scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

నాకు నేను అందంగా కనిపించేలా చేసింది నువ్వే!

The Latest Updates Of Celebrities

నన్ను అందంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు!

అనిల్‌ కపూర్‌ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. తనదైన అందం, అభినయంతో గుర్తింపు సంపాదించుకుంది సోనమ్‌ కపూర్‌. తన ఫ్యాషన్‌ లుక్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా స్టైల్‌ ఐకాన్‌గా పేరుగాంచిన ఈ భామ .. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఇటీవల మరణించిన మేకప్‌ ఆర్టిస్ట్‌ను ఉద్దేశిస్తూ..‘నాకు 22 సంవత్సరాలు ఉన్నప్పటి ఫొటో ఇది. నా ఫొటో షూట్స్‌ అన్నీ చూస్తే అందులో ఎక్కువగా నేను సుబ్బుతో వర్క్‌ చేసినవే..నాకు తెలిసి నా మొదటి పోర్ట్‌ఫోలియో షూట్‌, మొదటి కవర్‌ ఫొటో షూట్‌, నా మొదటి యాడ్‌ క్యాంపెయిన్‌, నా మొదటి ప్రిమియర్‌.. ఇలా అన్నింటికీ మీరే మేకప్‌ చేశారు. నేను మిమ్మల్ని మిస్‌ అవ్వుతున్నాను. నన్ను అందంగా తీర్చిదిద్దినందుకు.. అలాగే నాకు నేను అందగత్తెను అనిపించేలా చేసినందుకు కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్‌ పెట్టింది.

హ్యాపీ బర్త్‌డే ‘డాడీ’

కుటుంబంలో తండ్రి-కూతుళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. కూతుళ్లకు అతిపెద్ద సపోర్టర్‌ నాన్న. ఈ క్రమంలో టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘ఎంతో అందగాడైన నాన్నకి హ్యాపీ బర్త్‌డే. నీ ప్రేమ, నమ్మకం, దయ పెరుగుతూ ఉండాలి. అవి ఎప్పటికీ నిలిచి ఉండాలి. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. నా బలం, అండ నువ్వే’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా కూడా సోషల్‌ మీడియా వేదికగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది. సోనాక్షి తన తండ్రితో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘బర్త్‌డే బాయ్‌’ అంటూ క్యాప్షన్‌ని జతచేసింది

91219socialpostgh650.jpg

నేనిప్పటివరకూ ఇంత శక్తిమంతమైన మహిళను చూడలేదు..

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటన యావద్దేశాన్నీ కుదిపేసింది. ఆపై నిందితుల ఎన్‌కౌంటర్‌తో .. అలాంటి వారందరికీ ఇలాంటి శిక్షలే వేయాలంటూ నినదించింది. ఈ క్రమంలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై మళ్లీ చర్చలు జరగడం మొదలయ్యాయి. వారి శిక్ష అమలు గురించి ఇప్పుడందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రవీనా టాండన్‌ ఇన్‌స్టాలో నిర్భయ తల్లితో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ..‘నేను ఎంతో శక్తిమంతమైన మహిళ ఆశా దేవితో ఉన్నాను. 2012 నుండి ఇప్పటి దాకా ఆమె కన్నీరు ఆగలేదు. రాజకీయ నాయకులు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, కఠినమైన చట్టాలు, చదువుకున్న వారు.. ఇలా ఎవరి వల్లా ఏమీ మారలేదు. నేను తనని ఓ ప్యానల్‌ డిస్కషన్‌లో కలిశాను. ఇప్పటికీ మా డిమాండ్‌లో ఎటువంటి మార్పూ లేదు. సంవత్సరాలు గడిచిపోయినా తను అప్పుడు చెప్పిన మాటలు నా చెవులకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఈ హడావిడంతా నాలుగు రోజులు.. రాజకీయ నాయకుల మాటలు, కొవ్వొత్తుల ర్యాలీలు, టీవీల్లో న్యూస్‌లు అంతా నాలుగు రోజులే. 5వ రోజు నుండి అంతా మామూలుగానే ఉంటారు. మళ్లీ ఇటువంటి భయంకర సంఘటన జరిగేంత వరకూ దీని గురించి ఎవరూ పట్టించుకోరు. అప్పటి వరకూ మన ఆడబిడ్డలు ఇలాంటి క్రూరుల చేతిలో బలవుతూనే ఉంటారు. అలాంటి వారికి స్వేచ్ఛగా తిరిగే హక్కులేదు. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకూడదు. ఇలా సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్న ఆశా దేవి లాంటి అమ్మలందరికీ మరింత శక్తి చేకూరాలి. వారికి న్యాయం జరిగే సమయం రావాలి’ అంటూ తన భావోద్వేగాన్ని అక్షరీకరించిందీ బాలీవుడ్‌ మామ్‌.

ఇక మీరెవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) on

తాప్సీ, భూమి పెడ్నేకర్‌ నటించిన ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రానికి స్టార్‌ స్క్రీన్‌ అవార్డులు లభించాయి. గతంలో అంత వృద్ధ పాత్రలకు వీరిని ఎంచుకున్నందుకు పలువురు విమర్శించారు. దానికి సమాధానంగా తాప్సీ అవార్డ్‌ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ఆ సినిమా డైరెక్టర్‌ తుషార్‌ను ఉద్దేశించి ..‘తుషార్‌ హిరానందాని మమ్మల్ని ఈ పాత్రలకు ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడందరికీ అర్థమయ్యుంటుంది. మమ్మల్ని గుర్తించిన స్టార్‌ స్క్రీన్‌ అవార్డ్స్‌ జ్యూరీకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా తుషార్‌, నిధి పర్మర్‌ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. మమ్మల్ని నమ్మి ఈ కథని అందించిన షూటర్స్‌ చంద్రో తోమర్‌, ప్రకాషీ తోమర్లకు నా కృతజ్క్షతలు. నా మరదలు భూమి పెడ్నేకర్‌కు కూడా నా ధన్యవాదాలు’ అంటూ తన భావాలు పంచుకుంది.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సిస్టర్స్.. మీరే లేకుంటే ఈ మహమ్మారితో యుద్ధం చేయలేం!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీనివల్ల ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అదే సమయంలో చాలామంది ఆసుపత్రుల్లో బెడ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ‘ఐఐఎంయుఎన్‌’ అనే విద్యార్థుల బృందం ‘ఫైండ్‌ ఏ బెడ్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థను యువతే ముందుండి నడిపిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి ‘యువత ద్వారా.. దేశం కోసం’ (By the Youth, For the Country) అనే ట్యాగ్‌లైన్‌ని జోడించారు. 160 పట్టణాల్లో ఉన్న దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా www.Findabed.in అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్పిటల్‌ నంబర్లు, బెడ్ల వివరాలు, క్వారంటైన్‌ సెంటర్ల వివరాలు ఉన్నాయి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

పూలకుండీలతో పొట్ట చుట్టూ కొవ్వును ఇలా కరిగించండి..!

నటి సాక్షి అగర్వాల్‌ పూల కుండీలతో వ్యాయామం చేస్తోన్న తన వీడియోలను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నాలుగు పూల కుండీలను ఉపయోగించి ఈ అద్భుతమైన వ్యాయామాలను చేయండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉండేలా చూసుకోండి. అయితే నా దగ్గర ఇంత బరువున్న పూల కుండీలు లేవు. కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి..’ అని రాసుకొచ్చింది. ప్రతి పూల కుండీ బరువు 10 నుంచి 12 కేజీలు ఉంటుంది. మా ఇంట్లో ఈ వెయిట్స్ లేవు.. అందుకే కుండీలతో కొత్తగా ప్రయత్నించాను. మీరు కూడా ట్రై చేసి చూడండి..’ అని రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-celebrities-in-instagram

ఆక్సిజన్‌ అవసరమైతే ఇలా చేద్దాం..!

అందాల తార సోఫీ చౌదరి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోవడం కోసం చేసే ప్రోనింగ్‌కి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కరోనా కేసులు మునపటి కంటే అధికంగా నమోదవుతున్నాయి.. ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది.. ఈ సమయంలో ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకోవడానికి ప్రోనింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతికి వైద్యపరమైన ఆమోదం కూడా ఉంది. అయితే గర్భిణులు, వెన్నునొప్పి, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పద్ధతిని అనుసరించకూడదు. దీనిని పాటించే ముందు డాక్టరుని ఓసారి సంప్రదించండి. కానీ, ఇది చాలామందిని హాస్పిటల్‌కు వెళ్లకుండా నివారిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-holi-celebrations
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

సంతోషాన్ని పంచుకోండి.. కరోనాని కాదు..!

నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘వండర్ విమెన్’ అంటూ స్ఫూర్తిమంతమైన మహిళల గాథలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా డిజైనర్‌ అనితా సాగర్‌ గురించి పోస్ట్ చేసింది. ‘గత మూడు వారాల నుంచి మీకు స్ఫూర్తిమంతమైన మహిళల గురించి తెలియజేస్తున్నాను. తాజాగా ప్రముఖ డిజైనర్‌ సాగర్‌ తెనాలి భార్య, అనితా సాగర్‌ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో సాగర్‌ తెనాలి అనే ప్రముఖ డిజైనర్‌ ఉండేవారు. ఆయన 2016లో గుండెపోటుతో మరణించారు. ఆయన మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని, అంతర్జాతీయ వేదికలపై తన దుస్తులు ప్రదర్శించాలని కలలు కన్నారు. ఆయన కలలను తన భార్య అనితా సాగర్‌ నిజం చేయాలనుకుంది. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అవును.. దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది!

బాలీవుడ్‌ నటి, నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా తన పాపను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనం కేవలం మన పిల్లల బాగోగులు చూసుకోవడం వరకు మాత్రమే పరిమితం కావద్దు. విభిన్న ఐడియాలతో వారి మెదళ్లను నింపాలి. అలాగే వారి బలాలను గుర్తిస్తూనే బలహీనతలను మర్చిపోయేలా చేయాలి. అంతేకానీ, బలహీనతలను ఎత్తి చూపద్దు. అలాగే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటినుండి బయటకు తీసుకురావడానికి వారికి తగిన సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే కొంత కాలానికి మనకి మనంగా ఉంటూనే మన పిల్లలకు తల్లిలాగా ఉండగలుగుతాం’ అంటూ #perfectlyimperfectparenting అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

మనం ఎక్కడ ఉంటే అక్కడే మ్యాజిక్!

ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ కొందరు మహిళలు కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న ఆంక్షల చట్రాల నుండి బయటకు వస్తున్నారు. తమదైన ప్రతిభతో, సమర్థతతో ముందుకు దూసుకుపోతున్నారు. అయినా చాలామంది మహిళలు ఇంకా కట్టుబాట్ల బందిఖానాలో చిక్కుకుపోతూనే ఉన్నారు. అందుకోసమే మహిళలను చైతన్యపరచడానికి వారికంటూ ఓ రోజుని జరుపుకొంటున్నారు. అదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ రోజు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సారి #ChooseToChallenge అంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తారలు ఇన్‌స్టాపురములో ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

Movie Masala

Video Gallery