scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

హీ ఈజ్‌ సో క్యూట్‌.. హీ ఈజ్‌ సో స్వీట్‌!!

Actress and their first crushes

‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే..’, ‘హీ ఈజ్‌ సో క్యూట్‌.. హీ ఈజ్‌ సో స్వీట్‌..’ ఒక వ్యక్తిని చూడగానే మనలో కలిగే ఓ అందమైన ఫీలింగ్‌ని ఇలా పాట రూపంలో వ్యక్తీకరిస్తాం. అలాంటి మధురమైన భావన పేరే ప్రేమ. తమకూ ఇలాంటి ఫస్ట్ క్రష్ ఫీలింగ్స్ ఉన్నాయంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో ఒకరేమో క్రికెటర్‌ని చూసి ప్రేమలో పడితే, మరొకరు హ్యాండ్‌సమ్ హీరో ఫిజిక్‌కు ఫిదా అయిపోయారు. ఇంకొకరేమో పక్కింటి అబ్బాయిని చూసి మనసు పారేసుకున్నానని చెబుతున్నారు. మరి, ఇలా తమ తొలి ప్రేమానుభవాల్లో తేలియాడుతూ మన అందాల తారలు పంచుకున్న ఆ ఫస్ట్ క్రష్ విశేషాలేంటో ఈ ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా మీకోసం..
టాలీవుడ్‌లో..

అనూ ఇమ్మాన్యుయెల్‌
‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే..’ అంటూ కుర్రకారును తన అందం, నటనతో ఫిదా చేసేసింది మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయెల్‌. ఇలా అందరినీ తన అందంతో కట్టిపడేసే ఈ బ్యూటీ ఓ సందర్భంలో తన తొలిప్రేమ గురించి పంచుకుంది. ‘నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నాకు తొలి ప్రేమానుభవం కలిగింది. ఆ ఫీలింగ్‌ గురించి ఇప్పుడు గుర్తొచ్చినా నాలో నేనే నవ్వుకుంటాను..’ అంటూ ముసిముసిగా నవ్వేసిందీ క్యూట్‌ బేబీ.

heroinesfirstcrushgh650-1.jpg


అనుష్కశెట్టి
వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించే మన అందాల దేవసేన అనుష్కను ఒక క్రికెటర్ తన మాయలో పడేసుకున్నాడట! అతడే తన ఫస్ట్ క్రష్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వీటీ. ‘రాహుల్ ద్రవిడ్ నా ఫేవరెట్ క్రికెటర్. అతని ఆటను చూస్తూ ఎదిగిన నేను ఒకానొక సమయంలో అతనితో ప్రేమలో కూడా పడిపోయా..’ అని అతడిపై ఉన్న ప్రేమాభిమానాలను వెల్లడించింది అనుష్క.

19celebsfirstcrush1.jpg


రకుల్‌ప్రీత్ సింగ్
ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తన అందంతో మెరుపులు మెరిపిస్తూ.. అటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండడం ఎలాగో రకుల్‌ని చూసే నేర్చుకోవాలి. టాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరు తెచ్చుకొన్న ఈ భామ ఒకసారి ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో భాగంగా తన ఫస్ట్ క్రష్ గురించి నెటిజన్లతో పంచుకొంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటే తనకు వల్లమాలిన ప్రేమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చింది.

19celebsfirstcrush2.jpg


సమంత
తెలుగు ప్రేక్షకుల అభిమాన తారల్లో ఒకరిగా పేరు తెచ్చుకొన్న ఈ ముద్దుగుమ్మ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్‌ని ఇష్టపడేదట! ఆ తర్వాత కాలేజీ రోజుల్లో సూర్య అంటే పడి చచ్చిపోయేదట! ‘ఎప్పుడూ కాలేజీలో జరిగే ఈవెంట్లకు వెళ్లని నేను ఒకసారి సూర్య ముఖ్యఅతిథిగా వస్తున్నారని తెలిసి అందరికంటే ముందే వెళ్లి.. మొదటి వరుసలో నిలబడ్డా..’ అంటూ అతడిపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేసిందీ సుందరి.

19celebsfirstcrush3.jpg


రాశీఖన్నా
బబ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు సాధించిన నటి మన అందాల రాశీఖన్నా. ‘తొలిప్రేమ’ చిత్రంతో కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన తొలిప్రేమ గురించి కూడా మాట్లాడింది. ‘ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రోజుల్లో ఒక సీనియర్‌ని ఇష్టపడేదాన్ని. కానీ ఏనాడూ అతడికి ఆ విషయం చెప్పలేదు. ఒకరోజు అనుకోకుండా అతడే నా దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేశాడు..’ అంటూ సిగ్గులు మొగ్గలేసిందీ అందాల బొమ్మ.

19celebsfirstcrush4.jpg


రెజీనా కసాండ్రా
టాలీవుడ్ డస్కీ బ్యూటీ రెజీనా కూడా తన పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తిని బాగా ఇష్టపడేదట! కానీ అతను మాత్రం తనవైపు కనీసం కన్నెత్తైనా చూసేవాడు కాదని ఓ కార్యక్రమంలో భాగంగా తన ఫస్ట్ క్రష్ ముచ్చట్లను పంచుకుంది అందాల రెజీనా.

19celebsfirstcrush5.jpg


తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాని ఆరాధించే అభిమానుల సంఖ్య లక్షల్లోనే అని చెప్పుకోవచ్చు. అలాంటి మన తమ్మూ కూడా స్కూల్లో చదివే రోజుల్లో ఒక వ్యక్తిని ఇష్టపడిందట! ‘స్కూల్లో చదివే రోజుల్లో నా స్నేహితురాలి అన్నయ్యని ఎంతగానో ఇష్టపడేదాన్ని. అతను వయసులో నా కంటే చాలా పెద్దవాడు. మేమంతా తరచూ కలుస్తూనే ఉండేవాళ్లం. కానీ నా ప్రేమ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు..’ అంటూ తన తొలిప్రేమ అనుభవాలు పంచుకుందీ బ్యూటీ.

19celebsfirstcrush6.jpg


తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోన్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ అమ్మడికి చిన్నప్పట్నుంచీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమట! తన ఫస్ట్ క్రష్ అతడేనని, ఎప్పటికైనా అతడితో కలిసి నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నానని ఓ సందర్భంలో అభిమానులతో పంచుకుందీ సుందరి.

19celebsfirstcrush7.jpg


శ్రియ
సిల్వర్ స్క్రీన్‌పై తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ అందరినీ ఆకట్టుకునే నటీమణుల్లో శ్రియ ఒకరు. వయసు పెరుగుతున్నా ఒంపుసొంపులతో ఈతరం నటీమణులకు సైతం గట్టి పోటీనిస్తున్న ఈ ముద్దుగుమ్మకి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చాలా ఇష్టమట!

19celebsfirstcrush8.jpg


మెహరీన్
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే వరుస హిట్లతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది మెహరీన్. ఈ అమ్మడికి కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టమట! ‘కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో సల్మాన్‌ఖాన్ అంటే పడిచచ్చిపోయేదాన్ని. ఒకసారి బాడీగార్డ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన్ని కలిశా. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటూ తన తొలిప్రేమ అనుభూతులను పంచుకుందీ ముద్దుగుమ్మ.

19celebsfirstcrush9.jpgసాయిపల్లవి
‘ఫిదా’తో అందరి హృదయాలనూ కొల్లగొట్టిన బ్యూటీ సాయిపల్లవి. అయితే మన ‘మలర్’ హృదయాన్ని మాత్రం ఓ స్టార్ హీరో మాయ చేశాడట! ‘తమిళ నటుడు సూర్య అంటే నాకు చాలా ఇష్టం. తన చూపులు, నటనతోనే నన్ను మాయ చేసేశాడు..’ అంటూ అతడిపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తోందీ బ్యూటీ. ప్రేమ, ఫస్ట్‌క్రష్ విషయాలు ఎలా ఉన్నా, పేరెంట్స్‌ని చూసుకోవడం కోసం తను మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని ఓ సందర్భంలో చెప్పిందీ రౌడీబేబీ.

19celebsfirstcrush10.jpg


అదాశర్మ
తొలిచిత్రంతోనే కుర్రకారు మదిలో గిలిగింతలు పుట్టించిన అందాల భామ అదాశర్మ. ఈ అమ్మడికి కూడా హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చెప్పలేనంత ఇష్టమట. ‘లియోనార్డో అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అతడి కోసమే టైటానిక్ సినిమా దాదాపు పదిసార్లు చూశా..’ అంటూ ఓ కార్యక్రమంలో తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల భామ.19celebsfirstcrush11.jpg


నందిత
‘ప్రేమ కథా చిత్రమ్’తో అందరినీ భయపెడుతూనే వెండితెరకు పరిచయమై.. ఆపై తన అందచందాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న భామ నందిత. ఈ సుందరికి కూడా ఫస్ట్ క్రష్ అనుభవం స్కూలు రోజుల్లోనే ఎదురైందట! ‘స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. అతడు చాలా అందంగా ఉంటాడు. నేనే కాదు.. మా స్కూల్లో చాలామంది అమ్మాయిలు అతడ్ని ఇష్టపడేవారు..’ అంటూ తన తొలిప్రేమ అనుభూతులను ముద్దుముద్దుగా పంచుకుందీ సోగకళ్ల సుందరి.19celebsfirstcrush12.jpg


మంచు లక్ష్మీప్రసన్న
మన మన్మధుడు నాగార్జున అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. నేటికీ తన నటనతోనే కాదు.. తన అందంతోనూ ఎందరో అమ్మాయిల హృదయ రాకుమారుడిగా, ఫస్ట్ క్రష్‌గా మారాడు నాగ్. ఈ లిస్టులో తానూ ఉన్నానంటున్నారు టాలీవుడ్ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న. నవ మన్మధుడు నాగార్జున తనకు ఫస్ట్ క్రష్ అంటూ పలు సందర్భాల్లో లక్ష్మీప్రసన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.

19celebsfirstcrush13.jpg


బాలీవుడ్‌లో..
జాన్వీ కపూర్‌
నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’తోనే విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న కపూర్‌ బ్యూటీ జాన్వీ. ఓ టాక్‌ షోలో పాల్గొన్న ఈ బాలీవుడ్‌ అందం.. తన ఆల్‌టైమ్‌ క్రష్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘విజయ్‌ నా ఆల్‌టైమ్‌ క్రష్‌. కానీ దురదృష్టవశాత్తూ అటువైపు (విజయ్‌) నుంచి ఎలాంటి రియాక్షన్‌ రావడం లేదు. నేను ఎక్కువగా ఫీలైపోయి, మాట్లాడిన భావన కలుగుతోంది. జస్ట్‌.. సరదాగా అంటున్నానంతే.. విజయ్‌పై నాది కేవలం ఆరాధన భావం మాత్రమే.. అతడిని చూస్తే ముచ్చటేస్తుంది. నాకు తెలిసి ప్రస్తుతానికి ఇది వన్‌సైడ్‌ మాత్రమే. నా అభిప్రాయాలు కొన్ని కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రస్తుతం విజయ్‌ ఎంత స్థిరంగా ఉన్నాడో.. అతనిపై నా అభిమానం కూడా చాలా స్థిరంగా ఉంది. ప్రస్తుతానికైతే విజయ్‌పై నాకున్న ఇష్టం సేఫ్‌జోన్‌లోనే ఉంది..’ అంటూ తన ఫస్ట్‌ క్రష్‌ గురించి చెబుతూ మురిసిపోయిందీ అందాల తార. ‘వెంకీమామ’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా విజయ్‌ని చూసి మనసు పారేసుకున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

heroinesfirstcrushgh650-2.jpg


కరీనా కపూర్‌
తనదైన అందం, నట ప్రతిభతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార కరీనా కపూర్‌ కూడా ఓ సందర్భంలో భాగంగా తన ‘తొలివలపు’ గురించి ఇలా చెప్పుకొచ్చింది. 1990లో విడుదలైన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ‘ఆషిఖీ’ హీరో రాహుల్‌ రాయ్‌ని చూసి మనసు పారేసుకున్నానని చెబుతోంది బెబో. ‘రాహుల్‌ రాయ్ నా డ్రీమ్‌ బాయ్‌! అతను నటించిన ఆషిఖీ సినిమా ఎనిమిది సార్లు చూశా..’ అంటూ రాహుల్‌పై తనకున్న ఫస్ట్‌ క్రష్‌ను బయటపెట్టిందీ బాలీవుడ్‌ క్వీన్‌.heroinesfirstcrushgh650-3.jpgసోనమ్ కపూర్
‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ తన ఫస్ట్ క్రష్ హృతికే అంటూ, ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో రోహిత్ పాత్రలో నటించిన తనని చూసి ప్రేమలో పడిపోయినట్లు కొన్ని సందర్భాల్లో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దగ్గరైతే హృతిక్ ఫొటోలకు సంబంధించిన కలెక్షన్ కూడా ఉందట! ఇంకా ఈ జాబితాలో అందాల తారలు సోనాక్షీ సిన్హా, కృతీ సనన్‌, కియారా అడ్వాణీ.. వంటి ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.19celebsfirstcrush14.jpg


పరిణీతి చోప్రా
బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రాకు పటౌడీ కా నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అంటే వల్లమాలిన ప్రేమ. ఓసారి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి విచ్చేసిన పరి.. సైఫ్‌కి పెళ్లైనా తనని వివాహం చేసుకోవడానికి ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానంటూ తన తొలిప్రేమ కబుర్ల గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.

19celebsfirstcrush15.jpg


చిత్రాంగధ సింగ్
అందాల తార చిత్రాంగధ సింగ్‌కి కింగ్ ఖాన్ షారుఖ్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘చిత్రపరిశ్రమలో నాకు నచ్చిన నటులు చాలామందే ఉన్నారు. కానీ నా ఫస్ట్ క్రష్ మాత్రం షారుఖే. ‘ఫౌజీ’ అనే టీవీ సిరీస్‌లో షారుఖ్‌ని చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా..’ అంటూ వివరించింది చిత్ర. బొద్దుగుమ్మ విద్యాబాలన్ కూడా ఈ జాబితాలో ఉంది.

19celebsfirstcrush16.jpg


అలియా భట్
‘రాజీ’ తార అలియా భట్‌కి ముందునుంచీ రణ్‌బీర్ కపూర్ అంటే పిచ్చి ప్రేమ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటికీ రణ్‌బీర్‌ని ప్రేమిస్తూనే ఉంటా. ‘బర్ఫీ’లో ఆయన్ని చూసిన దగ్గర్నుంచి ఆయనపై నా ప్రేమ మరింతగా పెరిగింది. రణ్‌బీర్ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నా బిగ్గెస్ట్ క్రష్..’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారన్న విషయాలు మనకు తెలిసిందే. అలియానే కాదు.. ఇలా రణ్‌బీర్‌ని చూసి మనసు పారేసుకున్న ముద్దుగుమ్మల్లో.. జాన్వీ కపూర్, దిశా పటానీ, తాప్సీ, సాయేషా సైగల్, సారా అలీ ఖాన్‌లు కూడా ఉన్నారు.

19celebsfirstcrush17.jpg


కత్రినా కైఫ్
మన అందాల తార కత్రినా కైఫ్‌కి బ్రిటిష్ నటుడు రాబర్ట్ పాటిన్సన్ అంటే అమితమైన ప్రేమ. ఓ సందర్భంలో తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడుతూ.. ‘రాబర్ట్ అంటే నాకు ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను. అతడిని నా మైండ్‌లో నుంచి తీసేయడం అనేది జరగని పని. ప్రతి వ్యక్తిని, వస్తువును ఎంతో ప్రేమగా చూస్తాను నేను.. కానీ ఇప్పటిదాకా నన్ను ఇంత ప్రభావితం చేసిన వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదు..’ అంది క్యాట్.19celebsfirstcrush18.jpg


అదితీ రావ్ హైదరి
బాలీవుడ్ నటుడు, చిత్ర దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అంటే మన అదితికి చాలా ఇష్టమట. ‘ఫర్హాన్ ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఎంతో కూల్‌గా, హుందాగా వ్యవహరిస్తుంటారాయన. తనలో నచ్చే ఈ క్వాలిటీనే తనపై నాకు ఫస్ట్ క్రష్ కలిగేలా చేశాయి. నేనెక్కడున్నా నా కళ్లు అతని చుట్టే తిరుగుతూ ఉంటాయి..’ అంటూ తన తొలిప్రేమ ముచ్చట్లు చెప్పుకొచ్చింది అదితి.19celebsfirstcrush19.jpg


దీపికా పదుకొణె
టైటానిక్ హీరో లియోనార్డో డీ కాప్రియో అంటే మన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు చాలా ఇష్టమట. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన బెంగళూరు ఇంట్లోని తన గదిలో గోడలపై లియోనార్డో ఫొటోలు, వాటి పక్కనే తాను వివిధ స్టిల్స్‌లో దిగిన ఫొటోల్ని అమర్చుకునేదట! ఇలా ఆ గదినంతా ఆయన ఫొటోలతో నింపుకొని తన ప్రేమను చాటుకుందీ ముద్దుగుమ్మ.19celebsfirstcrush20.jpg

మరి, మన అందాల తారలు పంచుకున్న తొలి ప్రేమ ముచ్చట్లు తెలుసుకున్నారుగా! ఇంతకీ మీ ఫస్ట్ క్రష్ విశేషాలేంటి? మీకూ ఇలా తొలిసారి ఎవరిని చూడగానే మీ మదిలో ప్రేమ గంట మోగింది? ఆ విశేషాలను ‘వసుంధర.నెట్’ వేదికగా అందరితో పంచుకోండి. ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా ఆ మధురమైన జ్ఞాపకాల్ని మరోసారి నెమరువేసుకోండి.

women icon@teamvasundhara
renu-desai-talks-about-love-failure

లవ్ ఫెయిలైనా సరే... ఆ పని మాత్రం చేయద్దు!

‘వీలైతే ప్రేమిద్దాం... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’.. అని ఓ సినిమాలో చెప్పినట్లు మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు... కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని తెగ ఫీలైపోతుంటారు చాలామంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని అసలు తట్టుకోలేరు. ‘ప్రేమలో విఫలమయ్యాం.. ఇక జీవితమంతా శూన్యం’ అంటూ మానసిక కుంగుబాటుకు గురవ్వడం, బలవన్మరణాలకు పాల్పడడం వంటివి చేస్తుంటారు. అయితే ప్రేమలో ఓడినంత మాత్రాన ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఏ మాత్రం సరైనవి కావంటోంది రేణూదేశాయ్‌. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆమె తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా రిలేషన్‌షిప్‌, బ్రేకప్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
chitrangda-singh-opens-up-about-losing-modeling-assignments-because-of-dusky-complexion

నా రంగు కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా!

ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరాకృతి, అందం, బరువు, రంగు... మొదలైన విషయాల గురించి వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం చాలా మామూలు విషయమై పోయింది. ఇక రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో చర్మఛాయ పేరుతో అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే చాలామంది సినీతారలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన స్కిన్‌టోన్‌ కారణంగా తాను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార చిత్రాంగద సింగ్‌. అంతేకాదు తన చర్మఛాయ కారణంగా కెరీర్‌లో పలు అవకాశాలు కోల్పోయానంటోంది. ఈ సందర్భంగా తన స్కిన్‌టోన్‌కు సంబంధించి తనకెదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
tappsee-pannu-recalls-her-struggling-days-in-telugu

వారి పక్కన హీరోయిన్‌గా పనికిరానన్నారు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ర్టీలో ఒక మహిళ హీరోయిన్‌గా రాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునే దాకా ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల మెప్పు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ఈక్రమంలో సినిమా పరిశ్రమలో తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటోంది తాప్సీ. తాను అందంగా ఉండనని, గొంతు బాగోలేదని.. ఇలా పలు కారణాలను సాకులుగా చూపి తనను చాలా సినిమాల్లోంచి తప్పించారంటోంది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తనకెదురైన చేదు అనుభవాలు, అవమానాల గురించి అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
a-spiritual-leader-tried-to-take-advantage-of-me-says-actress-anupriya-goenka

ఆ బాబా నన్ను లోబరుచుకోవాలని చూశాడు!

తమని తామే దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ పలువురు దొంగ బాబాలు, స్వామీజీలు అమాయకుల్ని మోసం చేస్తుంటారు. భక్తి ముసుగులో ఆడపిల్లల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సేవ పేరుతో వారిని బానిసలుగా చేసి లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తానూ ఓ బాబా చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానంటోంది బాలీవుడ్‌ వర్ధమాన నటి అనుప్రియా గోయెంకా. తన తండ్రి బాగా నమ్మిన ఆ ఆధ్యాత్మిక గురువు మాయ మాటలతో తనను లోబరుచుకోవాలని చూశాడంటోంది. ఈ సందర్భంగా లైంగిక వేధింపులకు సంబంధించి తనకెదురైన చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
cinema-celebrities-interesting-social-media-posts-on-diwali

తారల దీపావళి సంబరాలు చూశారా?

జీవితంలోని చీకట్లను చెరిపేసి వెలుగులు నింపే దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకొంది. విద్యుద్దీపాల వెలుగులు, దీపాల కాంతులు, మతాబుల సందడితో ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ పండగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ర్టీకి చెందిన పలువురు తారలు సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కున మెరిశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తూ, దీపాలు పెడుతూ సందడి చేశారు. పండగ సంతోషాలను ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. అదేవిధంగా తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సినీ తారల దీపావళి సంబరాల విశేషాలేంటో మనమూ చూద్దాం రండి!

Know More

women icon@teamvasundhara
what-if-tollywood-actresses-are-compared-to-diwali-crackers

'రాకెట్' రకుల్.. 'ఆటం బాంబ్' పూజ.. 'తారాజువ్వ' కాజల్..!

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకొనే పండగల్లో దీపావళి ఒకటి. రామాయణం ప్రకారం 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు సీతతో కలిసి ఆయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా.. మహాభారతం ప్రకారం సత్యభామ నరకాసురుడిని వధించిన రోజుగా.. మనమంతా ఈ పండగను జరుపుకొంటాం. దీపావళి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దీపకాంతులు. ఈరోజున లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇళ్లంతా దీపాలతో అందంగా అలంకరిస్తాం. ఇక చీకటి పడ్డాక అసలైన ఘట్టం మొదలవుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటి సభ్యులంతా కలిసి దీపావళి టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. వీటిలో ఆకాశానికి ఎగసి వెలుగులు విరజిమ్మేవి కొన్నైతే.. నేలపైనే పేలుతూ కాంతితో పాటు శబ్దాలను ఇచ్చేవి మరికొన్ని. ఈ క్రమంలో మనల్ని ఎంతగానో అలరిస్తోన్న ఈతరం తారలకు, దీపావళి టపాసులకు పోలికలెన్నో..! మరి ఏ తార ఏ టపాసు లాంటిదో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
avika-gor-confirms-she-is-dating-with-milind-chandwani-in-telugu

ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడు!

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో ఆనందిగా పరిచయమైన అవికా గోర్‌ తన అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే అభినయంతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజి తీగలా మారి తన అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన అవిక... వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
tanushree-dutta-announces-her-bollywood-come-back-in-telugu

మళ్లీ వస్తున్నా.. అందుకోసం 15 కిలోలు తగ్గా..!

తనుశ్రీ దత్తా... మన దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పడంతోనే ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. ఆమె అందించిన ధైర్యంతోనే వివిధ రంగాలకు చెందిన మహిళలు ‘మాపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి’ అంటూ ఒక్కొక్కరు పెదవి విప్పారు. అంతకుముందు పలు హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన తనుశ్రీ ఈ ఉద్యమం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. అమెరికాలో స్థిరపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ తన అభిమానులకు ఓ తీపి కబురు అందించిందీ అందాల తార. ఈ సందర్భంగా సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
shradda-kapoor-on-instagram-reaches-56500000-followers-as-3rd-most-followed-indian

సోషల్‌ మీడియాలోనూ ఈ సాహో బ్యూటీదే హవా!

సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వెండితెరపై వెలిగిపోయే సెలబ్రిటీలకు తమ వృత్తితో పాటు సోషల్‌ మీడియా కూడా ముఖ్యమే. ఎందుకంటే తమను ఆరాధించే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి చాలామంది వారిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టివ్‌గా ఉన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 56.5 మిలియన్లకు చేరుకుంది. తద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్‌ సెలబ్రిటీల్లో మూడో స్థానానికి చేరుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
priyanka-reveals-two-most-uncomfortable-outfits-she-ever-worn
women icon@teamvasundhara
kangana-ranaut-reveals-weight-gain-for-thalaivi-wasnt-easy-in-telugu

అప్పుడు నా వెన్నుకు తీవ్ర గాయమైంది!

ఒక పనిలో పరిపూర్ణత రావాలంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా భరించాలంటోంది బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. ఎలాంటి పాత్రకైనా తనదైన రీతిలో పర్‌ఫెక్షనిజాన్ని తీసుకొచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘తలైవి’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం, ఆన్‌స్క్రీన్‌పై జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి ఏకంగా 20 కిలోలు పెరిగిన ఈ మనాలీ బ్యూటీ.. ప్రస్తుతం తాను పెరిగిన బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తనకెదురైన పలు అనుభవాలను సైతం అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది కూడా! ఈ క్రమంలోనే తలైవి కోసం భరతనాట్యం నేర్చుకున్నప్పుడు వెన్ను తీవ్రంగా గాయపడిందని, అయినా పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయగలిగానన్న సంతృప్తి ముందు ఆ బాధ ఏపాటిదంటూ తన షూటింగ్‌ అనుభవాలను ట్వీట్స్‌ రూపంలో పోస్ట్‌ చేసింది కంగన.

Know More

women icon@teamvasundhara
avika-gore-shares-a-post-about-self-love-in-telugu

ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం!

ప్రతి మనిషిలోనూ పాజిటివ్‌, నెగెటివ్‌... అని రెండు రకాల భావోద్వేగాలుంటాయి. పాజిటివ్‌ ఎమోషన్స్‌ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకపోయినా, ప్రతికూల ఆలోచనలు మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఈ తరహా ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈక్రమంలో తాను కూడా గతంలో నెగెటివ్‌ ఆలోచనలతో ఎంతగానో ఇబ్బందిపడ్డానంటోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా గోర్‌. చెడు ఆలోచనలతో తన విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానంటోంది. అయితే ఆ తర్వాత తనను తాను నమ్ముకున్నానని, చుట్టూ ఉన్న వాళ్లతో సమయం గడిపి ఈ సమస్యను అధిగమించానంటోంది. ఈక్రమంలో ప్రతికూల ఆలోచనలకు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రతిరోజూ మనతో మనం మాట్లాడుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే చక్కటి సందేశాన్ని అందిస్తోన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
bhumi-pednekar-flunked-film-school-had-rs-13-lakh-loan-on-her-head-when-she-started-out

ఆ కోర్సులో చేరడానికి 13 లక్షల లోన్‌ తీసుకున్నా!

ఎవరైనా తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నప్పుడు...తను సాధించిన విజయమే పైకి కనిపిస్తుంది తప్ప.. ఆ గెలుపును చేరుకోవడానికి వాళ్లు పడిన కష్టాలు, కన్నీళ్లు, చేసిన ప్రయత్నాలు ఎవరికీ కనిపించవు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతోన్న ఎంతోమంది తారలు తమ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఛీత్కారాలు ఎదుర్కొన్న వారే..! ఈక్రమంలో తన జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లున్నాయంటోందీ బాలీవుడ్‌ అందాల తార భూమీ పెడ్నేకర్‌. తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదంటోన్న భూమి.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
actress-fatima-sana-shaikh-reveals-she-was-molested-as-a-3-year-old

మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా!

ఏ రంగంలోనైనా ఉద్యోగానికి ప్రతిభే కొలమానం అన్న సంగతి తెలిసిందే! కానీ చిత్రపరిశ్రమలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే నెపోటిజం (బంధుప్రీతి), క్యాస్టింగ్‌ కౌచ్‌ ముఖ్యమని పలు సందర్భాల్లో కొంతమంది తారలు వెల్లడించిన విషయాలు, వారి అనుభవాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌. ‘దంగల్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిన్నది.. సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డానని, ముక్కుపచ్చలారని వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వేధింపులు మహిళలకు ప్రతి రంగంలోనూ ఎదురవుతున్నాయని, దీంతో వారు నిత్యం నరకం అనుభవిస్తున్నారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ క్యూటీ.

Know More

women icon@teamvasundhara
poonam-bajwa-introduced-her-soulmate-in-telugu

నీతో ప్రతిక్షణం ఓ మ్యాజిక్‌లా ఉంటుంది!

‘హలో బాసు..మహా క్లాసు’ అంటూ ‘బాస్‌’ సినిమాలో అక్కినేని నాగార్జునతో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుంది పూనమ్‌ బజ్వా. 15 ఏళ్ల క్రితం ‘మొదటి సినిమా’తో కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘బాస్‌’ చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈక్రమంలో తాజాగా అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన ఆమె.. వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-agarwal-pre-wedding-festivities-begin-in-telugu

‘చందమామ’ పెళ్లి సందడి మొదలైపోయింది!

టాలీవుడ్‌ పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో (అక్టోబర్‌ 30) ఈ చందమామ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడవనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనున్న ఈ అందాల తారకు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-shares-what-her-mom-said-to-her-when-she-won-miss-world-pageant

కంగ్రాట్స్ చెప్పకుండా ‘బేబీ.. నీ చదువు సంగతేంటి’? అనడిగింది!

మిస్‌ వరల్డ్‌... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎన్నో వడపోతలు, మరెన్నో రౌండ్లను చాకచక్యంగా దాటుకుంటూ ‘ప్రపంచ సుందరి’ కిరీటం అందుకోవాలంటే అంత సులభమేమీ కాదు. కానీ 18 ఏళ్ల వయసులోనే ఈ కిరీటాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంది బాలీవుడ్‌ అందాల తార ప్రియాంకా చోప్రా. ఈ ముద్దుగుమ్మ ఈ కిరీటం గెలుచుకుని రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈక్రమంలో అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్‌లు షేర్‌ చేస్తోంది ప్రియాంక.

Know More

women icon@teamvasundhara
alia-bhatt-shares-a-post-on-self-appreciation-in-telugu

సోషల్ మీడియాలో ఉండేది ‘నిజమైన మనం’ కాదు!

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఈ సంఘటనతో సోషల్‌ మీడియా వేదికగా ఇండస్ట్రీలోని బంధుప్రీతి, లాబీయింగ్, లైంగిక వేధింపులు వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇదే సమయంలో మహేశ్‌భట్‌ కుమార్తెగా అలియా భట్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఇప్పటివరకు తనపై వచ్చిన విమర్శలకు స్పందించని అలియా తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ షేర్ చేసింది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియాలో తనపై విమర్శలు చేసేవాళ్లని ఉద్దేశిస్తూ ఓ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
rani-mukerji-reveals-her-and-adira-plans-for-durga-puja-at-home

ఈసారి దసరా సరదాల్ని మిస్సవుతున్నాం!

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో బోలెడన్ని సరదాల్ని తీసుకొస్తుంది ‘దసరా’ పండగ. దేశవ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రుల పేరుతో వైభవంగా జరుపుకొనే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాల్లో కొలుస్తుంటారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన ‘విజయదశమి’ నాడు అసలు సిసలైన పండగ హడావిడి ఉంటుంది. మరి, ఇలా ఎన్నో సరదాల్ని, మధురానుభూతుల్ని అందించే ఈ పర్వదినాన్ని కరోనా పడగ కింద ఎంతో జాగ్రత్తగా జరుపుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాము కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండగను సెలబ్రేట్‌ చేసుకుంటామంటోంది బాలీవుడ్‌ అందాల తార రాణీ ముఖర్జీ. ఈ సందర్భంగా పండగకు సంబంధించి తన ప్రణాళికలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
saipallavi-puts-mehendi-on-kids-from-uttar-pradesh

మన భానుమతి మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది!

సాయిపల్లవి... సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టినా, ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసినా, ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసినా... అది నేచురల్ బ్యూటీ సాయి పల్లవికే చెల్లింది. డాక్టర్ కాబోయి యాక్టర్‌ అయిన ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది. రీల్ లైఫ్లో ఎంతో సింపుల్‌గా, సరదాగా కనిపించే సాయి పల్లవి నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా షూటింగ్‌ కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి వెళ్లిన ‘మలర్’ సడన్గా మెహెందీ ఆర్టిస్టుగా మారిపోయింది. అక్కడి చిన్నారుల చేతులను అద్భుతమైన మెహందీ డిజైన్లతో నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

Know More

women icon@teamvasundhara
varalaxmi-sarathkumar-turns-director-celebrities-pour-in-best-wishes

ఫైనల్‌గా కొత్త అవతారంలోకి అడుగు పెడుతున్నాను!

పురుషాధిక్యత ఉన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు కూడా పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. కేవలం నటీమణులుగానే కాకుండా... దర్శకులుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఈ తరం హీరోయిన్లలో అనుష్కాశర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె... తదితరులు ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థలను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. మరికొందరు మెగాఫోన్ పట్టి డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తన నటనతో ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారింది. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-keerthy-suresh-on-her-birthday-special-in-telugu

అందుకే మన కీర్తి ‘మహానటి’ అయింది!

‘మహా నటి’ సినిమాతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను ఒక్కసారి తన వైపు తిప్పుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమాలో అలనాటి అందాల తార ‘సావిత్రి’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు ‘జాతీయ ఉత్తమ నటి’ పురస్కారం అందుకుంది. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చుకునే ఈ ముద్దుగుమ్మ ఇటు కమర్షియల్‌ సినిమాలతో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనూ నటిస్తోంది. ఇలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 17). ఈ సందర్భంగా ఆ అందాల కథానాయిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-opens-about-her-goa-tour-and-online-trolls

గోవా బీచ్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే కాస్త ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అందుకే సెలబ్రిటీలందరూ బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని సమయం దొరికినప్పుడల్లా ఔటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి తన పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లింది. తన ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి అక్కడ తన జన్మదిన వేడుకలు జరుపుకొంది. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో ఈ ప్రయాణం చాలా అసౌకర్యంగా సాగిందంటూ తన గోవా టూర్‌కు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుందీ మంచు వారి వారసురాలు.

Know More

women icon@teamvasundhara
namrata-shirodkar-shares-30-days-positivity-plan-on-world-mental-health-day

౩౦ రోజుల్లో మానసిక ఆరోగ్యం.. నమ్రత పాజిటివ్ ప్లాన్ చూశారా?

జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏటా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ (అక్టోబర్ 10) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమస్యలపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు తానెలాంటి పనులు చేస్తున్నానో సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుంది ప్రిన్స్‌ మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్.

Know More

women icon@teamvasundhara
jai-ho-actress-quits-showbiz-pens-a-note-on-social-media

women icon@teamvasundhara
samantha-adorable-anniversary-wishes-to-chaitanya-wins-hearts-in-telugu

women icon@teamvasundhara
sonam-kapoor-shared-what-she-eats-for-her-breakfast-which-helps-her-deal-with-pcos

అప్పట్నుంచీ ఇదే నా బ్రేక్‌ఫాస్ట్!

పీసీఓఎస్‌.. ఇది ఒక్కసారి మన జీవితంలోకి అడుగుపెట్టిందంటే.. అదుపు చేసుకోవడమే తప్ప.. దాన్ని వదిలించుకోవడమనేది అసాధ్యం! మరి, ఈ సమస్యను అదుపు చేసుకోవాలంటే ముఖ్యంగా మన ఆహారపుటలవాట్లను అదుపులో పెట్టుకోవాలి.. అనారోగ్యకరమైన జీవనశైలికి దూరంగా ఉండాలి.. ఇదే విషయం చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. తాను గత కొన్నేళ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని, ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా, ఎందరు డాక్టర్లను కలిసినా సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ ఇటీవలే ఓ వీడియోలో భాగంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అయితే పోషకాహార నిపుణుల సలహా మేరకు చక్కటి ఆహార నియమాలు పాటించడం వల్లే ప్రస్తుతం తనకు పీసీఓఎస్‌ అదుపులో ఉందన్న సోనమ్‌.. అందుకు తాను తీసుకుంటోన్న అల్పాహారమేంటో తాజాగా మరో వీడియోలో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
kajal-aggarwal-announces-about-her-marriage-in-telugu

మేమిద్దరం ఆ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!

కాజల్‌ అగర్వాల్‌... సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పుష్కర కాలం దాటిపోతున్నా ఏ మాత్రం క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌. 2007లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్థానం సంపాదించింది. అందం, అభినయానికి తోడు క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల తార పెళ్లి ముహూర్తం తాజాగా ఫిక్సయింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఈ నెల 30న ఏడడుగులు నడవనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ స్టార్‌ హీరోయిన్‌. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
actress-anushka-chitchat-with-twitter-followers-in-telugu

అందుకే నేను గతాన్ని మార్చుకోవాలనుకోను!

తెలుగు చిత్ర సీమకు సంబంధించి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది అనుష్క. గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే, నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు పూర్తి న్యాయం చేస్తోందీ అందాల తార. అందం, అభినయంతో దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకులతో సమానంగా స్టార్ స్టేటస్‌ సొంతం చేసుకున్న ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే తదితరులు నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీలో మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడే యువతిగా మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది అనుష్క. ఈ సందర్భంగా ఇటీవల ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన ఆమె #AskAnushka అంటూ తొలిసారిగా అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. మరి అనుష్క, అభిమానుల మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kriti-sanon-shares-hard-hitting-notes-on-hathras-rape-case

అలా చేయకపోతే మగాడే కాదని వాళ్లకు నేర్పించండి..!

ఆడపిల్లల భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తించింది హథ్రాస్‌ హత్యాచార ఘటన. నలుగురు దుర్మార్గుల చేతుల్లో ఓ అభాగ్యురాలు బలైపోయిన తీరు, ఆ తర్వాతి పరిణామాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ముక్తకంఠంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ స్పందించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ఆమె... ఇంటి నుంచే మార్పు మొదలైతేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటూ అందులో చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
ileana-shares-a-breathtaking-picture-in-a-bikini-talks-about-body-positivity

నా అందం నాదే.. ప్రపంచం ఏమనుకుంటే నాకేమిటి?

‘చూడడానికి పాలరాతి శిల్పంలా తెల్లగా ఉండాలి.. పొడవైన వెంట్రుకలు ఉండాలి.. కనీసం ఐదున్నర అడుగుల ఎత్తుండాలి.. దానికి తగ్గట్లు చక్కని కొలతలు గల శరీర సౌష్టవం ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్లు లెక్క!’... ఇదీ అమ్మాయిల అందం గురించి ఇప్పటికీ సమాజంలో చాలామందికి ఉండే అభిప్రాయం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు కొందరు అమ్మాయిలు. అదే సమయంలో వారిని ఉద్దేశిస్తూ ఎదుటివారు చేసే విమర్శలు, కామెంట్లతో వారు మరింత మానసిక క్షోభకు గురవుతుంటారు. సామాన్యులకే కాదు... సెలబ్రిటీలకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలా ‘అందమంటే ఇదే’ అని సమాజంలో పేరుకుపోయిన కొన్ని మూసకట్టు ప్రమా18:58:41ణాల కారణంగా తానూ తీవ్ర ఆందోళనకు గురయ్యానంటోంది ఇలియానా. ఈ క్రమంలో తన శరీర సౌష్టవం, బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టా వేదికగా ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
anushka-sharma-pens-an-emotional-note-on-privilege-of-a-male-child
women icon@teamvasundhara
rashmika-mandana-shares-a-glimpse-of-her-beach-workout

ఈ బీచ్‌ వర్కవుట్‌కు బాగా అలవాటు పడిపోయాను!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్‌ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon@teamvasundhara
tollywood-actress-ramyakrishnan-turns-50-in-telugu