scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు!

Latest Posts Of Celebrities on Social Media

డ్యాన్స్‌ అంటే నాకు ప్రాణం!

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa) on

తెలుగులో ‘అఖిల్‌’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన లవ్లీ గర్ల్‌ సాయేషా సైగల్‌. ఈ సినిమాలో తన క్యూట్‌ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వివిధ కన్నడ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్‌ మీడియాలోనూ యమ చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా నాట్యం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘డ్యాన్స్‌ అంటే నాకు ప్రాణం..’ అంటూ రాసుకొచ్చిందీ క్యూట్‌ బ్యూటీ.

2 నెలలు.. 20 కిలోలు!

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ సినిమాలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అభిమానులంతా ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తి లేదు. అయితే కంగన ఈ సినిమా కోసం 20 కేజీల బరువు పెరిగి మొత్తంగా 70 కిలోలకు చేరుకుంది. ఇక తన తదుపరి చిత్రం ‘ధాకడ్‌’ కోసం తిరిగి బరువు తగ్గే పనిలో పడిందీ అందాల తార. ఇదే విషయాన్ని వీడియోగా రూపొందించి ‘టీం కంగనా రనౌత్‌’ ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేశారు. వీడియోతో పాటు.. ‘ట్రాన్స్‌ఫర్మేషన్‌ గోల్‌.. ‘ధాకడ్‌’ చిత్రంలో తన పాత్ర కోసం కంగన 2 నెలల్లో 20 కిలోలు తగ్గాలి. తన ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఎంతో కృషి చేస్తోందామె..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. దర్శకుడు రజ్‌నీష్‌ ఘాయ్‌ రూపొందిస్తోన్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

చిన్నారి అతిథికి స్వాగతం..!

View this post on Instagram

Keep Calm and...... (Fill in the Blanks) Throwback #ArjunSuravaram #looktest

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) on

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ తదుపరి సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి ఒక ముఖ్యమైన అతిథి విచ్చేసింది. ఆమె ఎవరో కాదు.. అల్లరి పిల్ల అల్లు అర్హ. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్‌ తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. అర్హ ఎంతో క్యూట్‌గా తన తాతయ్య అల్లు అరవింద్‌ను ముద్దాడుతున్న వీడియోని షేర్‌ చేసి.. ‘మా సినిమా ముహూర్తానికి ముఖ్య అతిథిగా అల్లు అర్హ తన ప్రియమైన తాతయ్యతో విచ్చేసింది.. మా సినిమా 18 పేజెస్‌ షూటింగ్‌ ప్రారంభమైంది..’ అని పేర్కొన్నాడు నిఖిల్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ క్యూట్‌ వీడియోని మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) on

'5Ws' ఫస్ట్‌ లుక్‌ చూశారా..?

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

‘RX 100’ సినిమతో కుర్రకారు మతిపోగొట్టిన అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమా విజయం తరువాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోందీ సుందరి. సోషల్‌ మీడియాలో తెగ చురుగ్గా ఉంటూ తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో పాటు వృత్తిపరమైన విశేషాలను కూడా పంచుకుంటుందీ హాట్‌ బ్యూటీ. ఈ క్రమంలో పాయల్‌ తన తదుపరి చిత్రం ‘5Ws’ కి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఎరుపు రంగు హుడీ ధరించి తదేకంగా చూస్తోన్న ఈ పోస్టర్‌ని షేర్‌ చేస్తూ.. ‘5 W’s .. సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు. నా తదుపరి చిత్రం 5 W’s పోస్టర్‌ వచ్చేసింది. మీ సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా..’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఫ్లోరల్‌ లుక్‌లో బార్బీ డాల్‌..!

నాజూకైన శరీరాకృతితో, చూపుతిప్పుకోలేని అందంతో సినీ ప్రేక్షకుల్ని మాయ చేస్తుంది బాలీవుడ్‌ టాల్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. ఎలాంటి అవుట్‌ఫిట్‌లోనైనా ఇట్టే ఒదిగిపోతూ.. ఆ దుస్తులకు వన్నె తీసుకొచ్చే ఈ అందాల తార.. తాజాగా మరో అందమైన అటైర్‌లో ముస్తాబైంది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ, తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు పంచుకునే ఈ లవ్లీ గర్ల్‌.. తాను ఫ్లోరల్‌ డ్రస్‌లో ముస్తాబై క్లిక్‌మనిపించిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది. ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి డిజైన్‌ చేసిన పింక్‌ కలర్‌ ఫ్లోరల్‌ లెహెంగాలో అచ్చం బార్బీ డాల్‌ను తలపించిందీ అందాల భామ. భారీ ఇయర్‌రింగ్స్‌, వేవీ హెయిర్‌స్టైల్‌ తన అందాన్ని ద్విగుణీకృతం చేశాయని చెప్పుకోవచ్చు. మరి, ఈ బార్బీ డాల్‌ బ్యూటిఫుల్‌ లుక్‌ను మీరూ ఫాలో అయిపోండి.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu