scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అలాంటి మాటల కంటే మౌనమే మేలు !

Latest Posts Of Celebrities On Social Media

ఏంటి.. ఆ చూపేంటి..?

ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా నిత్యం బిజీగా ఉంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది లక్ష్మి. ఇక వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూతురు విద్యా నిర్వాణతో ఎక్కువ సమయాన్ని గడుపుతుందీ సూపర్‌ మామ్‌. ఇటీవలే ఈ అందాల అమ్మ తన చిట్టిపొట్టి చిన్నారితో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. సందర్భానికి తగ్గట్లుగా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్‌ క్వీన్‌గా కూడా పిలిపించుకుంటోంది. ఇలా తాను దిగిన ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ లవ్లీ మామ్‌.. తాజాగా మరో ఫొటోను పంచుకుంది. తాను ట్రెడిషనల్‌గా చీరకట్టులో ముస్తాబై సైడ్‌ లుక్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘ఏంటి.. ఆ చూపేంటి’? అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ లుక్‌లో భాగంగా బ్లూ కలర్‌ చీరలో, బంగారు ఆభరణాల్లో ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైందీ క్యూట్‌ బ్యూటీ.

చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం..!

తనదైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ పలు హిట్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నటి సమంత ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. తమన్నా నటించిన పలు చిత్రాల్లోని ఫొటోలను ఒక చోట చేర్చి రూపొందించిన ఓ ‘కామన్‌ డీపీ’ని ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘15 అద్భుతమైన సంవత్సరాలు.. నాకు తెలిసిన అందమైన వ్యక్తుల్లో ఆమె ఒకరు. నిజాయతీ, కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి తమన్నా. వెండితెరపై ఆమె ఒక ‘టపాకాయ్‌’. చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కంగ్రాట్స్ డార్లింగ్‌’ అంటూ క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌తో పాటు #15YearsOfTAMANNAAH అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జోడించిందీ అక్కినేని వారి కోడలు.

అలాంటి మాటల కంటే మౌనమే మేలు!

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

తన నటనతో బాలీవుడ్‌లో అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటీమణుల్లో సన్నీ లియోనీ ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగులోనూ పలు చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వ్యాపారాల్లోనూ అడుగుపెట్టి తన సత్తా చాటిందీ అమ్మడు. దీంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకుంటోంది ఈ అందాల అమ్మ. ఇక కుటుంబం, నటన, వ్యాపారం... ఇలా ఎన్నో వ్యాపకాలతో బిజీగా గడిపే సన్నీ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాలో ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘ష్‌’ అంటూ సైగ చేస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘వట్టిమాటల కంటే మౌనమే మేలు..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ అందాల తార.

నా అధరాలు అబద్ధం చెప్పవు..!

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

హిందీలో వచ్చిన ‘1920’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది నటి అదా శర్మ. ఇక నితిన్‌ హీరోగా నటించిన ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. తన అందం, అభినయంతో నిజంగానే కుర్రకారుకు ‘హార్ట్‌ ఎటాక్‌’ను తెప్పించింది. అనంతరం పలు విజయవంతమైన సినిమాలతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోవడం అదాకు అలవాటు. ఈక్రమంలోనే గతంలో అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే కొన్ని ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘రియల్‌ ఆర్‌ ఫేక్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో అదా శర్మ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో.. ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిన్న బుట్టలో కూర్చున్నట్లుగా ఉన్న పక్షి బొమ్మను పట్టుకొని క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘పోల్‌: ఇది నిజమైందా..? కాదా? నేను అడిగేది నా పెదవుల గురించి కాదు..! ఈ బుట్టలో ఉన్న దాని గురించి. నా పెదవులు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. నా వెనకాల హుడీలో ఉందెవరో కూడా చెప్పుకోండి చూద్దాం’ అని క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

రెజీనా.. ‘నేనే నా..?!’

‘సీత సీతిక్కడ..’ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి రెజీనా కసాండ్రా. కేవలం గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా నట ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోందీ బ్యూటీ. ఇటీవల అడివి శేష్‌ హీరోగా నటించిన ‘ఎవరు’ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న రెజీనా.. తాజాగా ‘నేనే నా..?!’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రెజీనా ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మిస్తుండడం విశేషం. ఇక రెజీనా లుక్‌ను గమనిస్తే.. ఇనుప చువ్వల మధ్య బందీగా ఉన్న ఓ యువరాణిగా కనిపిస్తోంది. ఓవైపు ముఖంపై రక్తపు మరకలు.. మరోవైపు కన్నీళ్లతో రెజీనా పలికించిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. అసలు రాణిలా ముస్తాబైన రెజీనా బందీగా ఎందుకుంది? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే! కాగా ఇదే సినిమా ఫస్ట్‌లుక్‌ను నటి లావణ్య త్రిపాఠి ట్విట్టర్‌ వేదికగా పంచుకోగా.. అదే ట్వీట్‌ను.. ‘థ్యాంక్యూ మై లవ్‌’ అంటూ రెజీనా రీ ట్వీట్‌ చేసింది.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

డియర్ వసు