scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అందుకు అసలైన ఎనర్జీ ఇదే!

latest posts of celebrities on social media

కొత్త ఉత్సాహం నింపింది!

26220socialpost650-2.jpg

‘ఇష్టం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రియ. ఈ సినిమా విజయవంతం కావడంతో వరుస సినిమాలు ఈ బ్యూటీ కోసం క్యూ కట్టాయి. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన శ్రియ.. అనంతరం తమిళంతోపాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 19 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ రవ్వంతైనా తగ్గని అందంతో అభిమానులను ఆకట్టుకుంటోందీ చిన్నది. రష్యాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొశ్చీవ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోందీ చిన్నది. గతకొన్ని రోజులుగా విదేశాల్లో భర్తతో గడుపుతోన్న శ్రియ తాజాగా భారత్‌కు తిరిగొచ్చింది. ఈ సందర్భంగా శ్రియ.. తాను ముంబయిలో ‘స్పందన’ పేరుతో స్వయంగా నడిపిస్తోన్న స్పాను సందర్శించింది. ఇందులో భాగంగా సిబ్బందితో కలిసి దిగిన సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ వారాంతం ముంబయిలో గడపడానికొచ్చా. స్పందన స్పా.. నాకు కేవలం సంతోషాన్నే కాదు, నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది..’ అని రాసుకొచ్చిందీ అందాల తార. ఇక శ్రియ నడిపిస్తోన్న ఈ స్పాలో పనిచేసే వారందరూ దివ్యాంగులు కావడం విశేషం. ఇలా దివ్యాంగులకు తనదైన రీతిలో ఉపాధి కల్పించి తన వెన్నలాంటి మనసును చాటుకుందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

అందుకు అసలైన ఎనర్జీ ఇదే!

26220socialpost650-3.jpg

అలనాటి అగ్రతారల్లో ఒకరిగా వెలిగింది నటి సిమ్రన్‌. 1997లో తమిళ సినిమా వీఐపీతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..అదే ఏడాది వచ్చిన ‘అబ్బాయి గారి పెళ్లి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఒక్క దక్షిణాదికే పరిమితం కాకుండా ఉత్తరాదిన కూడా పలు భాషల్లో నటించిన సిమ్రన్‌ ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. 43 ఏళ్ల వయసులోనూ అందం విషయంలో నేటి తారలకు గట్టి పోటీనిస్తోందీ అందాల తార. ఇక ఇదిలా ఉంటే సిమ్రన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎంతో ఉత్సాహంగా ఓ పాటకు స్టెప్‌ వేస్తున్నట్లున్న వీడియో (జిఫ్‌ ఫైల్‌)ను పోస్ట్‌ చేసిన అందాల తార.. ‘కొత్త రోజును ప్రారంభించడానికి కావాల్సిన అసలైన ఎనర్జీ ఇదే’నంటూ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) on

కొన్నిసార్లు చూసే విధానం కొత్తగా ఉండాలి..

26220socialpost650.jpg

మాధురీ దీక్షిత్‌... ఒకప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఓ సంచలనం. 90ల్లో కుర్రాళ్లను ఈ పేరు నిద్ర లేకుండా చేసింది. తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో వెండితెర రాణిగా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. మధ్యలో సినిమాలకు కాస్త విరామం తీసుకున్నా.. ఇప్పుడు మళ్లీ బిజీగా మారి ఈ తరం నాయికలకు కూడా సవాల్‌ విసురుతోందీ బ్యూటీ. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా... సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోందీ యమ్మీ మమ్మీ. 52 ఏళ్ల వయసులోనూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా.. మోడ్రన్‌గా ముస్తాబై చేతిలో కాఫీ కప్పు పట్టుకొని స్టైలిష్‌ లుక్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది మాధురి. ఇక ఆ ఫొటోకు.. ‘కొన్నిసార్లు మీరు చూసే విధానం కొత్తగా ఉండాలి’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..

26220socialpost650-4.jpg

స్టైల్‌కు కొత్త అర్థాన్నిచ్చిన హీరో రజనీకాంత్‌. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అశేష అభిమాన గణం ఉందనడంలో సందేహం లేదు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించాడీ సూపర్‌ స్టార్‌. ఇప్పటికీ రజనీ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు.. సినీ అభిమానుల్లో ఎక్కడ లేని క్రేజ్‌ వస్తుంటుంది. అయితే నేడు ఈ తలైవా పెళ్లిరోజు. 1981 ఫిబ్రవరి 26న రజనీ లతను వివాహమాడారు. సో.. నేటితో వీరిద్దరి వివాహ బంధానికి 39 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రజనీ రెండో కుమార్తె సౌందర్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపింది. రజినీకాంత్‌, లత కలిసి దిగిన పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌చేస్తూ.. ‘అమ్మానాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు..’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Soundarya Rajinikanth (@soundaryaarajinikant) on

ప్రేమ.. వెల కట్టలేనిది..

26220socialpost650-1.jpg

పెద్ద కళ్లు, ఆకట్టుకునే నటన, అందమైన రూపం.. నటి ప్రణీతకు మాత్రమే సొంతం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విభిన్న చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అందాల తార ప్రస్తుతం హిందీలోనూ నటిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ కుందనపు బొమ్మ. ఇక శిల్పాశెట్టి చాలా రోజుల తర్వాత నటిస్తోన్న ‘హంగామా 2’ చిత్రంలోనూ ఆడిపాడనుందీ బ్యూటీ. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోన్న ప్రణీత సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలోనే తాజాగా తన పెంపుడు శునకాన్ని ప్రేమగా హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ప్రేమ వెల కట్టలేనిది’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

View this post on Instagram

A post shared by Pranitha Subhash (@pranitha.insta) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram