scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

హీ ఈజ్‌ సో క్యూట్‌.. హీ ఈజ్‌ సో స్వీట్‌!!

Actress and their first crushes in Telugu

‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే..’, ‘హీ ఈజ్‌ సో క్యూట్‌.. హీ ఈజ్‌ సో స్వీట్‌..’ ఒక వ్యక్తిని చూడగానే మనలో కలిగే ఓ అందమైన ఫీలింగ్‌ని ఇలా పాట రూపంలో వ్యక్తీకరిస్తాం. అలాంటి మధురమైన భావన పేరే ప్రేమ. తమకూ ఇలాంటి ఫస్ట్ క్రష్ ఫీలింగ్స్ ఉన్నాయంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో ఒకరేమో క్రికెటర్‌ని చూసి ప్రేమలో పడితే, మరొకరు హ్యాండ్‌సమ్ హీరో ఫిజిక్‌కు ఫిదా అయిపోయారు. ఇంకొకరేమో పక్కింటి అబ్బాయిని చూసి మనసు పారేసుకున్నానని చెబుతున్నారు. మరి, ఇలా తమ తొలి ప్రేమానుభవాల్లో తేలియాడుతూ మన అందాల తారలు పంచుకున్న ఆ ఫస్ట్ క్రష్ విశేషాలేంటో ఈ ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా మీకోసం..
టాలీవుడ్‌లో..

అనూ ఇమ్మాన్యుయెల్‌
‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే..’ అంటూ కుర్రకారును తన అందం, నటనతో ఫిదా చేసేసింది మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయెల్‌. ఇలా అందరినీ తన అందంతో కట్టిపడేసే ఈ బ్యూటీ ఓ సందర్భంలో తన తొలిప్రేమ గురించి పంచుకుంది. ‘నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నాకు తొలి ప్రేమానుభవం కలిగింది. ఆ ఫీలింగ్‌ గురించి ఇప్పుడు గుర్తొచ్చినా నాలో నేనే నవ్వుకుంటాను..’ అంటూ ముసిముసిగా నవ్వేసిందీ క్యూట్‌ బేబీ.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)


అనుష్క
వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించే మన అందాల దేవసేన అనుష్కను ఒక క్రికెటర్ తన మాయలో పడేసుకున్నాడట! అతడే తన ఫస్ట్ క్రష్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వీటీ. ‘రాహుల్ ద్రవిడ్ నా ఫేవరెట్ క్రికెటర్. అతని ఆటను చూస్తూ ఎదిగిన నేను ఒకానొక సమయంలో అతనితో ప్రేమలో కూడా పడిపోయా..’ అని అతడిపై ఉన్న ప్రేమాభిమానాలను వెల్లడించింది అనుష్క.

19celebsfirstcrush1.jpg


రకుల్‌ప్రీత్ సింగ్
ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తన అందంతో మెరుపులు మెరిపిస్తూ.. అటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండడం ఎలాగో రకుల్‌ని చూసే నేర్చుకోవాలి. టాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరు తెచ్చుకొన్న ఈ భామ ఒకసారి ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో భాగంగా తన ఫస్ట్ క్రష్ గురించి నెటిజన్లతో పంచుకొంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటే తనకు వల్లమాలిన ప్రేమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చింది.

19celebsfirstcrush2.jpg


సమంత
తెలుగు ప్రేక్షకుల అభిమాన తారల్లో ఒకరిగా పేరు తెచ్చుకొన్న ఈ ముద్దుగుమ్మ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్‌ని ఇష్టపడేదట! ఆ తర్వాత కాలేజీ రోజుల్లో సూర్య అంటే పడి చచ్చిపోయేదట! ‘ఎప్పుడూ కాలేజీలో జరిగే ఈవెంట్లకు వెళ్లని నేను ఒకసారి సూర్య ముఖ్యఅతిథిగా వస్తున్నారని తెలిసి అందరికంటే ముందే వెళ్లి.. మొదటి వరుసలో నిలబడ్డా..’ అంటూ అతడిపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేసిందీ సుందరి.

19celebsfirstcrush3.jpg


రాశీఖన్నా
బబ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు సాధించిన నటి మన అందాల రాశీఖన్నా. ‘తొలిప్రేమ’ చిత్రంతో కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన తొలిప్రేమ గురించి కూడా మాట్లాడింది. ‘ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రోజుల్లో ఒక సీనియర్‌ని ఇష్టపడేదాన్ని. కానీ ఏనాడూ అతడికి ఆ విషయం చెప్పలేదు. ఒకరోజు అనుకోకుండా అతడే నా దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేశాడు..’ అంటూ సిగ్గులు మొగ్గలేసిందీ అందాల బొమ్మ.


రెజీనా కసాండ్రా
టాలీవుడ్ డస్కీ బ్యూటీ రెజీనా కూడా తన పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తిని బాగా ఇష్టపడేదట! కానీ అతను మాత్రం తనవైపు కనీసం కన్నెత్తైనా చూసేవాడు కాదని ఓ కార్యక్రమంలో భాగంగా తన ఫస్ట్ క్రష్ ముచ్చట్లను పంచుకుంది అందాల రెజీనా.


తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాని ఆరాధించే అభిమానుల సంఖ్య లక్షల్లోనే అని చెప్పుకోవచ్చు. అలాంటి మన తమ్మూ కూడా స్కూల్లో చదివే రోజుల్లో ఒక వ్యక్తిని ఇష్టపడిందట! ‘స్కూల్లో చదివే రోజుల్లో నా స్నేహితురాలి అన్నయ్యని ఎంతగానో ఇష్టపడేదాన్ని. అతను వయసులో నా కంటే చాలా పెద్దవాడు. మేమంతా తరచూ కలుస్తూనే ఉండేవాళ్లం. కానీ నా ప్రేమ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు..’ అంటూ తన తొలిప్రేమ అనుభవాలు పంచుకుందీ బ్యూటీ.


తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోన్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ అమ్మడికి చిన్నప్పట్నుంచీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమట! తన ఫస్ట్ క్రష్ అతడేనని, ఎప్పటికైనా అతడితో కలిసి నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నానని ఓ సందర్భంలో అభిమానులతో పంచుకుందీ సుందరి.

19celebsfirstcrush7.jpg


శ్రియ
సిల్వర్ స్క్రీన్‌పై తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ అందరినీ ఆకట్టుకునే నటీమణుల్లో శ్రియ ఒకరు. వయసు పెరుగుతున్నా ఒంపుసొంపులతో ఈతరం నటీమణులకు సైతం గట్టి పోటీనిస్తున్న ఈ ముద్దుగుమ్మకి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చాలా ఇష్టమట!

19celebsfirstcrush8.jpg


మెహరీన్
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే వరుస హిట్లతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది మెహరీన్. ఈ అమ్మడికి కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టమట! ‘కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో సల్మాన్‌ఖాన్ అంటే పడిచచ్చిపోయేదాన్ని. ఒకసారి బాడీగార్డ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన్ని కలిశా. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటూ తన తొలిప్రేమ అనుభూతులను పంచుకుందీ ముద్దుగుమ్మ.

19celebsfirstcrush9.jpgసాయిపల్లవి
‘ఫిదా’తో అందరి హృదయాలనూ కొల్లగొట్టిన బ్యూటీ సాయిపల్లవి. అయితే మన ‘మలర్’ హృదయాన్ని మాత్రం ఓ స్టార్ హీరో మాయ చేశాడట! ‘తమిళ నటుడు సూర్య అంటే నాకు చాలా ఇష్టం. తన చూపులు, నటనతోనే నన్ను మాయ చేసేశాడు..’ అంటూ అతడిపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తోందీ బ్యూటీ. ప్రేమ, ఫస్ట్‌క్రష్ విషయాలు ఎలా ఉన్నా, పేరెంట్స్‌ని చూసుకోవడం కోసం తను మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని ఓ సందర్భంలో చెప్పిందీ రౌడీబేబీ.

19celebsfirstcrush10.jpg


అదాశర్మ
తొలిచిత్రంతోనే కుర్రకారు మదిలో గిలిగింతలు పుట్టించిన అందాల భామ అదాశర్మ. ఈ అమ్మడికి కూడా హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చెప్పలేనంత ఇష్టమట. ‘లియోనార్డో అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అతడి కోసమే టైటానిక్ సినిమా దాదాపు పదిసార్లు చూశా..’ అంటూ ఓ కార్యక్రమంలో తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల భామ.19celebsfirstcrush11.jpg


నందిత
‘ప్రేమ కథా చిత్రమ్’తో అందరినీ భయపెడుతూనే వెండితెరకు పరిచయమై.. ఆపై తన అందచందాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న భామ నందిత. ఈ సుందరికి కూడా ఫస్ట్ క్రష్ అనుభవం స్కూలు రోజుల్లోనే ఎదురైందట! ‘స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. అతడు చాలా అందంగా ఉంటాడు. నేనే కాదు.. మా స్కూల్లో చాలామంది అమ్మాయిలు అతడ్ని ఇష్టపడేవారు..’ అంటూ తన తొలిప్రేమ అనుభూతులను ముద్దుముద్దుగా పంచుకుందీ సోగకళ్ల సుందరి.19celebsfirstcrush12.jpg


మంచు లక్ష్మీప్రసన్న
మన మన్మధుడు నాగార్జున అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. నేటికీ తన నటనతోనే కాదు.. తన అందంతోనూ ఎందరో అమ్మాయిల హృదయ రాకుమారుడిగా, ఫస్ట్ క్రష్‌గా మారాడు నాగ్. ఈ లిస్టులో తానూ ఉన్నానంటున్నారు టాలీవుడ్ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న. నవ మన్మధుడు నాగార్జున తనకు ఫస్ట్ క్రష్ అంటూ పలు సందర్భాల్లో లక్ష్మీప్రసన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.

19celebsfirstcrush13.jpg


బాలీవుడ్‌లో..
జాన్వీ కపూర్‌
నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’తోనే విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న కపూర్‌ బ్యూటీ జాన్వీ. ఓ టాక్‌ షోలో పాల్గొన్న ఈ బాలీవుడ్‌ అందం.. తన ఆల్‌టైమ్‌ క్రష్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘విజయ్‌ నా ఆల్‌టైమ్‌ క్రష్‌. కానీ దురదృష్టవశాత్తూ అటువైపు (విజయ్‌) నుంచి ఎలాంటి రియాక్షన్‌ రావడం లేదు. నేను ఎక్కువగా ఫీలైపోయి, మాట్లాడిన భావన కలుగుతోంది. జస్ట్‌.. సరదాగా అంటున్నానంతే.. విజయ్‌పై నాది కేవలం ఆరాధన భావం మాత్రమే.. అతడిని చూస్తే ముచ్చటేస్తుంది. నాకు తెలిసి ప్రస్తుతానికి ఇది వన్‌సైడ్‌ మాత్రమే. నా అభిప్రాయాలు కొన్ని కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రస్తుతం విజయ్‌ ఎంత స్థిరంగా ఉన్నాడో.. అతనిపై నా అభిమానం కూడా చాలా స్థిరంగా ఉంది. ప్రస్తుతానికైతే విజయ్‌పై నాకున్న ఇష్టం సేఫ్‌జోన్‌లోనే ఉంది..’ అంటూ తన ఫస్ట్‌ క్రష్‌ గురించి చెబుతూ మురిసిపోయిందీ అందాల తార. ‘వెంకీమామ’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా విజయ్‌ని చూసి మనసు పారేసుకున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

heroinesfirstcrushgh650-2.jpg


కరీనా కపూర్‌
తనదైన అందం, నట ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార కరీనా కపూర్‌ కూడా ఓ సందర్భంలో భాగంగా తన ‘తొలివలపు’ గురించి ఇలా చెప్పుకొచ్చింది. 1990లో విడుదలైన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘ఆషిఖీ’ హీరో రాహుల్‌ రాయ్‌ని చూసి మనసు పారేసుకున్నానని చెబుతోంది బెబో. ‘రాహుల్‌ రాయ్ నా డ్రీమ్‌ బాయ్‌! అతను నటించిన ఆషిఖీ సినిమా ఎనిమిది సార్లు చూశా..’ అంటూ రాహుల్‌పై తనకున్న ఫస్ట్‌ క్రష్‌ను బయటపెట్టిందీ బాలీవుడ్‌ క్వీన్‌.heroinesfirstcrushgh650-3.jpgసోనమ్ కపూర్
‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ తన ఫస్ట్ క్రష్ హృతికే అంటూ, ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో రోహిత్ పాత్రలో నటించిన తనని చూసి ప్రేమలో పడిపోయినట్లు కొన్ని సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దగ్గరైతే హృతిక్ ఫొటోలకు సంబంధించిన కలెక్షన్ కూడా ఉందట! ఇంకా ఈ జాబితాలో అందాల తారలు సోనాక్షీ సిన్హా, కృతీ సనన్‌, కియారా అడ్వాణీ.. వంటి ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.19celebsfirstcrush14.jpg


పరిణీతి చోప్రా
బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రాకు పటౌడీ కా నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అంటే వల్లమాలిన ప్రేమ. ఓసారి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి విచ్చేసిన పరి.. సైఫ్‌కి పెళ్లైనా తనని వివాహం చేసుకోవడానికి ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానంటూ తన తొలిప్రేమ కబుర్ల గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.

19celebsfirstcrush15.jpg


చిత్రాంగధ సింగ్
అందాల తార చిత్రాంగధ సింగ్‌కి కింగ్ ఖాన్ షారుఖ్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘చిత్రపరిశ్రమలో నాకు నచ్చిన నటులు చాలామందే ఉన్నారు. కానీ నా ఫస్ట్ క్రష్ మాత్రం షారుఖే. ‘ఫౌజీ’ అనే టీవీ సిరీస్‌లో షారుఖ్‌ని చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా..’ అంటూ వివరించింది చిత్ర. బొద్దుగుమ్మ విద్యాబాలన్ కూడా ఈ జాబితాలో ఉంది.

19celebsfirstcrush16.jpg


అలియా భట్
‘రాజీ’ తార అలియా భట్‌కి ముందునుంచీ రణ్‌బీర్ కపూర్ అంటే పిచ్చి ప్రేమ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటికీ రణ్‌బీర్‌ని ప్రేమిస్తూనే ఉంటా. ‘బర్ఫీ’లో ఆయన్ని చూసిన దగ్గర్నుంచి ఆయనపై నా ప్రేమ మరింతగా పెరిగింది. రణ్‌బీర్ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నా బిగ్గెస్ట్ క్రష్..’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారన్న విషయాలు మనకు తెలిసిందే. అలియానే కాదు.. ఇలా రణ్‌బీర్‌ని చూసి మనసు పారేసుకున్న ముద్దుగుమ్మల్లో.. జాన్వీ కపూర్, దిశా పటానీ, తాప్సీ, సాయేషా సైగల్, సారా అలీ ఖాన్‌లు కూడా ఉన్నారు.

19celebsfirstcrush17.jpg


కత్రినా కైఫ్
మన అందాల తార కత్రినా కైఫ్‌కి బ్రిటిష్ నటుడు రాబర్ట్ పాటిన్సన్ అంటే అమితమైన ప్రేమ. ఓ సందర్భంలో తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడుతూ.. ‘రాబర్ట్ అంటే నాకు ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను. అతడిని నా మైండ్‌లో నుంచి తీసేయడం అనేది జరగని పని. ప్రతి వ్యక్తిని, వస్తువును ఎంతో ప్రేమగా చూస్తాను నేను.. కానీ ఇప్పటిదాకా నన్ను ఇంత ప్రభావితం చేసిన వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదు..’ అంది క్యాట్.19celebsfirstcrush18.jpg


అదితీ రావ్ హైదరి
బాలీవుడ్ నటుడు, చిత్ర దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అంటే మన అదితికి చాలా ఇష్టమట. ‘ఫర్హాన్ ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఎంతో కూల్‌గా, హుందాగా వ్యవహరిస్తుంటారాయన. తనలో నచ్చే ఈ క్వాలిటీనే తనపై నాకు ఫస్ట్ క్రష్ కలిగేలా చేశాయి. నేనెక్కడున్నా నా కళ్లు అతని చుట్టే తిరుగుతూ ఉంటాయి..’ అంటూ తన తొలిప్రేమ ముచ్చట్లు చెప్పుకొచ్చింది అదితి.19celebsfirstcrush19.jpg


దీపికా పదుకొణె
టైటానిక్ హీరో లియోనార్డో డీ కాప్రియో అంటే మన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు చాలా ఇష్టమట. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన బెంగళూరు ఇంట్లోని తన గదిలో గోడలపై లియోనార్డో ఫొటోలు, వాటి పక్కనే తాను వివిధ స్టిల్స్‌లో దిగిన ఫొటోల్ని అమర్చుకునేదట! ఇలా ఆ గదినంతా ఆయన ఫొటోలతో నింపుకొని తన ప్రేమను చాటుకుందీ ముద్దుగుమ్మ.19celebsfirstcrush20.jpg

మరి, మన అందాల తారలు పంచుకున్న తొలి ప్రేమ ముచ్చట్లు తెలుసుకున్నారుగా! ఇంతకీ మీ ఫస్ట్ క్రష్ విశేషాలేంటి? మీకూ ఇలా తొలిసారి ఎవరిని చూడగానే మీ మదిలో ప్రేమ గంట మోగింది? ఆ విశేషాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి. ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా ఆ మధురమైన జ్ఞాపకాల్ని మరోసారి నెమరువేసుకోండి.

women icon@teamvasundhara
shruthi-haasan-interacting-with-twitter-fans-in-telugu

అవంటే నాకు చచ్చేంత భయం!

కమల్‌ హాసన్‌ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్‌. అందం, అభినయంతోనే కాకుండా సింగర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా సత్తా చాటి.. మల్టీ ట్యాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుంది. ఇక చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలున్న ఈ సొగసరికి.. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. ఇటీవల ‘వకీల్‌ సాబ్‌’తో కలిసి ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చింది. మరి శృతి, ఆమె ఫ్యాన్స్‌ ఏం మాట్లాడుకున్నారో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
anasuya-bharadwaz-interacting-with-instagram-fans-and-tells-her-health-secrets

ఎప్పటికీ ఆయనే నా బెస్ట్‌ ఫ్రెండ్!

అనసూయ భరద్వాజ్... తెలుగు నాట స్టార్స్‌తో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ‘జబర్దస్త్‌’ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే.. వెండితెరపై విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటోందీ అందాల తార. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె నిత్యం తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంటుంది. అంతేకాదు.. వీలైనప్పుడల్లా అభిమానులతో మాట కలుపుతుంది. తాజాగా ‘లెట్స్‌ ఛాట్‌’ అంటూ మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరి మన రంగమ్మత్తకు, అభిమానులకు మధ్య జరిగిన ఆన్లై‌న్ ముచ్చటేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
mahima-chaudhry-opens-up-about-her-troubled-marriage-suffering-2-miscarriages

women icon@teamvasundhara
disha-patani-interacts-with-instagram-fans-in-telugu

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే ముఖ్యం.. మిగతాదంతా బోనసే!

దిశా పటానీ... బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ‘లోఫర్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘ఎం.ఎస్‌. ధోనీ’, ‘కుంగ్‌ ఫూ యోగా’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘బాఘీ2’, ‘భారత్‌’, ‘మలంగ్‌’, ‘బాఘీ3’ సినిమాలతో బాలీవుడ్‌లో గ్లామరస్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపే ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు. కఠినమైన వర్కవుట్లను సైతం అలవోకగా చేయడం, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఈ చక్కనమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో పాటు తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలు, హెల్దీ డైట్‌కు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బాలీవుడ్‌ బేబ్‌. ఇలా సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న దిశ తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Ask me anything’ పేరుతో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. మరి దిశాకు, అభిమానులకు మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
dia-mirza-announces-pregnancy-as-she-flaunts-baby-bump

నేను అమ్మను కాబోతున్నా!

ఆడవారికి అమ్మతనానికి మించిన ఆనందముండదు. జీవితంలో మరో మెట్టు పైకెక్కించే ఈ సందర్భాన్ని తలచుకుని తెగ సంబరపడిపోతుంటారు మహిళలందరూ. ఇక తొలిసారి గర్భం ధరించిన మహిళలైతే మదినిండా సంతోషంతో మధురానుభూతికి లోనవుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అనిర్వచనీయమైన ఆనందంలో మునిగి తేలుతోంది బాలీవుడ్‌ అందాల తార దియా మీర్జా. తనదైన అందం, అభినయంతో హిందీ సినిమా తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ...త్వరలోనే అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్‌ ఫొటోతో తానే స్వయంగా ఈ శుభవార్తను షేర్‌ చేసుకుందీ అందాల తార. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
67th-national-film-awards-announced-in-telugu

కంగన.. పల్లవి.. సావని.. అదే వీళ్ల కామన్ సీక్రెట్!

ఆమెకు నటనంటే ఎంతో ఆసక్తి. అందుకే ఇంట్లో పెద్దలను ఎదిరించి కేవలం 1500 రూపాయలతో దిల్లీలో అడుగుపెట్టింది. ఓ దశలో ఇంటి అద్దె కట్టలేక అవస్థలు పడింది. అయినా నటిగా తనను తాను నిరూపించుకోవాలనుకున్న ఆకాంక్షను మాత్రం వదులుకోలేదు. సవాళ్లను ఎదుర్కొంటూనే ముంబయికి మకాం మార్చింది. మోడల్‌గా చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. నటనలో శిక్షణ తీసుకుని బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సిల్వర్‌స్ర్కీన్‌పై తనను తాను చూసుకోవాలనుకున్న కలను సాకారం చేసుకుంది. గాడ్‌ఫాదర్లు ఎవరూ లేకపోయినా అగ్రహీరోలకు దీటుగా సూపర్‌స్టార్‌గా ఎదిగింది. సాహసోపేతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వెండితెరపై ‘క్వీన్‌’గా వెలుగొందుతున్న ఆమె మరెవరో కాదు... ఉత్తమ నటిగా నాలుగోసారి జాతీయ పురస్కారానికి ఎంపికైన కంగనా రనౌత్.

Know More

women icon@teamvasundhara
super-foods-recommended-by-kareena-kapoor-in-telugu

కరీనా ఇష్టపడి తినే సూపర్‌ఫుడ్స్ ఇవేనట!

సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించాలంటే అందం, అభినయంతో పాటు చక్కని శరీరాకృతి, ఫిట్‌నెస్ మెయింటైన్‌ చేస్తూ ఉండాల్సిందే. అందుకే మన ముద్దుగుమ్మలందరూ చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. ఇటీవల రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందిన కరీనా కపూర్‌ అయితే ఈ విషయాల్లో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటుంది. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తుంటుంది. ఇటు చక్కటి పోషకాహారం తీసుకుంటూనే, అటు రెగ్యులర్‌గా వ్యాయామాలు చేస్తుంటుంది. మరి బెబో ఎనర్జీకి, ఆరోగ్యానికి కారణమైన ఆ సూపర్‌ఫుడ్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
mehreen-pirzada-gets-engazed-to-bhavya-bishnoi

‘హనీ’ నిశ్చితార్థం ఫొటోలు చూశారా?

‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌..’ అంటూ ‘ఎఫ్ 2’ సినిమాలో తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మతులు పోగొట్టింది మెహరీన్‌ పిర్జాదా. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘పంతం’, ‘జవాన్‌’, ‘చాణక్య’, ‘అశ్వథ్థామ’.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపును సాధించుకుంది. ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకున్న ఈ భామ తమిళం, పంజాబీ భాషల్లోనూ నటించి మెప్పించింది. ప్రత్యేకించి ‘ఎఫ్ 2’ సినిమాలో తన క్యూట్‌ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ సొగసరి త్వరలోనే పెళ్లిపీటలనెక్కనుంది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో కలిసి ప్రేమలో ఉన్న ఆమె తాజాగా అతనితో కలిసి ఉంగరాలు మార్చుకుంది.

Know More

women icon@teamvasundhara
vidyabalan-and-ananya-panday-opens-up-on-being-body-shamed

నేనేమో బొద్దుగా ఉన్నాట... నావేమో చికెన్ లెగ్స్‌ట!

బాడీ షేమింగ్... ప్రస్తుతం మన సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. వారి శరీరాకృతి, అందం, చర్మఛాయ, బరువు... మొదలైన వాటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్నారు. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఈ సమస్య బారిన పడుతున్నారు. గతంలో సినిమా పరిశ్రమకు చెందిన ఎంతోమంది తారలు బాడీషేమింగ్‌కు సంబంధించి తమ అనుభవాలను షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ విలక్షణ నటి విద్యాబాలన్‌తో పాటు యంగ్‌ సెన్సేషన్‌ అనన్యా పాండే ఈ సమస్య కారణంగా తామెలా ఇబ్బందులు పడ్డామో అందరితో షేర్‌ చేసుకున్నారు. అదే సమయంలో బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటూ తమ లాంటి బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

Know More

women icon@teamvasundhara
ileana-dcruz-talks-about-her-body-shaming-and-body-positivity-issues

అందంగా లేనని, శరీరాకృతి బాలేదని ఎంతో బాధపడ్డా.. మీరలా చేయద్దు!

సాధారణంగా రోజులో ఎన్నోసార్లు మన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాం. అలాంటిది ఎప్పుడైనా అందంగా కనిపించకపోతే ‘అరే ఏంటిది... ఇలా ఉన్నానేంటి?’ అనుకుంటూ మనసులో తెగ కంగారుపడిపోతుంటాం. ఇతరులతో పోల్చుకుంటూ మన శరీరాకృతిని చూసి మనమే అసహ్యించుకుంటాం. వారికంటే బెటర్‌గా మన శరీర సౌష్టవాన్ని మార్చుకోవాలనుకుంటాం. ఒకానొక దశలో తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది స్మైలింగ్‌ బ్యూటీ ఇలియానా. తాను అందంగా లేనని, శరీర సౌష్టవం కూడా సరిగా లేదనుకుని ఎంతో అభద్రతా భావానికి లోనయ్యానంటోందీ అందాల తార. ‘అందమంటే ఇదే’ అని సమాజంలో పేరుకుపోయిన కొన్ని మూసకట్టు ప్రమాణాల కారణంగా తానూ తీవ్ర ఆందోళన చెందానంటోంది. ఈ సందర్భంగా తన శరీరాకృతికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
bollywood-actress-shares-inspirational-messages-and-experiences-on-women-discrimination-in-society

సింగిల్‌గా ఉండడం తప్పు కాదు.. అందమంటే కొలతలు కాదు!

పెళ్లి చేసుకోకపోతే సింగిల్‌గా ఎందుకున్నావంటారు. పెళ్లైంది మొదలు పిల్లల్ని ఎప్పుడు కంటావ్‌ అని అడుగుతుంటారు. అందంగా లేకపోతే గ్రహాంతర వాసిలా చూస్తుంటారు. పురుషులతో సమానంగా పనిచేసినా సమాన వేతనం మాత్రం ఇవ్వరు. ఎన్ని తరాలు మారినా ఈ సమాజం ఆడవారిని చూసే ధోరణిలో మాత్రం మార్పు రావట్లేదు. పురుషుల్లాగే స్త్రీలూ ఈ సమాజంలో భాగమైనా ఇద్దరినీ వేర్వేరుగా చూడడం, అన్ని విషయాల్లో ఆడవారినే తప్పుబట్టడం మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అయినా భూదేవికి ఉన్నంత ఓర్పుతో అన్నీ భరిస్తూ, ప్రతికూలతల్ని కూడా సానుకూలంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎంతోమంది అతివలు. కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలూ ఇందుకు అతీతులు కాదు. వెండితెర రంగుల ప్రపంచంలో తమకెదురైన ఆటుపోట్లను అధిగమిస్తూ, తోటి మహిళల సమస్యల్ని తమ గళంలో వినిపిస్తూ ఎంతోమందిలో పాజిటివిటీని నింపుతున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పలువురు నటీమణులు వివిధ సందర్భాల్లో పంచుకున్న అలాంటి స్ఫూర్తిదాయక సందేశాలు వారి మాటల్లోనే మీకోసం..!

Know More

women icon@teamvasundhara
ritu-verma-interacts-with-instagram-fans-in-telugu

అది నాకు అలవాటే.. అవంటే ఎంతో ఇష్టం!

‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది రీతూవర్మ. ఆ సినిమాలో తన సహజమైన నటనతో ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకుందీ స్మైలింగ్‌ బ్యూటీ. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కేశవ’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తోన్న ఈ అందాల తార హైదరాబాద్‌లోనే చదువుకుని ఇక్కడే స్థిరపడింది. తాజాగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Lets do this...Ask away’ పేరుతో నిర్వహించిన ఛాట్‌ సెషన్‌లో తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది. మరి రీతూకు, ఫ్యాన్స్‌కు జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
yami-gautam-speaks-of-road-accident-that-left-her-with-a-fracture-in-the-neck

అప్పుడు హెల్మెటే నా ప్రాణాలు కాపాడింది!

‘యాక్సిడెంట్‌ అంటే బైకో... కారో రోడ్డు మీద పడడం కాదు... మనతో పాటు మన కుటుంబం రోడ్డు మీద పడిపోవడం’... అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే అనర్థాల గురించి ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్‌ ఇది. అతను చెప్పినట్లు రోడ్డు ప్రమాదాల వల్ల అర్ధాంతరంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అదేవిధంగా చాలామంది తీవ్ర గాయాలకు లోనై ఆస్పత్రుల పాలవుతున్నారు. అప్పటికప్పుడు వేగంగా కోలుకున్నా కొన్ని గాయాలు మాత్రం దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాను కూడా ఇలాంటి అనుభవాలను చాలా ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ యామీ గౌతమ్.

Know More

women icon@teamvasundhara
ileana-interact-with-instagram-fans-in-telugu

అలాంటి వాళ్లతోనే కలిసి ఉండాలనుకుంటా!

ఇలియానా.. ‘దేవదాస్‌’ సినిమాతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన ఈ గోవా బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’, ‘రాఖీ’, ‘నేను నా రాక్షసి’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాలతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మధ్యలో వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘పాగల్‌ పంతి’ తదితర సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Ask Me Anything’ పేరిట అభిమానులతో ముచ్చటించింది ఇలియానా. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఇలియానాకు, అభిమానులకు జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
amala-paul-opens-up-about-problems-faced-during-her-divorce

విడాకుల సమయంలో నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..!

విడాకులు... ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అత్యంత కఠినమైన మలుపు...! సర్వస్వం తానే అనుకున్న జీవిత భాగస్వామితో మధ్యలోనే విడిపోవడం.. తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపే రోజులొస్తాయన్న ఆలోచన తీరని ఆవేదనను కలిగిస్తుంది. దీనికి తోడు విడాకులు తీసుకున్న స్త్రీలంటే సమాజం చూసే చిన్న చూపు వారిని మరింత అగాథంలోకి నెడుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి అవమానాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు ఇలాంటి విమర్శలు, అవమానాలను చాలా ఎదుర్కొంది అమలాపాల్‌. చాలామంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్‌ చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
alitho-saradaga-special-chat-show-with-mumaith-khan-in-telugu
women icon@teamvasundhara
actress-lakshmi-manchu-to-cycle-100-km-to-raise-funds-for-differently-abled-athletes

'స్వరూపక్క' సైకిల్ యాత్ర ఎందుకో తెలుసా?

మంచులక్ష్మి... తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరతో పాటు బుల్లితెర పైనా మెరుస్తూ నటిగా, నిర్మాతగా, గాయనిగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే... మంచు లక్ష్మికి సామాజిక దృక్పథం కాస్త ఎక్కువే. అందుకే సందర్భమొచ్చినప్పుడల్లా మహిళల సమస్యలు, సామాజిక అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. తాజాగా ఆమె మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది.

Know More

women icon@teamvasundhara
neha-dhupia-on-postpartum-stress-in-telugu

అప్పుడు నా కెరీర్‌ ముగిసిపోయినట్లే అన్నారు!

కొత్తగా తల్లైన వారికి అమ్మతనం ఎంతటి మధురానుభూతుల్ని పంచుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రమంలో వారిలో తలెత్తే శారీరక మార్పులు మాత్రం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు కారణం సమాజం నుంచి ఎదురయ్యే బాడీ షేమింగే. తన కూతురికి జన్మనిచ్చాక తనకూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెబుతోంది బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ నేహా ధూపియా. రెండేళ్ల క్రితం మెహ్ర్‌ అనే పాపకు జన్మనిచ్చిన నేహ.. ఆ సమయంలో విపరీతంగా బరువు పెరిగిపోయింది. ఈ క్రమంలో తన శరీరాన్ని చూసి చాలామంది విమర్శించారని, ఇక తన కెరీర్‌ ముగిసినట్లే అన్నారని అంటోంది. ఇటీవలే కరీనా కపూర్‌ చాట్‌ షో ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’లో పాల్గొన్న నేహ.. అమ్మతనం, ప్రసవానంతర ఒత్తిడి, వర్క్-లైఫ్‌ బ్యాలన్స్‌.. తదితర విషయాల గురించి తన మనసులోని మాటల్ని, తనకెదురైన అనుభవాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
shweta-basu-prasad-opens-about-her-divorce-with-rohit

మావి విడాకులు కాదు... బ్రేకప్‌!!

విడాకులు... ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అత్యంత కఠినమైన మలుపు..! సర్వస్వం తానే అనుకున్న జీవిత భాగస్వామితో మధ్యలోనే విడిపోవడం...తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపే రోజులొస్తాయన్న ఆలోచనే తీరని ఆవేదనను కలిగిస్తుంది. ఇలా విడాకులు తీసుకుని భాగస్వామికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత వరకు బాధను మర్చిపోవడానికి, వివిధ రకాలుగా సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో విడాకులు తీసుకున్న చాలామంది సెలబ్రిటీలు కూడా సినిమాలు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో నటి శ్వేతా బసు ప్రసాద్‌ కూడా ఒకరు. 2019 చివరిలో తన భర్త రోహిత్‌ మిట్టల్‌తో విడిపోయిన ఈ అందాల తార మళ్లీ వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది. తద్వారా తన వైవాహిక బంధం మిగిల్చిన చేదు అనుభవాల నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.

Know More

women icon@teamvasundhara
aliabhatt-interact-with-instagram-fans-and-shares-her-favorite-things

అందుకే నాకు షాపింగ్‌ అంటే పెద్దగా నచ్చదు!

అలియా భట్‌... బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మహేశ్‌ భట్‌ వారసురాలిగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్‌ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్‌ చేసుకుంటుంది. ఈక్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘True Or False’ అనే సెషన్‌లో భాగంగా అభిమానులతో ముచ్చటించింది అలియా. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి అలియాకు, అభిమానులకు మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
things-to-know-olivia-morris-as-jennifer-in-rajamouli-rrr

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ యువరాణి గురించి ఈ విషయాలు తెలుసా?

ఇండియన్‌ సినిమా... దేశాలను దాటి... ఖండాంతరాలను చేరుకుంది. ఇప్పుడు అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లోనూ భారతీయ చిత్రాలు విడుదలవుతున్నాయి. అక్కడి ప్రేక్షకులను కూడా తమ మాయాజాలంతో మెప్పిస్తున్నాయి. ఇక మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ చూసి.. బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో నటించడానికి విదేశీ సుందరీమణులు సైతం సిద్ధమైపోతున్నారు. కత్రినా కైఫ్‌(లండన్‌), జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(శ్రీలంక), కల్కి కొచ్లిన్‌(ఫ్రాన్స్‌), అమీ జాక్సన్‌(బ్రిటన్‌), నోరా ఫతేహి(కెనడా), ఎవ్లీన్‌ శర్మ(జర్మనీ), నర్గిస్‌ ఫక్రి(అమెరికా).. వీరంతా ఇలా వచ్చి సెటిలైన వారే! తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల తార చేరింది. ఆమే బ్రిటన్‌కు చెందిన ఒలీవియా మోరిస్‌.

Know More

women icon@teamvasundhara
rai-laxmi-shares-her-covid-experiences-in-telugu

కరోనాతో మానసికంగా కుంగిపోయాను!

ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకానొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఇక కరోనా వచ్చాక మానసిక కుంగుబాటుకు గురయ్యే బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు... ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈక్రమంలో కరోనా కారణంగా తానూ అలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నానంటోంది నటి రాయ్ లక్ష్మి. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవల పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
samantha-chitchat-with-fans

అతడి కోసమే జిమ్‌లో జాయినయ్యా!

మనసుకు నచ్చిన వారికోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఏమైనా చేయడానికి సిద్ధపడతాం.. వారికున్న అలవాట్లను మనం అలవర్చుకోవడానికీ వెనకాడం. అలా తాను కూడా చైతూ కోసం జిమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. అతని కోసమే జిమ్‌లో జాయినయ్యానని, తద్వారా కొన్నాళ్లకు ఫిట్‌నెస్‌ లవర్‌గా మారిపోయానంటూ తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతోన్న ‘కాతువక్కుల రెండు కాదల్‌’ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలో ఉంటోన్న సామ్‌.. తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sunny-leone-bullied-as-kid-says-it-has-carried-through-my-entire-life-in-telugu

చిన్నతనంలోనే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను!

సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సినీ తారల్ని చూసి ‘అబ్బ...వీళ్లు నిజంగా లక్కీ! చేతి నిండా డబ్బు.. లగ్జరీ లైఫ్‌స్టైల్‌...! అసలు లైఫ్‌ అంటే సినిమా వాళ్లదే!’ అని అనుకుంటాం. కానీ వాళ్లు ఆ దశకు చేరుకోవడానికి మొదట్లో ఎంత కష్టపడ్డారో చాలామంది ఊహించరు. ఈక్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివిధ రకాల వేధింపుల గురించి కొంతమంది తారలు పలు సందర్భాల్లో పంచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార సన్నీ లియోనీ. సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఆమె చిన్నతనంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానంటోంది. ఈ సందర్భంగా స్కూలింగ్‌లో తన తోటి విద్యార్థులు ఎలా ఏడిపించారో అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
kajal-aggarwal-chitchat-with-fans-in-instagram-in-telugu

అప్పుడు అతనే నా బాయ్ ఫ్రెండ్..!

కాజల్‌ అగర్వాల్... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది అక్టోబర్‌ 30న తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూనే వరసగా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్‌ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్‌ చేసుకుంటుంటుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత చాలా రోజులకు తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Shoot away’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి కాజల్‌, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrities-sankranthi-celebrations-and-wishes-in-telugu

మన అందాల తారల సంక్రాంతి సంబరాలు చూశారా?

భోగ భాగ్యాలనిచ్చే భోగి, బోలెడన్ని సరదాల్ని తీసుకొచ్చే సంక్రాంతి, కమ్మని విందు చేసే కనుమ... వెరసి ఇలా మూడు పండగలు కలగలిపి తెలుగు లోగిళ్లకు సందడిని తీసుకొచ్చే అతిపెద్ద పండగే మకర సంక్రాంతి. భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడూ బసవన్నలు, పిండి వంటలు, విందులు, వినోదాలు... ఇలా ఎన్నో సరదాల సమ్మేళనమైన ఈ పండగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొంటారు. ఈ క్రమంలో పలువురు తారలు సైతం షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సంక్రాంతిని తమదైన రీతిలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేనా... ఆ సంబరాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి మన అందాల తారల సంక్రాంతి సంబరాలపై ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
janhvi-kapoor-belly-dance-video-goes-viral

బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టిన జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’ సినిమాతో తనలోనూ ఓ మంచి నటి ఉందని రుజువు చేసుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోన్న ఈ స్టార్ కిడ్‌ కథా బలమున్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటోంది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన వర్కవుట్‌, ఫ్యాషన్స్‌కు సంబంధించిన విషయాలన్నింటినీ అందులో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో జాన్వీకపూర్‌ పోస్ట్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
anushka-sharma-reveals-about-her-pregnancy-cravings-in-telugu

డాక్టర్ బుర్రతో పాటు మొదటి మూడు నెలలు అవే ఎక్కువగా తిన్నా!

గర్భం ధరించిన మహిళలు నెలలు నిండుతున్న కొద్దీ ప్రతి క్షణాన్నీ ఎంతగా ఆస్వాదిస్తారో.. ఈ క్రమంలో పలు సవాళ్లను సైతం ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నడూ లేనన్ని సందేహాలు వారి మదిని తొలిచేస్తుంటాయి. ఒకరి కోసం తినాలా? ఇద్దరి కోసం తినాలా?, ఏ ఆహారం తినాలి? ఎంత మోతాదులో తినాలి?, ఈ సమయంలో ఆహారపు కోరికల్ని తీర్చుకోవడం సబబేనా? ఇలా వారి మదిలో మెదిలిన ప్రతి సందేహాన్నీ నిపుణులను అడిగి నివృత్తి చేసుకుంటుంటారు. తాను కూడా అదే చేశానంటోంది బాలీవుడ్‌ న్యూ మామ్‌ అనుష్కా శర్మ. ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. గర్భిణిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించానో.. ఈ క్రమంలో తన మనసులో మెదిలిన డౌట్స్‌ని నివృత్తి చేసుకోవడానికి తన డాక్టర్‌ బుర్ర అంతగా తిన్నానంటోంది. కాబోయే అమ్మగా గడిచిన తొమ్మిది నెలల్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే.. ఈ క్రమంలో తాను పాటించిన ఆహార నియమాలు, ఫుడ్‌ క్రేవింగ్స్‌ గురించి ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుందీ లవ్లీ మామ్.

Know More

women icon@teamvasundhara
singer-sunitha-pre-wedding-photos-goes-viral-in-telugu

పెళ్లి సందడి మొదలైపోయింది!

తన మధురమైన స్వరంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రామ్‌ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో సునీత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
manushi-chhillar-teams-up-with-un-to-raise-awareness-on-violence-against-women

అందుకే మహిళనైనందుకు బాధపడుతున్నా!

మహిళలు ఇంటికి మహాలక్ష్ములంటారు.. ఆడవారిగా పుట్టడం అదృష్టమంటారు.. కానీ ఈ వివక్షా పూరిత ప్రపంచంలో స్త్రీగా బతుకుతున్నందుకు చాలా బాధగా ఉందంటోంది మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ ఛిల్లర్‌. మహిళలపై జరుగుతోన్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రారంభించిన #OrangeTheWorld అనే కార్యక్రమంలో భాగమైందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో స్త్రీలపై జరుగుతోన్న అన్యాయాలపై గళమెత్తింది. ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎలాగైతే కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామో.. అదేవిధంగా మహిళలపై జరుగుతోన్న హింసకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ ఉద్యమం కోసం సమష్టిగా పోరాడాలని పిలుపునిస్తోంది.

Know More