అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్. తన మొదటి చిత్రం ‘ధడక్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాతో తనలోనూ ఓ మంచి నటి ఉందని రుజువు చేసుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోన్న ఈ స్టార్ కిడ్ కథా బలమున్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన సినిమా అప్డేట్స్తో పాటు తన వర్కవుట్, ఫ్యాషన్స్‌కు సంబంధించిన విషయాలన్నింటినీ అందులో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో జాన్వీకపూర్ పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటనే కాదు డ్యాన్స్‌లోనూ!
నటనే కాదు నృత్యంలోనూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది జాన్వీ. శాస్త్రీయ నృత్యమైనా, వెస్ట్రన్ డ్యాన్స్ అయినా ఎంతో హుషారుగా, ఉత్సాహంగా కాలు కదపడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే. తన ఇన్స్టాగ్రామ్ వీడియోలను ఒకసారి చూస్తే ఆమెలో ఎంత మంచి డ్యాన్సర్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇక బెల్లీ డ్యాన్స్‌లోనూ జాన్వీకి ఎంతో ప్రావీణ్యం ఉంది. కరోనాకు ముందు ఈ వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసులకు కూడా హాజరైంది. అయితే కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం బెల్లీ డ్యాన్స్ శిక్షణకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో డ్యాన్స్ క్లాసులను మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘సనా సనన్’ అంటూ!
కరీనా కపూర్, షారుఖ్ ఖాన్ జంటగా నటించిన హిస్టారికల్ డ్రామా ‘అశోకా’. 2001లో విడుదలైన ఈ సినిమాలోని ‘సనా సనన్’ పాటకు కరీనా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఇదే పాటకు ఎంతో హుషారుగా కాలు కదిపి పలువురి మన్ననలు అందుకుంటోంది జాన్వీ. పాటకు అనుగుణంగా నడుమును తిప్పడం, సందర్భానికి తగ్గట్టుగా అద్భుతమైన ముఖ కవళికలను చూసి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు సైతం మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో ‘బురిటో బెల్లీ డ్యాన్స్ సెషన్లను మిస్ అవుతున్నానంటూ’ జాన్వీ పోస్ట్ చేసిన వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గతంలోనూ!
ఇప్పుడే కాదు గతంలోనూ ఎంతో అద్భుతమైన డ్యాన్స్ వీడియోలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది జాన్వీ. తద్వారా తనలోని ఓ మంచి డ్యాన్సర్‌ను అందరికీ పరిచయం చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే... జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘రూహీ అఫ్జానా’, ‘గుడ్‌లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.