నవ్వు నాలుగు విధాలా మేలు..!
అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్ ఫ్రీక్.