తన క్యూట్ లుక్స్‌తో సినీ అభిమానులను మెస్మరైజ్ చేసే టాలీవుడ్ ‘ఓ బేబి’ అక్కినేని సమంత. అటు గ్లామర్‌తో పాటు ఫిట్నెస్కి కూడా సమ ప్రాధాన్యమిచ్చే ఈ లవ్లీ లేడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం వ్యాయామం చేయడం మాత్రం మరవదు. తను జిమ్‌లో చేసే వివిధ రకాల కసరత్తుల వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులకు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతుంది సామ్. ఇక తను చేసే వర్కవుట్లను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..! ఎంతో కఠినంగా ఉండే వర్కవుట్లను సైతం అలవోకగా చేసేస్తూ అందరికీ ఫిట్నెస్ గురూగా మారిన జానూ.. తాజాగా మరో వర్కవుట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సామ్ తాజాగా 100 కేజీల బరువు ఎత్తున్న వర్కవుట్ వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ‘మళ్లీ నిన్ను కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నేస్తమా.. 100 kgs సుమో డెడ్ లిఫ్ట్..’ అంటూ వ్యాయామం తనకెంతో ప్రాణప్రదం అని చెప్పకనే చెప్పిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.. సామ్ వర్కవుట్ వీడియో చూసి అభిమానులంతా ఆమెపై ప్రశంసలు కురిపించడమే కాదు.. ఆ వీడియోను తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు కూడా!
కేవలం ఇప్పుడే కాదు.. గతంలోనూ ఓసారి 100 కిలోల బరువు ఎత్తుతూ స్క్వాట్స్ చేసింది సామ్.. అప్పుడూ తన వర్కవుట్‌తో ఫిట్నెస్ ప్రియుల్లో స్ఫూర్తి నింపిందీ అక్కినేని వారి కోడలు పిల్ల.
ఇటీవలే విడుదలైన ‘జాను’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ లవ్లీ గర్ల్.. ఓ తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రంలో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.