scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేను ఎంత మంచిదాన్నో మీరే చెప్పండి..!

latest posts of celebrities on socialmedia

ఆ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది..!

21220socialpost650-3.jpg

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

వీడికి నీళ్లంటే చాలా ఇష్టం..!

21220socialpost650-6.jpg

తన అసమాన ప్రతిభాపాటవాలతో భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించింది టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మొక్కవోని దీక్షతో ఏకంగా 26 కిలోలు తగ్గి ఔరా అనిపించింది. కేవలం బరువు తగ్గడమే కాదు.. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టి ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఓవైపు టెన్నిస్‌లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్‌ ఈవెంట్‌లలో పాల్గొనే ఈ సూపర్‌ మామ్‌ తన లేటెస్ట్ అవుట్‌ఫిట్స్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా తన కుమారుడితో స్విమ్మింగ్‌ పూల్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సానియా. ఈ ఫొటోతో పాటు కొడుకు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ను ఉద్దేశిస్తూ.. ‘వీడికి నీళ్లంటే ఎంతో ఇష్టం’ అని రాసుకొచ్చిందీ లవ్లీ మామ్‌.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar) on

గొప్ప నిర్ణయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం ..

21220socialpost650-4.jpg

ఒక్క దక్షిణాదికి మాత్రమే కాకుండా యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. ఆయన ఏది చేసినా సంచలనమే. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ‘ఖైదీ నెంబర్‌ 150’తో వచ్చి ఇప్పటికీ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు చిరు.
చిరుకు మహిళా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిరంజీవి, ఆయన భార్య సురేఖలను చూస్తే ఆది దంపతుల్లా చూడముచ్చటగా కనిపిస్తారు. చిరంజీవి మెగాస్టార్‌ కాకముందే సురేఖకు విపరీతంగా నచ్చేశాడు. వాళ్లిద్దరూ 1980 ఫిబ్రవరి 20న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇలా వీరి మధ్య అనుబంధానికి గురువారంతో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరు, సురేఖలు కలిసి దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘ఈరోజు మేం ఒక గొప్ప నిర్ణయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం.. పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌ను జోడించాడు.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan) on

అవి చాలా మంచివి..

21220socialpost650-7.jpg

పర్యావరణానికి చెట్లు చేసే మేలు ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పర్యావరణంలో జరుగుతోన్న మార్పులు మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చెట్లను నాటాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సెలబ్రిటీలతో కూడా ఈ విషయాన్ని చెప్పిస్తున్నాయి. ఈక్రమంలో ఇదే విషయాన్ని చెబుతోంది బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షీ సిన్హా. సినిమాలతో బిజీగా ఉండే సోనాక్షి చెట్లను పెంచాలని పిలుపునిస్తోంది. తను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. చెట్టు పైకెక్కి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘చెట్లు చాలా మంచివి. మనం కచ్చితంగా ఎక్కువ సంఖ్యలో చెట్లను నాటాలి’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) on

నేను ఎంత మంచిదాన్నో మీరే చెప్పండి..!

21220socialpost650-2.jpg

ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది నటి కాజల్‌ అగర్వాల్‌. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో కూడా కాజల్‌ నటిస్తోంది. ఇందులో కాజల్‌.. ‘అను’ పాత్రలో సందడి చేయనుంది. తాజాగా ఈ చిత్రంలోని కాజల్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

తన ఫస్ట్‌లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్న కాజల్‌.. ఫొటోతో పాటు.. ‘మంచీచెడు అనేవి మనం చూసే విధానం, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నేను ఎంత మంచిదాన్నో మీరే నిర్ణయించండి. లవ్‌.. అను.!’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ సినిమాను జెఫ్రీ గీ చిన్‌ అనే హాలీవుడ్‌ దర్శకుడు తెరకెక్కిస్తుండడం విశేషం. ‘యావత్‌ ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ స్కాం’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. మరి ఆ ఐటీ స్కాంలో కాజల్‌ భాగస్వామ్యం కూడా ఉందా? ఇంతకీ కాజల్‌ మంచిదా.. చెడ్డదా.. తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే.

మాల్దీవుల్లో ప్రేమజంట..

21220socialpost650-1.jpg

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తి పరంగా ఎంతో బిజీ బిజీగా ఉండే ఈ జంట కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతుంటారు. ఇక వారి విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం వీరికి అలవాటే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో విహరిస్తోంది. ఫిబ్రవరి 23న కరణ్‌ పుట్టినరోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రేమ పక్షులు ఎంతో సంతోషంగా విహరిస్తున్నాయి. ఇక ఈ హాలిడేకు సంబంధించిన ఫొటోలను బిపాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on


View this post on Instagram

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More