scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనాతో క్షణాల్లో వారి ఆరోగ్యం క్షీణించడం కళ్లారా చూశాను!'

'సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!'

Know More

Movie Masala

 
category logo

అందుకే మన కీర్తి ‘మహానటి’ అయింది!

Interesting Facts About Keerthy Suresh On Her Birthday Special in Telugu

‘మహా నటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తన వైపు తిప్పుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమాలో అలనాటి అందాల తార ‘సావిత్రి’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు ‘జాతీయ ఉత్తమ నటి’ పురస్కారం అందుకుంది. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చుకునే ఈ ముద్దుగుమ్మ ఇటు కమర్షియల్‌ సినిమాలతో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనూ నటిస్తోంది. ఇలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 17). ఈ సందర్భంగా ఆ అందాల కథానాయిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


బాలనటిగా అరంగేట్రం..!
కీర్తి 1992, అక్టోబర్ 17న మలయాళ నిర్మాత సురేష్ కుమార్, తమిళ నటి మేనక దంపతులకు జన్మించింది. తనకు రేవతి సురేష్ అనే ఓ అక్క కూడా ఉంది. కీర్తి బాల్యం, చదువంతా చెన్నైలోనే సాగింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే తన తండ్రి ప్రొడక్షన్‌లో కీర్తి బాలనటిగా మూడు మలయాళ చిత్రాల్లో నటించింది. తను హీరోయిన్‌గా నటించిన తొలిచిత్రం ‘గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’ సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె అనతికాలంలోనే మలయాళం, తమిళ, తెలుగు పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడాలని..
ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన కీర్తికి సినిమాల్లోకి రాక ముందు ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడాలనుండేదట. భవిష్యత్తులో ఎప్పటికైనా సొంతంగా ఒక బొటిక్‌ను ప్రారంభిస్తానని కీర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇటీవల తను సొంతంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని ట్విట్టర్ లో షేర్‌ చేసిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


ఆ సినిమా అంతటి ‘కీర్తి’ని తెచ్చిపెట్టింది!
‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్ర కోసం ముందు చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ, చివరికి ఆ సువర్ణావకాశం కీర్తిని వరించింది. ‘తొడరి’ (తెలుగులో ‘రైల్‌’) అనే తమిళ సినిమాలోని ఒక పాట చిత్రీకరణలో కీర్తిని చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ తనను ఎంపిక చేశాడు. కానీ, ఈ పాత్రలో నటించడానికి మొదట కీర్తి అంగీకరించలేదు. ‘సావిత్రి పాత్రా..? అంత గొప్ప పాత్రలో నటించడానికి నేను అర్హురాలినా..? ఒకవేళ నటించినా తెరపై ఆమెను మరిపించగలనా..? పాత్రలో పూర్తిగా లీనం కాగలనా..? ఇలా నా మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. కానీ ‘నో’ అన్న నాతోనే ‘యస్’ అనేలా చేశాడు నాగ్ అశ్విన్. ఆ క్షణం నుంచి కీర్తిలా ఉన్న నేను సావిత్రిలా మారిపోయా..! ‘మహానటి’ చిత్రం విడుదల తర్వాత ఓ సారి గుంటూరుకు వెళ్లాను. అక్కడ ఓ పెద్దాయన నా దగ్గరకు వచ్చి ‘మీరు సావిత్రి గారే కదా..?' అని అడిగారు. ‘నేను సావిత్రి గారిని కాదండీ, ఆ పాత్రలో నటించాను’ అని చెప్పా. ‘లేదు.. మీరు సావిత్రి గారే..!’ అన్నారు. ఈ సినిమా నాకు అంతటి కీర్తిని తెచ్చిపెట్టింది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ తార.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


యాక్టరే కాదు సింగర్ కూడా..!
నటనతో పాటు అద్భుతమైన గాత్రంతోనూ ప్రేక్షకులను అలరించే ఈతరం నటీమణుల్లో కీర్తి కూడా ఒకరు. తను నటించిన తమిళ సినిమా ‘సామీ స్క్వేర్’ అనే చిత్రంలో కీర్తి ఓ పాట కూడా పాడడం విశేషం. కీర్తికి సింగింగ్‌తో పాటు స్విమ్మింగ్ పట్ల కూడా ఆసక్తి ఎక్కువే. చిన్నతనంలో తన ఇంటి దగ్గరున్న ఓ శిక్షణ కేంద్రంలో స్విమ్మింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుందట. పాఠశాల, కళాశాలలో జరిగే నృత్య, నటనా ప్రదర్శనల్లోనూ చురుకుగా పాల్గొనేదట. అలాగని ఆమె చదువులో వెనకపడలేదు.. అందులోనూ ముందే ఉండేదట! అలాగే వయొలిన్‌ చక్కగా వాయించే ఈ అందాల తార లాక్‌డౌన్‌లో ఆ కళకు మరింత పదును పెట్టిందట.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


తెర వెనుకా ‘సావిత్రమ్మే’..!
'మహానటి' చిత్రం కీర్తిని ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. తన సినిమా కెరీర్‌ను 'మహానటి'లో నటించడానికి ముందు, నటించిన తర్వాత అని చెప్పేలా ఆ సినిమా కీర్తికి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా కోసం కీర్తి సావిత్రిలా కనిపించడానికి చాలా హోమ్‌వర్క్ చేసింది. సావిత్రి అలవాట్లు, అభిరుచులతో పాటు.. ఆమె షూటింగ్స్‌లో ఎలా ఉండేవారు, నిజ జీవితంలో తోటివారితో ఎలా ప్రవర్తించేవారు.. మొదలైన విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది కీర్తి. పూర్వం సావిత్రి సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక తన రెమ్యునరేషన్‌లో నుండి కొంత డబ్బును తీసి సెట్‌లో తనతో పాటు పని చేసిన వాళ్లందరికీ పంచి పెట్టేవారు. ఈ క్రమంలో కీర్తి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవడం మొదలుపెట్టింది. ‘మహానటి’, ‘సందకోడి 2’ సినిమాల చిత్రీకరణ చివరి రోజున సినిమాలో తనతో పాటు పని చేసిన వారందరికీ 5 నుండి 10 గ్రాముల వరకు బరువుండే బంగారు నాణాల్ని కానుకగా ఇచ్చింది కీర్తి. మహానటి సావిత్రి ప్రభావం కీర్తిపై ఉందని చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే..!

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


ఛాలెంజింగ్‌ రోల్స్‌కు ‘సై’ అంటూ!
అంతర్జాతీయంగా విజయం అందుకున్న ‘మహానటి’ నుంచి కీర్తి సురేశ్‌ పాత్రల ఎంపికలో చాలా మార్పులు వచ్చాయి. కమర్షియల్‌ పాత్రలకు సై అంటూనే సవాలుతో కూడుకున్న స్క్రిప్టుల్ని ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా ‘సీమరాజా’ ఫ్లాష్‌బ్యాక్‌లో మహారాణిగా కనిపించింది కీర్తి. లాక్‌డౌన్లో విడుదలైన ‘పెంగ్విన్‌’ భారాన్ని పూర్తిగా తన భుజాలపై మోసింది. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’లోనూ కీర్తి విభిన్న పాత్రలో అలరించనుంది. ఈ సినిమా కోసం క్లాసికల్‌ మ్యూజిక్‌ కూడా నేర్చుకుంది. ఇందులో ఆమె చైనాకు చెందిన నటుడి ప్రేయసిగా నటిస్తోంది. మరో పక్క తమిళ హిట్‌ ‘వేదాలం’ తెలుగులో రీమేక్‌ కానుంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనికి గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే.. ఆమె ఖాతాలో మరో ప్రత్యేక పాత్ర చేరినట్లే. త్వరలో రాబోతున్న ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ సినిమాల్లోని పాత్రలు కూడా ఈ కోవకు చెందినవే.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


సన్నజాజి తీగలా మారి!
సినిమా కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే కీర్తి ఇటీవల సన్నజాజి తీగలా మారిపోయింది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆమె క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఫిట్‌గా తయారయ్యింది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


‘వసంత కోకిల’లో శ్రీదేవి, ‘క్వీన్‌’లో కంగన, ‘కహానీ’లో విద్యా బాలన్ పోషించిన రోల్స్‌ అంటే కీర్తి సురేశ్‌కు ఎంతో ఇష్టం. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని పలు సందర్భాల్లో వెల్లడించింది. ఆమె విజయ్‌కు వీరాభిమాని. ఆయనతో కలిసి ‘భైరవ’లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


అరుదైన అవార్డులు!
గతేడాది 66వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో ‘మహానటి’ చిత్రానికి గాను కీర్తి ‘ఉత్తమ నటి’గా అవార్డు గెలుచుకుంది. 1990లో విజయశాంతి (‘కర్తవ్యం’) తర్వాత ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు సినిమా తార కీర్తే కావడం విశేషం. దీంతో పాటు జీ సినీ అవార్డులు, సౌత్‌ ఇండియన్ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డులు, ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్బోర్న్‌ తదితర వేడుకల్లోనూ ఉత్తమ నటిగా పలు అవార్డులు సొంతం చేసుకుందీ సొగసరి.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


ప్రస్తుతం కీర్తిసురేశ్‌ తెలుగులో తెరకెక్కుతున్న ‘రంగ్‌దే’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో విడుదల కావాల్సిన ‘మరక్కర’ సినిమా వాయిదా పడింది. మరోపక్క కీర్తి సురేశ్‌ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ‘అన్నాత్తే’లో నటిస్తోంది. దీంతో పాటు మహేశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’లో కూడా ఆమే హీరోయిన్.


విలక్షణమైన పాత్రలతో సినీ అభిమానులను అలరిస్తున్న కీర్తి నేటితో 28వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మనమూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం!
హ్యాపీ బర్త్‌ డే కీర్తి!





women icon@teamvasundhara
bhumi-pednekar-flunked-film-school-had-rs-13-lakh-loan-on-her-head-when-she-started-out

ఆ కోర్సులో చేరడానికి 13 లక్షల లోన్‌ తీసుకున్నా!

ఎవరైనా తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నప్పుడు...తను సాధించిన విజయమే పైకి కనిపిస్తుంది తప్ప.. ఆ గెలుపును చేరుకోవడానికి వాళ్లు పడిన కష్టాలు, కన్నీళ్లు, చేసిన ప్రయత్నాలు ఎవరికీ కనిపించవు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతోన్న ఎంతోమంది తారలు తమ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఛీత్కారాలు ఎదుర్కొన్న వారే..! ఈక్రమంలో తన జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లున్నాయంటోందీ బాలీవుడ్‌ అందాల తార భూమీ పెడ్నేకర్‌. తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదంటోన్న భూమి.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
actress-fatima-sana-shaikh-reveals-she-was-molested-as-a-3-year-old

మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా!

ఏ రంగంలోనైనా ఉద్యోగానికి ప్రతిభే కొలమానం అన్న సంగతి తెలిసిందే! కానీ చిత్రపరిశ్రమలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే నెపోటిజం (బంధుప్రీతి), క్యాస్టింగ్‌ కౌచ్‌ ముఖ్యమని పలు సందర్భాల్లో కొంతమంది తారలు వెల్లడించిన విషయాలు, వారి అనుభవాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌. ‘దంగల్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిన్నది.. సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డానని, ముక్కుపచ్చలారని వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వేధింపులు మహిళలకు ప్రతి రంగంలోనూ ఎదురవుతున్నాయని, దీంతో వారు నిత్యం నరకం అనుభవిస్తున్నారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
poonam-bajwa-introduced-her-soulmate-in-telugu

నీతో ప్రతిక్షణం ఓ మ్యాజిక్‌లా ఉంటుంది!

‘హలో బాసు..మహా క్లాసు’ అంటూ ‘బాస్‌’ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుంది పూనమ్‌ బజ్వా. 15 ఏళ్ల క్రితం ‘మొదటి సినిమా’తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘బాస్‌’ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈక్రమంలో తాజాగా అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన ఆమె.. వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-agarwal-pre-wedding-festivities-begin-in-telugu

‘చందమామ’ పెళ్లి సందడి మొదలైపోయింది!

టాలీవుడ్‌ పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో (అక్టోబర్‌ 30) ఈ చందమామ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడవనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనున్న ఈ అందాల తారకు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-shares-what-her-mom-said-to-her-when-she-won-miss-world-pageant

కంగ్రాట్స్ చెప్పకుండా ‘బేబీ.. నీ చదువు సంగతేంటి’? అనడిగింది!

మిస్‌ వరల్డ్‌... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది బాలీవుడ్‌ అందాల తార ప్రియాంకా చోప్రా. ఈ ముద్దుగుమ్మ ఈ కిరీటం గెలుచుకుని రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈక్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్‌లు షేర్‌ చేస్తోంది ప్రియాంక.

Know More

women icon@teamvasundhara
alia-bhatt-shares-a-post-on-self-appreciation-in-telugu

సోషల్ మీడియాలో ఉండేది ‘నిజమైన మనం’ కాదు!

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఈ సంఘటనతో సోషల్‌ మీడియా వేదికగా ఇండస్ట్రీలోని బంధుప్రీతి, లాబీయింగ్, లైంగిక వేధింపులు వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇదే సమయంలో మహేశ్‌భట్‌ కుమార్తెగా అలియా భట్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఇప్పటివరకు తనపై వచ్చిన విమర్శలకు స్పందించని అలియా తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ షేర్ చేసింది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియాలో తనపై విమర్శలు చేసేవాళ్లని ఉద్దేశిస్తూ ఓ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
rani-mukerji-reveals-her-and-adira-plans-for-durga-puja-at-home

ఈసారి దసరా సరదాల్ని మిస్సవుతున్నాం!

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో బోలెడన్ని సరదాల్ని తీసుకొస్తుంది ‘దసరా’ పండగ. దేశవ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రుల పేరుతో వైభవంగా జరుపుకొనే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాల్లో కొలుస్తుంటారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన ‘విజయదశమి’ నాడు అసలు సిసలైన పండగ హడావిడి ఉంటుంది. మరి, ఇలా ఎన్నో సరదాల్ని, మధురానుభూతుల్ని అందించే ఈ పర్వదినాన్ని కరోనా పడగ కింద ఎంతో జాగ్రత్తగా జరుపుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాము కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండగను సెలబ్రేట్‌ చేసుకుంటామంటోంది బాలీవుడ్‌ అందాల తార రాణీ ముఖర్జీ. ఈ సందర్భంగా పండగకు సంబంధించి తన ప్రణాళికలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
saipallavi-puts-mehendi-on-kids-from-uttar-pradesh

మన భానుమతి మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది!

సాయిపల్లవి... సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టినా, ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసినా, ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసినా... అది నేచురల్ బ్యూటీ సాయి పల్లవికే చెల్లింది. డాక్టర్ కాబోయి యాక్టర్‌ అయిన ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది. రీల్ లైఫ్లో ఎంతో సింపుల్‌గా, సరదాగా కనిపించే సాయి పల్లవి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి వెళ్లిన ‘మలర్’ సడన్గా మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది. అక్కడి చిన్నారుల చేతులను అద్భుతమైన మెహందీ డిజైన్లతో నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

Know More

women icon@teamvasundhara
varalaxmi-sarathkumar-turns-director-celebrities-pour-in-best-wishes

ఫైనల్‌గా కొత్త అవతారంలోకి అడుగు పెడుతున్నాను!

పురుషాధిక్యత ఉన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు కూడా పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. కేవలం నటీమణులుగానే కాకుండా... దర్శకులుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఈ తరం హీరోయిన్లలో అనుష్కాశర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె... తదితరులు ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థలను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. మరికొందరు మెగాఫోన్ పట్టి డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తన నటనతో ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారింది. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-opens-about-her-goa-tour-and-online-trolls

గోవా బీచ్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే కాస్త ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అందుకే సెలబ్రిటీలందరూ బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని సమయం దొరికినప్పుడల్లా ఔటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి తన పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లింది. తన ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి అక్కడ తన జన్మదిన వేడుకలు జరుపుకొంది. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో ఈ ప్రయాణం చాలా అసౌకర్యంగా సాగిందంటూ తన గోవా టూర్‌కు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుందీ మంచు వారి వారసురాలు.

Know More

women icon@teamvasundhara
namrata-shirodkar-shares-30-days-positivity-plan-on-world-mental-health-day

౩౦ రోజుల్లో మానసిక ఆరోగ్యం.. నమ్రత పాజిటివ్ ప్లాన్ చూశారా?

జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏటా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ (అక్టోబర్ 10) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమస్యలపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు తానెలాంటి పనులు చేస్తున్నానో సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది ప్రిన్స్‌ మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్.

Know More

women icon@teamvasundhara
jai-ho-actress-quits-showbiz-pens-a-note-on-social-media

women icon@teamvasundhara
samantha-adorable-anniversary-wishes-to-chaitanya-wins-hearts-in-telugu

women icon@teamvasundhara
sonam-kapoor-shared-what-she-eats-for-her-breakfast-which-helps-her-deal-with-pcos

అప్పట్నుంచీ ఇదే నా బ్రేక్‌ఫాస్ట్!

పీసీఓఎస్‌.. ఇది ఒక్కసారి మన జీవితంలోకి అడుగుపెట్టిందంటే.. అదుపు చేసుకోవడమే తప్ప.. దాన్ని వదిలించుకోవడమనేది అసాధ్యం! మరి, ఈ సమస్యను అదుపు చేసుకోవాలంటే ముఖ్యంగా మన ఆహారపుటలవాట్లను అదుపులో పెట్టుకోవాలి.. అనారోగ్యకరమైన జీవనశైలికి దూరంగా ఉండాలి.. ఇదే విషయం చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. తాను గత కొన్నేళ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని, ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా, ఎందరు డాక్టర్లను కలిసినా సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ ఇటీవలే ఓ వీడియోలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అయితే పోషకాహార నిపుణుల సలహా మేరకు చక్కటి ఆహార నియమాలు పాటించడం వల్లే ప్రస్తుతం తనకు పీసీఓఎస్‌ అదుపులో ఉందన్న సోనమ్‌.. అందుకు తాను తీసుకుంటోన్న అల్పాహారమేంటో తాజాగా మరో వీడియోలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-aggarwal-announces-about-her-marriage-in-telugu

మేమిద్దరం ఆ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!

కాజల్‌ అగర్వాల్‌... సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పుష్కర కాలం దాటిపోతున్నా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌. 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్థానం సంపాదించింది. అందం, అభినయానికి తోడు క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల తార పెళ్లి ముహూర్తం తాజాగా ఫిక్సయింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఈ నెల 30న ఏడడుగులు నడవనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ స్టార్‌ హీరోయిన్‌. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
actress-anushka-chitchat-with-twitter-followers-in-telugu

అందుకే నేను గతాన్ని మార్చుకోవాలనుకోను!

తెలుగు చిత్ర సీమకు సంబంధించి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది అనుష్క. గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే, నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు పూర్తి న్యాయం చేస్తోందీ అందాల తార. అందం, అభినయంతో దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకులతో సమానంగా స్టార్ స్టేటస్‌ సొంతం చేసుకున్న ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే తదితరులు నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీలో మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడే యువతిగా మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది అనుష్క. ఈ సందర్భంగా ఇటీవల ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన ఆమె #AskAnushka అంటూ తొలిసారిగా అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. మరి అనుష్క, అభిమానుల మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kriti-sanon-shares-hard-hitting-notes-on-hathras-rape-case

అలా చేయకపోతే మగాడే కాదని వాళ్లకు నేర్పించండి..!

ఆడపిల్లల భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తించింది హథ్రాస్‌ హత్యాచార ఘటన. నలుగురు దుర్మార్గుల చేతుల్లో ఓ అభాగ్యురాలు బలైపోయిన తీరు, ఆ తర్వాతి పరిణామాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ముక్తకంఠంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ స్పందించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ఆమె... ఇంటి నుంచే మార్పు మొదలైతేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటూ అందులో చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
ileana-shares-a-breathtaking-picture-in-a-bikini-talks-about-body-positivity

నా అందం నాదే.. ప్రపంచం ఏమనుకుంటే నాకేమిటి?

‘చూడడానికి పాలరాతి శిల్పంలా తెల్లగా ఉండాలి.. పొడవైన వెంట్రుకలు ఉండాలి.. కనీసం ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గట్లు చక్కని కొలతలు గల శరీర సౌష్టవం ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అమ్మాయిల అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు కొందరు అమ్మాయిలు. అదే సమయంలో వారిని ఉద్దేశిస్తూ ఎదుటివారు చేసే విమర్శలు, కామెంట్లతో వారు మరింత మానసిక క్షోభకు గురవుతుంటారు. సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలా ‘అందమంటే ఇదే’ అని సమాజంలో పేరుకుపోయిన కొన్ని మూసకట్టు ప్రమా18:58:41ణాల కారణంగా తానూ తీవ్ర ఆందోళనకు గురయ్యానంటోంది ఇలియానా. ఈ క్రమంలో తన శరీర సౌష్టవం, బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టా వేదికగా ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
rashmika-mandana-shares-a-glimpse-of-her-beach-workout

ఈ బీచ్‌ వర్కవుట్‌కు బాగా అలవాటు పడిపోయాను!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్‌ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
lavanya-tripathi-chitchat-with-insta-fans

కరోనా లాంటి వైరస్‌లు ఇంకెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నా!

లావణ్యా త్రిపాఠి... పేరుకు తగ్గట్టే అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించుకుంది. ‘దూసుకెళ్తా’, భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అంతరిక్షం’, ‘అర్జున్‌ సురవరం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకునే ఈ సొగసరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఈ అందాల తారకు, ఫ్యాన్స్కు మధ్య జరిగిన సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-about-casting-couch-in-film-industry-in-telugu

అలాంటి పాములు నన్నూ కాటేయాలనుకున్నాయి..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఇక యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు అతనిలాగే తాము కూడా ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా సమీరా రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి తన అనుభవాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
samantha-sharing-gardening-tips-and-narrating-how-to-plant-seeds

అవి మన పిల్లల్లాంటివి... అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకుందాం!

ప్రస్తుతం గార్డెనింగ్‌లో తెగ బిజీ అయిపోయింది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. కరోనా ప్రతికూల పరిస్థితులు తనకు జీవితం విలువ తెలియజేశాయని, అవే తనను గార్డెనింగ్‌ వైపు పురికొల్పాయని గతంలో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో చెప్పుకొచ్చిన సామ్‌.. ఇక అప్పట్నుంచి మొక్కల్నే తన కన్న పిల్లలుగా చూసుకుంటోంది. ఇలా తన ఆహారాన్ని తాను పండించుకునే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులు, చిట్కాలను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతోందీ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తాజాగా మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చిందీ టాలీవుడ్‌ అందం. విత్తనాల్ని ఎలా విత్తుకోవాలి?, ఈ క్రమంలో పాటించాల్సిన నియమాలేంటి? తదితర విషయాలన్నీ తాజా ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా పంచుకుంది సమంత.

Know More

women icon@teamvasundhara
akkineni-samantha-chit-chat-with-fans-in-twitter-in-telugu

ఆ సీక్రెట్ ఇప్పుడే తెలిసింది!

సమంత... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్‌, హెల్త్‌ టిప్స్‌, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తికే ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇంట్లోనే ఆహారాన్ని పండిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించే సామ్‌... తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. ట్విట్టర్‌ వేదికగా ‘#AskSam’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
keerthy-suresh-special-photo-shoot-on-onam-in-telugu

ఓనమ్ వేడుకల్లో ‘మహానటి’ ఎలా మెరిసిపోతోందో చూడండి!

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ ఎంత ప్రీతిపాత్రమో... మలయాళీలకు ‘ఓనమ్’ అంతే ప్రత్యేకం. కేరళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండగను అక్కడి ప్రజలు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఇక ఈ పండగ వచ్చిందంటే చాలు...కేరళ కుట్టీల హడావిడి మామూలుగా ఉండదు. తెల్లటి దుస్తుల్లో సంప్రదాయబద్ధంగా ముస్తాబై మెరిసిపోతుంటారు. ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో ‘ఓనమ్’ పండగను పురస్కరించుకుని కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది ‘మహానటి’ కీర్తి సురేశ్‌. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దిగిన ఫొటోలతో పాటు, కీర్తి ప్రత్యేకంగా దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
nikki-galrani-recovers-from-covid-19-urges-people-to-get-tested-if-they-show-symptoms

'కరోనా మనల్ని ఏం చేస్తుందిలే ' అనుకోవద్దు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రస్తుతం మనదేశంలోనూ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజుకు లక్షకు దగ్గరగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా సోకి కోలుకున్న బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక వైరస్‌ను జయించిన సెలబ్రిటీలు కూడా తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటి నిక్కీ గల్రానీ కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను ఓ వీడియో రూపంలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
genelia-dsouza-reveals-she-tested-positive-for-covid-19-three-weeks-ago-is-negative-now

కరోనా వచ్చి పోయింది.. కానీ ఆ మూడు వారాలు మూడు యుగాలయ్యాయి!

ఒంటరితనం.. కరోనా వచ్చాకే చాలామందికి దీని అసలైన అర్థమేంటో తెలిసింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు, వృత్తిరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటూ మరికొందరు.. ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మారిపోతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు రోజుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌తో వివాహం తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ.. ఇద్దరు కొడుకులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. అయితే ఇలా హ్యాపీగా ఉన్న సమయంలోనే కరోనా వల్ల తన కుటుంబానికి మూడు వారాల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
akkineni-samantha-chitchat-with-fans-in-instagram-in-telugu

2017 నుంచే నేను గర్భంతో ఉన్నాననుకుంటున్నా!

ఓ వైపు సినిమాలతో మాయ చేస్తూ.. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే నటీమణుల్లో అక్కినేని సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Ask me anything’ అంటూ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
janhvi-says-criticism-is-an-opportunity-to-better-herself-in-telugu

అమ్మ ఇప్పుడు ఉంటే అవి చూసి మురిసిపోయేది!

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా పలువురు సెలబ్రిటీలపై విమర్శలు రావడం సహజమే. ఈ క్రమంలో శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌ కూడా తన డ్రస్సింగ్‌, సినిమాలు, ఇతర విషయాల్లో అప్పుడప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉంది. ఆమె నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా విడుదలై కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో- తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను ఎలా సానుకూలంగా మార్చుకుంటుందో జాన్వీ ఓ సందర్భంలో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
krishna-and-his-leela-actress-shalini-weds-manoj-in-telugu

women icon@teamvasundhara
bipasha-basu-on-taking-a-break-after-marrying-karan-singh-grover-in-telugu

భర్తలు అలా చేస్తే చాలు.. భార్యలు ప్రేమ నింపేసుకుంటారు!

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది బిపాసా బసు. హిందీ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, హాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల తార 2016లో సహనటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోన్న బిపాసా ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం ‘డేంజరస్’. బిపాసా తన భర్తతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ..

Know More

women icon@teamvasundhara
samantha-flags-off-growwithme-challenge-nominates-manchu-lakshmi-and-rakul-preet

కుండ, మట్టి, ఖాళీ పాల ప్యాకెట్‌తో రడీగా ఉండండి!

సమంత... విలక్షణమైన పాత్రల్లో సిల్వర్‌ స్ర్కీన్‌పై సందడి చేసే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన బ్యూటీ సీక్రెట్స్, హెల్త్‌ టిప్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. ఇక లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంటికే పరిమితమైన సామ్‌ ఓ సరికొత్త పని కూడా నేర్చుకుంది. అదేనండీ...గార్డెనింగ్‌! ఈ మధ్య తాను ఇంటి మేడ పైనే కాయగూరలు, ఆకుకూరలు పండించడం తన సోషల్‌ మీడియా ఫొటోల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ బ్యూటీ #GrowWithMe పేరుతో ఓ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.

Know More