scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను!

Latest posts of Celebrities in Social Media

కొన్నిసార్లు ఇలాంటి చిన్న కానుకలే హృదయాన్ని తాకుతుంటాయి..!

131219socialpostghg650-7.jpg

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు ఉల్లిపాయలను ఓ కూరగాయగా కాకుండా బంగారంతో సమానంగా భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఉల్లిపాయలపై నెటిజన్లు తయారు చేసిన రకరకాల ఫన్నీ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన ప్రియమైన భార్య ట్వింకిల్‌ ఖన్నాకు ఉల్లిపాయలతో తయారు చేసిన ఇయర్‌ రింగ్స్‌ను కానుకగా ఇచ్చాడు. వాటికి సంబంధించిన ఫొటోను ట్వింకిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా పార్ట్‌నర్‌ కపిల్‌ శర్మ షో నుంచి ఇంటికి తిరిగి వచ్చి.. ‘షోలో వాళ్లు వీటిని కరీనాకు చూపించారు. కానీ, ఇవి తనను అంతలా మెప్పించలేకపోయాయి. ఇవి నీకు కచ్చితంగా నచ్చుతాయని నాకు తెలుసు. అందుకే నీకోసం తీసుకొచ్చా..!’ అని అన్నారు. కొన్నిసార్లు ఇలాంటి చిన్న కానుకలే హృదయాన్ని తాకుతుంటాయి’ అని రాసుకొచ్చింది.

131219socialpostghg650-8.jpg

మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను..!

131219socialpostghg650-6.jpg

మనం అభిమానించే వ్యక్తులకు సంబంధించిన ప్రతి విషయం మనకూ ప్రత్యేకమే..! ఈరోజు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తల్లిదండ్రులు.. శక్తి కపూర్‌, శివంగి కపూర్‌ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా వాళ్లకు సోషల్‌ మీడియా ద్వారా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిందీ ముద్దుగుమ్మ. ‘హ్యాపీ యానివర్సరీ మమ్మీ, బాపు..! మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు..!’ అంటూ రాసుకొచ్చింది శ్రద్ధ.

131219socialpostghg650-5.jpg

గుడ్‌ ఫ్రెండ్స్‌ = ఫ్యామిలీ’ అని ఈ ఫొటో నిరూపిస్తోంది..!

131219socialpostghg650-9.jpg

టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనమ్‌ మీర్జా వివాహం మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌తో ఇటీవలే హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో సానియాకు ప్రియ మిత్రులైన రామ్‌ చరణ్‌, ఉపాసనలు కూడా ఈ వేడకలో సందడి చేయడం విశేషం. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘‘గుడ్‌ ఫ్రెండ్స్‌ = ఫ్యామిలీ’ అని చివరి ఫొటో నిరూపిస్తోంది’ అని రాసుకొచ్చింది.

స్టైల్‌ ఐకాన్‌..!

131219socialpostghg650-1.jpg

సినిమాలతో పాటు బయట జరిగే కార్యక్రమాల్లోనూ తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌, స్టైల్‌ స్టేట్‌మెంట్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకొంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ. అంతేకాదు తను ధరించే ట్రెండీ ఫ్యాషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొంటుందీ భామ. ఈ క్రమంలో కియారా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన లేటెస్ట్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

131219socialpostghg650-2.jpg

బారాత్‌కి టైమ్‌ అయింది.. స్టైల్‌గా ఉండడం తప్పనిసరి..!

పెళ్లి అంటేనే సరదాలు, సంతోషాల సమ్మేళనం. మెహెందీ ఫంక్షన్‌, సంగీత్‌, బ్యాచిలర్‌ పార్టీ, వివాహం, రిసెప్షన్‌.. అంటూ రకరకాల ఈవెంట్లతో సందడి నెలకొంటుంది. ఇక పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితుల హడావిడి, కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌ తారలు పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్‌ తమ తమ స్నేహితుల వివాహ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను తాము సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఇలా క్యాప్షన్లు ఇచ్చారు.

131219socialpostghg650-4.jpg

ప్రగ్యా - సంగీత్‌ నైట్‌..!

131219socialpostghg650-3.jpg

పూజ - పెళ్లికొడుకు తరఫు బంధువులం..! బారాత్‌కి టైమ్‌ అయింది.. స్టైల్‌గా ఉండడం తప్పనిసరి..!

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery