scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

అప్పుడు నాకు మాటలు రావు.!

latest posts of celebrities on social media

జీవితంలో చేయాలనుకుంది ఇదే..!

28220socialpost650-3.jpg

ఎవరి జీవితంలో అయినా మొదటి ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం, అందుకున్న తొలి జీతం ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకంగానే ఉంటుంది. కెరీర్‌లో ఏ స్థాయికి ఎదిగినా సరే ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే చాలు మనసు ఉప్పొంగుతుంది. ప్రస్తుతం అలాంటి ఓ జ్ఞాపకాన్నే అభిమానులతో పంచుకుంది నటి హంసా నందిని. ‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హంస.. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తన తొలి చిత్రం విడుదలై 13 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా హంసానందిని తన కెరీర్‌ తొలినాళ్లలోని ఓ సందర్భాన్ని నెటిజన్లతో పంచుకుంది. ‘అనుమానాస్పదం’ సినిమా కోసం చేసిన టెస్ట్‌ షూట్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిందీ అందాల తార.

‘ఈ ఫొటోలు నా మొదటి స్క్రీన్‌ టెస్ట్‌ కోసం దిగినవి. ఆశ్చర్యమేంటంటే.. తొలి షూట్‌ అయినా నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఆరోజు చాలా సంతోషంగా గడిపాను. ఆ మొత్తం ప్రక్రియను ఎంతో ఎంజాయ్‌ చేశాను. తీసిన ఫొటోలను మానిటర్‌లో చూడగానే.. నేను నా జీవితంలో చేయాలనుకుంది ఇదేననిపించింది. నా తొలి చిత్రంలోకి ఇలా అడుగుపెట్టాను’. అని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ.

దాన్ని వెతకండి..!

28220socialpost650-4.jpg

కన్నడ చిత్రం ద్వారా 2008లో వెండితెరకు పరిచయమైంది నటి వితికా షేరు. ఇక అనంతరం 2009లో వచ్చిన ‘ప్రేమించే రోజుల్లో’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తదనంతరం కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించిన వితిక.. 2013లో విడుదలైన ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక 2016లో హీరో వరుణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న వితిక మరోసారి ‘బిగ్‌బాస్‌-3’ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ షోలో భర్త వరుణ్‌తో కలిసి చేసిన హంగామా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ షో పూర్తి అయిన తర్వాత వితిక సోషల్‌ మీడియాలో చురుగ్గా మారింది. భర్త వరుణ్‌తో దిగిన ఫొటోలతో పాటు తన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కు సంబంధించిన ఫొటోలనూ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవడం ప్రారంభించింది.
ఈక్రమంలో గత రెండు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వితిక పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మెరూన్‌ కలర్‌ డ్రస్‌లో నవ్వుతూ పోజిచ్చిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నవ్వడానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. దాన్ని వెతకండి’ అంటూ ఆలోచింపచేసే క్యాప్షన్‌ను జోడించింది. వితిక లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి...

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on


View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on


View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on

అవి ఎప్పటికీ అద్భుతమే..!

28220socialpost650-2.jpg

రొటీన్‌ లైఫ్‌లో కాస్త రీఛార్జ్‌ కావడానికి ఒక్కొక్కరూ ఒక్కో దారిని వెతుక్కుంటుంటారు. అయితే ఎక్కువమంది మాత్రం ప్రయాణాలకే మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. చివరికి దగ్గర్లో ఉన్న ప్రదేశాలనైనా సందర్శిస్తుంటారు. దీనివల్ల మనసు ఎంతో ఉల్లాసంగా మారి.. రెట్టింపు ఉత్సాహంతో మన ఉద్యోగాలను నిర్వర్తిస్తుంటాం. ఈ విషయాన్ని పరిశోధకులు అధ్యయనాలు చేసి మరీ చెప్పారు. అయితే తాజాగా ఇదే విషయాన్ని చెబుతోంది నటి, యాంకర్‌ అనసూయ.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

యాంకర్‌గా, నటిగా ఎంతో బిజీగా ఉండే అనసూయ కాస్త సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళుతుంటుంది. తన విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అనసూయకు అలవాటు. ఈక్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. తను వెళ్లిన ప్రదేశం ఏంటో చెప్పక పోయినప్పటికీ ప్రకృతి రమణీయతతో ఉన్న ఆ ప్రదేశంలో తలకు క్యాప్‌, చేతులకు గ్లౌజ్‌లు పెట్టుకొని సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన అను.. ‘తరచూ చేసే ప్రయాణాలు.. ఎప్పటికీ అద్భుతంగా ఉంటాయి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

అప్పుడు నాకు మాటలు రావు..!

28220socialpost650-1.jpg

మనసులో ఉన్న భావాలను ఎలాంటి మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పే తారల్లో నటి అమలాపాల్‌ ఒకరు. ఇదివరకు పలు సందర్భాల్లో అమల చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఓవైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తుంది ఈ అందాల తార. ‘ఆదాయ్‌’ (తెలుగులో ‘ఆమె’) తర్వాత ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫ్రెండ్స్‌తో జాలీగా గడిపింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘ప్రేమ, చాక్లెట్‌ మళ్లీ కలిశాయి... ఈ అందమైన గ్యాంగ్‌ (స్నేహితులను ఉద్దేశించి) గురించి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. నాకు అసలు మాటలు రావు. వీరితో గడిపే సమయం అద్భుతం. స్వర్గంలాంటి మీ (స్నేహితులు నకుల్‌ మెహతా, జాన్‌కీ పరేఖ్‌లను ఉద్దేశిస్తూ) ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని పంచుకుందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Amala Paul ✨ (@amalapaul) on

గ్రేట్‌ డే మై లవ్‌..!

యువరాజ్‌ సింగ్‌.. భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరిది. తన గొప్ప ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. క్యాన్సర్‌లాంటి మహమ్మారిని కూడా ఎదిరించి, నిలిచాడీ డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌. యువరాజ్‌ సింగ్‌ 2019లో అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే గ్రౌండ్‌లో తన విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే యువీ.. గ్రౌండ్ బయట మాత్రం ఎంతో ఉల్లాసంగా గడుపుతుంటాడు. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే యువీ.. తన వ్యక్తిగత విషయాలను అభిమాలనుతో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటాడు. ఇక యువరాజ్‌ సింగ్‌ 2016 నవంబర్‌ 30న హేజల్‌ కీచ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా హేజల్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని చేసిన పోస్ట్‌ ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ దగ్గర దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హే.. హేజీ.. ఈరోజు నీ పుట్టిన రోజు. ఈ చల్లటి ప్రదేశానికి తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. దీనికి నీ పుట్టినరోజే కారణం. హావ్‌ ఏ గ్రేట్‌ డే మై లవ్‌’ అంటూ క్యాప్షన్‌ను జోడించాడు.

View this post on Instagram

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లే నా లడ్డూలు..!

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అందుకే ఆ రోజు నాకు బాగా గుర్తుంది!

అటు నటనలోనే కాకుండా సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్న అందాల భామ శృతి హాసన్‌. చిన్నప్పటి నుంచి సంగీతంపై తనకున్న ఆసక్తే తనను గొప్ప గాయనిగా మనందరికీ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడిన ఈ చిన్నది.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని కూడా రూపొందిస్తుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన సినిమా అప్‌డేట్లతో పాటు తాను పాల్గొనే లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ విశేషాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో శృతి తన చిన్ననాటి ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ యూనిఫాం ధరించిన శృతి.. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ముందు కూర్చొని పాట పాడుతున్న ఫొటోను ఎవరో షేర్‌ చేయగా.. దాన్ని తిరిగి రీపోస్ట్‌ చేస్తూ.. ‘నేను స్కూల్‌ యూనిఫాంలో పాట పాడుతున్న ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం.. ఓ దిగ్గజ గాయని (ఆశా భోస్లే) సమక్షంలో ఎంతో నెర్వస్‌గా పాట పాడిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. అదొక మధుర జ్ఞాపకం. ఈ ఫొటోని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు..’ అంటూ పేర్కొందీ స్లిమ్మీ బ్యూటీ.