scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'డాక్టర్‌గా సేవలందించిన చోటే కరోనా రోగిగా చేరాను!'

'ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టర్‌ కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. అదే సమయంలో న్యుమోనియా సోకడంతో మరణం అంచుల దాకా వెళ్లింది. అలా సుమారు రెండు వారాల పాటు ఐసీయూలో ఉన్న ఆమె ఇటీవల కొవిడ్‌ నుంచి కోలుకుంది. ఇప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న ఈ డాక్టరమ్మ కరోనా రోగులను కాపాడేందుకు మళ్లీ ఆస్పత్రిలో అడుగుపెట్టింది. '

Know More

Movie Masala

 
category logo

ఇంతటి ఆనందం ఉండగా... మాటలెందుకు దండగ !

Latest Posts Of Celebrities On Social Media

నా ప్రియమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే!

25220socialpostghg650-2.jpg

ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేసుకునే సెలబ్రిటీ కపుల్స్‌లో షాహిద్‌ కపూర్‌- మీరా రాజ్‌పుత్‌ జంట ఒకటి. షాహిద్‌ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తుంటాడు. ఇలా కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం షాహిద్‌ బెటరాఫ్‌ మీరాకు అలవాటే. నేడు షాహిద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీరా ఇన్‌స్టా వేదికగా శ్రీవారికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. వీళ్లిద్దరూ కలిసున్న ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ ప్రేమగా రాసుకొచ్చిందీ వైఫీ.

స్నేహితులు కలిసిన శుభవేళ..!

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఇటీవల ‘KAY’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అందాల భామ తన ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అలియా భట్‌, ప్రియాంక చోప్రాలను ముంబైలోని తన నివాసానికి ఆహ్వానించింది. ఈ క్రమంలో కత్రినా, ప్రియాంకకు బోలెడన్ని లిప్‌ కలర్స్‌, ఐ పెన్సిల్స్‌ను బహూకరించగా, ఆ సందర్భంలో వీళ్లిద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని తమ తమ ఇన్‌స్టాల్లో అభిమానులతో పంచుకున్నారీ బాలీవుడ్‌ బేబ్స్‌.


ఈ ఫొటోను క్యాట్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘ప్రియాంక.. #kaybeauty నుంచి నీకో చిన్న మేకప్‌ పార్టీ.. మనిద్దరం కలిసి గురూజీ వద్ద కథక్‌ నేర్చుకున్న రోజుల దగ్గర్నుంచి ఇప్పటివరకు నిన్ను కలుసుకున్న ప్రతి సందర్భమూ ఓ గొప్ప అనుభూతినిచ్చింది..’ అంటూ రాసుకొచ్చింది.

మాటల్లేవ్‌.. ఆశ్చర్యం మాత్రమే..!

View this post on Instagram

🚨

A post shared by Hansika Motwani (@ihansika) on

మనం అనుకోని విధంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ వంటి దిగ్గజాలు మన ముందుకొచ్చారనుకోండి.. నోటి వెంట మాట రాదు కదా..! తాజాగా తనకూ అలాంటి సందర్భమే ఎదురైందని చెబుతోంది అందాల తార హన్సిక. తాను ప్రయాణిస్తున్న విమానంలోనే సచిన్‌ను అనుకోకుండా కలుసుకుందీ క్యూటీ. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ సచిన్‌తో కలిసి దిగిన ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘ఈ ఫొటోకు ఎలాంటి క్యాప్షన్స్‌ అవసరం లేదు..’ అంటూ తన ఆనందాన్ని, సచిన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుందీ సుందరి.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on

చీరకట్టు అమ్మాయిలకెంతో అందం!

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తనకు సంబంధించిన విశేషాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది అందాల భామ మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ క్రమంలో తాజాగా తను కట్టుకున్న అందమైన రెడ్‌ కలర్‌ చీరకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘చీరకట్టు అమ్మాయిలకు ఎంతో అందాన్ని, ఆనందాన్నిస్తుంది..’ అంటూ సరదాగా రాసుకొచ్చిందీ లవ్లీ లేడీ. రెడ్‌ కలర్‌ షిమ్మరీ శారీపై వైట్‌ కలర్‌ ఫుల్‌ స్లీవ్డ్‌ లేస్‌ బ్లౌజ్‌ను జతచేసి ఫ్యాషన్‌ దివాలా మెరిసిపోయిందీ అందాల అమ్మ.

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే!

25220socialpostghg650-1.jpg

న్యాచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘V’. నివేదా థామస్‌, అదితీ రావ్‌ హైదరీలు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్‌ రోల్‌ పోషిస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా నాని పుట్టినరోజు (ఫిబ్రవరి 24న) సందర్భంగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసిందీ చిత్రబృందం. ‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈవేళ..’ అంటూ సాగే ఈ అద్భుతమైన మెలొడీ సాంగ్‌కు అమిత్‌ త్రివేదీ స్వరాలు అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన బాణీలను గుదిగుచ్చి పాట రాశారు. సంగీత ప్రియుల వీనుల విందు చేస్తోన్న ఈ లవ్లీ సాంగ్‌ను మీరూ వినేయండి మరి.

ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘V’ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.

మీరు పట్టు తప్పుతున్నారనిపిస్తే..!

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

అందానికి అందం.. నటనకు నటన.. ఇలా స్టార్‌ హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ చురుగ్గా ఉంటుంది. తన వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకునే ఈ వయ్యారి భామ.. తాజాగా తన డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అద్దం ముందు నిలబడి అద్భుతంగా స్టెప్పులేస్తోన్న జానూ ఈ వీడియోను పంచుకుంటూ.. ‘మీరు పట్టు తప్పుతున్నారనిపిస్తే.. దాన్ని ఇతరులకు తెలియకుండా చాకచక్యంగా ముగించే ప్రయత్నం చేయండి..’ అంటూ సరదాగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోలో జానూ నృత్యం అద్భుతంగా చేసిందంటూ ఒకరు, ఇలాంటి డ్యాన్స్‌ వీడియోలు ఇంకా ఉంటే షేర్‌ చేయమని మరొకరు.. కామెంట్లు పెడుతూ ఆమె ప్రతిభను ప్రశంసిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram