కాజల్ అగర్వాల్... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది అక్టోబర్ 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూనే వరసగా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటుంటుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత చాలా రోజులకు తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘Shoot away’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి కాజల్, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
హాయ్ మేడమ్... వైవాహిక బంధంలోకి అడుగు పెట్టినందుకు మొదటగా మీకు కంగ్రాట్స్. వివాహానికి ముందు... తర్వాత మీరు గ్రహించిన తేడాలేమిటి?
బాధ్యతలు పెరిగాయి. అందరి కంటే నా భర్తకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. (స్మైలీ ఎమోజీ జత చేస్తూ)
హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తున్నారు?
ఫిబ్రవరి మధ్యలో వస్తాను. రాగానే మొదట నీకు కాల్ చేస్తాను (నవ్వుతూ)..!
మీ నిశ్చితార్థం ఫొటో ఒకటి మాతో పంచుకోరా?

మీ అభిమానుల గురించి ఒక్కమాటలో ఏం చెబుతారు?
ది బెస్ట్ అంతే. నేను ప్రస్తుతం ఇక్కడ, ఈ స్థాయిలో ఉండడానికి మీరే కారణం.
మీ అమ్మతో కలిసి దిగిన ది బెస్ట్ ఫొటో..?

ఈ ఏడాదిని ఎలా ప్లాన్ చేసుకున్నారు?
ఇల్లు, పని... ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. జీవితంలో నేను ఇంకా చాలా విషయాల్లో మెరుగవ్వాలి.
మీ హనీమూన్ ఎక్కడ జరిగింది?
మాల్దీవులు
మీకు ఇష్టమైన ఫుడ్..?
ఇండియన్ ఫుడ్‌తో పాటు పాటు థాయ్, జపనీస్, వియత్నాం తదితర ఆసియా వంటకాలన్నీ నాకు ఇష్టమే.
మీ చర్మం, శిరోజాల సంరక్షణకు సహజంగా ఏం వాడతారు..?
కొబ్బరి నూనె... అలోవెరా జెల్.
మీ వైవాహిక జీవితం ఎలా ఉంది?మీ భర్త గౌతమ్ గురించి ఒక్కమాటలో చెప్పండి?
మా పెళ్లి యాదృచ్ఛికంగా జరిగింది. ఇక మా ఆయన గురించి చెప్పాలంటే... నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్, భర్త ఒక్కరే.
మీ చిన్ననాటి కల..?
చిన్నతనంలో నేను ఆస్ట్రోనాట్ అవుదామని కలగనేదాన్ని. త్వరలోనే నేనూ ఒక రాకెట్‌ను నడిపిస్తానని అనుకుంటున్నా (స్మైలీ ఎమోజీ)!
మీ సోదరి నిషా అగర్వాల్ గురించి రెండు మాటలు ఏం చెబుతారు?
తను నా సోల్ మేట్... ఇంకా లైఫ్ లైన్.
నటనను కొనసాగిస్తారా...?
కచ్చితంగా... అందులో డౌట్ లేదు. నా మొదటి లవ్ సినిమానే.
మీ నాన్న గారితో కలిసి దిగిన ఫొటో..?

గౌతమ్ ఎలా పరిచయమయ్యారు?
మా కామన్ ఫ్రెండ్ ద్వారా గౌతమ్ పరిచయమయ్యాడు.
ప్రస్తుతం మీరేం చేస్తున్నారు. మీ సెల్ఫీని మాకు పంపండి?

జీవితంలో మీకు బాగా సంతోషాన్నిచ్చే విషయమేంటి?
షూటింగ్ సెట్లో నా సీన్ పూర్తి కాగానే నా నటనను కెమెరాలో మళ్లీ చూసుకుంటాను. ఒక్కోసారి అలా చూస్తూ కెమెరా ముందు ఉండిపోతాను. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
మీ కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఫొటో..?

నటన కాకుండా మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి?
ఈ ప్రపంచమంతా దయతో నిండిపోయేలా చేయాలనుంది.
మీకు ఇష్టమైన పెర్ఫ్యూమ్?
Bohoboco
మీ మొబైల్ వాల్ పేపర్ ఏంటో మాతో షేర్ చేసుకోరా?

మీ రోజు ఎలా మొదలవుతుంది?
నా ప్రతిరోజూ కృతజ్ఞతా భావంతో మొదలవుతుంది. మన జీవితంలో ఎదుగుదలకు మనల్ని అడుగడుగునా ప్రోత్సహించిన వాళ్లందరి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. అదేవిధంగా ఒక గ్లాసు వేడి నీటిలో అల్లం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటాను. మహామంత్రం జపిస్తాను. 30 నిమిషాల పాటు ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేస్తాను. వీటితో పాటు నా భర్తకు ఒక హగ్ ఇస్తాను.
ఇప్పటివరకూ ఎవరితోనూ షేర్ చేసుకోని మీ బెస్ట్ పెళ్లి ఫొటో..?

మీకు కోపం తెప్పించే విషయాలు?
మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం
మీరు చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడాలనుంది. దయచేసి మీ చిన్నప్పటి ఫొటో ఒకటి పంచుకోండి మేడమ్?

మీ ఫేవరెట్ డ్రింక్..?
నింబూ పానీ (నిమ్మరసం), గ్రే టీ.
మీకు జీవితంలో బాగా ఇష్టమైన వ్యక్తులెవరు?

ఓవర్ థింకింగ్‌ను ఎలా అధిగమిస్తారు?
పాజిటివ్ అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుంటాను. యోగా కూడా చేస్తాను.
ఇటీవల మేకప్ లేకుండా దిగిన ఓ ఫొటో ఉంటే పోస్ట్ చేయండి?

మంచు విష్ణుతో కలిసి నటిస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘హా..ఇట్స్ సీక్రెట్...కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ వేచి ఉండాల్సిందే. నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మీ బాయ్ ఫ్రెండ్...?
గౌతమ్ కిచ్లూ.. తొమ్మిదేళ్ల క్రితం దిగిన ఫొటో.

మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ‘ఆచార్య’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఈ సినిమా షూటింగ్‌కు దూరమయ్యాను. మళ్లీ నా పాత్రలోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మీ మొహంపై ఎప్పుడూ చిరునవ్వును తెప్పించే ఒక వ్యక్తి ఫొటోను మాతో పంచుకోండి?
