scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అందుకే ఈ వారం ఎంతో ప్రత్యేకం..!

Latest Posts Of Celebrities On Social Media

ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా...!

27220socialpost650-2.jpg

అటు వృత్తికి, ఇటు కుటుంబానికి సమప్రాధాన్యమిస్తూ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. సన్నీ లియోనీ. అయితే సన్నీ తను ఇటీవలే మొదలుపెట్టిన ‘Kidz Social House’ అనే డే కేర్‌కు సంబంధించిన విశేషాలను తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘మార్చి 7న ‘Kidz Social House’ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో పిల్లల పెంపకంపై చైల్డ్‌ సైకాలజిస్ట్‌ చాందినీ భగత్‌, ఇతర తల్లిదండ్రులతో నిర్వహిస్తోన్న స్పెషల్‌ ప్యానల్‌ టాక్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ తెలిపిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. 

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

ఈ వారం ఎంతో ప్రత్యేకం..!

27220socialpost650-3.jpg

వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే కొణిదెల వారి కోడలు ఉపాసన.. తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేయడం మాత్రం ఎప్పుడూ మిస్‌ అవ్వదు. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉండే ఉప్సీ.. తాజాగా ఇన్‌స్టాలో తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ఉపాసన, రామ్‌ చరణ్‌తో పాటు అత్తామామలు.. చిరంజీవి, సురేఖ, అమ్మానాన్నలు, తాతయ్య, చిన్నాన్న, సోదరుడు అనిందిత్‌.. తదితరులు ఉన్న ఈ ఫొటోలను పంచుకుంటూ..‘అత్తయ్య, మావయ్యల పెళ్లిరోజు.. అమ్మానాన్నల 35వ పెళ్లిరోజు.. అనిందిత్‌ 30వ పుట్టినరోజు.. విష్ణు చిన్నాన్న 60వ పుట్టినరోజు.. ఇన్ని వేడుకలతో మిళితమైన ఈ వారం ఎంతో ప్రత్యేకం..’ అంటూ రాసుకొచ్చిందీ బిజినెస్‌ వుమన్‌.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

ఈ రాయల్‌ లుక్‌ అదిరింది..!

27220socialpost650-1.jpg

ఎలాంటి ఫ్యాషన్‌ దుస్తుల్లోనైనా ఇట్టే ఇమిడిపోయి, ఆ దుస్తులకే అదనపు వన్నెను తెస్తుంది మన బాలీవుడ్‌ ఫ్యాషనిష్టా సోనమ్‌ కపూర్‌. తను ధరించిన స్పెషల్‌ అవుట్‌ఫిట్‌లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకునే ఈ బాలీవుడ్‌ అందం.. తాను ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయిన మరికొన్ని ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. నేవీ బ్లూ కలర్‌ వన్‌ షోల్డర్డ్‌ బాడీ హగ్గింగ్‌ డ్రస్‌పై అదిరిపోయే జ్యుయలరీ సెట్‌ను ధరించిన సోనమ్‌ రాయల్‌ ప్రిన్సెస్‌లా మెరిసిపోయింది. మరి ఈ లవ్లీ బేబీ రాయల్‌ లుక్‌పై మీరూ  ఓ లుక్కేయండి..!

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

నా సోదరీమణులతో రుచికరమైన భోజనం..!

27220socialpost650.jpg

ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం బిజీగా ఉంటారు అందాల నటీమణి అక్కినేని అమల. తాను పాల్గొనే సామాజిక కార్యక్రమాలతో పాటు అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటుందీ లవ్లీ ఉమన్‌. ఈ క్రమంలో అమల తన సోదరీమణులతో కలిసి లంచ్‌కు వెళ్లిన సందర్భంలో దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నా సోదరీమణులతో కలిసి వైబ్రంట్‌ లివింగ్‌ కేఫ్‌లో భోజనం చేశాను. సేంద్రియ ఉత్పత్తులతో తయారుచేసిన ఇక్కడి రుచికరమైన భోజనంతో పాటు చియా సీడ్‌ పుడ్డింగ్‌ ఎంతో టేస్టీగా ఉంది.’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ లేడీ. 

View this post on Instagram

A post shared by Amala Akkineni (@akkineniamala) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

Movie Masala

Video Gallery