రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన చర్చిలు... లైట్లతో మిరుమిట్లు గొలిపే క్రిస్మస్ చెట్లు... శాంటాక్లాజ్ కోసం వేచి చూసే చిన్నారులు.. ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు వెల్లివిరిస్తున్నాయి. దేశ విదేశాల్లో ప్రతిఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. క్రిస్మస్ చెట్టు, స్టార్స్, లైట్స్, బెలూన్స్... మొదలైన వాటితో ఇంటిని అందంగా అలంకరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ప్రత్యేకాకర్షణగా నిహారిక-చైతన్య!
మెగా ఫ్యామిలీలో పండగ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగ వాతావరణం మొత్తం అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా క్రిస్మస్ వేడుకల్లోనూ మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ సందడి చేశారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులు నిర్వహించిన ఈ వేడుకల్లో కొత్త జంట నిహారిక-చైతన్య దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బన్నీ-స్నేహలత, శ్రీజ-కల్యాణ్ దేవ్, సుస్మిత-విష్ణు, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లుశిరీష్ తదితరులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం తమ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇక మహేశ్-నమ్రత దంపతులు క్రిస్మస్ ట్రీ వద్ద గౌతమ్, సితార దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ ప్రశాంతత, ప్రేమ, ఆనందాన్ని అందజేయాలని కోరుకున్నారు. వీరితో పాటు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, అనన్యా పాండే, హన్సిక, రాయ్ లక్ష్మి, మాధురీ దీక్షిత్, సోహా అలీఖాన్, శిల్పాశెట్టి, కాజోల్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంకా చోప్రా, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తదితరులు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మరి, మనమూ ఒకసారి ఆ ఫొటోలను చూద్దాం రండి.