ఎన్నెన్నో సరదాల దసరా పండగను పలువురు తారలు ఘనంగా జరుపుకొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
కాబోయే భర్తతో కాజల్ సెలబ్రేషన్స్!
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు కాబోయే భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకొంది. ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బ్లూ కలర్ షరారా దుస్తుల్లో కాజల్ మెరిసిపోగా, బ్లాక్ కలర్ కుర్తా, పైజామా ధరించి సూపర్బ్ అనిపించాడు గౌతమ్. ఈ సందర్భంగా తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ‘మా తరఫున మీ అందరికీ దసరా శుభకాంక్షలు’ అని తెలిపారీ లవ్లీ కపుల్. గౌతమ్‌తో కలిసి ఈ నెల 30న ఏడడుగులు నడవనున్నట్లు ఈ నెల ఆరంభంలో ప్రకటించింది కాజల్. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి ముందు కానీ, ఆ తర్వాత కానీ కాజల్ తనకు కాబోయేవాడితో దిగిన ఫొటోలు ఎప్పుడూ షేర్ చేయలేదు. దీంతో మరో మూడురోజుల్లో ఒక్కటవుతోన్న ఈ అందాల జంట ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న ఈ ఫొటోలకు ఇప్పటివరకు సుమారు 9.8 లక్షలకు పైగా లైకులు రావడం విశేషం. ఇక ఈ ఫొటోలు చూసిన అభిమానులు ‘సూపర్ కపుల్’, ‘చూడముచ్చటైన జంట’, ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు.
కాజల్ సోదరి నిషా అగర్వాల్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషా సైతం తనకు కాబోయే బావతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
గౌతమ్ కూడా సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ ‘ప్రి వెడ్డింగ్ ఫెస్టివల్స్’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
|
అత్తారింట్లో ‘రానా’ వేడుకలు!
లాక్డౌన్లో తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బాయ్ చెప్పేసిన భళ్లాలదేవుడు రానా -మిహీకా బజాజ్ దసరాను ఘనంగా జరుపుకొన్నారు. వివాహమైన తర్వాత వచ్చిన తొలి విజయదశమి కావడంతో కుటుంబంతో కలిసి వేడుకలను చేసుకున్నారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం అత్త-మామలతో కలిసి రానా, ఆయన సతీమణి మిహీక ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను రానా అత్తయ్య బంటీ బజాజ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ ‘హ్యాపీ దసరా’ అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఫొటోల్లో పర్పుల్ కలర్ శారీ, హాఫ్‌వైట్ బ్లౌజ్ ధరించి మిహీక సంప్రదాయబద్ధంగా కనిపించింది. దుస్తులకు తగ్గట్టుగా ఉన్న జ్యుయలరీ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ఎప్పటిలాగే వైట్ కుర్తా, డెనిమ్ జీన్స్ ప్యాంట్లో స్టైలిష్‌గా మెరిసిపోయాడు రానా. ఈ క్రమంలో ‘లవ్లీ కపుల్’, ‘బ్యూటిఫుల్ కపుల్’ అంటూ అభిమానులు, నెటిజన్లు ఈ అందాల జంటకు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
|
వీరితో పాటు కాజోల్, అనుష్కాశెట్టి, అల్లు స్నేహారెడ్డి, నమ్రతా శిరోద్కర్, శిల్పాశెట్టి, రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, మంచులక్ష్మి, సుమ, అనసూయ, నభానటేష్, అను ఇమ్మాన్యుయెల్, రితూవర్మ, శ్రీముఖి, కృతి సనన్, నిఖిల్, మంచు విష్ణు, కల్యాణ్ దేవ్ తదితరులు తమ అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు.