మాధురీ దీక్షిత్... సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో వెండితెర రాణిగా ఓ వెలుగు వెలిగిందీ తార. మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘టోటల్ ఢమాల్’, ‘కళంక్’ వంటి సినిమాలతో మరోసారి తన నటనా ప్రతిభను చాటుకుంది. అలాంటి మాధురి తొలిసారి హీరోయిన్గా నటించిన చిత్రం ‘అబోధ్’. 1984లో విడుదలైన ఈ చిత్రం ఇటీవల 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మాధురి ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #Askmd అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా చేసిన ఈ ఆన్లైన్ ఛాటింగ్‌లో తన 36 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...
బాలీవుడ్లో 36 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్! తొలిసారిగా సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎలా అనిపించింది?
1984లో విడుదలైన ‘అబోధ్’ నా మొదటి చిత్రం. ఆ సినిమా షూట్‌కు హాజరవుతున్నప్పుడు అంతా ఓ కలగా అనిపించింది.
మేడమ్! మీకు ఇష్టమైన పెర్ప్యూమ్?
పువ్వుల్లా పరిమళాలనిచ్చే ఏ పెర్ఫ్యూమ్ అయినా నాకిష్టమే!
మీరు నటించిన పాటల్లో మీకు చాలా ఇష్టమైన సాంగ్ ?(ఏదో ఒక్కటే చెప్పాలి)
ఇది చాలా కష్టమైన ప్రశ్న. అలా చెప్పాలంటే నాకు ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన ‘ఏక్, దో, తీన్’ సాంగ్ అంటే చాలా ఇష్టం.
‘అబోధ్’ సినిమాలో నటిస్తున్నప్పుడు అసలు ఇంత క్రేజ్ వస్తుందని ఊహించారా?
వెల్...! ఈ (అబోధ్) సినిమాలో నటిస్తున్నప్పుడు కూడా ఊహించలేదు... నేను అసలు సినిమాల్లోకి వస్తానని.(నవ్వుతూ)
మీరు నటించిన చిత్రాల్లో మీ ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా?
‘హమ్ ఆప్ కే హై కౌన్’.
నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు మీరెలా వాటి నుంచి బయటపడతారు?
నాకు నచ్చిన పాటలు వింటాను. అది నాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.
డ్యాన్స్ స్టేజి పైకి వెళ్లేముందు మనసులో ఏమైనా కోరుకుంటారా?
నేను ఏ స్టేజి ఎక్కినా ముందు ‘నమస్కారం’ పెడతాను.
షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాల్లో మీకిష్టమైన సినిమా?
‘బాజీగర్’, ‘డీడీఎల్జే’, ‘చక్ దే ఇండియా’ తో పాటు మేమిద్దరం జంటగా నటించిన సినిమాలన్నీ నాకిష్టం. (నవ్వుతూ)
సినిమాల్లోకి రాకపోయి ఉంటే మీరేం చేసేవారు?
జెనెటిక్స్ రంగంలో రీసెర్చ్ చేసేదాన్నేమో!
మీకిష్టమైన హాలిడే స్పాట్ ?
నాకు సముద్రపు ఒడ్డున సేదతీరడం అంటే చాలా ఇష్టం.
సినిమా షూటింగ్‌ల నుంచి విశ్రాంతి దొరికినప్పుడు మీరు అమితంగా ఆడే గేమ్?
నేను టేబుల్ టెన్నిస్ బాగా ఆడతాను. ఊటీ లాంటి ఔట్ డౌర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కూడా ఈ గేమ్‌ను ఆడుతుంటాను.
మేడమ్! 36 ఏళ్లుగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మూడు మధురమైన జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకోండి?
నా మొదటి చిత్రం, నేను పెళ్లిచేసుకున్న సందర్భం, నాకు పిల్లలు పుట్టినప్పుడు.
మీ 36 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఒక్క మాటలో వర్ణించమంటే ఏం చెబుతారు?
ఒక థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపిస్తోంది...
ఇండియాలో మీకు ఇష్టమైన వెకేషన్ ప్లేస్?
గోవా సముద్ర తీరం.
సైక్లింగ్, స్కూబా డైవింగ్ కాకుండా మీ భర్తతో కలిసి ఆడిన మరో ఆట ?
సర్ఫింగ్.
మీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలు చాలానే చేశారు? ఇంకా మీ డ్రీమ్ రోల్ అంటూ ఏమైనా ఉందా?
తక్కువైనా, ఎక్కువైనా ఇప్పటివరకు అన్ని రకాల పాత్రలు చేశాననే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? (నవ్వుతూ).
మిమ్మల్ని మళ్లీ స్ర్కీన్ మీద చూడాలనుకుంటున్నాం. ఈ అవకాశం మాకెప్పుడు కల్పిస్తారు?అదేవిధంగా మీరు నిర్మిస్తోన్న ‘పంఛక్’ ఎప్పుడు విడుదలవుతుంది?
మీలాగే ‘పంఛక్’ సినిమా విడుదల కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఓ గుడ్ న్యూస్‌తో మీ ముందుకు వస్తాను.