scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

అలా చేస్తే సంతోషం మన ఇంట్లోనే దొరుకుతుంది!

Latest Posts Of  Celebrities On Social media

మీ అందరికీ 9 మిలియన్ల ధన్యవాదాలు..!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేనంత క్రేజ్‌ ఈ హ్యాండ్‌సమ్‌ హీరోకి ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 9 మిలియన్లు దాటింది. ట్విట్టర్‌లో ఇప్పటివరకూ ఇంతమంది ఫాలోవర్లు మరే ఇతర సౌత్‌ ఇండియన్‌ హీరోకీ లేరు. ఈ విషయంపై స్పందిస్తూ.. మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా ట్వీపుల్‌కి 9 మిలియన్ల ధన్యవాదాలు! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనవాళ్లందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు..’ అంటూ రాసుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హంక్‌.

హలో ఇన్‌స్టాగ్రామ్‌..!

బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నిన్నటిదాకా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాలోకి అడుగుపెట్టడంతో తన అభిమానులంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదెంతలా అంటే.. బెబో ఇన్‌స్టాలో ఖాతా తెరిచిన ఒక్కరోజులోనే మిలియన్‌ ఫాలోవర్లను సొంతం చేసుకుందంటేనే అభిమానుల్లో ఆమెకున్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తన ఫొటోను షేర్‌ చేసి ‘హలో ఇన్‌స్టాగ్రామ్‌..’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసిందీ కపూర్‌ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

ఈ క్రమంలో కరీనా.. తన గారాల పట్టి తైమూర్‌ని ఎత్తుకొని దిగిన మరొక ఫొటోని తాజాగా పోస్ట్‌ చేస్తూ.. ‘నా ఫొటోఫ్రేమ్‌లో నేను చోటిచ్చే ఏకైక వ్యక్తి..’ అని తైమూర్‌ని ఉద్దేశిస్తూ పేర్కొందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

హ్యాపీ ఫ్యామిలీ..!

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తగిన సమయం కేటాయించాలని చెప్తోంది నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. నటిగా, యాంకర్‌గా నిత్యం బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన కుటుంబంతో కలిసి గడపడానికి ఎంతో ప్రాధాన్యమిస్తుంది. అలాగే ఆ విశేషాలను సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటుందీ బ్యూటిఫుల్‌ బేబ్‌. ఈ క్రమంలోనే అనసూయ.. ఇటీవలే తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కి వెళ్లినప్పుడు దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ‘సంతోషం మన ఇంట్లోనే దొరుకుతుంది. మనమంతా బిజీ అని నాకు తెలుసు. కుటుంబంతో కలిసి గడపకపోవడానికి మన దగ్గర ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నిజం చెప్పాలంటే.. ఎవ్వరూ అంత బిజీ కాదు. అది కేవలం మనమిచ్చే ప్రాధాన్యం బట్టి ఉంటుంది. అంతే. అందువల్ల మీ కుటుంబం కోసం కాస్త సమయం కేటాయించండి.. జీవితమంటే ఏంటో తెలుసుకోండి..’ అంటూ కుటుంబం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల భామ.

క్యాథరిన్‌ ఇన్‌ గ్రీన్‌..!

View this post on Instagram

💚

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) on

‘యూ ఆర్‌ మై MLA..’ అనిపించుకుంటూ కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల భామ క్యాథరిన్‌ ట్రెసా. తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ చేరువగానే ఉంటుందీ సొగసరి. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్‌ అప్‌డేట్లతో పాటు, తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న క్యాథరిన్‌ అందమైన శారీ లుక్‌లో ఆకట్టుకుంది. డార్క్‌ గ్రీన్‌ కలర్‌ డిజైనర్‌ శారీ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. మ్యాచింగ్‌ స్లీవ్‌లెస్‌ వెల్వెట్‌ బ్లౌజ్‌ను జతచేసింది.. భారీ ఇయర్‌ రింగ్స్‌, సింపుల్‌ మేకప్‌తో మెరిసిన ఈ అందాల తార.. ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీగా తళుక్కుమంది. ఇలా తన అటైర్‌కు సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంటూ నేటి తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోందీ చిన్నది. మరి ఈ బ్యూటిఫుల్‌ బేబ్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.