నేను చిన్నప్పుడు నిజంగానే చబ్బీగా (బొద్దుగా) ఉన్నాను..!
పార్టీ టైమ్ విత్ ఫ్యామిలీ..!
ఈరోజు నేను ఇలా ఉండడానికి వీరిద్దరే కారణం..! అందమైన జంట..! అమ్మ, నాన్నా ఐ లవ్ యూ..! పెళ్లిరోజు శుభాకాంక్షలు.
నా కొత్త బొమ్మ..! (తొలి ఇన్‌స్టా పోస్ట్)
ఐ లవ్ యూ నాన్నా..!
‘క్రియేచర్ 3డి’ తెరవెనక చిత్రాలు..! విక్రమ్‌తో ఊటీలో గడ్డకట్టే చలిలో..!
హ్యాపీ హాలోవీన్..!
కుట్టిక్కనం..! భూతల స్వర్గం..!
హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి..! నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి!
నేను ఎవరి ఫొటో తీశానో చూడండి..! 2015లో డబూరత్నానీ క్యాలెండర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రాఫర్లు, స్నేహితులను ఇలా నా కెమెరాలో బంధించా..!
కొవ్వును తగ్గించుకోవడానికి దయచేసి ఇలా ప్రయత్నించకండి..! (నవ్వులు)
నేను, హృతిక్, మలైకా.. ఇంకా మా టీమ్!
2016 ఏప్రిల్ 30 మన పెళ్లిరోజు..! నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది, కానీ అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయి. నిజమైన ప్రేమంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేశావు (భర్త కరణ్‌సింగ్‌ను ఉద్దేశించి). థాంక్యూ మై లవ్..! హ్యాపీ మంకీ వర్సరీ! ఐ లవ్ యూ! వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచే పెళ్లిరోజు వేడుకలు ప్రారంభించి అందరినీ కంగారు పెట్టనని మాటిస్తున్నాను!
మీరు ఇష్టపడే అలవాటు ఒక్కటైనా ఉండాలి..!
సంగీత ప్రియులకు భూమి ఒక చక్కటి సంగీత సాధనం!
ప్రస్తుతం నా మూడ్ ఇలా ఉంది..!
ఫ్యాషన్ పేరుతో ఇలా చేయకండి..! జీన్స్ అంటే మాకు చాలా ఇష్టం, వాటిని ఇలా మార్చకండి... జీన్స్‌ని అసభ్యంగా ధరించకండి.. చాలా బాధగా ఉంది.
మేము చదువుతోంది ఐ థింక్ ఫిట్నెస్ కేఫ్ మెనూ..! ఏదో పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది కదూ..!!
నా పుట్టినరోజు నాడు ఎంతో సంతోషంగా ఉన్నాను..!
నేను నిన్ను ప్రేమిస్తోంది కేవలం నిన్ను చూసే కాదు.. నీతో ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆనందంగా ఉంటానన్న భావనను మరింతగా ప్రేమిస్తా.. ఆస్వాదిస్తా..!