scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

అతను.. ఆమె.. ఓ వెకేషన్‌!

Latest Posts Of Celebrities On Social Media

వెకేషన్‌ మోడ్‌ ఆన్‌!

బాలీవుడ్‌ గ్లామరస్‌ కపుల్‌ అనగానే టక్కున గుర్తొచ్చే జంట రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె.
భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో ఈ అందమైన జంటను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వృత్తిపరంగా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ అందాల జంట వీలు చిక్కినప్పుడల్లా విభిన్న పర్యటక ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తమ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త విరామం తీసుకొని వెకేషన్‌కు చెక్కేసిందీ ముద్దుల జంట. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. తామిద్దరి పాస్‌పోర్ట్‌లను క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేసిన దీప్స్‌.. ‘అతను, ఆమె.. ఓ వెకేషన్‌’ అనే అర్థం వచ్చేట్లుగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

View this post on Instagram

His & Hers...💞 #vacation

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

అయితే తాము ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదీ అందాల తార. కానీ ‘వేలంటైన్స్‌ డే’ను ఏకాంతంగా సెలబ్రేట్‌ చేసుకోవడానికే ఈ జంట వెకేషన్‌కు వెళ్లినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జీవా @ 5!

View this post on Instagram

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, సాక్షి సింగ్‌ల ముద్దుల తనయ జీవాకు సోషల్‌ మీడియాలో ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్యూట్‌ కిడ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు తన చిన్నారిలో దాగున్న విభిన్న నైపుణ్యాలను వీడియోల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారీ సెలబ్రిటీ కపుల్‌. ఇలా తన ట్యాలెంట్‌తో బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుందీ సూపర్బ్‌ కిడ్‌. ఈరోజు జీవా పుట్టినరోజు. ఈ సందర్భంగా సాక్షి.. జీవాకు సంబంధించిన ఒక క్యూట్‌ ఫొటోను పోస్ట్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ‘ఐదో పుట్టినరోజు జరుపుకొంటున్న నా చిట్టి తల్లికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ రాసుకొచ్చింది సాక్షి.

స్వీట్స్‌పై చాక్లెట్‌ సిరప్‌ పోస్తూ..!

View this post on Instagram

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

క్యాన్సర్‌ మహమ్మారిని తనదైన ఆత్మస్థైర్యంతో జయించి, ప్రస్తుతం ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న అందాల భామ సోనాలీ బింద్రే. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత విశేషాలను తరచూ నెటిజన్లతో పంచుకుంటూనే ఉంటుందీ లవ్లీ లేడీ. ఈ క్రమంలో తను ఛీట్‌ డేను ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘ఈరోజు నా ఛీట్‌ డే..’ అంటూ పేర్కొంది. స్వీట్స్‌పై చాక్లెట్‌ సిరప్‌ను పోస్తూ.. వాటిని తిన్నంతగా ఆస్వాదిస్తోన్న ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే మనకూ నోరూరకమానదు. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి!

View this post on Instagram

Cheat day today 😋

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

బ్యూటీస్‌ ఇన్‌ వన్‌ ఫ్రేం..!

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ నిన్న తన కవల పిల్లలు యష్‌, రూహీల పుట్టినరోజు వేడుకలను తారల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న మన బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ లేడీస్‌ కరీనా కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, రాణీ ముఖర్జీలు కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఇలా ఒదిగిపోయారు. ఈ ఫొటోను కరీనా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ హార్ట్‌ సింబల్స్‌ జత చేసింది. ఇలా ముగ్గురు ముద్దుగుమ్మలూ నవ్వుతూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోను చూసిన అభిమానులు వారి అందానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఈ అందమైన ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి..

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.