‘ఏం సందేహం లేదు.. ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది..
ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది..
ఏం సందేహం లేదు.. ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది..!’
ఈ పాట వింటే మన కళ్ల ముందు కదలాడే అందం.. రాశీ ఖన్నా..! ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ‘ఊహలు గుసగుసలాడే’, ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’.. తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రాశి ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఈ భామ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో రాశి ఇటీవల ట్విట్టర్ వేదికగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలిచ్చింది మన ‘బెల్లం శ్రీదేవి’.
ఆ ఫొటోలో ఉన్నదెవరో మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడూ ఇలా నవ్వుతూ, పాజిటివ్‌గా ఉండడం మీకెలా సాధ్యమవుతోంది..?
వావ్.. ఆ ఫొటోలో ఉన్నది నేనే..! ఇది మీకు ఎలా దొరికింది..? ఏదైతేనేం ఇది నాకు షేర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు..! నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం, స్నేహితులు, మీలాంటి అభిమానులు.. ఎప్పుడూ నా చుట్టూ ఉండడమే నేను ఇంత పాజిటివ్‌గా ఉండడానికి కారణం.
ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం.. వీటిలో మీకు ఏదంటే ఇష్టం..?
ప్రేమ వివాహమే!
మీ ఫేవరెట్ టీవీ షో ఏది..?
డార్క్..!

మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా?
టైటానిక్
మీరు తెలుగు సినిమాలు చూస్తుంటారా..?
వీలైనంత వరకు విడుదలైన అన్ని తెలుగు సినిమాలు చూస్తుంటాను.
ఈ లాక్డౌన్ సమయాన్ని మీరెలా గడుపుతున్నారు..?
వీలైనంత పాజిటివ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మానసిక ప్రశాంతత కోసం పుస్తకాలు చదువుతూ, స్ఫూర్తి నింపే వీడియోలు చూస్తున్నాను.
మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి..!
తమిళంలో ‘అరన్మనై 3’తో పాటు సూర్యతో ఓ సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో మరో రెండు సినిమాలపై చర్చలు జరుగుతున్నాయి. వీటి గురించి మరిన్ని విషయాలు లాక్డౌన్ తర్వాత వెల్లడిస్తాం.
ప్రస్తుతం మీ మానసిక స్థితి ఎలా ఉంది?
ప్రశాంతంగా, కృతజ్ఞతా భావంతో ఉన్నాను.
జీవితంలో మీరు పాటించే సూత్రమేది..?
‘మార్పును స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి..!’
మీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్?
Prague
తెలుగులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?
సమంత
ఒకవేళ జీనీ (‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ కథలోని పాత్ర) వచ్చి మీకు ఏదైనా వరం కావాలని కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు?
టైమ్ ట్రావెల్ చేసే సూపర్ పవర్ కావాలని కోరుకుంటాను.

మీకు ఇష్టమైన సినిమా ఏది?
The Proposal
మీరు ఎక్కువగా పాడే పాట?
ప్రస్తుతం ‘Get you the moon (Feat Snow)’ పాటను ఎక్కువగా వింటూ, పాడుతున్నాను.
టీ, కాఫీ.. ఈ రెండింట్లో మీకు ఏదంటే ఇష్టం..?
ఛాయ్..!
మీ ఫేవరెట్ పుస్తకం ఏది..?
ఇప్పటికైతే.. Dr. Wayne Dyer రచించిన ‘The power of Intention’ పుస్తకమంటే చాలా ఇష్టం.
రాశి ఈ లాక్డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం.. తదితర పనులు చేస్తూ ఆనందంగా గడుపుతోంది.