scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

తన వలలో పడబోకే మనసా..!

latest posts of celebrities on social media

నా టీషర్టే అంతా చెబుతుంది.!

2320socialpost650-3.jpg

సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని బద్ధకం ఆవహిస్తుంది. ఆదివారాన్ని జాలీగా గడిపిన తర్వాత.. సోమవారం తిరిగి పనులకు, ఉద్యోగాలకు వెళ్లడానికి చాలామంది బద్ధకిస్తుంటారు. అయితే సోమవారాన్ని కూడా మరో శుక్రవారంలా మార్చుకోవాలని చెబుతోంది నటి తమన్నా. అంటే.. సోమవారం బద్ధకంగా కాకుండా.. వీకెండ్ ముందుంది అంటూ శుక్రవారం ఎలా ఎంజాయ్‌ చేస్తారో అలా గడపండి అనే అర్థం వచ్చే కొటేషన్‌తో ఉన్న టీషర్ట్‌ను ధరించి క్లిక్‌ మనిపించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన తమ్మూ.. ‘నా టీషర్టే అంతా చెబుతుంది’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘సీటీమార్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా జ్వాలారెడ్డి అనే పాత్రలో కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు హిందీలో ‘బోలే చుడియా’, తమిళంలో తెరకెక్కుతోన్న ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

నువ్వు నా జీవితం నాన్నా..!

2320socialpost650-1.jpg

‘గిల్లీ’ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రకుల్‌ కెరీర్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో ఎంతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on

వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగిన ప్రాధాన్యమిచ్చే ఈ అమ్మడు.. తాజాగా తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకొని ఓ పోస్ట్‌ చేసింది. తల్లిదండ్రులతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన రకుల్‌.. ‘హ్యాపీ బర్త్‌ డే సూపర్‌ డాడ్‌... నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వే నా బలం, నా స్ఫూర్తి, నా మద్దతు, నా జీవితం. నువ్వు లేకుండా నేను ఎలా ఉండేదాన్నో, ఏం చేసేదాన్నో నాకే తెలియదు. నువ్వు నాకోసం చేసినదానికి కృతజ్ఞత అనే పదం సరిపోదు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ఆరోగ్యంతో గడపాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చింది.

సాగర తీరాన గుర్రపు స్వారీ..

2320socialpost650-4.jpg

అందమైన సెలబ్రిటీ జంటల్లో ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్‌ మొదటి వరుసలో ఉంటారు.
ఎక్కడో అమెరికాకు చెందిన పాప్‌ సింగర్‌.. భారత్‌కు చెందిన ఓ నటితో ప్రేమలో పడడం, ఆ ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లడం.. ఈ జంటను చూస్తుంటే ప్రేమకున్న పవర్‌ ఇదేనేమో అనిపిస్తుంది. వివాహమైన నాటి నుంచి ఈ స్వీట్‌ కపుల్ క్షణమైనా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరైపోయారు. కాస్త సమయం దొరికిందంటే చాలు విహార యాత్రల పేరిట ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఈ క్యూట్‌ కపుల్‌ వారాంతాన్ని ఎంతో ఉత్సాహంగా గడిపారు.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

క్యాలిఫోర్నియాలోని శాంటా బార్బరా అనే పట్టణంలోని సముద్ర తీరంలో గుర్రాలపై స్వారీ చేస్తూ సందడి చేసిందీ జంట. ఇక ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారీ లవ్లీ కపుల్‌. గుర్రాలపై స్వారీ చేస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ప్రియాంక.. ‘మ్యాజిక్‌’ అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్‌ ఎమోజీని జోడించగా, నిక్‌ జొనాస్‌.. హార్ట్‌ ఎమోజీతో పాటు ‘సండే’ అని రాసుకొచ్చాడు. మరి ఈ ప్రేమ జంట.. గుర్రపు స్వారీపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Nick Jonas (@nickjonas) on

తన వలలో పడబోకే మనసా..!

అక్కినేని నట వారసుడు అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు భాస్కర్‌’ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘గీతా ఆర్ట్స్‌2’ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అటు దర్శకుడు భాస్కర్‌తో పాటు ఇటు అఖిల్‌ అక్కినేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

2320socialpost650-2.jpg
‘మనసా.. మనసా.. మనసారా బతిమాలా, తన వలలో పడబోకే మనసా’ అని మొదలయ్యే పాటలోని చరణాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. సురేంద్ర కృష్ణ అందించిన లిరిక్స్‌ వీనుల విందు చేస్తున్నాయి. ఇక గోపీ సుందర్‌ సంగీతానికి తోడు.. సిద్‌ శ్రీరాం గాత్రం మెస్మరైజ్‌ చేస్తోంది. మరి, ఈ మెలోడీ పాటను మీరూ ఓసారి వినేయండి.

తారలు కలిసిన వేళ..!

అలనాటి అందాల తార జయసుధ పెద్ద కుమారుడు నిహార్‌ వివాహం అమ్రిత్‌ అనే అమ్మాయితో ఇటీవల దిల్లీలో కొంతమంది బంధువుల సమక్షంలో జరిగింది. అయితే తాజాగా రిసెప్షన్‌ పార్టీని శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ విందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈక్రమంలోనే ఈ వేడుకకు హాజరైన నటి రమ్యకృష్ణ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. అలనాటి తారలంతా ఒక చోట చేరి సందడి చేసిన ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘అందమైన వ్యక్తులతో మరిచిపోలేని జ్ఞాపకాలు’ అంటూ రాసుకొచ్చింది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Ramya Krishnan (@meramyakrishnan) on


View this post on Instagram

A post shared by Ramya Krishnan (@meramyakrishnan) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara