scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నీతో ఉండే ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే..!

Latest social media posts of Celebrities

అందంగా మెరవడం ఆమె స్వభావం..!

191119socialpostgh650-1.jpg

అక్కినేని కుటుంబం ఇటీవలే సినీ నటి రేఖను ‘ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం’తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో నటి అమల, మంచు లక్ష్మి, నిహారికలు.. రేఖతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అమల రేఖతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్‌ చేస్తూ ‘రేఖాజీతో గడిపిన ఈ సాయంత్రం ఎప్పటికీ మరపురానిది. ఆమె 2019సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపికైంది. మీరు మా హృదయాలకు చేరువైనందుకు మీకు కృతజ్ఞతలు..!’ అని రాసుకొచ్చింది.

191119socialpostgh650-6.jpg

మంచు లక్ష్మి.. రేఖతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘ఒక లెజెండ్‌ని కలిసినప్పుడు ఒకరు ఎలాంటి అనుభూతిని పొందుతారో.. నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది. అందంగా మెరవడం రేఖాజీ స్వభావం...!’ అని రాసుకొచ్చింది.

191119socialpostgh650-5.jpg

నిహారిక.. రేఖతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘వన్నె తరగని అందం ఆమె సొంతం..!’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

నీతో ఉండే ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే..!

191119socialpostgh650-2.jpg

తన ప్రేయసి పుట్టినరోజుకంటే ప్రత్యేకమైన సందర్భం ఒక ప్రియుడికి ఇంకేముంటుంది చెప్పండి. ప్రస్తుతం అలాంటి సందర్భాన్నే మనసారా ఎంజాయ్‌ చేస్తో్ంది నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల జంట. నవంబర్‌ 18 నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ జంట విహారయాత్ర కోసం న్యూయార్క్‌కు వెళ్లింది. ఇద్దరూ కలిసి అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను విఘ్నేశ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

నా ప్రియమైన ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీలో ఉన్న నిజాయతీ, సాహసం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, శ్రమించే గుణం, అంకితభావం, దేవుడంటే భయం.. మొదలైన గుణాలను అలాగే ఉండనివ్వు. నువ్వు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకొంటున్నాను. నా జీవితంలో ఎన్నో మధురమైన అనుభవాలను నీతో పంచుకొన్నందుకు నాకు ఆనందంగా, గర్వంగా ఉంది. నీతో ఉండే ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే..! అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు విఘ్నేశ్‌.

ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది..?

191119socialpostgh650-4.jpg

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తోన్న ‘ఫ్రోజెన్‌ 2’ చిత్రం ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఇందులోని ‘ఎల్సా’ పాత్రకు సహజ నటి నిత్యా మేనన్‌, బేబీ ఎల్సా పాత్రలకు మహేష్‌ బాబు తనయ సితార డబ్బింగ్‌ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఫ్రోజెన్‌ 2’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా నిత్య, సితారలు కలిసి దిగిన ఓ ఫొటోను మహేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది..! ఎల్సాతో బేబీ ఎల్సా..!’ అని రాసుకొచ్చాడు. ‘ఫ్రోజెన్‌ 2’ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది.

మీతో గడిపిన ఈ సమయం నాకెంతో ప్రత్యేకం..!

191119socialpostgh650-3.jpg

ప్రతి ఒక్కరి జీవితంలో తమకు స్ఫూర్తిగా నిలిచేవాళ్లు చాలామంది ఉంటారు. ఆ వ్యక్తుల్ని కలిసినప్పుడు.. లేదా వాళ్లతో సమయం గడిపినప్పుడు మనం పొందే అనుభూతి వెలకట్టలేనిది. తాజాగా అలాంటి ఓ అనుభూతికే లోనయ్యానంటోంది మిల్క్‌ బ్యూటీ తమన్నా. బాలీవుడ్‌ అందాల తార కరిష్మా కపూర్‌ని ఇటీవల అనుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లో కలిసింది. ఈ సందర్భంగా తనతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిందీ తార.

నాకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని కలిసినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌ ఇప్పటికీ నా ఫేవరెట్‌..! ప్రియమైన కరిష్మా.. మీతో గడిపిన ఈ సమయం నాకెంతో ప్రత్యేకమైంది, మరపురానిది..!’ అని రాసుకొచ్చింది తమన్నా.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-varalakshmi-vratham-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

Movie Masala

Video Gallery