scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఆ మందులతో.. ఈ ఆహారంతో.. ‘కరోనా’ను జయించా!'

'ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేరు వినగానే శరీరమంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుండడమే! అయితే ఈ వైరస్‌ గురించి ఎంత అవగాహన ఉన్నప్పటికీ మనదాకా వస్తే గానీ ఆ భయం, ఆందోళన తెలియదంటారు. కానీ అలాంటి భయం అక్కర్లేదని, గుండె ధైర్యమే ఈ మహమ్మారికి అసలు సిసలైన ఔషధమని ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు తమ కరోనా అనుభవాలను పంచుకున్నారు. ఇలా తాను కూడా ఆత్మస్థైర్యంతో, సానుకూల దృక్పథంతోనే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానంటూ చెబుతున్నారు చెన్నైకి చెందిన భరతనాట్యం కళాకారిణి మాధుర్యా శ్రీకృష్ణన్.'

Know More

Movie Masala

 
category logo

ముగ్గురమ్మాయిలం.. అబ్బాయిల కంటే ఎక్కువే సాధించాం!

The Latest Social Media Updates Of Celebrities

కపుల్‌ గోల్స్

180119socialglamour650-1.jpg

బాలీవుడ్‌లోని అందమైన జంటల్లో సోనమ్‌ కపూర్‌-ఆనంద్‌ అహుజా జంట ఒకటి. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ అందరినీ అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ, అలాగే ప్రతి సందర్భాన్ని కలిసి జరుపుకుంటూ.. దాంవత్యబంధాన్ని నిత్యనూతనంగా ఎలా గడపాలో పాఠాలు నేర్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట... తరచూ వారికి సంబంధించిన విశేషాలను తమ అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. తాజాగా తమ విహారయాత్రకు సంబంధించిన విశేషాలను పోస్ట్‌ చేసి ‘మా బంధం ఎప్పటికీ నిత్యనూతనమే’ అని చెప్పకనే చెప్పారు. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ పార్క్‌లో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను సోనమ్‌ భర్త ఆనంద్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. మీరు కూడా ఈ అందమైన జోడీని ఓసారి చూడండి!

View this post on Instagram

A post shared by anand s ahuja (@anandahuja) on

సావిత్రీ బాయిని చూశారా..!

180119socialglamour650-6.jpg

బాలీవుడ్‌ యాంగ్రీ మ్యాన్‌ అజయ్‌ దేవగణ్‌ తన 100వ చిత్రంగా మరాఠా యోధుడు తానాజీ మల్‌సరే జీవిత కథ ఆధారంగా నిర్మించనున్న చిత్రంలో తానాజీగా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో తానాజీ భార్య సావిత్రీ బాయి మల్‌సరే పాత్రను కాజోల్‌ పోషిస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది కాజోల్‌. అందులో నుదుట బొట్టుతో, ముక్కెరతో మరాఠా యోధుడి భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది కాజోల్‌. దీనికి సంబంధించిన ట్రైలర్‌ నవంబర్‌ 19న విడుదల కానుంది. అలాగే సినిమా 2020 జనవరి 10న విడుదల అవుతున్నట్లుగా కూడా తెలియజేసింది తానాజీ సతీమణి.

అబ్బాయిల కంటే ఎక్కువే సాధించాం!

180119socialglamour650.jpg

బాడీ పాజిటివిటీ, బ్రెస్ట్‌ ఫీడింగ్‌, బాడీ షేమింగ్‌పై ఎప్పటికప్పుడు తన పాజిటివ్‌ సందేశాలతో స్ఫూర్తి నింపే బాలీవుడ్‌ మామ్‌ సమీరా రెడ్డి.. చూడండీ ‘అబ్బాయిల కంటే ఎక్కువ సాధించాం’ అంటుంది. ఈ ఆధునిక కాలంలో కూడా అమ్మాయిల్ని భారంగా భావిస్తున్నారంటూ తన ఇన్‌స్టా వేదికగా బాధను వ్యక్తం చేసింది. ఇటీవలే జన్మనిచ్చిన తన బుజ్జి పాపాయిని ఆడిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ పాప ఉండడం ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ, నాకు అర్ధంకాని విషయమేమిటంటే.. ఇప్పటికీ మన దేశంలో కొన్నిచోట్ల ఆడపిల్లని భారంగా భావిస్తున్నారు. చాలా కుటుంబాల్లో తమకు మొదటి సంతానంగా మగ బిడ్డ కావాలనుకుంటారు. కానీ ఒక విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను.. ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబంలో పుట్టిన నేను అబ్బాయిల కంటే ఎక్కువే సాధించాను’ అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని వంచుకుంది. ప్రస్తుతం సినిమాలకు పూర్తి విరామం ప్రకటించి తన పిల్లల ఆలనా పాలనాలో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది సమీర.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on

ఏఎన్నార్‌ పురస్కారాల సందడి

180119socialglamour650-4.jpg

తెలుగు సినీ ప్రపంచానికి మూల స్తంభం వంటి వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. తన ఆఖరి క్షణాల వరకూ సినిమాలలో నటిస్తూ.. నటన పట్ల తనకు గల అంకితభావాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా నాగార్జున తన తండ్రి జ్ఞాపకార్ధం ప్రకటించిన ఏఎన్నార్‌ పురస్కారాలను మన దక్షిణాది తారలైన శ్రీదేవి, రేఖలకు ఘనంగా నిర్వహించిన వేడుకల్లో అందజేశారు. వాటిని పురస్కరించుకుని అక్కినేని అమల తన ట్విట్టర్‌ ఖాతాలో వేడుకలకు సంబంధించిన గ్రూప్‌ ఫొటోను పంచుకుంటూ ‘ఏఎన్నార్‌ అవార్డ్స్‌, అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్నాతకోత్సవం అద్భుతంగా జరిగింది’ అని రాసుకొచ్చింది.

హాలీవుడ్‌ భామల హంగామా

180119socialglamour650-7.jpg

ఇండియాలో జరిగే మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌ బ్యూటీస్‌ సందడి చేస్తే వావ్‌ అనిపించేలా ఉంటుంది కదూ! వన్‌ ప్లస్‌ సమర్పిస్తున్న మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఉర్రూతలూగించే సాంగ్స్‌తో సందడి చేయడానికి విచ్చేశారు పాపులర్‌ పాప్‌స్టార్స్‌ కెటీ పెర్రీ, డువా లిపా. ముంబైలో జరిగిన ఈ సంగీత విభావరి వాళ్ల పాప్‌ సాంగ్స్‌తో మార్మోగిపోయింది. ఈ షో ఆద్యంతం సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. ఈ హాలీవుడ్‌ కూడా ఎంతో ఆనందంగా ఇండియాలో జరిగిన ఈ షో గురించి సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులతో0 వంచుకున్నారు. మరి మీరూ వారి జోష్‌ని ఓసారి చూడండి!

180119socialglamour650-8.jpg

View this post on Instagram

Last night in Mumbai for #oneplusmusicfestival 💚 📸 @timsek

A post shared by KATY PERRY (@katyperry) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More