scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

ఈ అందం.. మీ ప్రతిరూపమే !

latest posts of celebrities on socialmedia

దివి నుంచి దిగివచ్చిన దేవ కన్యవా.?

18220socialpost650.jpg

అలనాటి సూపర్‌ స్టార్‌ శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలి సినిమా ‘దబాంగ్‌’తోనే యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. ఇటీవల ‘దబాంగ్‌ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనాక్షి ప్రస్తుతం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనల కోసం ఫొటో షూట్‌లలో పాల్గొంటుంది సోనాక్షి. ఇక లేటెస్ట్‌ అవుట్‌ఫిట్స్‌లో దిగిన ఫొటోలు, సినిమా విశేషాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘పికాక్‌’ అనే మ్యాగజైన్‌ కోసం దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది సోనాక్షి. వీటిలో సోనాక్షి ఎంబ్రాయిడరీ లెహెంగాలో తలపై కిరీటాన్ని పోలిన పూలతో అచ్చంగా దేవ కన్యలా కనిపిస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) on


View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) on


View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona) on

అది ఎప్పటికీ జరగదు..!

18220socialpost650-1.jpg

ఒకరేమో ఇండియన్‌ క్రికెట్‌ దిగ్గజం.. ఎంతోమందికి ఆరాధ్య క్రికెటర్‌. మరొకరేమో ఇండియన్‌ సినిమా దిగ్గజ నటీమణుల్లో ఒకరు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారే అనుష్క, విరాట్‌లు. అభిమానులు ప్రేమగా ‘విరుష్క’ అని పిలుచుకునే ఈ జంట ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంటారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతారు. ఇక ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను అనుష్క, విరాట్‌లో ఎవరో ఒకరు నిత్యం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. తాజాగా నటి అనుష్క భావోద్వేగంతో కూడిన ఓ పోస్ట్‌ చేసింది. అనుష్క, విరాట్‌ కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘వీడ్కోలు చెప్పడం.. సమయంతో పాటు తేలికవుతుందని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు’ అని రాసుకొచ్చిందీ బాలీవుడ్‌ అందాల తార.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

అది మీ ప్రతిరూపమే..!

18220socialpost650-2.jpg

తన అసమాన ప్రతిభ, అందం, డ్యాన్స్‌లతో 90ల్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్న నటీమణుల్లో మాధురీ దీక్షిత్‌ ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్‌ ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’గా పేరు సంపాదించుకున్న ఈ అందాల తార ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా తనలోని డ్యాన్సింగ్‌ ప్రతిభను బయటపెడుతూనే ఉంది. ఇక 50 ఏళ్ల వయసు దాటుతున్నా రవ్వంతైనా తగ్గని అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ నేటితరం నటీమణులకు కూడా పోటీనిస్తోందీ అందాల తార. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే మాధురి తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా బ్లాక్‌, రెండ్ కాంబినేషన్‌లో ఉన్న లంగా ఓణీ ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నాలో మీకు కనిపిస్తున్న అందం.. మీకు ప్రతిరూపమే’ అని ప్రముఖ తత్త్వవేత్త ‘రూమి’ చెప్పిన కొటేషన్‌ను జత చేసింది. మరి లంగా ఓణీలో 16ఏళ్ల పడుచమ్మాయిగా మారిపోయిన మాధురి ఫొటోలను మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on


View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

నా ‘లిటిల్‌ లేడీ’తో.. నా ‘బ్లాక్‌ లేడీ’..!

View this post on Instagram

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

గతేడాది వచ్చిన ‘గల్లీబాయ్‌’ చిత్రంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. ఇందులో ఓ దిగువ మధ్య తరగతి కుర్రాడిగా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ నటనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్‌ అవార్డు కూడా వరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న రణ్‌వీర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఆకట్టుకుంటోంది. ఫిలింఫేర్‌ అవార్డుల్లో భాగంగా ఇచ్చే ‘బ్లాక్‌ లేడీ’ (అవార్డును)ని దీపిక పట్టుకున్న ఫొటోను పోస్ట్‌ చేసిన రణ్‌వీర్‌.. ‘నా లిటిల్‌ లేడీ (భార్య దీపికను ఉద్దేశిస్తూ)ని.. నా బ్లాక్‌లేడీ (అవార్డు) కలుసుకున్న వేళ’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించాడు.

View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh) on

ఒక్క ఫొటోలో ఎన్నో ఎమోషన్స్‌..

బిగ్‌బాస్‌ - 3 రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది నటి వితికా షేరు. గతంలో కొన్ని సినిమాల్లో నటించినా.. బిగ్‌బాస్‌ హౌస్‌లో వితిక చేసిన హంగామానే తనని ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేసింది. ఇక టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ జంటల్లో వితిక, వరుణ్‌ సందేశ్‌ జంట ఒకటి. ఇటీవల వితిక సోషల్‌మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. తన భర్తతో గడిపిన మధుర జ్ఞాపకాలతో పాటు తన లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా వైట్‌ షర్ట్‌లో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది. రకరకాల హావభావాలతో దిగిన ఫొటోలన్నింటినీ ఒక చోట చేర్చిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Vithika Sheru (@vithikasheru) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లే నా లడ్డూలు..!

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More