సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

 
women icon@teamvasundhara
beauty

ఇప్పుడు నాకు అవే ముఖ్యమనిపిస్తోంది..!

కరోనా వ్యాప్తిని అరికట్టే టీకా కోసం పరిశోధకులు, వైద్యులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఈ మూడు మార్గాలే మనల్ని కరోనా బారిన పడకుండా రక్షిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు వీటిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో రోజుల కొద్దీ ఇంట్లో గడపడుతుండడంతో ప్రజల ఆలోచన తీరులో క్రమంగా మార్పు వస్తోంది. ఇంతకాలం వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడిపిన చాలామందికి ఈ లాక్‌డౌన్‌ సమయం తమ గురించి తాము తెలుసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన క్వారంటైన్‌ సమయం తన ఆలోచన తీరులో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ.

Know More

women icon@teamvasundhara

నాతో డిన్నర్‌ డేట్‌కి మీలో ఎవరు రడీ?

కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ప్రపంచమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రదేశాల ఆర్థి్క వ్యవస్థలు సైతం అతలాకుతలమవుతున్నాయి. అలా కరోనా బారిన పడిన అగ్రదేశాల్లో బ్రిటన్‌ కూడా ఉంది. కొవిడ్‌ వైరస్‌ కారణంగా ఆ దేశంలో ఇప్పటికే సుమారు 1800మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆరోగ్య శాఖ మంత్రి నాదినే డోరీస్‌, బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ సైతం ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. ఇక అక్కడ రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో వైద్య సదుపాయాల కొరత కూడా అధికంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి కొవిడ్‌ బాధితులకు తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ప్రముఖ బ్రిటన్‌ యాక్ట్రెస్‌ ఎమీలియా క్లార్క్‌. ఈ క్రమంలో తన అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడానికి ఓ వినూత్న ప్లాన్‌ను రడీ చేసింది.

Know More