scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

అలాంటి భార్యలందరికీ హ్యాట్సాఫ్‌ !

Latest Posts Of Celebrities On Social Media

నా యోగిని..!

అటు అందంతో పాటు ఫిట్‌నెస్‌కి కూడా సమప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీ మామ్స్‌లో మంచు లక్ష్మీ ప్రసన్న ఒకరు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ చురుగ్గా ఉంటుందీ అందాల అమ్మ. ఈ క్రమంలో తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటుందీ మామ్‌. తాజాగా లక్ష్మి తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణతో కలిసి యోగా చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘నా యోగిని..’ అంటూ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

అలాగే తాను తన కూతురు, యోగా ట్రైనర్‌ అన్షుకతో కలిసి యోగా చేస్తున్న మరో ఫొటోను షేర్‌ చేసిన ఈ మంచువారి ఆడపడుచు.. ‘నా చిన్నారి యోగిని ఎంత నిర్భయంగా యోగా చేస్తోందో..! ఇందుకు సహకరించిన అన్షుకకు ధన్యవాదాలు. నీతో పాటు ఇలా తలకిందులుగా వేలాడుతూ యోగా చేయడం మంచి అనుభూతినిచ్చింది..’ అంటూ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

మిస్‌ ఇండియా రాబోతోంది..!

20220socialpost650-1.jpg
అందాల భామ కీర్తి సురేష్‌ నటించిన ‘మిస్‌ ఇండియా’ సినిమా విడుదల కోసం అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌తో పాటు ఈ సినిమాలోని రెండు పాటలు ‘ఓ లచ్చా గుమ్మడి’, ‘కొత్తగా.. కొత్తగా.. కొత్తగా..’ ప్రేక్షకుల్లో చిత్రంపై అంచనాలను విపరీతంగా పెంచేశాయని చెప్పుకోవచ్చు. అయితే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా విడుదల తేదీని కీర్తి తాజాగా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘‘మిస్‌ ఇండియా’ ఏప్రిల్‌ 17న విడుదల కాబోతోంది.. మీరంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ రాసుకొచ్చిందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

లవ్లీ కపుల్‌... లవ్లీ లుక్‌!

బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకొణెలు తమ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘83’. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌.. కపిల్‌ దేవ్‌ పాత్రలో, దీపిక.. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో భాగంగా విడుదలైన రణ్‌వీర్‌ సింగ్‌ ఫస్ట్‌ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను.. ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తున్న దీపిక ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతోన్న ఈ లవ్లీ లుక్‌ను దీప్‌వీర్‌ తమ ఇన్‌స్టా ఖాతాల ద్వారా పంచుకున్నారు. కాగా దీనిపై స్పందించిన దీప్స్‌.. ‘క్రీడా చరిత్రలో అత్యద్భుతమైన క్షణాలను రంగరించి రూపొందించిన ఈ గొప్ప చిత్రంలో ఒక భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. తన భర్త వృత్తిపరమైన, వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొని విజయం సాధించడంలో ఒక భార్య ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో మా అమ్మను చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నటించిన ఈ ‘83’ చిత్రం.. తన భర్త కలలను తనవిగా భావించి ఆయనకు అనుక్షణం అండగా నిలిచే ప్రతి మహిళ కోసం రూపొందించినది..’ అనే చక్కటి, అర్థవంతమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ !

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ఆమె ధైర్యానికి చిహ్నం..!

20220socialpost650-2.jpg

2016లో విడుదలై విజయం సాధించిన బాలీవుడ్‌ చిత్రం ‘నీరజ’. కరాచీలో హైజాక్‌కు గురైన పాన్‌ ఆమ్‌ ఫ్లైట్‌ 73 విమానంలోని ప్రయాణికుల్ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్‌ అటెండెంట్‌ నీరజా బానోత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించిన బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌కు ఏకంగా జాతీయ అవార్డునే తెచ్చిపెట్టిన ఈ సినిమా విడుదలై నిన్నటికి (ఫిబ్రవరి 19, 2020కి) నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోనమ్‌ ఇన్‌స్టాలో ఒక స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది.

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

‘కరాచీలో హైజాక్‌కు గురైన Pan AM Flight 73లో 359 మంది ప్రయాణికులను రక్షించే క్రమంలో తన ప్రాణాలనే పణంగా పెట్టిన నీరజా బానోత్‌ పాత్రలో నటించడం నాకు పెద్ద సవాలే కాదు.. గర్వకారణం కూడా! ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. నీరజ ధైర్య సాహసాలను మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆమె ధైర్యానికి చిహ్నం.. ఆమె చేసిన త్యాగం దేశానికే గర్వ కారణం. ఆమె అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ అందరికీ స్ఫూర్తిప్రదాతే..’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది సోనమ్‌.

సూర్యకిరణాలను ఇలా ఆస్వాదిస్తున్నా..!

సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తన అద్భుతమైన ఫ్యాషన్‌ లుక్స్‌ను ఎప్పటిప్పుడు అభిమానులతో పంచుకునే బాలీవుడ్‌ భామల్లో మలైకా అరోరా ఒకరు. ఈ క్రమంలోనే మలైకా తాజాగా ఇన్‌స్టాలో ఓ అందమైన ఫొటోను షేర్‌ చేసింది. మల్టీకలర్‌ స్కర్ట్‌కు మ్యాచింగ్‌ క్రాప్‌టాప్‌ను జతచేసి వయ్యారంగా మెట్లు దిగుతూ క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘సూర్యకిరణాలను ఇలా ఆస్వాదిస్తున్నా..’ అంటూ రాసుకొచ్చింది. మరి ఈ అందాల భామ అందమైన ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి...

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సిస్టర్స్.. మీరే లేకుంటే ఈ మహమ్మారితో యుద్ధం చేయలేం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీనివల్ల ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అదే సమయంలో చాలామంది ఆసుపత్రుల్లో బెడ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ‘ఐఐఎంయుఎన్‌’ అనే విద్యార్థుల బృందం ‘ఫైండ్‌ ఏ బెడ్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థను యువతే ముందుండి నడిపిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ‘యువత ద్వారా.. దేశం కోసం’ (By the Youth, For the Country) అనే ట్యాగ్‌లైన్‌ని జోడించారు. 160 పట్టణాల్లో ఉన్న దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా www.Findabed.in అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్పిటల్‌ నంబర్లు, బెడ్ల వివరాలు, క్వారంటైన్‌ సెంటర్ల వివరాలు ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

పూలకుండీలతో పొట్ట చుట్టూ కొవ్వును ఇలా కరిగించండి..!

నటి సాక్షి అగర్వాల్‌ పూల కుండీలతో వ్యాయామం చేస్తోన్న తన వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నాలుగు పూల కుండీలను ఉపయోగించి ఈ అద్భుతమైన వ్యాయామాలను చేయండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉండేలా చూసుకోండి. అయితే నా దగ్గర ఇంత బరువున్న పూల కుండీలు లేవు. కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి..’ అని రాసుకొచ్చింది. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉంటుంది. మా ఇంట్లో ఈ వెయిట్స్ లేవు.. అందుకే కుండీలతో కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి..’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram