scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు..!

Latest Posts of Celebrities On Social Media

అందుకే నాకు థాయ్‌లాండ్‌ అంటే ఇష్టం..!

తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటి సన్నీ లియోనీ. వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి మాత్రం తగిన సమయాన్ని కేటాయిస్తుంటుందీ బ్యూటీ. అంతేకాదు.. తన భర్త, పిల్లలతో గడిపిన మధుర క్షణాలు, ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా సన్నీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో సన్నీ తన భర్త డేనియర్‌ వెబర్‌తో కలిసి ఇటీవలే థాయ్‌లాండ్‌లోని దేవాలయాలను దర్శించుకొని అక్కడి విశేషాలను ఇన్‌స్టాలో పంచుకుంది.

థాయ్‌లాండ్‌ను ఇష్టపడడానికి గల ఎన్నో కారణాలలో.. ఇక్కడి దేవాలయాలు కూడా ఒకటి..! చిన్నవైనా.. పెద్దవైనా.. ఆలయాలంటే నాకెంతో ఇష్టం. డేనియల్‌తో కలిసి వెళ్లడం ఇంకా ఇష్టం. ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా గడవాలని ప్రార్థిస్తున్నా..!’ అంటూ రాసుకొచ్చిందీ గ్లామర్‌ బ్యూటీ.

నా ఫేవరెట్‌ రెసిపీ ఇదే..!

ఆరోగ్యమే మహాభాగ్యం’.. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాడే అసలైన శ్రీమంతుడు..!మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కానీ, ప్రస్తుతం ఉన్న బిజీ జీవన విధానంలో మనిషి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. వాటికి సంబంధించిన రెసిపీల గురించి తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. అందుకే అలాంటి హెల్దీ రెసిపీస్‌ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మొదలైంది #whatsinyourdabba అనే సోషల్‌ మీడియా ఛాలెంజ్‌. కొన్నిరోజుల క్రితం మొదలైన ఈ ఛాలెంజ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ తమకు తెలిసిన ఆరోగ్యకరమైన వంటకాలను పంచుకుంటున్నారు.

View this post on Instagram

I may occasionally be a ‘VADA PAV-ERED’ girl but I also carry some healthy treats in my dabba like these yummy beetroot tikkis! I am also nominating @akshaykumar @malaikaaroraofficial and @iamsonalibendre to let me have a peek inside their dabbas. I'd love to know your favourite healthy treats. Share a photo on social media with #WhatsInYourDabba and tag @tweakindia Recipe Corner Wash and grate the beetroot,then sauté in a pan until the water dries out. Add some grated paneer, chat masala, salt, jeera and dhaniya powder and bread crumbs to the beetroot. Add a little oil and mix gently. Then make tikki out of it. Let it rest for 15 minutes, shallow fry in a pan with minimum oil.

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

బాలీవుడ్‌ బ్యూటీ ట్వింకిల్‌ ఖన్నా కూడా తాజాగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ ఆరోగ్యకరమైన వంటకం రుచిని ఆస్వాదిస్తూ క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘వడాపావ్‌ అంటే నాకెంతో ఇష్టమయినప్పటికీ.. దానిని నేను చాలా అరుదుగా తింటుంటాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్‌రూట్‌ టిక్కీల వంటి వంటకాలను సైతం నా డబ్బాలో తీసుకెళ్తుంటాను..!’ అంటూ రాసుకొచ్చింది.

అంతేకాదు, బీట్‌రూట్‌ టిక్కీ తయారు చేసుకునే విధానాన్ని కూడా ట్వింకిల్‌ ఈ పోస్ట్‌లో తెలిపిందిముందుగా బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఇందులో తురిమిన పన్నీర్‌, చాట్‌ మసాలా, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, బ్రెడ్‌ క్రంబ్స్‌తో పాటు కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని టిక్కీల మాదిరిగా చేసుకోవాలి. ఒక ప్యాన్‌పై కొద్దిగా నూనె వేసి..  ఈ టిక్కీలను 15 నిమిషాల పాటు ఇరువైపులా ఫ్రై చేసుకుంటే సరి..!

ఈ సందర్భంగా నేను అక్షయ్‌ కుమార్‌, మలైకా అరోరా, సోనాలీ బింద్రేలను నామినేట్‌ చేస్తున్నా..! మీరు ఎక్కువగా ఇష్టపడే ఆరోగ్యకరమైన ఆహారాలేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటికి సంబంధించిన ఫొటోలను మీరు సోషల్‌ మీడియాలో #whatsinyourdabba అనే హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి..!’ అని పేర్కొందీ బ్యూటీ.

మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు..!

View this post on Instagram

Saying my goodbyes to the gorgeous Como!! ♥♥

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబుకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ ఈ హ్యాండ్‌సమ్‌కు యువతలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల సందర్భంగా మహేష్‌ బాబు అభిమానులు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కొంతమంది అభిమానులు మహేష్‌పై తమకున్న అమితమైన ప్రేమను తెలియజేస్తూ తమ కార్లు, బైకులపై ‘సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్లను అతికించుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘అభిమానాన్ని చూపించడానికి ఎన్నో మార్గాలుంటాయి..! మాపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తోన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు..!’ అంటూ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

వైట్‌ కలర్‌ డ్రస్సుల్లో ఏంజెల్స్‌..!

యువతకు లేటెస్ట్‌ ఫ్యాషన్లను పరిచయం చేయడంలో ముందుంటారు మన సినీ తారలు. ఎక్కువగా మోడ్రన్‌ దుస్తుల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మలు.. అప్పుడప్పుడూ ఎంతో ట్రెడిషనల్‌గా మెరుస్తూ వారెవ్వా.. అనిపిస్తుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ బ్యూటీస్‌ కీర్తి సురేష్‌, నివేదా పేతురాజ్‌లు వేర్వేరు ఈవెంట్లలో వైట్‌ కలర్‌ ట్రెడిషనల్‌ డ్రస్సుల్లో హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి ఈ అందమైన భామల ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి

View this post on Instagram

A post shared by Shravya Varma (@shravyavarma) on

కప్‌ కేక్స్‌ అంటే స్వర్గమే..!

View this post on Instagram

Cupcakes are heaven 😋😍🔥 #cupcakes #vegan #cheatday #yummy #ting

A post shared by Preity G Zinta (@realpz) on

తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం స్టార్‌ హీరోయిన్‌ ప్రీతీ జింటా. ఈ సొట్టబుగ్గల సందరి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. అభిమానుల్లో తనకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రీతి సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ చేరువగానే ఉంటుంది. ఈ క్రమంలో తను తాజాగా ఇన్‌స్టాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘కప్‌ కేక్స్‌ అంటే స్వర్గమే..!’ అని కప్‌ కేక్స్‌ అంటే తనకెంత ఇష్టమో తెలియజేసిందీ బ్యూటీ.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

వీళ్లే నా లడ్డూలు..!

తన పాటలతో సంగీత ప్రియులను మెస్మరైజ్‌ చేసే బ్యూటిఫుల్‌ సింగర్‌.. గీతా మాధురి. గతేడాది ఆగస్టులో దాక్షాయణి ప్రకృతి అనే బుజ్జి పాపకు జన్మనిచ్చిన గీత.. ప్రస్తుతం తన చిన్నారి ఆలనాపాలనలో బిజీబిజీగా గడుపుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో ఆ వేదికగా పంచుకునే ఈ లవ్లీ సింగర్‌.. తాజాగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఇటీవలే ఓ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొన్న గీత.. పాపని ఎత్తుకొని, ఆ పక్కనే ఆమె భర్త నందు తన భుజంపై తల వాల్చినప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. ‘నా ప్రపంచమంతా నా భుజాలపైనే ఉంది..’ అంటూ తన భర్తే తన సర్వస్వం అని చెప్పకనే చెప్పిందీ తెలుగందం. మరి, ఈ లవ్లీ పిక్‌ను మీరూ చూసేయండి.

Know More