కరోనా లాక్‌డౌన్‌తో నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే మానవజాతికి చిన్న విరామం దొరికింది. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులను మినహాయిస్తే.. దేశ ప్రధానుల దగ్గర నుంచి సాధారణ కూలీ వరకు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా వృత్తిగతంగా క్షణం కూడా తీరిక దొరకని సినిమా తారలకు ఇదొక అరుదైన అవకాశమనే చెప్పాలి. అందుకే ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు, తమ మనసుకు నచ్చిన పనులు చేసేందుకు వినియోగిస్తున్నారు. అంతేకాదు, తమ వ్యక్తిగత పనులతో పాటు ఇంటి పనులు సైతం తామే స్వయంగా పూర్తి చేసుకుంటున్నారు. మరి ఈ క్వారంటైన్ సమయంలో కొంతమంది తారలు ఏం చేస్తున్నారో మీరే చూడండి.
అనుష్కా శర్మ
ఫ్యామిలీ అంతా కలిసి మోనోపొలీ గేమ్ ఆడుతున్నాం..! గెలుపు ఎవరిదో చెప్పగలరా..?
క్వారంటైన్‌లొ ఇలాంటి పనులు కూడా చేయొచ్చు..!
దీపికా పదుకొణె
వంట చేయడం, భోజనం చేయడం, నిద్రపోవడం.. వీటిని రిపీట్ చేయడం.
ఏదో సరదాగా ఇలా..!
అలియా భట్
నా అక్క షాహీన్‌తో కలిసి నేను ఈ చాక్లెట్ కేక్ తయారు చేశాను.
పుస్తకాలు చదవడం ద్వారా.. ఉన్నచోటు నుంచే మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్లొచ్చు..!
కత్రినా కైఫ్
ఈ వంటకం ఏంటో మాకు కూడా తెలీదు..! ఇది పూర్తయ్యాక మీకు చెప్తాం..!
ఈ పనులు చేయడం ద్వారా.. మన కోసం పని చేస్తోన్న వాళ్ల శ్రమను గుర్తించి వారిని తప్పక ప్రశంసిస్తాం..!
పూజా హెగ్డే
ఈ గజర్ కా హల్వాను నేనే స్వయంగా తయారు చేశాను..!
ఈ సమయాన్ని ఎక్కువశాతం యోగా చేయడం కోసమే వినియోగిస్తున్నా..!
రాశీ ఖన్నా
కాలానికి వెనక్కి వెళ్లి పాత అలవాట్లను గుర్తు చేసుకుందాం..!
ఈ కరోనా హడావిడి అంతా పూర్తయ్యాక మమ్మల్ని నిద్ర లేపండి..!
రకుల్ ప్రీత్ సింగ్
సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభించింది. నా తమ్ముడితో ఇన్ని రోజులు కలిసి ఉండి చాలా ఏళ్లయ్యింది..!
ఆట నియమాలను పాటించనప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉంటుంది. అయినా నాకు చీట్ చేయడం రాదనుకోండి..!
శృతి హాసన్
ఈ సమయంలో పియానో ప్లే చేస్తూ, మనసుకు నచ్చిన పాటలు పాడుతున్నాను.
పాయల్ రాజ్‌పుత్
దీని పేరు క్యాండీ..! తనతో సమయం గడపడంతోనే నా మనసుకు ప్రశాంతత లభిస్తోంది..!
బోర్ కొట్టి ఇలా టిక్‌టాక్ చేశా..!
లావణ్య త్రిపాఠి
నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మా ఇంటి మేడ పైకి వెళ్లాను. ఇప్పుడు నా ఫేవరెట్ ప్రదేశాల జాబితాలో ఇది కూడా చేరింది.
అనుపమా పరమేశ్వరన్
నిజానికి ఇక్కడ కనిపిస్తోన్న రియాక్షన్ రివర్స్‌లో ఉండాలి. తను(కుక్క) స్నానం చేశాడు.. నేను చేయలేదు..!
వీళ్లతో పాటు మరికొంతమంది హీరోయిన్లు తమ క్వారంటైన్ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు.