scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అడ్వాన్స్‌ పెళ్లిరోజు శుభాకాంక్షలు బేబీ..!

Latest social Media posts of Celebrities in Social Media

నా లవ్లీ అక్క..!

27119socialpostgh650-2.jpg

కుటుంబంలో అక్కా-తమ్ముళ్లు, అన్నా-చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైంది. వీళ్లలో ఎక్కువశాతం మంది బయటకి ఎప్పూడూ తిట్టుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ.. కనిపించినా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్‌ల మధ్య ఉండే అనుబంధమే ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో తాము టామ్‌ అండ్‌ జెర్రీల్లా ఉంటామని లక్ష్మి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను మనోజ్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘టామ్‌ అండ్‌ జెర్రీలు నిశ్శబ్దంగా ఒకే వైపు చూస్తుంటే ఇలాగే ఉంటుంది. నా లవ్లీ అక్క..!’ అని రాసుకొచ్చాడు

View this post on Instagram

A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu) on

అడ్వాన్స్‌ పెళ్లిరోజు శుభాకాంక్షలు బేబీ..!

27119socialpostgh650-4.jpg

పెంపుడు జంతువులను ఇష్టపడే నటీమణుల్లో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా ఒకరు. తను మాత్రమే కాదు తన ఇష్టసఖుడు నిక్‌ జోనాస్‌ కూడా పెట్‌ లవరే కావడం విశేషం..! డిసెంబర్‌ 1న వీళ్లు తమ తొలి పెళ్లిరోజును జరుపుకోనున్నారు. ఈ క్రమంలో తన ప్రియుడికి ఓ కుక్కపిల్లను సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది ప్రియాంక. నిక్‌ను నిద్రలో నుంచి లేపుతూ ఈ కుక్కపిల్లను తనపైకి వదిలింది. ఆ కుక్కపిల్ల కూడా నిక్‌ను ప్రేమగా తడుముతూ తనను నిద్ర లేపింది. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ప్రియాంక, నిక్‌లు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

నిక్‌ - ప్రి (ప్రియాంక ముద్దు పేరు) ఉదయాన్నే ఈ సర్‌ప్రైజ్‌తో ఇంటికొచ్చింది. మా కొత్త పప్పీని చూడండి. తన పేరు ‘జినో జోనాస్‌’. ఉదయం లేవగానే అసలేం జరుగుతోందో కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు. థ్యాంక్యూ ప్రియాంకా..!

27119socialpostgh650-3.jpg

ప్రియాంక - ఒకే ఫ్రేమ్‌లో ఎంతో క్యూట్‌నెస్‌ కదా..! అడ్వాన్స్‌ పెళ్లిరోజు శుభాకాంక్షలు బేబీ..!

అంతేకాదు జినోకు ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టా ఖాతాను కూడా తెరిచారు ఈ గ్లోబల్‌ స్టార్స్‌. తన ఇన్‌స్టా ఐడీ @ginothegerman. ఇందులో జినోకు సంబంధించిన విశేషాలను జినోనే పోస్ట్‌ చేస్తున్నట్లుగా క్యాప్షన్లను జత చేసి షేర్‌ చేస్తున్నారు. ఈ ఇన్‌స్టా పేజీని ప్రారంభించిన 18 గంటల్లోనే 2లక్షల మంది ఫాలోవర్లు రావడం కొసమెరుపు.

ఓర చూపుతో నువ్వు చంపేస్తుంటే...!

27119socialpostgh650-6.jpg

ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కన్నడ భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న తెలుగింటి ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. తను నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకొంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది.ఈ క్రమంలో ఈషా పోస్ట్‌ చేసిన లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by 𝐄𝐄𝐒𝐇𝐀 𝐑𝐄𝐁𝐁𝐀 🌟 (@yourseesha) on

గుర్తుకొస్తున్నాయి..!

27119socialpostgh650-5.jpg

మనకు ఎదురయ్యే అనుభూతులను ఫొటోలు, వీడియోల రూపంలో నిక్షిప్తం చేసుకోవడం మామూలే. మళ్లీ ఎప్పుడైనా వాటిని చూసినప్పుడు అప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మన కళ్ల ముందు కదలాడతాయి. ఇలాంటి అనుభూతికే లోనయ్యానంటోంది ‘గ్యాంగ్‌ లీడర్‌’ భామ ప్రియాంకా మోహన్‌. తను, నాని జంటగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా చక్కటి విజయం సాధించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను ప్రియాంక తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘మెమరీస్‌..!’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

Memories❤️ #gangleader #majormissing

A post shared by Priyanka Mohan (@priyankamohanoffl) on

బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌..!

27119socialpostgh650-1.jpg

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన అందాల తార అనన్యా పాండే. తను నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లతో సమానంగా క్రేజ్‌ని సంపాదించుకుందీ బ్యూటీ. సినిమా పరంగా మాత్రమే కాదు సోషల్‌ మీడియాలోనూ అనన్య ఫాలోయింగ్‌ గట్టిగానే ఉంది. తన వ్యక్తిగత విశేషాలతో పాటు.. లేటెస్ట్‌ ఫొటోషూట్స్‌, సినిమా అప్‌డేట్స్‌.. మొదలైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటుంటుందీ తార. ఈ క్రమంలో అనన్య తాజాగా తన ఫొటోలను ఓ పోస్ట్‌ చేస్తూ ‘సీరియస్‌ వినోదం పంచదని ఎవరన్నారు..?’ అని క్యాప్షన్‌ను జత చేసింది.

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

అనన్య ప్రస్తుతం ‘పతీ పత్నీ ఔర్‌ వో’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబర్‌ 6న విడుదల కానుంది.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

డియర్ వసుంధర