scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఇంతకంటే ఇంకేం కావాలి?

Latest Posts Of Celebrities On Social Media

తండ్రీకూతుళ్ల ప్రేమకు నిదర్శనమిది!

View this post on Instagram

HAPPY DIWALI TO ALL OF YOU . SNEHA , ARHA , AYAAN , ARJUN & THE ENTIRE ALLU FAMILY .

A post shared by Allu Arjun (@alluarjunonline) on

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అల్లు అర్జున్‌- స్నేహల ముద్దుల తనయ అల్లు అర్హకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ గారాల పట్టి అర్హకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటారీ లవ్లీ కపుల్‌. ఈ క్రమంలో బన్నీ ఇన్‌స్టా వేదికగా తన ముద్దుల పాప అర్హ తనతో ముద్దుముద్దుగా మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్‌ చేశాడు. ‘నీ ఫేవరేట్‌ కలర్‌ ఏంటి బే’ అని అల్లు అర్జున్‌ అడగ్గా ‘పింక్‌ బే..’ అంటూ అర్హ ఫన్నీగా సమాధానమిస్తుంది. ఇలా సరదాగా సాగే తమ సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ స్టైలిష్‌ డాడ్‌.. తండ్రీకూతుళ్ల ప్రేమకు నిదర్శనమిది అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

View this post on Instagram

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on

ఇంత కంటే ఇంకేం కావాలి..!

View this post on Instagram

A post shared by Shanvi sri (@shanvisri) on

కన్నడలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అందాల భామ శాన్వీ శ్రీవాత్సవ. సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఈ లవ్లీ గర్ల్‌ తన వృత్తిపరమైన, వ్యక్తిగత విశేషాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. శాన్వి ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్‌ నుంచి కొంత విరామం తీసుకొని నీలగిరి అడవుల్లో విహరిస్తోంది. నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ, అక్కడి పచ్చటి ప్రకృతి మధ్య ఎంజాయ్‌ చేస్తూ క్లిక్‌మనిపించిన ఫొటోలను ఇస్‌స్టాలో షేర్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ఒక టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతున్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘అందమైన పర్వతాల మధ్య, పక్షుల కిలకిలారావాలు వింటూ ఒక కప్పు టీ తాగడం కంటే ఇంకేం కావాలి..’ అంటూ రాసుకొచ్చిందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Shanvi sri (@shanvisri) on

గంగా నదీ తీరాన..!

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

వృత్తిపరంగా కాస్త విరామం దొరికినా విహారయాత్రలకు చెక్కేసే సెలబ్రిటీల్లో పటౌడీ ప్రిన్సెన్‌ సారా అలీ ఖాన్‌ ముందుంటుంది. తను ఎంజాయ్‌ చేసిన ఆ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంటుందీ బాలీవుడ్‌ బేబ్‌. ఈ క్రమంలో సారా ఇటీవలే వారణాసిలోని గంగా నదిని దర్శించుకొని, అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సారా.. ‘గంగా నది..’ అనే క్యాప్షన్‌ను జతచేసింది.

ఫిట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ లేడీ..!

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

టాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటూ, అగ్ర హీరోలతో నటిస్తూ, స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలోకి చేరుకున్న అందాల భామ పూజా హెగ్డే. అందంతో పాటు ఫిట్‌నెస్‌కి కూడా ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ తాను జిమ్‌లో కసరత్తులు చేసే ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో పూజ వర్కవుట్‌ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను పంచుకుంటూ ‘గత మూడు రోజుల నుండి తిన్న చక్కెరలను ఇలా కరిగించేస్తున్నా..’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ను జత చేసిందీ సొగసరి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on


ఇటీవల విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయం అందుకున్న పూజ.. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌), అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాల్లో నటిస్తోంది.

ఇట్స్‌ కాఫీ టైమ్‌..!

View this post on Instagram

A post shared by sindhu pv (@pvsindhu1) on

సామాన్యులే కాదు.. తమ రోజుని కప్పు కాఫీతో మొదలుపెట్టే సెలబ్రిటీలు బోలెడంత మంది ఉంటారు. అయితే తను కూడా ఈ కోవలోకే వస్తానని చెప్పకనే చెబుతోంది భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. ఈ క్రమంలో కాఫీ పట్ల తన ఇష్టాన్ని తెలియజేస్తూ.. కాఫీ తాగుతున్న మోషన్‌ పిక్చర్‌ను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది సింధు. ‘కాఫీ తాగని రోజు ఎలా గడుస్తుందో.. జస్ట్‌ కిడింగ్‌.. నాకు ఐడియా లేదు..’ అంటూ ఫన్నీగా పేర్కొందీ బ్యాడ్మింటన్‌ స్టార్‌.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram