scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఫైనల్‌గా కొత్త అవతారంలోకి అడుగు పెడుతున్నాను!

Varalaxmi Sarathkumar Turns Director. Celebrities Pour In Best Wishes

పురుషాధిక్యత ఉన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు కూడా పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. కేవలం నటీమణులుగానే కాకుండా... దర్శకులుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఈ తరం హీరోయిన్లలో అనుష్కాశర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె... తదితరులు ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థలను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. మరికొందరు మెగాఫోన్ పట్టి డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తన నటనతో ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారింది. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.


వరలక్ష్మీ శరత్‌కుమార్‌... పాపులర్‌ నటుడు శరత్‌ కుమార్‌ కూతురిగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి. తన అందం, అభినయంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నీ సొంతం చేసుకుందీ ట్యాలెంటెడ్‌ యాక్ర్టెస్‌. హీరోయిన్‌గా గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే విలన్‌, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా కథ నేపథ్యం దృష్ట్యా ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయి నటించడం ఈ అమ్మడికున్న ప్రత్యేకత. కోలీవుడ్‌.. టాలీవుడ్‌ అనే తేడాలేమీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా దర్శకురాలిగా అవతారం ఎత్తింది. ‘కన్నామూచ్చి’ పేరుతో ఓ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. ‘కన్నామూచి’ అంటే తెలుగులో ‘దాగుడుమూతలు’ అని అర్థం. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు తమ సహ నటికి మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.


చదువే ముందు..!
శరత్‌కుమార్‌-ఛాయా దంపతుల కుమార్తె అయిన వరలక్ష్మి చెన్నైలోనే పుట్టి పెరిగింది. అక్కడి హిందూస్థాన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రముఖ ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఎమ్‌)లో పీజీ పూర్తి చేసింది. ఇదే క్రమంలో శంకర్‌ ‘బాయ్స్‌’ సినిమా కోసం జరిగిన ఆడిషన్‌కి హాజరై మెయిన్‌ రోల్‌కు కూడా ఎంపికైంది. అయితే ముందు ఉన్నత చదువులు పూర్తిచేయాలన్న తండ్రి సలహాతో వెనక్కు తగ్గింది. ఆయన చెప్పినట్లుగానే చదువు పూర్తి చేసిన వరలక్ష్మి అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరి నటనకు సంబంధించిన ఓనమాలు నేర్చుకుంది.


హీరోలకు దీటుగా !
ఎనిమిదేళ్ల క్రితం విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోడా పోడి’ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి. మొదటి సినిమాలోనే శింబు లాంటి అగ్రహీరోతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ భామ ఆ తర్వాత వరుసగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అలరించింది. ‘తారాయి తప్పట్టై’, ‘విక్రమ్‌ వేద’, ‘సత్య’, ‘మిస్టర్‌ చంద్రమౌళి’, ‘సందకోజి 2’, ‘సర్కార్‌’, ‘మారి 2’, ‘నీయా 2’ తదితర తమిళ సినిమాల్లో సందడి చేసిందీ అందాల తార. ప్రధానంగా ‘సందకోజి 2’ (పందెం కోడి 2), ‘సర్కార్‌’ వంటి సినిమాల్లో వరుసగా విశాల్‌, విజయ్‌ వంటి అగ్ర హీరోలకు దీటుగా ప్రతినాయిక పాత్రలు పోషించి పలువురి ప్రశంసలు అందుకుందీ తమిళ సుందరి. ఇక ‘తెనాలి రామకృష్ణ బీఏ..బీఎల్‌’ సినిమాతో నేరుగా తెలుగు వారిని పలకరించిన ఈ బ్యూటీ బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.


‘మీటూ’కు మద్దతిచ్చి!
సినిమాలతో పాటు మహిళా సమస్యలు, సామాజిక అంశాలపై సూటిగా స్పందించడం వరలక్ష్మికి అలవాటు. ఏ విషయమైనా నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పేయడం ఈ అమ్మడి స్టైల్‌. ‘మీటూ’ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఈ డేరింగ్‌ బ్యూటీ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యలు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఇక మూడేళ్ల క్రితం సహ నటి భావనపై దాడి జరిగినప్పుడు ఆమెకు మద్దతుగా సంతకాల ఉద్యమానికి తెరలేపింది. ఇక లాక్‌డౌన్‌ సమయంలో గృహ హింసకు వ్యతిరేకంగా నిలబడింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయంపై అవగాహన కల్పించి బాధితుల్లో భయాన్ని పోగొట్టింది. ఇక తల్లి ఛాయా దేవి కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తోన్న ‘సేవ్‌ శక్తి ఫౌండేషన్‌’ బాధ్యతలను కూడా భుజానికెత్తుకుంది వరలక్ష్మి. ఈ ఎన్‌జీవో ద్వారా మూగజీవాల సంరక్షణ, మహిళల మానసిక ఆరోగ్యం, గృహహింస వంటి అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.


నేనేంటో నిరూపించుకుంటాను!
8 ఏళ్లు... 4 భాషలు... 30కు పైగా సినిమాలు... క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ వరలక్ష్మి సినీ ప్రయాణం! ఇలా ఇన్నాళ్లూ విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించిన ఈ సొగసరి తాజాగా మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌గా మారిన ఆమె తన తాజా చిత్రం ‘కన్నామూచి’ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. ‘ఫైనల్‌గా దర్శకురాలిగా కొత్త అవతారంలోకి అడుగుపెడుతున్నాను. దర్శకురాలిగా కష్టపడి నేనేంటో నిరూపించుకుంటాను. మీ అందరి ముందు తలెత్తుకుని నిలబడతాను’ అని రాసుకొచ్చిందీ అందాల తార.


ఇక్కడ చాలా శక్తిమంతమైన మహిళలున్నారు!
ఈ క్రమంలో ‘ఉమెన్‌ పవర్‌’ అంటూ సమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయిపల్లవి, కాజల్‌, త్రిష, తమన్నా, ఐశ్వర్యా రాజేష్‌, తాప్సి, మంచులక్ష్మి, రాధికా శరత్‌కుమార్‌, శ్రుతిహాసన్‌, సాయేషా సైగల్‌, రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్‌, అదితీరావు హైదరీ, హన్సిక, అక్షరా హాసన్‌, రాయ్‌లక్ష్మి, ఆండ్రియా, మంజిమా మోహన్, సుహాసిని, సిమ్రన్‌, చిన్మయి...తదితరులు కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ‘కన్నామూచి’ సినిమా పోస్టర్‌ను షేర్‌ చేశారు. డైరెక్టర్‌గా ఆమె పేరును చూడడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. సూర్య సతీమణి జ్యోతిక, విజయ్‌ సతీమణి సంగీత కూడా వరలక్ష్మికి అభినందనలు తెలిపారు. ఇక డీఎంకే ఎంపీ కనిమొళి ట్విట్టర్‌ వేదికగా ఈ సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ ‘ఇక్కడ చాలా శక్తిమంతమైన మహిళలున్నారు. మనకు వారు తెలిసుండచ్చు.. మనలోనే వారుండచ్చు.. అలాంటి వారి సంఖ్యను మరింతగా పెంచుదాం..’ అని రాసుకొచ్చారు.





women icon@teamvasundhara
chitrangda-singh-opens-up-about-losing-modeling-assignments-because-of-dusky-complexion

నా రంగు కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా!

ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరాకృతి, అందం, బరువు, రంగు... మొదలైన విషయాల గురించి వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం చాలా మామూలు విషయమై పోయింది. ఇక రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో చర్మఛాయ పేరుతో అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే చాలామంది సినీతారలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన స్కిన్‌టోన్‌ కారణంగా తాను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార చిత్రాంగద సింగ్‌. అంతేకాదు తన చర్మఛాయ కారణంగా కెరీర్‌లో పలు అవకాశాలు కోల్పోయానంటోంది. ఈ సందర్భంగా తన స్కిన్‌టోన్‌కు సంబంధించి తనకెదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
tappsee-pannu-recalls-her-struggling-days-in-telugu

వారి పక్కన హీరోయిన్‌గా పనికిరానన్నారు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ర్టీలో ఒక మహిళ హీరోయిన్‌గా రాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునే దాకా ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల మెప్పు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ఈక్రమంలో సినిమా పరిశ్రమలో తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటోంది తాప్సీ. తాను అందంగా ఉండనని, గొంతు బాగోలేదని.. ఇలా పలు కారణాలను సాకులుగా చూపి తనను చాలా సినిమాల్లోంచి తప్పించారంటోంది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తనకెదురైన చేదు అనుభవాలు, అవమానాల గురించి అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
a-spiritual-leader-tried-to-take-advantage-of-me-says-actress-anupriya-goenka

ఆ బాబా నన్ను లోబరుచుకోవాలని చూశాడు!

తమని తామే దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ పలువురు దొంగ బాబాలు, స్వామీజీలు అమాయకుల్ని మోసం చేస్తుంటారు. భక్తి ముసుగులో ఆడపిల్లల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సేవ పేరుతో వారిని బానిసలుగా చేసి లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తానూ ఓ బాబా చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానంటోంది బాలీవుడ్‌ వర్ధమాన నటి అనుప్రియా గోయెంకా. తన తండ్రి బాగా నమ్మిన ఆ ఆధ్యాత్మిక గురువు మాయ మాటలతో తనను లోబరుచుకోవాలని చూశాడంటోంది. ఈ సందర్భంగా లైంగిక వేధింపులకు సంబంధించి తనకెదురైన చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
cinema-celebrities-interesting-social-media-posts-on-diwali

తారల దీపావళి సంబరాలు చూశారా?

జీవితంలోని చీకట్లను చెరిపేసి వెలుగులు నింపే దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకొంది. విద్యుద్దీపాల వెలుగులు, దీపాల కాంతులు, మతాబుల సందడితో ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ పండగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ర్టీకి చెందిన పలువురు తారలు సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కున మెరిశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తూ, దీపాలు పెడుతూ సందడి చేశారు. పండగ సంతోషాలను ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. అదేవిధంగా తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సినీ తారల దీపావళి సంబరాల విశేషాలేంటో మనమూ చూద్దాం రండి!

Know More

women icon@teamvasundhara
what-if-tollywood-actresses-are-compared-to-diwali-crackers

'రాకెట్' రకుల్.. 'ఆటం బాంబ్' పూజ.. 'తారాజువ్వ' కాజల్..!

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకొనే పండగల్లో దీపావళి ఒకటి. రామాయణం ప్రకారం 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు సీతతో కలిసి ఆయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా.. మహాభారతం ప్రకారం సత్యభామ నరకాసురుడిని వధించిన రోజుగా.. మనమంతా ఈ పండగను జరుపుకొంటాం. దీపావళి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దీపకాంతులు. ఈరోజున లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇళ్లంతా దీపాలతో అందంగా అలంకరిస్తాం. ఇక చీకటి పడ్డాక అసలైన ఘట్టం మొదలవుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటి సభ్యులంతా కలిసి దీపావళి టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. వీటిలో ఆకాశానికి ఎగసి వెలుగులు విరజిమ్మేవి కొన్నైతే.. నేలపైనే పేలుతూ కాంతితో పాటు శబ్దాలను ఇచ్చేవి మరికొన్ని. ఈ క్రమంలో మనల్ని ఎంతగానో అలరిస్తోన్న ఈతరం తారలకు, దీపావళి టపాసులకు పోలికలెన్నో..! మరి ఏ తార ఏ టపాసు లాంటిదో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
avika-gor-confirms-she-is-dating-with-milind-chandwani-in-telugu

ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడు!

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో ఆనందిగా పరిచయమైన అవికా గోర్‌ తన అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే అభినయంతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజి తీగలా మారి తన అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన అవిక... వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
tanushree-dutta-announces-her-bollywood-come-back-in-telugu

మళ్లీ వస్తున్నా.. అందుకోసం 15 కిలోలు తగ్గా..!

తనుశ్రీ దత్తా... మన దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పడంతోనే ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. ఆమె అందించిన ధైర్యంతోనే వివిధ రంగాలకు చెందిన మహిళలు ‘మాపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి’ అంటూ ఒక్కొక్కరు పెదవి విప్పారు. అంతకుముందు పలు హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన తనుశ్రీ ఈ ఉద్యమం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. అమెరికాలో స్థిరపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ తన అభిమానులకు ఓ తీపి కబురు అందించిందీ అందాల తార. ఈ సందర్భంగా సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
shradda-kapoor-on-instagram-reaches-56500000-followers-as-3rd-most-followed-indian

సోషల్‌ మీడియాలోనూ ఈ సాహో బ్యూటీదే హవా!

సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వెండితెరపై వెలిగిపోయే సెలబ్రిటీలకు తమ వృత్తితో పాటు సోషల్‌ మీడియా కూడా ముఖ్యమే. ఎందుకంటే తమను ఆరాధించే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి చాలామంది వారిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టివ్‌గా ఉన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 56.5 మిలియన్లకు చేరుకుంది. తద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్‌ సెలబ్రిటీల్లో మూడో స్థానానికి చేరుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
kangana-ranaut-reveals-weight-gain-for-thalaivi-wasnt-easy-in-telugu

అప్పుడు నా వెన్నుకు తీవ్ర గాయమైంది!

ఒక పనిలో పరిపూర్ణత రావాలంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా భరించాలంటోంది బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. ఎలాంటి పాత్రకైనా తనదైన రీతిలో పర్‌ఫెక్షనిజాన్ని తీసుకొచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘తలైవి’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం, ఆన్‌స్క్రీన్‌పై జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి ఏకంగా 20 కిలోలు పెరిగిన ఈ మనాలీ బ్యూటీ.. ప్రస్తుతం తాను పెరిగిన బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తనకెదురైన పలు అనుభవాలను సైతం అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది కూడా! ఈ క్రమంలోనే తలైవి కోసం భరతనాట్యం నేర్చుకున్నప్పుడు వెన్ను తీవ్రంగా గాయపడిందని, అయినా పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయగలిగానన్న సంతృప్తి ముందు ఆ బాధ ఏపాటిదంటూ తన షూటింగ్‌ అనుభవాలను ట్వీట్స్‌ రూపంలో పోస్ట్‌ చేసింది కంగన.

Know More

women icon@teamvasundhara
avika-gore-shares-a-post-about-self-love-in-telugu

ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం!

ప్రతి మనిషిలోనూ పాజిటివ్‌, నెగెటివ్‌... అని రెండు రకాల భావోద్వేగాలుంటాయి. పాజిటివ్‌ ఎమోషన్స్‌ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకపోయినా, ప్రతికూల ఆలోచనలు మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఈ తరహా ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈక్రమంలో తాను కూడా గతంలో నెగెటివ్‌ ఆలోచనలతో ఎంతగానో ఇబ్బందిపడ్డానంటోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా గోర్‌. చెడు ఆలోచనలతో తన విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానంటోంది. అయితే ఆ తర్వాత తనను తాను నమ్ముకున్నానని, చుట్టూ ఉన్న వాళ్లతో సమయం గడిపి ఈ సమస్యను అధిగమించానంటోంది. ఈక్రమంలో ప్రతికూల ఆలోచనలకు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రతిరోజూ మనతో మనం మాట్లాడుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే చక్కటి సందేశాన్ని అందిస్తోన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
bhumi-pednekar-flunked-film-school-had-rs-13-lakh-loan-on-her-head-when-she-started-out

ఆ కోర్సులో చేరడానికి 13 లక్షల లోన్‌ తీసుకున్నా!

ఎవరైనా తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నప్పుడు...తను సాధించిన విజయమే పైకి కనిపిస్తుంది తప్ప.. ఆ గెలుపును చేరుకోవడానికి వాళ్లు పడిన కష్టాలు, కన్నీళ్లు, చేసిన ప్రయత్నాలు ఎవరికీ కనిపించవు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతోన్న ఎంతోమంది తారలు తమ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఛీత్కారాలు ఎదుర్కొన్న వారే..! ఈక్రమంలో తన జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లున్నాయంటోందీ బాలీవుడ్‌ అందాల తార భూమీ పెడ్నేకర్‌. తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదంటోన్న భూమి.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
actress-fatima-sana-shaikh-reveals-she-was-molested-as-a-3-year-old

మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా!

ఏ రంగంలోనైనా ఉద్యోగానికి ప్రతిభే కొలమానం అన్న సంగతి తెలిసిందే! కానీ చిత్రపరిశ్రమలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే నెపోటిజం (బంధుప్రీతి), క్యాస్టింగ్‌ కౌచ్‌ ముఖ్యమని పలు సందర్భాల్లో కొంతమంది తారలు వెల్లడించిన విషయాలు, వారి అనుభవాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌. ‘దంగల్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిన్నది.. సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డానని, ముక్కుపచ్చలారని వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వేధింపులు మహిళలకు ప్రతి రంగంలోనూ ఎదురవుతున్నాయని, దీంతో వారు నిత్యం నరకం అనుభవిస్తున్నారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
poonam-bajwa-introduced-her-soulmate-in-telugu

నీతో ప్రతిక్షణం ఓ మ్యాజిక్‌లా ఉంటుంది!

‘హలో బాసు..మహా క్లాసు’ అంటూ ‘బాస్‌’ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుంది పూనమ్‌ బజ్వా. 15 ఏళ్ల క్రితం ‘మొదటి సినిమా’తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘బాస్‌’ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈక్రమంలో తాజాగా అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన ఆమె.. వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-agarwal-pre-wedding-festivities-begin-in-telugu

‘చందమామ’ పెళ్లి సందడి మొదలైపోయింది!

టాలీవుడ్‌ పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో (అక్టోబర్‌ 30) ఈ చందమామ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడవనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనున్న ఈ అందాల తారకు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-shares-what-her-mom-said-to-her-when-she-won-miss-world-pageant

కంగ్రాట్స్ చెప్పకుండా ‘బేబీ.. నీ చదువు సంగతేంటి’? అనడిగింది!

మిస్‌ వరల్డ్‌... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది బాలీవుడ్‌ అందాల తార ప్రియాంకా చోప్రా. ఈ ముద్దుగుమ్మ ఈ కిరీటం గెలుచుకుని రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈక్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్‌లు షేర్‌ చేస్తోంది ప్రియాంక.

Know More

women icon@teamvasundhara
alia-bhatt-shares-a-post-on-self-appreciation-in-telugu

సోషల్ మీడియాలో ఉండేది ‘నిజమైన మనం’ కాదు!

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఈ సంఘటనతో సోషల్‌ మీడియా వేదికగా ఇండస్ట్రీలోని బంధుప్రీతి, లాబీయింగ్, లైంగిక వేధింపులు వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇదే సమయంలో మహేశ్‌భట్‌ కుమార్తెగా అలియా భట్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఇప్పటివరకు తనపై వచ్చిన విమర్శలకు స్పందించని అలియా తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ షేర్ చేసింది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియాలో తనపై విమర్శలు చేసేవాళ్లని ఉద్దేశిస్తూ ఓ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
rani-mukerji-reveals-her-and-adira-plans-for-durga-puja-at-home

ఈసారి దసరా సరదాల్ని మిస్సవుతున్నాం!

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో బోలెడన్ని సరదాల్ని తీసుకొస్తుంది ‘దసరా’ పండగ. దేశవ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రుల పేరుతో వైభవంగా జరుపుకొనే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాల్లో కొలుస్తుంటారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన ‘విజయదశమి’ నాడు అసలు సిసలైన పండగ హడావిడి ఉంటుంది. మరి, ఇలా ఎన్నో సరదాల్ని, మధురానుభూతుల్ని అందించే ఈ పర్వదినాన్ని కరోనా పడగ కింద ఎంతో జాగ్రత్తగా జరుపుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాము కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండగను సెలబ్రేట్‌ చేసుకుంటామంటోంది బాలీవుడ్‌ అందాల తార రాణీ ముఖర్జీ. ఈ సందర్భంగా పండగకు సంబంధించి తన ప్రణాళికలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
saipallavi-puts-mehendi-on-kids-from-uttar-pradesh

మన భానుమతి మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది!

సాయిపల్లవి... సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టినా, ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసినా, ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసినా... అది నేచురల్ బ్యూటీ సాయి పల్లవికే చెల్లింది. డాక్టర్ కాబోయి యాక్టర్‌ అయిన ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది. రీల్ లైఫ్లో ఎంతో సింపుల్‌గా, సరదాగా కనిపించే సాయి పల్లవి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి వెళ్లిన ‘మలర్’ సడన్గా మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది. అక్కడి చిన్నారుల చేతులను అద్భుతమైన మెహందీ డిజైన్లతో నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-keerthy-suresh-on-her-birthday-special-in-telugu

అందుకే మన కీర్తి ‘మహానటి’ అయింది!

‘మహా నటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తన వైపు తిప్పుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమాలో అలనాటి అందాల తార ‘సావిత్రి’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు ‘జాతీయ ఉత్తమ నటి’ పురస్కారం అందుకుంది. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చుకునే ఈ ముద్దుగుమ్మ ఇటు కమర్షియల్‌ సినిమాలతో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనూ నటిస్తోంది. ఇలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 17). ఈ సందర్భంగా ఆ అందాల కథానాయిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-opens-about-her-goa-tour-and-online-trolls

గోవా బీచ్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే కాస్త ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అందుకే సెలబ్రిటీలందరూ బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని సమయం దొరికినప్పుడల్లా ఔటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి తన పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లింది. తన ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి అక్కడ తన జన్మదిన వేడుకలు జరుపుకొంది. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో ఈ ప్రయాణం చాలా అసౌకర్యంగా సాగిందంటూ తన గోవా టూర్‌కు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుందీ మంచు వారి వారసురాలు.

Know More

women icon@teamvasundhara
namrata-shirodkar-shares-30-days-positivity-plan-on-world-mental-health-day

౩౦ రోజుల్లో మానసిక ఆరోగ్యం.. నమ్రత పాజిటివ్ ప్లాన్ చూశారా?

జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏటా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ (అక్టోబర్ 10) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమస్యలపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు తానెలాంటి పనులు చేస్తున్నానో సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది ప్రిన్స్‌ మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్.

Know More

women icon@teamvasundhara
jai-ho-actress-quits-showbiz-pens-a-note-on-social-media

women icon@teamvasundhara
samantha-adorable-anniversary-wishes-to-chaitanya-wins-hearts-in-telugu

women icon@teamvasundhara
sonam-kapoor-shared-what-she-eats-for-her-breakfast-which-helps-her-deal-with-pcos

అప్పట్నుంచీ ఇదే నా బ్రేక్‌ఫాస్ట్!

పీసీఓఎస్‌.. ఇది ఒక్కసారి మన జీవితంలోకి అడుగుపెట్టిందంటే.. అదుపు చేసుకోవడమే తప్ప.. దాన్ని వదిలించుకోవడమనేది అసాధ్యం! మరి, ఈ సమస్యను అదుపు చేసుకోవాలంటే ముఖ్యంగా మన ఆహారపుటలవాట్లను అదుపులో పెట్టుకోవాలి.. అనారోగ్యకరమైన జీవనశైలికి దూరంగా ఉండాలి.. ఇదే విషయం చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. తాను గత కొన్నేళ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని, ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా, ఎందరు డాక్టర్లను కలిసినా సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ ఇటీవలే ఓ వీడియోలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అయితే పోషకాహార నిపుణుల సలహా మేరకు చక్కటి ఆహార నియమాలు పాటించడం వల్లే ప్రస్తుతం తనకు పీసీఓఎస్‌ అదుపులో ఉందన్న సోనమ్‌.. అందుకు తాను తీసుకుంటోన్న అల్పాహారమేంటో తాజాగా మరో వీడియోలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-aggarwal-announces-about-her-marriage-in-telugu

మేమిద్దరం ఆ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!

కాజల్‌ అగర్వాల్‌... సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పుష్కర కాలం దాటిపోతున్నా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌. 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్థానం సంపాదించింది. అందం, అభినయానికి తోడు క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల తార పెళ్లి ముహూర్తం తాజాగా ఫిక్సయింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఈ నెల 30న ఏడడుగులు నడవనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ స్టార్‌ హీరోయిన్‌. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
actress-anushka-chitchat-with-twitter-followers-in-telugu

అందుకే నేను గతాన్ని మార్చుకోవాలనుకోను!

తెలుగు చిత్ర సీమకు సంబంధించి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది అనుష్క. గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే, నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు పూర్తి న్యాయం చేస్తోందీ అందాల తార. అందం, అభినయంతో దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకులతో సమానంగా స్టార్ స్టేటస్‌ సొంతం చేసుకున్న ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే తదితరులు నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీలో మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడే యువతిగా మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది అనుష్క. ఈ సందర్భంగా ఇటీవల ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన ఆమె #AskAnushka అంటూ తొలిసారిగా అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. మరి అనుష్క, అభిమానుల మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kriti-sanon-shares-hard-hitting-notes-on-hathras-rape-case

అలా చేయకపోతే మగాడే కాదని వాళ్లకు నేర్పించండి..!

ఆడపిల్లల భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తించింది హథ్రాస్‌ హత్యాచార ఘటన. నలుగురు దుర్మార్గుల చేతుల్లో ఓ అభాగ్యురాలు బలైపోయిన తీరు, ఆ తర్వాతి పరిణామాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ముక్తకంఠంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ స్పందించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ఆమె... ఇంటి నుంచే మార్పు మొదలైతేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటూ అందులో చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
ileana-shares-a-breathtaking-picture-in-a-bikini-talks-about-body-positivity

నా అందం నాదే.. ప్రపంచం ఏమనుకుంటే నాకేమిటి?

‘చూడడానికి పాలరాతి శిల్పంలా తెల్లగా ఉండాలి.. పొడవైన వెంట్రుకలు ఉండాలి.. కనీసం ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గట్లు చక్కని కొలతలు గల శరీర సౌష్టవం ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అమ్మాయిల అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు కొందరు అమ్మాయిలు. అదే సమయంలో వారిని ఉద్దేశిస్తూ ఎదుటివారు చేసే విమర్శలు, కామెంట్లతో వారు మరింత మానసిక క్షోభకు గురవుతుంటారు. సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలా ‘అందమంటే ఇదే’ అని సమాజంలో పేరుకుపోయిన కొన్ని మూసకట్టు ప్రమా18:58:41ణాల కారణంగా తానూ తీవ్ర ఆందోళనకు గురయ్యానంటోంది ఇలియానా. ఈ క్రమంలో తన శరీర సౌష్టవం, బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టా వేదికగా ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
anushka-sharma-pens-an-emotional-note-on-privilege-of-a-male-child
women icon@teamvasundhara
rashmika-mandana-shares-a-glimpse-of-her-beach-workout

ఈ బీచ్‌ వర్కవుట్‌కు బాగా అలవాటు పడిపోయాను!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్‌ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
tollywood-actress-ramyakrishnan-turns-50-in-telugu
women icon@teamvasundhara
lavanya-tripathi-chitchat-with-insta-fans

కరోనా లాంటి వైరస్‌లు ఇంకెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నా!

లావణ్యా త్రిపాఠి... పేరుకు తగ్గట్టే అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించుకుంది. ‘దూసుకెళ్తా’, భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అంతరిక్షం’, ‘అర్జున్‌ సురవరం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకునే ఈ సొగసరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఈ అందాల తారకు, ఫ్యాన్స్కు మధ్య జరిగిన సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-about-casting-couch-in-film-industry-in-telugu

అలాంటి పాములు నన్నూ కాటేయాలనుకున్నాయి..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇక యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు అతనిలాగే తాము కూడా ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా సమీరా రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
samantha-sharing-gardening-tips-and-narrating-how-to-plant-seeds

అవి మన పిల్లల్లాంటివి... అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకుందాం!

ప్రస్తుతం గార్డెనింగ్‌లో తెగ బిజీ అయిపోయింది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. కరోనా ప్రతికూల పరిస్థితులు తనకు జీవితం విలువ తెలియజేశాయని, అవే తనను గార్డెనింగ్‌ వైపు పురికొల్పాయని గతంలో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో చెప్పుకొచ్చిన సామ్‌.. ఇక అప్పట్నుంచి మొక్కల్నే తన కన్న పిల్లలుగా చూసుకుంటోంది. ఇలా తన ఆహారాన్ని తాను పండించుకునే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులు, చిట్కాలను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతోందీ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తాజాగా మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చిందీ టాలీవుడ్‌ అందం. విత్తనాల్ని ఎలా విత్తుకోవాలి?, ఈ క్రమంలో పాటించాల్సిన నియమాలేంటి? తదితర విషయాలన్నీ తాజా ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా పంచుకుంది సమంత.

Know More

women icon@teamvasundhara
akkineni-samantha-chit-chat-with-fans-in-twitter-in-telugu

ఆ సీక్రెట్ ఇప్పుడే తెలిసింది!

సమంత... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్‌, హెల్త్‌ టిప్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తికే ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇంట్లోనే ఆహారాన్ని పండిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించే సామ్‌... తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. ట్విట్టర్‌ వేదికగా ‘#AskSam’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
keerthy-suresh-special-photo-shoot-on-onam-in-telugu

ఓనమ్ వేడుకల్లో ‘మహానటి’ ఎలా మెరిసిపోతోందో చూడండి!

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ ఎంత ప్రీతిపాత్రమో... మలయాళీలకు ‘ఓనమ్’ అంతే ప్రత్యేకం. కేరళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండగను అక్కడి ప్రజలు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఇక ఈ పండగ వచ్చిందంటే చాలు...కేరళ కుట్టీల హడావిడి మామూలుగా ఉండదు. తెల్లటి దుస్తుల్లో సంప్రదాయబద్ధంగా ముస్తాబై మెరిసిపోతుంటారు. ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో ‘ఓనమ్’ పండగను పురస్కరించుకుని కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది ‘మహానటి’ కీర్తి సురేశ్‌. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దిగిన ఫొటోలతో పాటు, కీర్తి ప్రత్యేకంగా దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
nikki-galrani-recovers-from-covid-19-urges-people-to-get-tested-if-they-show-symptoms

'కరోనా మనల్ని ఏం చేస్తుందిలే ' అనుకోవద్దు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రస్తుతం మనదేశంలోనూ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజుకు లక్షకు దగ్గరగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా సోకి కోలుకున్న బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక వైరస్‌ను జయించిన సెలబ్రిటీలు కూడా తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటి నిక్కీ గల్రానీ కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను ఓ వీడియో రూపంలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
genelia-dsouza-reveals-she-tested-positive-for-covid-19-three-weeks-ago-is-negative-now

కరోనా వచ్చి పోయింది.. కానీ ఆ మూడు వారాలు మూడు యుగాలయ్యాయి!

ఒంటరితనం.. కరోనా వచ్చాకే చాలామందికి దీని అసలైన అర్థమేంటో తెలిసింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు, వృత్తిరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటూ మరికొందరు.. ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మారిపోతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు రోజుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌తో వివాహం తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ.. ఇద్దరు కొడుకులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే ఇలా హ్యాపీగా ఉన్న సమయంలోనే కరోనా వల్ల తన కుటుంబానికి మూడు వారాల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More