటోను ఎవరో షేర్‌ చేయగా.. దాన్ని తిరిగి రీపోస్ట్‌ చేస్తూ.. ‘నేను స్కూల్‌ యూనిఫాంలో పాట పాడుతున్న ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం.. ఓ దిగ్గజ గాయని (ఆశా భోస్లే) సమక్షంలో ఎంతో నెర్వస్‌గా పాట పాడిన ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అదొక మధుర జ్ఞాపకం. ఈ ఫొటోని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు..’ అంటూ పేర్కొందీ స్లిమ్మీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by @shrutzhaasan on

ఫ్యాన్స్‌తో డ్యాన్స్‌..!

View this post on Instagram

Still fighting jet lag tbh....✨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్‌. తన అందం, నటనతో ఎంతోమంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ లవ్లీ గర్ల్‌.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బాలీవుడ్‌ అందం.. అక్కడ తను చేసిన హంగామాకు సంబంధించిన వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ ఈవెంట్‌లో పాల్గొన్న అభిమానులు జాన్వీని డ్యాన్స్‌ చేయమని కోరగా.. ‘ధడక్‌’ సినిమాలోని ‘జింగాత్‌..’ పాటకు స్టేజీపై అదిరిపోయే స్టెప్పులేసిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. ఇలా తాను స్టేజిపై డ్యాన్స్‌తో ఓ వూపు వూపేస్తుంటే అభిమానులు కూడా చిందేస్తూ ఆమెను ఎంకరేజ్‌ చేశారు. ఇలా మరోసారి తన సూపర్బ్‌ డ్యాన్స్‌ స్టెప్పులతో అలరించిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ శారీ లుక్స్‌ అదుర్స్‌..!

చీరకట్టు మగువలోని అందాన్ని రెట్టింపు చేస్తుందని మరోసారి నిరూపించింది మన మంచు వారి వారసురాలు లక్ష్మీ ప్రసన్న. తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకునే ఈ అందాల భామ.. తాను ఇటీవలే అందమైన శారీ లుక్స్‌లో ముస్తాబై క్లిక్‌మనిపించిన ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది.
ఓ లుక్‌లో భాగంగా.. లైట్‌ పింక్‌ కలర్‌ రఫుల్‌ శారీపై.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, డైమండ్‌ బ్యాంగిల్స్‌, మ్యాచింగ్‌ ఇయర్‌రింగ్స్‌ను జతచేసి ఎంతో ట్రెండీగా మెరిసిపోయిందీ లవ్లీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on


ఇక మరో లుక్‌లో భాగంగా.. పీచ్‌ కలర్‌ ఆర్గంజా శారీపై డార్క్‌ రోజ్‌ కలర్‌ వెల్వెట్‌ పఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజును ధరించి ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ బ్యూటీగా దర్శనమిచ్చింది లక్ష్మి. మరి ఈ బ్యూటిఫుల్‌ లేడీ సూపర్బ్‌ శారీ లుక్స్‌ని మీరూ చూసేయండి.

వెల్‌కం పప్పీ గర్ల్‌..!

చాలామంది సెలబ్రిటీలు తమ పెంపుడు జంతువులను కూడా తమ కుటుంబంలోని వ్యక్తుల్లాగే ట్రీట్‌ చేస్తుంటారు. ఇక కొత్త పెట్స్‌ని తమ కుటుంబంలోకి ఆహ్వానించే క్రమంలో ఫొటోలు దిగడం, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం.. ఇలా నానా హంగామా చేస్తుంటారు. ప్రస్తుతం ఇదే సంతోషంలో మునిగి తేలుతోంది టాలీవుడ్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా! ఎయిర్‌పోర్ట్‌లో ఓ చిన్న కుక్కపిల్లను ఎత్తుకొని ముద్దుచేస్తూ క్లిక్‌మనిపించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె.. ‘క్యాండీ (పెంపుడు కుక్క) రాకతో మా కుటుంబం మరింత పెద్దదైంది. పప్పీ గర్ల్‌ నీకు స్వాగతం.. సో హ్యాపీ..’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

గమనిక: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటి నుంచి కరోనా వ్యాపించకపోయినా పెట్స్‌తో ఆడుకునేటప్పుడు, వాటిని ముట్టుకున్నప్పుడు వెంటనే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి !

నేను.. నా ఫ్రెండ్స్‌!

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on

అటు వరుస తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంటూ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ‘హైపర్‌’ బ్యూటీ.. రాశీ ఖన్నా. తన వృత్తిపరమైన విషయాలతో పాటు పర్సనల్‌ విశేషాలను కూడా అభిమానులతో పంచుకునే ఈ క్యూట్‌ డాల్‌.. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫాటోలను ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేసుకుంది. రాశితో పాటు తన స్నేహితులందరూ సోల్జర్స్‌ మాదిరిగా గన్స్‌ పట్టుకొని దిగిన ఈ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘స్నేహితులు ఎవరైతే కలిసి ప్రయాణిస్తారో.. ఎవరైతే కలిసి ఆడుకుంటారో.. వాళ్లు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఐ లవ్‌ యూ గాయిస్‌..!’ అంటూ క్యాప్షన్‌ రూపంలో నిజమైన స్నేహానికి అర్థం చెప్పిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram