ఇలా చేస్తే మీరు కోరుకున్నది ఏదైనా జరగచ్చు!
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘2021తో కొవిడ్ అంతమవుతుందని, ఆ తర్వాత సాధారణ జీవితాన్ని గడపచ్చని భావించాం. కానీ, అది ఇంకా ఎక్కువ దూరంలో ఉంది. కాబట్టి, అందరూ మాస్క్ ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, అలాగే సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గరే ఉండడానికి ప్రయత్నించండి. నేను కూడా సాధ్యమైనంతవరకు ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఈ నెల 19న షూటింగ్ ఉంది. అది కూడా కొంతమందితోనే ఉంటుంది. ఆ తర్వాత కనీసం నెల పాటు స్వీయనిర్భంధంలో ఉంటాను.’ అంటూ కరోనా జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది.