scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

జాను.. ఐలవ్యూ!

Latest posts of celebrities on social media

మీ అమ్మ నాపై కచ్చితంగా కోపగించుకుంటుంది!

‘జాను’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది నటి సమంత. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సామ్‌ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇక సమంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్‌ సామ్‌ సొంతం. తాజాగా సమంత అభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోపై ఏకంగా సమంతే స్పందించడం విశేషం.


నోట్‌బుక్‌ పేజీలను ‘ఐలవ్యూ సామ్‌’తో నింపి.. మధ్యలో రెడ్‌ పెన్నుతో ‘జాను’ అని రాసి, ఆ పక్కనే రెడ్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ వేసిన పుస్తకంలోని పేజీల్ని చూపిస్తున్న వీడియోను శృతి అనే అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో పాటు ‘ఇది రాయడానికి నాకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. మా అమ్మ తిడుతున్నా కూడా నేను రాయడం ఆపలేదు. నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ ఆగిపోని ప్రయాణం లాంటిది సామ్‌’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌ను సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘మీ అమ్మ నాపై కచ్చితంగా కోపగించుకుంటుంది. నువ్వు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని. కానీ ముందు నువ్వు బాగా చదువుకో ప్లీజ్‌’! అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాక్ట్రెస్‌.

View this post on Instagram

Let me tell you a story ... #jaanuonfeb7th

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఇక ‘జాను’ చిత్ర ట్రైలర్‌ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంత కొత్త లుక్‌లో తళుక్కుమంది. క్రీమ్‌ కలర్‌ ఐవరీ టిష్యూ సిల్క్‌ శారీలో అందానికే అసూయ పుట్టేలా ఉందీ భామ. ఇక క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో లైట్‌ జ్యుయలరీలో సామ్‌ ఇచ్చిన పోజుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


ప్రతిరోజూ నా ఉదయం ఇలాగే మొదలవుతుంది..

View this post on Instagram

I woke up like this... 😴🤷🏻‍♀️ #goodmorning #stretchitout @samir.purohit

A post shared by Pooja Hegde (@hegdepooja) on

అందంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికీ ఈ తరం నటీమణులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి పూజా హెగ్డే. ఇందులో భాగంగా జిమ్‌లో క్రమం తప్పకుండా వర్కవుట్లు చేసే పూజ.. వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పూజ.. ‘ప్రతి రోజూ నా ఉదయం ఇలాగే మొదలవుతుంది’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on

ఇక లేత గులాబీ రంగు స్వెట్టర్‌ ధరించి ఓరనవ్వు నవ్వుతూ క్లిక్‌మనిపించిన మరో ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఏదేమైనా.. నవ్వడానికి ఓ కారణాన్ని వెతుక్కోండి’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. పూజా హెగ్డే తాజాగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ అందాల భామ ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

చాలామంది విమర్శకులున్నారు..

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమాల్లోనూ సత్తా చాటుతోంది నటి, యాంకర్‌ అనసూయ. గురువారం వచ్చిందంటే చాలు ‘జబర్దస్త్‌’ షోతో బుల్లితెర అభిమానులను పలకరించే అను.. సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం తన ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునే అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. తెలుపు రంగు గౌన్‌పై కుంకుమపువ్వు రంగు జాకెట్‌ వేసుకొని దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘ఇప్పటికే ఈ ప్రపంచంలో చాలామంది విమర్శకులున్నారు. మీరు మాత్రం ఇతరులను ప్రోత్సహించండి..’ అంటూ ఆలోచనలను రేకెత్తించే క్యాప్షన్‌ను జోడించింది.

మా కొత్త సినిమాలివే!

ఇప్పుడిప్పుడే తన సత్తా ఏంటో చాటుతూ వరుస సినిమాలతో బిజీగా మారుతోంది ఉత్తరాది నటి సారా అలీఖాన్‌. ఇక మరోవైపు దక్షిణాదిలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగి కొన్ని రోజులు సినిమాలకు దూరమైనా, ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు సై అంటోంది నటి త్రిష. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకనేగా మీ డౌట్‌. ఈ ఇద్దరు తారలు ఒకే రోజు తమ కొత్త చిత్రాలకు సంబంధించిన వివరాలను వారి వారి సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించి తమ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తారు. అదీ అగ్రనటులతో..! ఇంతకీ ఆ సినిమాలేంటో వారి మాటల్లోనే...

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నా..
ఒకవైపు నుంచి తమిళ హీరో ధనుష్‌, మరోవైపు నుంచి అక్షయ్‌ కుమార్‌ తన బుగ్గలపై ముద్దుపెడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సారా.. ‘నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నా.. నా తర్వాతి సినిమా ‘అట్రాంగి రే’. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌తో కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ సర్‌, ఎంతో ప్రతిభ కలిగిన ధనుష్‌లతో కలిసి పనిచేయడం నా అదృష్టం..!’ అని రాసుకొచ్చిందీ పటౌడీ ప్రిన్సెస్‌.


View this post on Instagram

A post shared by Trish (@dudette583) on

వీరితో కలిసి పనిచేయడం చాలా అదృష్టం..
జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా ‘రామ్’ అనే సినిమా ఇది వరకే ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించే అవకాశాన్ని నటి త్రిష కొట్టేసింది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది. ‘ఒకవైపు భారతదేశంలోనే ఉత్తమ దర్శకుల్లో ఒకరు (జీతూ జోసెఫ్‌), మరోవైపు లెజెండరీ నటుడు (మోహన్‌లాల్‌)... వీరిద్దరి మధ్యలో కూర్చోవడం ఎంతో సంతోషంగా ఉంది. వీరితో కలిసి పనిచేయడం మరెంతో అదృష్టంగా భావిస్తున్నాను’ అని పోస్ట్‌ చేసింది త్రిష.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లే నా లడ్డూలు..!

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

హలో.. హలో.. మీరు నేననుకునే వ్యక్తేనా?

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. యాంకర్‌గా రాణించి.. సినిమాల్లో నటించేంత స్థాయికి ఎదిగింది అనసూయ. ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇక కెరీర్‌ పరంగా తానెంత బిజీగా ఉన్నా సరే.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే అనసూయ.. తన ఫొటోలతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ‘జబర్దస్త్‌’ సెట్‌లో లంగా ఓణీలో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన అను.. ‘నా ఆత్మ పరిభాషే డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అందుకే ఆ రోజు నాకు బాగా గుర్తుంది!

అటు నటనలోనే కాకుండా సింగర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్న అందాల భామ శృతి హాసన్‌. చిన్నప్పటి నుంచి సంగీతంపై తనకున్న ఆసక్తే తనను గొప్ప గాయనిగా మనందరికీ పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడిన ఈ చిన్నది.. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని కూడా రూపొందిస్తుంటుంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అనునిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తన సినిమా అప్‌డేట్లతో పాటు తాను పాల్గొనే లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ విశేషాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో శృతి తన చిన్ననాటి ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఇందులో భాగంగా స్కూల్‌ యూనిఫాం ధరించిన శృతి.. ప్రముఖ గాయని ఆశా భోంస్లే ముందు కూర్చొని పాట పాడుతున్న ఫొటోను ఎవరో షేర్‌ చేయగా.. దాన్ని తిరిగి రీపోస్ట్‌ చేస్తూ.. ‘నేను స్కూల్‌ యూనిఫాంలో పాట పాడుతున్న ఈ ఫొటో అంటే నాకెంతో ఇష్టం.. ఓ దిగ్గజ గాయని (ఆశా భోస్లే) సమక్షంలో ఎంతో నెర్వస్‌గా పాట పాడిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. అదొక మధుర జ్ఞాపకం. ఈ ఫొటోని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు..’ అంటూ పేర్కొందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నువ్వు లేని జీవితం ఊహించుకోలేను ప్రాణమా..!

ప్రస్తుతం నటనకు దూరమైనా.. సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది అందాల నటి కరిష్మా కపూర్‌. ఒక దశలో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ కపూర్‌ బ్యూటీ.. తన ట్రెండీ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో ఈ తరం తారలకు గట్టి పోటీనిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తన లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఈ తరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయిందీ సుందరి. ఈ క్రమంలో కరిష్మా ఇటీవల ధరించిన ఓ అందమైన మోనోక్రోమ్‌ అవుట్‌ఫిట్‌కి సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. వైట్‌-బ్లాక్‌ స్ట్రైప్‌డ్‌ వైడ్‌ లెగ్‌ ప్యాంట్స్‌ని ధరించిన కరిష్మా.. దానికి ఫుల్‌ స్లీవ్స్‌ వైట్‌ షర్ట్‌ను జతచేసి ప్రొఫెషనల్‌ బ్యూటీగా మెరిసిపోయింది. కాస్త హెవీ మేకప్‌, జడతో అదరగొట్టిన ఈ బాలీవుడ్‌ అందం.. అచ్చం లేడీ బాస్‌ని తలపించింది. మరి, ఈ బాస్‌ బేబీ ప్రొఫెషనల్‌ లుక్‌ని మీరూ ఫాలో అయిపోండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా చేస్తే సంతోషం మన ఇంట్లోనే దొరుకుతుంది!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేనంత క్రేజ్‌ ఈ హ్యాండ్‌సమ్‌ హీరోకి ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 9 మిలియన్లు దాటింది. ట్విట్టర్‌లో ఇప్పటివరకూ ఇంతమంది ఫాలోవర్లు మరే ఇతర సౌత్‌ ఇండియన్‌ హీరోకీ లేరు. ఈ విషయంపై స్పందిస్తూ.. మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా ట్వీపుల్‌కి 9 మిలియన్ల ధన్యవాదాలు! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనవాళ్లందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు..’ అంటూ రాసుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హంక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలాంటి మాటల కంటే మౌనమే మేలు !

ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా నిత్యం బిజీగా ఉంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నా.. ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది లక్ష్మి. ఇక వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూతురు విద్యా నిర్వాణతో ఎక్కువ సమయాన్ని గడుపుతుందీ సూపర్‌ మామ్‌. ఇటీవలే ఈ అందాల అమ్మ తన చిట్టిపొట్టి చిన్నారితో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. సందర్భానికి తగ్గట్లుగా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్‌ క్వీన్‌గా కూడా పిలిపించుకుంటోంది. ఇలా తాను దిగిన ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ లవ్లీ మామ్‌.. తాజాగా మరో ఫొటోను పంచుకుంది. తాను ట్రెడిషనల్‌గా చీరకట్టులో ముస్తాబై సైడ్‌ లుక్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘ఏంటి.. ఆ చూపేంటి’? అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ లుక్‌లో భాగంగా బ్లూ కలర్‌ చీరలో, బంగారు ఆభరణాల్లో ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇంతకంటే ఇంకేం కావాలి?

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అల్లు అర్జున్‌- స్నేహల ముద్దుల తనయ అల్లు అర్హకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ గారాల పట్టి అర్హకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటారీ లవ్లీ కపుల్‌. ఈ క్రమంలో బన్నీ ఇన్‌స్టా వేదికగా తన ముద్దుల పాప అర్హ తనతో ముద్దుముద్దుగా మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్‌ చేశాడు. ‘నీ ఫేవరేట్‌ కలర్‌ ఏంటి బే’ అని అల్లు అర్జున్‌ అడగ్గా ‘పింక్‌ బే..’ అంటూ అర్హ ఫన్నీగా సమాధానమిస్తుంది. ఇలా తండ్రీకూతుళ్లిద్దరూ ఒకరినొకరు బే అంటూ సాగే సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ స్టైలిష్‌ డాడ్‌.. ‘తనే నా బే..’ అనే క్యాప్షన్‌తో తండ్రీకూతుళ్ల ప్రేమకు నిదర్శనమిది అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అప్పుడు నాకు మాటలు రావు.!

యాంకర్‌గా, నటిగా ఎంతో బిజీగా ఉండే అనసూయ కాస్త సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళుతుంటుంది. తన విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అనసూయకు అలవాటు. ఈక్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. తను వెళ్లిన ప్రదేశం ఏంటో చెప్పక పోయినప్పటికీ ప్రకృతి రమణీయతతో ఉన్న ఆ ప్రదేశంలో తలకు క్యాప్‌, చేతులకు గ్లౌజ్‌లు పెట్టుకొని సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన అను.. ‘తరచూ చేసే ప్రయాణాలు.. ఎప్పటికీ అద్భుతంగా ఉంటాయి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అందుకు అసలైన ఎనర్జీ ఇదే!

మాధురీ దీక్షిత్‌... ఒకప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఓ సంచలనం. 90ల్లో కుర్రాళ్లను ఈ పేరు నిద్ర లేకుండా చేసింది. తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో వెండితెర రాణిగా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. మధ్యలో సినిమాలకు కాస్త విరామం తీసుకున్నా.. ఇప్పుడు మళ్లీ బిజీగా మారి ఈ తరం నాయికలకు కూడా సవాల్‌ విసురుతోందీ బ్యూటీ. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా... సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోందీ యమ్మీ మమ్మీ. 52 ఏళ్ల వయసులోనూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా.. మోడ్రన్‌గా ముస్తాబై చేతిలో కాఫీ కప్పు పట్టుకొని స్టైలిష్‌ లుక్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది మాధురి. ఇక ఆ ఫొటోకు.. ‘కొన్నిసార్లు మీరు చూసే విధానం కొత్తగా ఉండాలి’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇంతటి ఆనందం ఉండగా... మాటలెందుకు దండగ !

ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేసుకునే సెలబ్రిటీ కపుల్స్‌లో షాహిద్‌ కపూర్‌- మీరా రాజ్‌పుత్‌ జంట ఒకటి. షాహిద్‌ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తుంటాడు. ఇలా కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం షాహిద్‌ బెటరాఫ్‌ మీరాకు అలవాటే. నేడు షాహిద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీరా ఇన్‌స్టా వేదికగా శ్రీవారికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. వీళ్లిద్దరూ కలిసున్న ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ ప్రేమగా రాసుకొచ్చిందీ వైఫీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

నాలో మీకు తెలిసింది కొంతే.. తెలుసుకోవాల్సింది ఎంతో.!

అలనాటి అందాల తార శ్రీదేవి పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి యావత్‌ భారతీయ సినిమా ప్రియుల హృదయాల్లో గూడు కట్టుకుందీ అలనాటి తార. దాదాపు ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన ఈ అతిలోక సుందరి.. తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఆపై ‘మామ్‌’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. మళ్లీ అభిమానులకు దగ్గరవుతోందనుకున్న సమయంలోనే 2018 ఫిబ్రవరి 24న అందరినీ వదిలేసి దివికేగిందీ దేవకన్య. సోమవారం (ఫిబ్రవరి 24) శ్రీదేవి వర్ధంతి.. ఈ సందర్భంగా ఆమె కూతురు, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తల్లితో దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి.. తల్లికి నివాళులర్పించింది. జాన్వీ చిన్నతనంలో శ్రీదేవితో కలిసి సరదాగా దిగిన ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేస్తూ.. ‘నిన్ను ప్రతిరోజూ మిస్‌ అవుతూనే ఉన్నానమ్మా’ అని ఎమోషనల్‌ క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

గ్లోబల్‌ స్టారా.. మజాకానా?

ఇటు బాలీవుడ్‌లోనూ, అటు హాలీవుడ్‌లోనూ నటిస్తూ గ్లోబల్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్న లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా. యువతలో ఈ ముద్దుగుమ్మకున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఇక సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుందీ స్టార్‌ హీరోయిన్‌. తాజాగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 50 మిలియన్లకు చేరుకుంది. అంతేకాదు.. భారతీయ సెలబ్రిటీల్లో ఇంతమంది సోషల్‌ మీడియా ఫాలోవర్లు విరాట్‌ కోహ్లీ తర్వాత మన పీసీకే ఉండడం విశేషం. 50.3 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, ప్రియాంక.. 50 మిలియన్‌ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. మరి గ్లోబల్‌ స్టారా మజాకానా! వీరిద్దరి తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెను 44.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

నేను ఎంత మంచిదాన్నో మీరే చెప్పండి..!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలాంటి భార్యలందరికీ హ్యాట్సాఫ్‌ !

బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకొణెలు తమ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘83’. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌.. కపిల్‌ దేవ్‌ పాత్రలో, దీపిక.. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో భాగంగా విడుదలైన రణ్‌వీర్‌ సింగ్‌ ఫస్ట్‌ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను.. ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రోమీ దేవ్‌ పాత్రలో నటిస్తున్న దీపిక ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుతోన్న ఈ లవ్లీ లుక్‌ను దీప్‌వీర్‌ తమ ఇన్‌స్టా ఖాతాల ద్వారా పంచుకున్నారు. కాగా దీనిపై స్పందించిన దీప్స్‌.. ‘క్రీడా చరిత్రలో అత్యద్భుతమైన క్షణాలను రంగరించి రూపొందించిన ఈ గొప్ప చిత్రంలో ఒక భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఒక భార్య తన భర్త వృత్తిపరమైన, వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొని విజయం సాధించడంలో ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తుందో మా అమ్మను చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నటించిన ఈ ‘83’ చిత్రం.. తమ భర్త కలలను తమవిగా భావించి ఆయనకు అనుక్షణం అండగా నిలిచే ప్రతి మహిళ కోసం రూపొందించినది..’ అనే చక్కటి, అర్థవంతమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ వైఫీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

‘6+23=29’... ఎన్నో అందమైన జ్ఞాపకాలు!

ఒకప్పుడు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది నటి ఛార్మి. ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’, ‘జ్యోతి లక్ష్మి’ వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అద్భుత నటనను కనబరిచి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఛార్మి తాజాగా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీజగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌పై ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిందీ ముద్దుగుమ్మ. ఇక ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ముంబయిలో జరుగుతోంది. ఈక్రమంలో ముంబయికి మకాం మార్చిన ఛార్మి.. అక్కడ తెగ సందడి చేస్తోంది. షూటింగ్‌కు సంబంధించిన వివరాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోందీ భామ. ఇక తాజాగా షూటింగ్‌ స్పాట్‌లో తన పెంపుడు శునకాలను పట్టుకొని.. నవ్వుతూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘సంతోషంగా ఉండడానికి ప్రతిఒక్కరూ అర్హులే’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-socialmedia

ఈ అందం.. మీ ప్రతిరూపమే !

అలనాటి సూపర్‌ స్టార్‌ శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలి సినిమా ‘దబాంగ్‌’తోనే యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. ఇటీవల ‘దబాంగ్‌ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనాక్షి ప్రస్తుతం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనల కోసం ఫొటో షూట్‌లలో పాల్గొంటుంది సోనాక్షి. ఇక లేటెస్ట్‌ అవుట్‌ఫిట్స్‌లో దిగిన ఫొటోలు, సినిమా విశేషాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘పికాక్‌’ అనే మ్యాగజైన్‌ కోసం దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసింది సోనాక్షి. వీటిలో సోనాక్షి ఎంబ్రాయిడరీ లెహెంగాలో తలపై కిరీటాన్ని పోలిన పూలతో అచ్చంగా దేవ కన్యలా కనిపిస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నాకింకా కొత్తగానే ఉంది..!

డబ్‌స్మాష్‌లతో మొదలై షార్ట్‌ ఫిలిమ్స్‌తో నెటిజన్లకు పరిచయమైంది దీప్తి సునైనా. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’ సీజన్‌2తో బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరైందీ అందాల తార. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన అల్లరి పనులతో అందరినీ ఆకట్టుకున్న దీప్తి ప్రస్తుతం పలు లఘు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలోఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసుకోవడం ఈ అమ్మడికి అలవాటు. ఈక్రమంలో తాజాగా పసుపు రంగు చీరలో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ కోల్పోని... తిరిగి పొందాలనుకునే వ్యక్తి.. నేనే!’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ షార్ట్‌ ఫిలిం క్వీన్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అది ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఉంది!

బాలనటిగా వెండితెరకు పరిచయమై.. అగ్ర కథా నాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది నటి మీనా. దక్షిణ సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిందీ అందాల తార. ఇక 2009లో విద్యాసాగర్‌ను పెళ్లాడిన ఈ తార.. అనంతరం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా ‘కరోలిన్‌ కామాక్షి’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌. ఇదిలా ఉంటే ఇప్పటికీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంటున్న మీనా.. సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటోంది. తన పాత జ్ఞాపకాలతో పాటు ఇటీవల పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్న మీనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. హాఫ్‌వైట్‌ డ్రస్‌లో కుందనపు బొమ్మలా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ అల్లరి పిల్ల.. ‘ఎప్పుడూ నవ్వుతూ ఉండండి..’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అప్పట్నుంచీ అదే ఎక్స్‌ప్రెషన్‌.. ఏమీ మారలేదు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు - అందాల భామ నమ్రతల ముద్దుల తనయ సీతా పాపకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, ఈ క్యూట్‌ డాల్‌ ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సితార చేసిన డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంటారు ఆమె పేరెంట్స్‌ మహేష్‌-నమ్రతలు. ఈ క్రమంలో తాజాగా చిన్నారి సితార ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘డ్యాంగ్‌.. డ్యాంగ్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా డ్యాన్సింగ్‌ క్వీన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ను జతచేసి, ‘ఎంత అద్భుతంగా చేసిందో..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఎంతో చూడముచ్చటగా డ్యాన్స్‌ చేస్తున్న సితార అచ్చం తమన్నాలాగే స్టెప్పులేసి ఇరగదీసిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి, ఈ క్యూట్‌ కిడ్‌ చేసిన డ్యాన్స్‌ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

దూరమైపోతే తట్టుకోవాలి... దక్కే వరకు ఎదురుచూడాలి.!

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నటి స్నేహా ఉల్లాల్‌. ఆకట్టుకునే అందం, అభినయంతో అభిమానులను ఫిదా చేసిందీ చిన్నది. ఇక ఫ్యాన్స్‌ ఈ ముద్దుగుమ్మను ‘జూనియర్‌ ఐశ్వర్య’గా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే ఈ చేప కళ్ల చిన్నది తాజాగా చేసిన పోస్ట్‌ ఆకట్టుకుంటోంది. రెస్టరంట్‌లో కూర్చొని తను ఆర్డర్‌ చేసిన వివిధ పదార్థాలు ముందు పెట్టుకొని సెల్‌ఫోన్‌ను చూస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఒక వేళ సెల్‌ఫోన్లు లేకపోతే మనం ఎలా ఉండే వాళ్లమో?’ అంటూ తనను తానే ప్రశ్నించుకొని.. ‘ప్రశాంతంగా ఉండేవాళ్లం’ అంటూ ఫన్నీగా జవాబు కూడా రాసుకొచ్చింది స్నేహ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్‌ డియర్‌!

అటు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం మన గోవా బ్యూటీ ఇలియానాకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుందీ లవ్లీ బ్యూటీ. ఈ క్రమంలో ఇలియానాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య తాజాగా 12 మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా నాలుగు విభిన్న వీడియోలను పోస్ట్‌ చేసి తన ఆనందాన్ని ఇలా పంచుకుందీ అందాల తార. ‘నన్ను ఫాలో అవుతున్న 12 మిలియన్ల మంది అభిమానులు చూపించే ప్రేమ నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు..’ అంటూ రాసుకొచ్చిందీ అమ్మడు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

కళ్లు చూసేది కొంచెమే.. మనసు పొందేది ఎంతో!

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను విభిన్నమైన క్యాప్షన్లతో పోస్ట్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నటీమణుల్లో ప్రగ్యా జైస్వాల్‌ ఒకరు. గతకొన్ని రోజులు క్రితం ‘బాలీ’లో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసిన ప్రగ్య.. తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ఎరుపు రంగు ట్రెండీ డ్రస్‌లో వాటర్‌ఫాల్‌ ముందు హృదయాకారంలో ఉన్న ఓ నిర్మాణం దగ్గర దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నీరు ఎక్కడ ఉంటుందో.. హృదయం అక్కడే ఉంటుంది’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఇక ప్రగ్య కెరీర్‌ విషయానికొస్తే.. 2018లో మంచు విష్ణు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ తర్వాత మరే సినిమాలో కనిపించలేదీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఆ దేవుడిని ఇంతకంటే ఇంకేం అడగను!

సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన ‘జాను’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ చిత్ర బృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందాల భామ సమంత తన అందంతోనే కాదు.. తన అటైర్‌తోనూ మాయ చేసేసింది. డల్‌ రోజ్‌ కలర్‌ ఇటాలియన్‌ ఆర్గంజా శారీలో ముస్తాబైన సామ్‌.. చక్కటి మేకప్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె చీరపై ముందు భాగంలో పెయింట్‌ చేసిన 'Jaanu' అనే అక్షరాలు, ఫ్లోరల్‌ పెయింటింగ్‌.. వంటివన్నీ చీరకు మరింతగా వన్నెలద్దాయని చెప్పుకోవచ్చు. ఇలా తాను ఎంతో అందంగా ముస్తాబైన ఈ ఫొటోలను సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, స్పెషల్ లుక్‌లో ముస్తాబైన సామ్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేసేయండి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వన్నె తగ్గని అందం..!

‘మహానటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తనవైపు తిప్పుకుంది నటి కీర్తిసురేష్‌. తన అసమాన నటనతో అలనాటి నటి ‘సావిత్రి’ పాత్రకు ప్రాణం పోసిన కీర్తి ఈ సినిమాతో ‘జాతీయ ఉత్తమ నటిగా’ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘మిస్‌ ఇండియా’ అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోందీ చెన్నై చిన్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ‘ఓ లచ్చా గుమ్మడి’ పాట సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రయూనిట్‌ సినిమాలోని మరో లిరికల్‌ పాటను విడుదల చేసింది. ‘కొత్తగా.. కొత్తగా.. కొత్తగా.. రంగులే నింగిలో పొంగే సారంగమై..!’ అని సాగే పాటలోని చరణాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. థమన్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాశారు. ఇక శ్రేయా ఘోషల్‌ గొంతుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈ పాటను ఓసారి మీరూ వినేయండి..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అతను.. ఆమె.. ఓ వెకేషన్‌!

బాలీవుడ్‌ గ్లామరస్‌ కపుల్‌ అనగానే టక్కున గుర్తొచ్చే జంట రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె. భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో ఈ అందమైన జంటను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వృత్తిపరంగా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ అందాల జంట వీలు చిక్కినప్పుడల్లా విభిన్న పర్యటక ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తమ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త విరామం తీసుకొని వెకేషన్‌కు చెక్కేసిందీ ముద్దుల జంట. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. తామిద్దరి పాస్‌పోర్ట్‌లను క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేసిన దీప్స్‌.. ‘అతను, ఆమె.. ఓ వెకేషన్‌’ అనే అర్థం వచ్చేట్లుగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా ప్రేమ రోజురోజుకీ రెట్టింపవుతోంది!

నేహా ధూపియా- అంగద్‌ బేడీ.. పరిచయం అవసరం లేని బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ వీరు. 2018, మేలో అత్యంత రహస్యంగా వివాహమాడిన ఈ చూడముచ్చటైన జంట.. అదే ఏడాది నవంబర్‌లో మెహ్ర్‌ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సందర్భమేదైనా ఈ క్యూట్‌ కపుల్‌ తమ మధ్య ఉన్న ప్రేమను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తమ దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు.. తమ ఫ్యాన్స్‌కు దాంపత్య పాఠాలు నేర్పుతున్నారు. ఈరోజు అంగద్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన భర్తకు విషెస్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఓ లవ్లీ పోస్ట్‌ పెట్టింది నేహ.

Know More