scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి? మీరే చెప్పండి!'

'ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒక అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు ఒకటే కావడం వల్ల, ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడుతున్నారా? లేక కేవలం ఆకర్షణతోనే ఒక్కటవుతున్నారా? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !'

Know More

Movie Masala

 
category logo

నా కథను ఇంత అద్భుతంగా రాసినందుకు ధన్యవాదాలమ్మా..!

Here are the Mother's day wishes from our celebrities

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఈసారి ప్రజలు మాతృ దినోత్సవ వేడుకలను తమ ఇళ్లలోనే జరుపుకొన్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చాలామందికి తమ తల్లులను స్వయంగా వెళ్లి కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో ఫోన్‌, వీడియో కాల్స్‌ ద్వారానే వారికి పరోక్షంగా మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టుకున్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు తారలు కూడా సోషల్‌ మీడియా ద్వారా తమ మాతృమూర్తులకు మదర్స్‌ డే విషెస్‌ తెలిపారు.


అనుష్కా శర్మ

లవ్యూ అమ్మా..!

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onకత్రినా కైఫ్‌

తను మా అమ్మ..! తనను హత్తుకోవడం, తనతో కలిసి డ్యాన్స్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం..! నా చిన్నతనంలో నేను ఎప్పుడూ ఇలా అమ్మను చుట్టుకొని ఉండేదాన్ని. ఇది నాకు బాగా గుర్తు.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) onప్రియాంకా చోప్రా

ఈ ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..! ఈరోజు మీకు అంకితం..! లవ్యూ అమ్మా..!

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onదీపికా పదుకొణె

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

నువ్వు మాపై చూపించే నిస్వార్థమైన ప్రేమకు.. మా కోరికల కోసం నీ ఇష్టాయిష్టాలను పక్కనపెట్టినందుకు.. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొంటూ వచ్చినందుకు.. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాకు నేర్పినందుకు.. నీకు కృతజ్ఞతలు..! లవ్యూ అమ్మా!

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) onసోనమ్‌ కపూర్‌

ఈరోజు నిన్ను చాలా మిస్సవుతున్నానమ్మా..! నిన్ను ఎప్పుడెప్పుడు కలుసుకొని హత్తుకుంటానా.. అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా..! లవ్యూ అమ్మా..!

View this post on Instagram

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onజాన్వీ కపూర్‌

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానమ్మా..!

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onశ్రియ

హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..! నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది..!

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) onఅనుష్క

ఈ సృష్టిలో ఉన్న నిజమైన ప్రేమను చూడాలనుకుంటే.. ఒక్కసారి మీ తల్లి కళ్లలోకి చూడండి..! లవ్యూ అమ్మా..! మాతృమూర్తులందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు..!

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) onకాజల్‌

జీవితంలో నాకెప్పటికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తివి నువ్వు..! నిన్ను చూసినప్పుడల్లా నా మనసు గర్వంతో ఉప్పొంగుతుంటుంది..! హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..! లవ్యూ సో మచ్‌..!

View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onసమంత

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..!

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

హ్యాపీ మదర్స్‌ డే టమ్టూ(పెంపుడు కుక్క పేరు)..! నిన్ను దత్తత తీసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది..!

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) onతమన్నా

ఇంటికి వచ్చిన మరుక్షణం నేను అడిగే మొదటి ప్రశ్న ‘అమ్మ ఎక్కడ..?’. అమ్మా.. నేను ఈ ప్రశ్నను ఎన్నిసార్లు అడిగినా అలసిపోను. ఎందుకంటే.. నీ ముఖం చూసినా లేదా నీ మాట విన్న ప్రతిసారీ నీకు కూతురిగా పుట్టడం నా జన్మజన్మల అదృష్టం అనిపిస్తుంటుంది. నువ్వు నాపై కురిపించే ప్రేమ, ఆప్యాయతలను మాటల్లో చెప్పేందుకు ఏ భాషా సరిపోదు. హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

ఈ మదర్స్‌ డే రోజున నేను పూర్తిగా అమ్మతోనే గడిపాను. అంతేకాదు, ఈరోజు ఆమెకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా ఇంట్లో పనులన్నీ నేనే చేసి.. తననెంతో ప్రత్యేకంగా చూసుకున్నాను..!

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) onపూజా హెగ్డే

మూడు తరాలకు చెందిన శక్తిమంతమైన మహిళలు ఇక్కడే ఉన్నారు..! మా సూపర్‌ డూపర్‌ అమ్మకి, నా క్యూటీ అమ్మమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..!

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) onనమ్రతా శిరోద్కర్‌

ఇవి మా అమ్మ నాకు నేర్పిన పాఠాలు..

* ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇచ్చింది.

* నాకు ఓటమి ఎదురైనప్పుడు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

* ఇతరులకు ప్రేమను ఎలా పంచాలో నేర్పింది.

* కుటుంబ విలువలను బోధించింది.

* నాకు ఇష్టమైన మార్గంలో నడిచే స్వేచ్ఛనిచ్చింది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. నాకు నాలా ఉండడం నేర్పింది.

ఈ క్రమంలో నా తరఫున, నా సోదరి తరఫున అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మా.. నేను ఇప్పటికీ నీలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో.. నేనూ నా పిల్లలను అంతే ప్రేమగా చూసుకొంటున్నాను. చిన్నతనం నుంచే వారికి ధైర్యంగా ఉండడం నేర్పిస్తున్నాను, జీవితం విలువల గురించి బోధిస్తున్నాను. నేను నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా..! హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) onఉపాసన కొణిదెల

మీ నలుగురూ లేని జీవితాన్ని ఊహించుకోలేను..! నాకు ఇంతటి ప్రేమను, ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు..! హ్యాపీ మదర్స్‌ డే..!

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

అత్తమ్మ, నాయనమ్మ (రామ్‌ చరణ్‌ నాయనమ్మ)లకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..! వివాహం తర్వాత ఏ ఆడపిల్లైనా తన మెట్టినింటికి కూతురవుతుంది. తన భర్తతో సమానంగా తానూ ఇంటి బాధ్యతలను స్వీకరిస్తుంది. మా అత్తగారు కోడలిగా తన పాత్రను సమర్థంగా పోషించారు. ఇప్పుడు నేను కూడా ఆమె అడుగుజాడల్లో నడవాలనుకొంటున్నా..!

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) onరకుల్‌ ప్రీత్‌ సింగ్‌

అమ్మా.. ఇది నీ రోజు..! నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. మనలో ప్రతి ఒక్కరి కథ వెనుక ఒక తల్లి ఉంటుంది. నా కథను ఇంత అద్భుతంగా రాసినందుకు నీకు ధన్యవాదాలమ్మా..! నువ్వు నాలో నిస్వార్థం, ప్రేమ, కరుణ, ధైర్యం.. మొదలైన లక్షణాలు నింపావు. అన్నింటికీ మించి ఒకరిపై ఆధారపడకుండా జీవితంలో ఎలా ఎదగాలో నేర్పించావు. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు చాలట్లేదు..! కానీ, నేను జీవితంలో ఉత్తమమైన మహిళగా గుర్తింపు తెచ్చుకుంటానని నీకు మాటిస్తున్నాను. లవ్యూ అమ్మా..!

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) onకీర్తి సురేష్‌

హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) onనిహారిక కొణిదెల

నా జీవితంలో వెలుగు నింపుతోన్న కాంతివి నువ్వే..! హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela) onరాశీ ఖన్నా

ప్రేమ, నిస్వార్థాలకు నువ్వు నిలువెత్తు రూపం..! ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే..! నీలాంటి అమ్మకు బిడ్డను కావడం నిజంగా నా అదృష్టం. నీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు..! లవ్యూ అమ్మా..!

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) onలావణ్య త్రిపాఠి

నువ్వు జీవితం గురించి ఎన్నో విషయాలు నాకు బోధించావు..! నువ్వు నన్ను పెంచినట్లుగానే.. నేనూ నా పిల్లలను పెంచుతాను..! హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya) onఅనుపమా పరమేశ్వరన్‌

హ్యాపీ మదర్స్‌ డే అమ్మా..!

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onపాయల్‌ రాజ్‌పుత్‌

నా క్యూటీ..! ఈ సృష్టిలో అమ్మ ప్రేమ కంటే స్వచ్ఛమైంది మరొకటి లేదు..! నిన్ను చాలా మిస్సవుతున్నానమ్మా..!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

women icon@teamvasundhara
sonam-kapoor-reveals-the-two-women-who-have-inspired-her-the-most

వారిద్దరే నాకు స్ఫూర్తి ప్రదాతలు!

జీవితంలో ఏదో ఒక దశలో మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరో ఒకరుంటారు. అలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారు చూపిన మార్గంలో పయనించి మనం అందుకున్న సక్సెస్‌ను, వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ మహానుభావులను పదే పదే గుర్తుచేసుకుంటాం. అలాంటి స్ఫూర్తి ప్రదాతలు తన జీవితంలో ఇద్దరున్నారని చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అప్పట్లో పురుషాధిక్యత రాజ్యమేలుతోన్న సినీ రంగంలో నిలదొక్కుకొని తనను తాను నిరూపించుకున్న వారు ఒకరైతే.. మహిళలు ఎంతటి శక్తిమంతులో ప్రపంచానికి చాటిన ధీర మరొకరు అంటూ వారిద్దరి గురించి ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది సోనమ్‌. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలో స్ఫూర్తి రగిలించిన ఆ ఇద్దరు మహిళా మణులెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
deepika-padukone-shares-heartwarming-film-on-mental-health

చెప్పేదాకా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉండండి!

మన మనసులోని బాధను పంచుకుంటేనే గుండె భారం దిగుతుంది. అదే.. దాన్ని మన మనసులోనే దాచుకుంటే గుండె బరువెక్కి బరువెక్కి మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోయేలా చేస్తుంది.. అందుకే మన మనసులోని ఆందోళనల్ని మన సన్నిహితులతో పంచుకోమని, ఒకవేళ వారు తమ సమస్య పంచుకోకపోతే చెప్పేదాకా వాళ్లను దాని గురించే పదే పదే అడగమని సలహా ఇస్తోంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. ఇలా ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్‌ గురించి మాట్లాడడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో తానూ ఈ సమస్యను ఎదుర్కొన్నానని, ఆపై దాన్నుంచి తనెలా బయటపడిందో ఇప్పటికే చాలా సందర్భాల్లో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి రగిలించిందీ బాలీవుడ్‌ బ్యూటీ. తనలా మరెవరూ బాధపడకూడదన్న ముఖ్యోద్దేశంతోనే ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఒత్తిడి, ఆందోళనల గురించి అందరిలో అవగాహన పెంచుతోందీ సుందరి. ఈ క్రమంలోనే ఈ సమస్య గురించి మరోసారి అందరికీ తెలియజేయాలన్న సదుద్దేశంతో తన సంస్థ ద్వారా ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించిందీ బాలీవుడ్‌ బేబ్.

Know More

women icon@teamvasundhara
actress-renu-desai-accepts-green-india-challenge-by-udayabhanu
women icon@teamvasundhara
sonam-kapoor-and-samantha-shares-childhood-pictures
women icon@teamvasundhara
vidyullekha-raman-shares-her-inspiring-weight-loss-journey-through-insta-post

నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే!

కాస్త బొద్దుగా ఉన్న వాళ్లు మన కళ్లల్లో పడ్డారంటే చాలు.. ‘అబ్బ ఎంత లావుగా ఉన్నారు.. బరువు తగ్గి నాలా అవ్వచ్చుగా..’ అని గొణుక్కునేవారు మనలో చాలామందే ఉంటారు. ఇంకొందరేమో ఇదే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా వారిని నేరుగా అడిగేస్తుంటారు కూడా! బాడీ షేమింగ్‌ విషయంలో ఇలాంటి అనుభవాలు తనకూ బోలెడున్నాయని చెబుతోంది తమిళ బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్‌. ‘రన్‌ రాజా రన్‌’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘భాగమతి’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఈ క్రమంలోనే తాను కసరత్తులు చేస్తున్నప్పుడు దిగిన ఓ ఫొటోను విద్యుల్లేఖ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా ఆమె బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు తన ఫ్యాట్‌ టు ఫిట్‌ స్టోరీని సైతం జతచేసిన ఈ బబ్లీ గర్ల్‌ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
shilpa-reddy-shared-a-story-how-she-recover-from-corona-virus
women icon@teamvasundhara
ahead-of-international-yoga-day-fitness-freak-shilpa-shetty-shares-a-video

యోగా చేద్దాం.. మన జీవితాల్లో సంతోషాన్ని నింపుకొందాం !

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా, మనసును ప్రశాంతంగా మార్చుకోవాలన్నా మనం జపించే మంత్రం ‘యోగా’. అంతేనా.. ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసే శక్తి యోగా సొంతం. అందుకే యోగాను మన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవడమే కాదు.. దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలాంటి పవర్‌ఫుల్‌ యోగాతో ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని మన జీవితాల్లో పాజిటివిటీని నింపుకుందాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పాశెట్టి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎవరింట్లో వాళ్లే యోగా చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌ని రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా సాధన చేయాలని, తమ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని తాజా పోస్ట్‌ ద్వారా తన ఫ్యాన్స్‌ను కోరుతోందీ బాలీవుడ్‌ యోగిని.

Know More

women icon@teamvasundhara
niharika-konidela-reveals-her-would-be-photo
women icon@teamvasundhara
ayesha-takia-reveals-being-victim-of-work-place-bullying

మిమ్మల్ని వేధిస్తున్న వారిని గెలవనివ్వకండి!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. తాజాగా యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హఠాన్మరణంతో సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణం మరోసారి తెరమీదకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనిలాగే తాము కూడా సినిమా ఇండస్ర్టీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అయేషా టకియా కూడా ఈ జాబితాలో చేరింది. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న బెదిరింపులపై నోరు విప్పుతూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
actress-sayali-bhagat-welcomes-baby-girl-names-her-ivankaa
women icon@teamvasundhara
samantha-shares-her-first-harvest-of-cabbage-microgreens

సమంతలాగా మైక్రో గ్రీన్స్‌ క్యాబేజీని పండించేస్తారా?

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవలే సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది. దీంతో మళ్లీ ‘బ్యాక్‌ టు వర్క్‌’ అంటూ సినీ తారలు మేకప్‌ వేసుకునేందుకు రడీ అవుతున్నారు. అయితే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతో లాక్‌డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సినీతారలు బాగానే ఆస్వాదిస్తున్నారు. కొందరు కొత్త విషయాలను నేర్చుకుంటుంటే, మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. కుకింగ్‌, గార్డెనింగ్‌కు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
gunjan-saxena-elaborate-post-on-her-biopic-starring-janhvi-kapoor-is-viral-now

ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయ్‌!

గుంజన్‌ సక్సేనా.. 20 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్‌ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్‌లో క్షేమంగా బేస్‌క్యాంప్‌కు తరలించిన ధీర వనిత. శత్రువుల చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్‌లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. తనదైన ధైర్యసాహసాలను ప్రదర్శించి కార్గిల్‌ గర్ల్‌గా మారింది. అందుకే ఆమె తెగువ, జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందుతోందే ‘గుంజన్‌ సక్సేనా - ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ గుంజన్‌గా కనిపించనుంది. అయితే గుంజన్‌ జీవితంలోని కొన్ని జ్ఞాపకాల సమాహారంతో రూపొందించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న గుంజన్‌.. ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ రాసుకొచ్చారు. దీనికి జాన్వీ, చిత్ర దర్శకుడు శరణ్‌ స్పందిస్తూ పెట్టిన పోస్టులు, వీరి సోషల్‌ మీడియా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
actress-aparna-nair-slams-a-pervert-for-his-vulgar-comment-in-telugu

ఇక్కడ ఉన్నది మీ ఆనందం కోసం కాదు!

సామాజిక మాధ్యమాలు... సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలున్నాయి. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే..మరికొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా మలయాళీ హీరోయిన్‌ అపర్ణా నాయర్‌ కూడా ఇలాగే దీటుగా సమాధానమిచ్చింది. తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌కు అసభ్యంగా కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.

Know More

women icon@teamvasundhara
mahima-chaudhry-opens-up-on-horrific-accident-that-destroyed-her-career

women icon@teamvasundhara
suma-dance-goes-viral-in-social-media

సుమక్కా! నువ్వు సూపర్‌!

సుమ కనకాల... మాటలతో మాయ చేసే ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలుపెరగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఆమె ఎక్కడుంటే అక్కడ ఫుల్‌ హంగామా ఉంటుంది. అందుకే బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంటుంది. ఇక వెండితెరకు సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్‌, ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినా ఈ క్రేజీ యాంకర్‌ హంగామానే వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె లాక్‌డౌన్‌లోనూ వివిధ రకాల పోస్టులు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ అద్భుతమైన డ్యాన్స్‌తో మన ముందుకొచ్చిందీ బుల్లితెర ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
tv-actress-mohena-kumari-shares-her-covid-19-journey