scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

మగువలు మెచ్చే కానుకలు.. అవే..!

Latest posts of Celebrities in Social Media

వాళ్లకూ ఇలాంటి శిక్షలే విధిస్తే ఏమవుతుంది..?

211219socialpostgh650-3.jpg

ప్రస్తుతం మన దేశాన్ని పీడిస్తోన్న సమస్యల్లో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు ప్రధానమైనవి. నెలల శిశువు నుంచి వృద్ధుల వరకు రోజుకు ఎందరో ఆడవాళ్లు ఈ రాక్షసుల చేతిలో అన్యాయంగా బలవుతున్నారు. వీటిని ఆపడం ఎలా..? అనే విషయం గురించి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివిధ వేదికల ద్వారా తరచూ తమ అభిప్రాయాలను తెలియజేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా ప్రస్తుతం రాజస్థాన్‌లో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ తనకు ఎదురు పడిన ఓ అరుదైన విషయాన్ని జుహీ ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ ఫొటోలో కుడివైపు మీకు కనిపిస్తోన్న బావి 50 అడుగుల లోతు ఉంటుంది. ప్రస్తుతం అది ఎండిపోయింది. పూర్వం ఇక్కడ దోపిడీలు, నేరాలకు పాల్పడిన వారిని ఇందులో వేసి వదిలేసేవారట. కొద్దిరోజులకు వాళ్లు అందులోనే చనిపోయేవారు. అలా వాళ్లు బాధతో కూడిన చావుకు గురయ్యేవారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతోన్న దుర్మార్గులకు కూడా ఇలాంటి శిక్షలే విధిస్తే ఏమవుతుంది..?’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిందీ తార.

నేను రడీ.. మరి మీరు..?

211219socialpostgh650-4.jpg

సినిమా పరిశ్రమకు సంబంధించి నటన, దర్శకత్వం, సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ.. మొదలైన విభాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన కళాకారులకు ప్రతి ఏటా పురస్కారాలను అందించి సత్కరిస్తుంది ఫిలింఫేర్‌. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ‘ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌’ వేడుకలు ఈ సాయంత్రం చెన్నైలో ఘనంగా జరగనున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో అలరించేందుకు అందాల తారలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తను ఎంతో ఆత్రుతగా ఉన్నట్లు అందాల తార రకుల్‌ ఓ వీడియో ద్వారా తెలిపింది.

ఈ షోలో నా డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని ఎంతో ఆత్రుతతో ఎదురు చేస్తున్నా..! 2018, 2017 ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ వేడుకల్లో కూడా నేను డ్యాన్స్‌ చేశాను. ఈసారి కూడా నా పెర్ఫార్మెన్స్‌ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.!’ అని చెప్పుకొచ్చిందీ భామ. రకుల్‌ డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తోన్న ఓ వీడియోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఫిలింఫేర్‌.

మగువలు మెచ్చే కానుకలు.. ఇవే..!

ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉల్లిపాయలను చాలా అపురూపమైన వస్తువుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఉల్లిపై రకరకాల ఫన్నీ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తన సతీమణి ట్వింకిల్‌ ఖన్నాకు ఉల్లిపాయతో తయారు చేసిన ఇయర్‌ రింగ్స్‌ను కానుకగా ఇచ్చాడు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాజాగా ట్వింకిల్‌ వాటిని ధరించి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘ఈ వెల కట్టలేని కానుకను ధరించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మగువలు మెచ్చే కానుకలు.. ఉల్లిపాయలే..!’ అని రాసుకొచ్చింది.

211219socialpostgh650-1.jpg

నాకు గుడ్‌లక్‌ చెప్పండి ఫ్రెండ్స్‌..!

211219socialpostgh650-5.jpg

మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న నటుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. తనతో నటించే అవకాశం కోసం అగ్ర తారలు సైతం ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ‘దర్బార్‌’ తర్వాత రజినీ తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో నిన్నటి తరం అందాల తారలు ఖుష్బూ, మీనాలు కీలకపాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పనులు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖుష్బూ తన ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘ఇప్పుడే హైదరాబాద్‌కి చేరుకున్నాను. రజినీకాంత్‌ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్‌ రేపటి నుంచి మొదలు కానుంది. ఆనందంతో పాటు కొంత భయంగా కూడా ఉంది. గుడ్‌లక్‌ చెప్పి నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్‌..!’ అని రాసుకొచ్చిందీ తార.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram