scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నువ్వు లేని జీవితం ఊహించుకోలేను ప్రాణమా..!

Latest Posts Of Celebrities On Social Media

లేడీ ‘బాస్‌’!

View this post on Instagram

Boss up▪️▫️ #mentalhood Outfit - @leoandlin Styled - @stylebyami MuH - @kritikagill Photography - @kvinayak11

A post shared by KK (@therealkarismakapoor) on

ప్రస్తుతం నటనకు దూరమైనా.. సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది అందాల నటి కరిష్మా కపూర్‌. ఒక దశలో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ కపూర్‌ బ్యూటీ.. తన ట్రెండీ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో ఈ తరం తారలకు గట్టి పోటీనిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఈ తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయిందీ సుందరి. ఈ క్రమంలో కరిష్మా ఇటీవల ధరించిన ఓ అందమైన మోనోక్రోమ్‌ అవుట్‌ఫిట్‌కి సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. వైట్‌-బ్లాక్‌ స్ట్రైప్‌డ్‌ వైడ్‌ లెగ్‌ ప్యాంట్స్‌ని ధరించిన కరిష్మా.. దానికి ఫుల్‌ స్లీవ్స్‌ వైట్‌ షర్ట్‌ను జతచేసి ప్రొఫెషనల్‌ బ్యూటీగా మెరిసిపోయింది. కాస్త హెవీ మేకప్‌, జడతో అదరగొట్టిన ఈ బాలీవుడ్‌ అందం.. అచ్చం లేడీ బాస్‌ని తలపించింది. మరి, ఈ బాస్‌ బేబీ ప్రొఫెషనల్‌ లుక్‌ని మీరూ ఫాలో అయిపోండి.

View this post on Instagram

A post shared by KK (@therealkarismakapoor) on

నువ్వు లేని జీవితం ఊహించుకోలేను జానూ..!

10320socialpostghg650-2.jpg

రొమాంటిక్‌ కపుల్‌ ఆర్య- సాయేషా సైగల్‌ గతేడాది మార్చిలో ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లవ్లీ కపుల్‌ ఏడడుగులు నడిచి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సాయేషా ఇన్‌స్టా వేదికగా తన ప్రియమైన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘నా జీవితాన్ని అన్ని విధాలా పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను జానూ.. మనిద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమ, స్నేహం, ఉత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..’ అని తన మనసులోని ప్రేమనంతా రంగరించి క్యాప్షన్‌ రూపంలో పోస్ట్‌ చేసింది సాయేషా.

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa) on

వస్తున్నా.. వచ్చేస్తున్నా..!

న్యాచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితీ రావ్‌ హైదరీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘V’. మార్చి 25న ఉగాది సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంలో నాని ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ..’ సంగీత ప్రియులను ఎంతగానో మైమరిపించింది. అయితే ఈ సినిమాలోని రెండో మెలోడీని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దన్నా.. వదిలేస్తానా..’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేది, అనురాగ్‌ కుల్‌కర్ణి ఆలపించారు. ఈ మధురమైన పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. అమిత్‌ త్రివేది శ్రావ్యమైన సంగీతం సమకూర్చారు. ప్రేమ, రొమాన్స్‌ కలగలిసిన ఈ మెలోడీని మీరూ ఓసారి వినేయండి మరి!

సాగర తీరంలో.. ఇసుక తిన్నెల్లో..!

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

‘ఛపాక్‌’ బ్యూటీ దీపికా పదుకొణె తన తదుపరి చిత్రం ‘83’ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తన లేటెస్ట్‌ అప్‌డేట్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘ఎలే’ కవర్‌ పేజీ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా విభిన్న దుస్తులు ధరించి సాగర తీరాన, ఇసుక తిన్నెల్లో కాస్త హాట్‌గా ఫొటోలకు పోజిచ్చిందీ అందాల తార. ఈ ఫొటోలను దీప్స్‌ ఇన్‌స్టాలో పంచుకోగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onView this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

అందుకే ఇండియా అంటే నాకిష్టం..!

View this post on Instagram

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే బాలీవుడ్‌ తారల్లో అందాల నటీమణి ట్వింకిల్‌ ఖన్నా ఒకరు. వివిధ రకాల పోస్టులతో అభిమానులను ఆకట్టుకునే ఈ భామ.. తాజాగా హోలీ పండగ సందర్భంగా ఇన్‌స్టా ద్వారా ఒక ఫొటోని షేర్‌ చేసి తనలోని దేశభక్తిని మరోసారి చాటుకుంది. ఓ భారీ దిష్టిబొమ్మ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘నేను ఇండియాను ప్రేమించడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఇదీ ఒకటి. ముంబైలో నివసించే ప్రజలు కరోనా వైరస్‌ను సూచిస్తున్నట్లుగా ఉన్న ఒక పెద్ద నీలిరంగు దిష్టిబొమ్మను హోలీ వేడుకల్లో భాగంగా దహనం చేశారు..’ అనే క్యాప్షన్‌ పెట్టిన ట్వింకిల్‌.. దానికి ‘హ్యాపీ హోలీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసింది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu