@teamvasundhara
నా ప్రేమ రోజురోజుకీ రెట్టింపవుతోంది!
ముద్దులతో నిద్ర లేద్దాం !
నేహా ధూపియా- అంగద్ బేడీ.. పరిచయం అవసరం లేని బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ వీరు. 2018, మేలో అత్యంత రహస్యంగా వివాహమాడిన ఈ చూడముచ్చటైన జంట.. అదే ఏడాది నవంబర్‌లో మెహ్ర్ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సందర్భమేదైనా ఈ క్యూట్ కపుల్ తమ మధ్య ఉన్న ప్రేమను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తమ దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు.. తమ ఫ్యాన్స్‌కు దాంపత్య పాఠాలు నేర్పుతున్నారు. ఈరోజు అంగద్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన భర్తకు విషెస్ చెబుతూ ఇన్‌స్టాలో ఓ లవ్లీ పోస్ట్ పెట్టింది నేహ.
తన ఇష్టసఖుడి బుగ్గపై గాఢంగా ముద్దుపెడుతూ క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వైఫీ.. ‘నా ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీపై నాకున్న ప్రేమ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అదెలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావట్లేదు.. కానీ నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. రోజూ ఉదయం నువ్విచ్చే ముద్దుతో నేను, నేనిచ్చే ముద్దుతో నువ్వు నిద్ర లేవాలని కోరుకుంటున్నా..’ అంటూ తన భర్తపై తన గుండెలోతుల్లో దాగున్న ప్రేమకు క్యాప్షన్ రూపంలో అక్షర రూపమిచ్చిందీ అందాల తార.
|
సింధుతో లక్ష్మి!
భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు సాధించిన విజయాలు యావత్ దేశానికే గర్వకారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ ప్రముఖులు సైతం ఈ తెలుగు తేజాన్ని కలిసి సన్మానిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా తన కుటుంబంతో కలిసి పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ బ్యాడ్మింటన్ స్టార్‌ను సన్మానించింది. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందులో మంచు లక్ష్మి, మోహన్ బాబు, పీవీ సింధు కుటుంబంతో పాటు, చిరంజీవి, నాగార్జున, పుల్లెల గోపీచంద్, అజారుద్దీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను లక్ష్మి ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘మనందరినీ గర్వపడేలా చేసిన వ్యక్తిని గౌరవించుకోవడం ఎంతో సంతోషకరం.. ఈ డిన్నర్ ఎంతో ఆనందంగా గడిచింది..’ అంటూ పేర్కొందీ బ్యూటిఫుల్ లేడీ.
|
లవ్లీ ‘జాను’ శారీ లుక్స్ అదుర్స్.!
సమంత, శర్వానంద్ జంటగా నటించిన ‘జాను’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్కై సామ్ తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు అదిరిపోయే శారీ లుక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిందీ అందాల తార.
ఒక లుక్‌లో భాగంగా.. సిల్వర్ బోర్డర్ ప్లెయిన్ బ్లాక్ కలర్ శారీ ధరించిన ఈ లవ్లీ గర్ల్.. మ్యాచింగ్ బ్లౌజ్‌తో అదరగొట్టింది. ఇక మరో లుక్ కోసం లైట్ గ్రీన్ కలర్ చందేరీ స్ట్రైప్డ్ శారీపై డార్క్ గ్రీన్ సిల్క్ బ్లౌజ్‌ను ధరించింది. ఈ రెండు శారీ లుక్స్ సామ్‌ను మరింత లవ్లీగా చూపించాయని చెప్పుకోవచ్చు.
|
వీకెండ్ కోసం ఎదురుచూస్తున్నాం..!
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఒక ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అందాల తార.. ‘వీకెండ్ కోసం ఎదురుచూస్తున్నాం..’ అంటూ సరదాగా క్యాప్షన్ జోడించింది.
|
ఈ ప్రపంచంలో నిస్వార్థమైంది ప్రేమ ఒక్కటే!
టాలీవుడ్ లవర్ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజయ్‌కి.. ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, కేథరిన్, ఇజాబెల్.. వంటి నలుగురు హీరోయిన్లకు మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాలు, పలు రొమాంటిక్ సీన్స్, హృదయానికి హత్తుకునే డైలాగ్స్.. వంటివన్నీ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఈ ప్రపంచంలో నిస్వార్థమైంది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు.. ఐ వాంటెడ్ టు బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్’, ‘గుండెకు తగిలిన దెబ్బకు నొప్పి తెల్వకుండా ఉండాలంటే ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి..’ అనే డైలాగ్స్‌తో సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో ఒకింత ఆసక్తి రేకెత్తిస్తున్నాడు విజయ్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుందీ చిత్రం. మరి, తాజాగా విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
|
|