scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

మీరెక్కడున్నా ఇది మరవకండి!

latest posts of celebrities on social media

ఆ మూడింటితో నేను..!

అలనాటి అందాల తారల్లో నటి రవీనా టాండన్‌ ఒకరు. 1991లో విడుదలైన ‘పత్తర్‌ కే ఫూల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రవీనా.. ఎన్నో విభిన్న పాత్రలను పోషించి అభిమానులను ఆకట్టుకుంది. ఇక నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’.. బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ పలకరించిందీ అమ్మడు. తెలుగులో చివరిగా మోహన్‌బాబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో నటించిన రవీనా.. పలు హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’ చిత్రంలో నటిస్తోందీ బాలీవుడ్‌ క్వీన్‌.

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

ఇండస్ట్రీకి వచ్చి సుమారు 29 ఏళ్లు గడుస్తోన్నా తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న రవీనా.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సముద్రపు ఒడ్డున గంతులేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ఓ మోషన్‌ పిక్చర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ అందాల తార.. ‘ఇసుక, సూర్యుడు, సముద్రం.. నేను’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

మీరెక్కడున్నా ఇది మరవకండి!

View this post on Instagram

💫 Stylist @sandhya__sabbavarapu Pc @charanpallatiphotography Makeup @fiorrcosmetics Outfit @pragnyareddydesignerstudio

A post shared by Avika (@avikagor) on

‘చిన్నారి పెళ్లి కూతురు’ (బాలికా వధూ) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది నటి అవికా గోర్‌. ఈ సీరియల్‌లో ‘ఆనంది’ పాత్రతో ప్రతి ఇంట్లో అమ్మాయిగా మారిపోయిందీ చిన్నది. ఇక హిందీలో వచ్చిన ‘మార్నింగ్‌ వాక్‌’ చిత్రంతో బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అవిక.. సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా తనదైన ముద్ర వేసింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తన క్యూట్‌ నటనతో ఆకట్టుకుంది. అలాగే ‘రాజు గారి గది-3’లో నటించి అందరినీ భయపెట్టింది. చిన్న వయసులోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ క్యూటీ గర్ల్‌.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది.

View this post on Instagram

In a world where you can be anything, be kind.

A post shared by Avika (@avikagor) on

సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అవిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది.
ఓ ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చొని ఓ శునకాన్ని తలపై ప్రేమగా నిమురుతున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా... ఏ స్థాయిలో ఉన్నా సరే.. మంచి మనసుతో ఆలోచించండి.. దయతో మెలగండి..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ చక్కనమ్మ.

కొన్నిసార్లు ఓటమీ మంచిదే..!

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

జీవితంలో ఎప్పుడూ గెలుపులే కాదు.. ఓటములూ ఉండాలని, అవి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయని చెబుతుంటారు పెద్దలు. అయితే తాజాగా అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇలాంటి వేదాంతాన్నే బోధిస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో ఒకరైన రకుల్‌.. తాజాగా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది. బ్లూ-వైట్‌ కాంబినేషన్‌ వన్‌-షోల్డర్‌ డ్రస్‌లో ముస్తాబై సైడ్‌ యాంగిల్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ లవ్లీ గర్ల్‌.. ‘కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచిదే. ఎందుకంటే అదే మీరేంటో మీకు తెలిసేలా చేస్తుంది..’ అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పలు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉందీ బ్యూటిఫుల్‌ గర్ల్‌.

ప్రతీ క్షణం నవ్వుతూనే ఉన్నా..!

‘సిద్ధూ ఫ్రమ్‌ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి శ్రద్ధాదాస్‌. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది.. తెలుగుతో పాటు పలు హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘నిరీక్షణ’ అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోన్న శ్రద్ధ.. మార్చి 4న తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులు, బంధువుల సమక్షంలో జరుపుకొంది.

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43) on

ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఫొటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘నా బెస్ట్‌ బర్త్‌డే వేడుక ఇదే. ప్రతి క్షణం నవ్వుతూనే ఉన్నా. నా పుట్టినరోజును ఇంత వేడుకగా నిర్వహించినందుకు, ఇన్ని సర్‌ప్రైజెస్‌ ఇచ్చినందుకు మీ అందరికీ (స్నేహితులు, బంధువులను ఉద్దేశిస్తూ) ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.

ఈ నవ్వు ‘లోడెడ్‌ గన్‌’ లాంటిది..!

View this post on Instagram

A post shared by MEHREEN ✨🌟 (@mehreenpirzadaa) on

అందమైన రూపం, ఆకట్టుకునే నటన.. హీరోయిన్‌ మెహరీన్‌ పిర్జాదా సొంతం. ‘హనీ ఈజ్‌ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్‌-2’ చిత్రంలో అల్లరి చేసిన ఈ చిన్నది తన పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘అశ్వథ్థామ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిందీ భామ. కేవలం తెలుగులోనే కాకుండా పలు హిందీ, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించిన ఈ చక్కనమ్మ.. నటిగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఇక నిరంతరం సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు.

ఈక్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెహరీన్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలుపు రంగు డ్రస్‌లో.. సింపుల్‌ జ్యుయలరీతో.. చిరునవ్వు రువ్వుతూ క్లిక్‌మనిపించిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన మెహరీన్‌.. ‘ఈ నవ్వు లోడెడ్‌ గన్‌ లాంటిది’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

‘నిశ్శబ్దం’ చాలా వైలెంట్‌..!

‘భాగమతి’ తర్వాత అనుష్క నటిస్తోన్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో మాధవన్‌, అంజలి, శ్రీనివాస్‌ అవసరాల, షాలినీ పాండే, సుబ్బరాజు.. తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

ట్రైలర్‌ను గమనిస్తే.. అనుష్కపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేస్తారు. అసలా వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీస్‌ ఆఫీసర్‌ అంజలి దర్యాప్తు మొదలు పెడుతుంది. ఇంతకీ అనుష్కపై దాడి చేసింది ఎవరు? మధ్యలో ఈ సోనాలీ (షాలినీ పాండే) ఎవరు? మాధవన్‌ పాత్ర ఏంటి? ఇలా ఎన్నో ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో ట్రైలర్‌ మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పేరుకు ‘నిశ్శబ్ద’మే అయినా ట్రైలర్‌ చూస్తుంటే సినిమా చాలా వైలెంట్‌గా ఉండేలా అనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే చెవిటి, మూగ పెయింటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.





women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media