scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'రెండున్నర నెలలు ఇంట్లోనే ఉన్నా.. అయినా నాకు కరోనా సోకింది !'

'ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా విషపు ఛాయలు అలుముకున్నాయి. మరి, ఈ మహమ్మారి బారిన పడకూడదంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం.. వంటివన్నీ చేయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి జాగ్రత్తలే తానూ తీసుకున్నానని, అయినా కరోనా బారిన పడ్డానని అంటోంది బంగ్లాదేశీ-అమెరికన్‌ బ్యూటీ బ్లాగర్‌ నబేలా నూర్‌. రెండున్నర నెలల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. అత్యవసర పనుల కారణంగా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకున్నానని, అయినా ఈ వైరస్‌ తనను వదల్లేదంటోంది. ఈ క్రమంలోనే తనకు వైరస్‌ ఎలా సోకింది? తనలో కనిపించిన లక్షణాలేంటి? రోజురోజుకీ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటోంది? తదితర విషయాల గురించి వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోందీ బబ్లీ గర్ల్‌.'

Know More

Movie Masala

 
category logo

మారింది దశాబ్దమే.. వీరి స్టార్‌డమ్‌ కాదు..!

Change over in Heroines from start to end of this decade 2010-2019

2019కి గుడ్‌బై చెప్పడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించేందుకు ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఒక విధంగా ఆలోచిస్తే మనం కేవలం 2019 సంవత్సరానికి మాత్రమే కాదు.. ఒక దశాబ్దానికి కూడా ముగింపు పలకబోతున్నాం. అవునండీ.. 2010 నుంచి 2019 వరకు పది సంవత్సరాలు.. అంటే ఒక దశాబ్దం పూర్తయిందన్నమాట. ఇక ఇప్పుడు కొత్త దశాబ్దం ఆరంభం కానుందిగడిచిన దశాబ్దంలో మనిషి జీవన విధానం దగ్గర నుంచి.. వాతావరణ పరిస్థితుల వరకు ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా ఈ దశాబ్దం (2010-2019) మన టాలీవుడ్‌ నటీమణుల్లో కూడా ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొందరు తారలు ‘సాధారణ నటి’ స్థాయి నుంచి ‘సూపర్‌ స్టార్‌’ స్థాయికి ఎదిగితే.. కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని తమ వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరిలో కొంతమంది అగ్ర తారల దశాబ్ది ప్రయాణం గురించి ఒకసారి నెమరు వేసుకుందాం..!

శ్రియ

decadeheroines650-1.jpg

దశాబ్దం ప్రారంభానికే శ్రియ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోందిఈ పదేళ్లలో తెలుగుతో పాటు తమిళమలయాళంహిందీఇంగ్లిష్‌ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిందీ భామనటిగా బిజీగా ఉన్న సమయంలోనే తను రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చీవ్‌తో ప్రేమలో పడిందివీళ్ల వివాహం 2018లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా జరిగిందిపెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శ్రియ.. ప్రస్తుతం మళ్లీ వరుస అవకాశాలతో బిజీగా మారింది.

త్రిష

decadeheroines650-2.jpg

ఈ దశాబ్దం మొదటి నుంచి చివరి వరకూ తమ ఫామ్‌ను అలాగే కొనసాగిస్తోన్న నటీమణుల్లో అందాల తార త్రిష ఒకరు. 2010లో తమిళంలో విడుదలైన ‘విన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేసావె’సినిమాతో తమిళంలో భారీ విజయాన్ని అందుకుందీ భామఅంతేకాదుఅదే సంవత్సరం ‘కట్టా మీఠా’ అనే సినిమాతో త్రిష బాలీవుడ్‌లోకి ఎంట్రీ కూడా ఇవ్వడం విశేషందీని తర్వాత తను అడపాదడపా తెలుగుమలయాళ సినిమాల్లో మెరిసినప్పటికీ.. ఎక్కువశాతం తమిళ సినిమాల్లోనే నటించిందీ భామగతేడాది విడుదలైన ‘‘96’, ‘హే జూద్‌’ సినిమాలు త్రిషకు విజయంతో పాటు ‘ఉత్తమ నటి’గా పలు అవార్డులను కూడా తీసుకొచ్చాయిఅంతేకాదు.. ప్రస్తుతం చిరంజీవికొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లు సినిమా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయిఇది కానీ నిజమైతే.. ఆ సినిమా త్రిషకు తెలుగులో కమ్‌బ్యాక్‌ చిత్రమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

అనుష్క

decadeheroines650-3.jpg

ఈ దశాబ్దంలో స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన తారల జాబితాలో అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుందిదశాబ్దం ప్రారంభంలో అప్పటికే విడుదలైన ‘అరుంధతి’ విజయంతో అనుష్క మంచి ఫామ్‌లో ఉందిఒక్క 2010లోనే అనుష్క నటించిన సినిమాలు విడుదలయ్యాయంటే.. నటిగా తనెంత బిజీగా ఉందో అర్ధమవుతోందిముఖ్యంగా అదే సంవత్సరం విడుదలైన ‘వేదం’ సినిమా అనుష్కకు నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చిందిఈ సినిమాలో తను పోషించిన ‘సరోజ’ అనే వేశ్య పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుందిఇక ఈ దశాబ్దంలో అనుష్కకు ప్రపంచవ్యాప్తంగా కీర్తిగుర్తింపును తీసుకొచ్చిన సినిమాలు ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదుఈ సినిమాల్లో అందంవీరత్వంగాంభీర్యంరాజసం కలగలిసిన ‘దేవసేన’ పాత్రలో తను పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలిఇవి కాకుండా ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’, ‘భాగమతి’, ‘ఓం నమో వేంకటేశాయ’.. మొదలైన సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిందీ మన స్వీటితను ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందేఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో కనిపించనుంది.

నయనతార

decadeheroines650-4.jpg

ఈ దశాబ్దం ప్రారంభంలో దక్షిణ పరిశ్రమకు సంబంధించి వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తారల్లో నయనతార కూడా ఒకరుఅప్పటివరకు కేవలం గ్రామర్‌ పాత్రలకే పరిమితమైన ఈ బ్యూటీ.. ఈ దశాబ్దం ప్రారంభం నుంచి తన పంథాను పూర్తిగా మార్చుకుందిపాత్రకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుందిఈ క్రమంలో తెలుగులో తను నటించిన ‘శ్రీరామరాజ్యం’, ‘సింహా’, ‘రాజా రాణి’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘అనామిక’, ‘సైరా’.. మొదలైన సినిమాలు నయన్‌కు నటిగా గుర్తింపుతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చాయిఅయితే.. ఈ దశాబ్దంలో నయన్‌ ఎక్కవశాతం తమిళ సినిమాల్లోనే నటించిందిప్రస్తుతం తను దక్షిణ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతుండడం విశేషం.

తాప్సీ

decadeheroines650-5.jpg

2010లో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది తాప్సీఈ దశాబ్దం మొదటి భాగం తాప్సీకి అంతగా కలిసి రాకపోయినా.. రెండో భాగం మాత్రం తనను సూపర్‌స్టార్‌గా నిలబెట్టిందిఅప్పటివరకు డల్‌గా కొనసాగుతోన్న తాప్సీ కెరీర్‌ ఒక్కసారిగా వరుస విజయాలతో పరుగులు పెట్టడం ప్రారంభించింది. 2016లో తను నటించిన ‘పింక్‌’ సినిమా తాప్సీకి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు తీసుకొచ్చిందిఈ క్రమంలో తను నటించిన ‘ది ఘాజీ అటాక్‌’, ‘జుడ్వా 2’, ‘సూర్మా’, ‘ముల్క్‌’, ‘మన్మర్జియా’, ‘బద్లా’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’.. మొదలైన విభిన్న కథా చిత్రాలు తనలో దాగున్న ‘సూపర్‌స్టార్‌’ని ప్రపంచానికి పరిచయం చేశాయిఇక తెలుగులోనే ‘గుండెల్లో గోదారి’, ‘ఆనందో బ్రహ్మ’, ‘గేమ్‌ ఓవర్‌’.. వంటి సినిమాలతో సక్సెస్‌ను మూటగట్టుకుందీ సొట్టబుగ్గల సుందరితాప్సీ ప్రస్తుతం ‘తప్పడ్‌’, ‘తడ్కా’, ‘శెభాష్‌ మిథూ’ సినిమాల్లో నటిస్తోంది.

కాజల్‌

decadeheroines650-6.jpg

సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోలకు ఉన్నంత క్రేజ్‌ హీరోయిన్లకు ఉండదుకాలం గడిచే కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గి అభిమానుల్లో తమకు ఉండే క్రేజ్‌డిమాండ్‌ క్రమంగా తగ్గిపోతుంటాయికానీకొంతమంది హీరోయిన్లు మాత్రం ఇందుకు భిన్నంసినిమాల విజయాలతో సంబంధం లేకుండా అభిమానులు వీళ్లను ఆరాధిస్తుంటారుఅందాల తార కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ కోవకు చెందిందేఈ దశాబ్దం ఆరంభంలో ‘డార్లింగ్‌’, ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’.. మొదలైన సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. 2011లో విడుదలైన ‘సింగం’తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిందిఆ తర్వాత తను తెలుగుతో పాటు.. తమిళంలోనూ వరుస విజయాలు అందుకుందిదశాబ్దం చివర్లో కాజల్‌ నటించిన సినిమాలు పెద్దగా ఆదరణ పొందకపోయినా అభిమానుల్లో తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదుఈ క్రమంలో కాజల్‌పై తమకున్న అభిమానాన్ని చాటేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 20న ‘World Kajalism Day’గా జరుపుకుంటున్నారు ఈ ‘చందమామ’ ఫ్యాన్స్‌.

అంతేకాదు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో త్వరలో కాజల్‌ మైనపు బొమ్మను ప్రదర్శించబోతున్నారుఈ గౌరవం అందుకున్న తొలి సౌత్‌ ఇండియన్‌ హీరోయిన్‌గా కాజల్‌ చరిత్రకెక్కడం విశేషంతను ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’, ‘ముంబయి సాగా’, ‘మోసగాళ్లు’.. తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

సమంత

decadeheroines650-7.jpg

2010లో వెండితెరకు దొరికిన ఆణిముత్యం.. అందాల తార సమంతతన తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’లో సహజమైన నటనతో ప్రేక్షకులను నిజంగానే మాయ చేసిందీ బ్యూటీఆ తర్వాత తెలుగుతమిళ పరిశ్రమల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిందీ తారఈ క్రమంలో తను నటించిన ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’, ‘జనతా గ్యారేజ్‌’.. మొదలైన సినిమాలు విజయాలు అందుకొని తనను సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయిసాధారణంగా వివాహం తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటుంటారుకానీసమంత మాత్రం వివాహం తర్వాత సినిమాల్లో మరింత చురుగ్గా ఉంటోందిఈ క్రమంలో 2018లో సమంత నటించిన ఆరు సినిమాలు విడుదలవడం విశేషంపెళ్లి తర్వాత స్క్రిప్ట్‌ సెలెక్షన్‌ విషయంలో సామ్‌ తన పంథాను పూర్తిగా మార్చుకుందనే చెప్పాలిఈ క్రమంలో తను నటించిన ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూ-టర్న్‌’, ‘సూపర్ డీలక్స్‌’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’.. తదితర సినిమాలు సమంతను లేడీ సూపర్‌స్టార్‌ని చేశాయికేవలం సినిమాలతోనే కాదు సామాజిక కార్యక్రమాల్లోనూ సమంత చురుగ్గా ఉంటూ తన మంచి మనుసును చాటుకుంటోంది.

తమన్నా

decadeheroines650-8.jpg

ఈ దశాబ్దం ప్రారంభంలో తమన్నా కెరీర్‌ కాస్త డల్‌గా ఉన్నప్పటికీ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుందిఈ క్రమంలో తను నటించిన ‘100% లవ్‌’, ‘బద్రినాథ్‌’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’.. మొదలైన సినిమాలు తనకు మంచి విజయాలను అందించాయిఅంతేకాదు.. 2013లో విడుదలైన ‘హిమ్మత్‌వాలా’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకుందీ మిల్కీ బ్యూటీఆ తర్వాత దక్షిణ పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తమన్నా పలు సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 2015, 2017లో విడుదలైన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల్లో ‘అవంతిక’ పాత్రలో ఒదిగిపోయిందీ పాలరాతి శిల్పంఇక ఈ ఏడాది విడుదలైన ‘సైరా’ , ‘పెట్రోమ్యాక్స్‌’ సినిమాల్లో తమన్నా నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కడం విశేషంతను ప్రస్తుతం ‘బోలే చూడియా’ (హిందీ), ‘సీటీమార్‌’ (తెలుగుసినిమాల్లో నటిస్తోందిమహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించనుంది.

వీళ్లతో పాటు మరెందరో తారలు ఈ దశాబ్దంలో మనల్ని అలరించగా.. మరి కొంతమంది తారలు కొత్త దశాబ్దంలో మనల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ల ప్రయాణం కూడా విజయవంతంగా సాగాలని వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!

women icon@teamvasundhara
corona-virus-janhvi-kapoor-on-being-lady-of-the-house-post-sridevi-demise

వాళ్లిద్దరినీ ‘అమ్మ’లాగా చూసుకుంటోంది !

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’ తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని అందంతో పాటు నటన కూడా తన రక్తంలోనే ఉందని నిరూపించింది. శ్రీదేవి అకాల మరణం తర్వాత బాలీవుడ్‌లో ఆమె స్థాయిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న జాన్వీ ఇంట్లో కూడా తన తల్లి మిగిల్చి వెళ్లిన బాధ్యతలను భుజాలకెత్తుకుంది. ఈక్రమంలో లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె.. తండ్రి బోనీ కపూర్‌, సోదరి ఖుషీ కపూర్‌ల యోగక్షేమాలను దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఆపత్కాలంలో ‘అమ్మ’ లేని లోటు కనిపించకుండా వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ సమకూరుస్తోంది.

Know More

women icon@teamvasundhara
nandita-das-short-film-on-domestic-violence-implores-us-to-listen

గుసగుసగా చెప్పు... అరచి చెప్పు... కానీ చెప్పకుండా దాయద్దు !

‘స్టే హోమ్‌...స్టే సేఫ్‌’ అనే నినాదంతో కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ...ఈ లాక్‌డౌన్‌ కాలంలో కొందరిళ్లలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా పిల్లలు, పెద్దలు అంతా ఇంటిపట్టునే ఉండడం వల్ల పనిభారంతో మహిళలందరూ సతమతమవుతున్నారు. ఇక కొందరు ఉద్యోగినులు అయితే ఇంటి నుంచే పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇదే సమయంలో కొందరు మహిళలు గృహహింసతో నలిగిపోతున్నారు. శారీరకంగా, మానసికంగా వేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు సెలబ్రిటీలు గృహహింస బారిన పడిన మహిళలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ విషయంలో మౌనం వీడండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ విలక్షణ నటి, డైరెక్టర్‌ నందితా దాస్‌ గృహహింసపై ఓ సందేశాత్మక లఘుచిత్రంతో మన ముందుకు వచ్చింది.

Know More

women icon@teamvasundhara
samantha-bags-10m-followers-on-instagram

కోటిమంది ప్రేమాభిమానాలకు ప్రతీక ఇది !

సమంత... తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. పెళ్లయ్యాక కథాబలమున్న చిత్రాల్లో నటిస్తూ, విభిన్న తరహా పాత్రల్లో ఒదిగిపోతూ సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకుందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేస్తుంటుంది. ఇలా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటున్న సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా పది మిలియన్ల(కోటి)కు చేరుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
samantha-shares-funny-post-on-nagachaitanya

women icon@teamvasundhara
actress-sanghavi-welcomes-her-baby-girl

నా లిటిల్‌ ఏంజెల్‌ ఇదిగో!

‘హాయ్‌ రే హాయ్‌...జాంపండు రోయ్‌’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘సీతారామరాజు’, ‘సమరసింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘చిరంజీవులు’, ‘సందడే సందడి’ తదితర చిత్రాల్లో సందడి చేసిందీ ముద్దుగుమ్మ. తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లోని అగ్రహీరోలందరితోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ సొగసరి తన అందం, అభినయంతో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈక్రమంలో నాలుగేళ్ల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంఘవి 42ఏళ్ల వయసులో ఇటీవల అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేసింది.

Know More

women icon@teamvasundhara
sushmita-sen-shares-how-practicing-nunchaku-helped-her-heal-from-addisons-disease

women icon@teamvasundhara
shilpa-shetty-opens-up-on-why-she-chose-surrogacy

అందుకే ‘సరోగసీ’ ద్వారా రెండోసారి అమ్మయ్యాను!

పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మ పిలుపు కోసం ఆరాటపడుతుంటారు. అయితే వివిధ రకాల అనారోగ్యాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఇలా పిల్లలు లేని జంటలకు వరంగా మారుతోంది ‘సరోగసీ’. ఈమేరకు కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి కూడా సరోగసీ ద్వారానే రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఆమె తన మాతృత్వానికి సంబంధించి పలు విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. సరోగసీ ద్వారా ఎందుకు రెండోసారి బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందో ఈ సందర్భంగా పంచుకుందీ బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
corona-virus-dia-mirza-becomes-unep-goodwill-ambassador-for-the-second-time

ఆ మంచి మార్పు ఇలాగే కొనసాగాలి!

దియా మీర్జా... కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె మోడల్‌గా మెరిసి.. 2000లో ‘మిస్‌ ఏషియా పసిఫిక్‌’ కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందీ హైదరాబాదీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా పర్యావరణ సమస్యలు, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తోంది. ఈక్రమంలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా మరోసారి యునైటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తాజాగా ఎంపికైంది దియా. ఈక్రమంలో మరో రెండేళ్ల పాటు (2022 ముగిసే వరకు) ఆమెను ఈ హోదాలో కొనసాగించనున్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది.

Know More

women icon@teamvasundhara
here-are-the-mothers-day-wishes-from-our-celebrities
women icon@teamvasundhara
raashi-khanna-twitter-chat-with-her-fans

నా పాజిటివిటీ రహస్యం అదే!

‘ఏం సందేహం లేదు.. ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది.. ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది.. ఏం సందేహం లేదు.. ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది..!’ ఈ పాట వింటే మన కళ్ల ముందు కదలాడే అందం.. రాశీ ఖన్నా..! ‘మద్రాస్‌ కేఫ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ‘ఊహలు గుసగుసలాడే’, ‘సుప్రీమ్‌’, ‘జై లవకుశ’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’.. తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రాశి ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఈ భామ.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో రాశి ఇటీవల ట్విట్టర్‌ వేదికగా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలిచ్చింది మన ‘బెల్లం శ్రీదేవి’.

Know More

women icon@teamvasundhara
amala-paul-questioned-mans-role-in-women-life

ఆ ‘ఐ లవ్యూ’లో ఉన్నదంతా నిజమైన ప్రేమ కాదు!

అమలాపాల్‌.. తెలుగునాట చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయిలా ఇక్కడి అభిమానులకు దగ్గరైందీ క్యూట్‌ గర్ల్‌. ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. ‘లవ్‌ ఫెయిల్యూర్‌’తో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘నాయక్‌’, ‘ఇద్దరమ్మాయిలతో’.. చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇటీవల ‘ఆమె’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ బ్యూటీ.. ఈ క్వారంటైన్‌ సమయాన్ని ఇంట్లో గడుపుతూ.. బుక్స్‌ చదవడంలో నిమగ్నమైంది. కేవలం చదవడమే కాదు.. అందులోని విషయాల గురించి సమాజాన్ని ప్రశ్నిస్తోంది.. నాటి నుంచి ఆడవాళ్లే ఎందుకు అన్ని బాధల్నీ అనుభవించాలి? ఈ విషయాలన్నీ మగాళ్లకు ఎందుకు పట్టవు? అంటూ తన సూటి ప్రశ్నలతో ఆడవారి బాధల్ని కళ్లకు కట్టినట్లు చూపుతూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది అమల.

Know More

women icon@teamvasundhara
actresses-condolences-to-irrfan-khan-rishi-kapoor

మీరు లేని లోటు పూడ్చలేనిది.. మీతో అనుబంధం మరపురానిది!

2020 మనుషులకు ఎన్నో చేదు జ్ఞాపకాలను అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరోనా విజృంభణతో దేశ ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు బాలీవుడ్‌ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. భారతదేశం గర్వించదగ్గ నటులుగా కీర్తి గడించిన ఇర్ఫాన్‌ ఖాన్‌ (53), రిషీ కపూర్‌(67)లు ఇద్దరూ ఒకరోజు వ్యవధిలోనే మృతి చెందడంతో అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు సినీ ప్రముఖులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నటుల అంతిమసంస్కార కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నందుకు పలువురు నటీనటులు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీళ్లు సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఇర్ఫాన్‌, రిషీ కపూర్‌లకు కడసారి వీడ్కోలు పలుకుతూ.. వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

Know More

women icon@teamvasundhara
here-are-the-quarantine-activities-of-our-tv-anchors

ఇంట్లోనే ఉంటూ మనసు మాట వింటున్నారు..!

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో కఠినంగా పాటిస్తున్నారంతా. అయితే అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్‌ని సద్వినియోగం చేసుకునేందుకు అందరూ రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. వీరిలో తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న వారు కొందరైతే.. ఇంట్లో ఉంటూనే తమ వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తోన్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో టీవీ షోస్‌ షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉండే మన తెలుగు టీవీ యాంకర్లకు కూడా లాక్‌డౌన్‌తో కాస్త బ్రేక్‌ దొరికినట్లయ్యింది. దాంతో అటు తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూనే.. ఇటు తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరి, ఈ క్వారంటైన్‌ సమయాన్ని వాళ్లు ఎలా గడుపుతున్నారో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
happy-birthday-samantha-here-are-some-interesting-insta-posts-of-this-beauty

నేను ఎంచుకున్న.. నన్ను ఎంచుకున్న జీవితానికి థ్యాంక్స్‌!

ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత. గ్లామర్‌, లేడీ ఓరియంటెడ్‌, హోమ్లీ, థ్రిల్లర్‌, ప్రయోగాత్మక, సందేశాత్మక, సెంటిమెంట్‌.. ఇలా ఏ జోనర్‌కు చెందిన పాత్రైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ట్యాలెంట్‌, శ్రమించేతత్వం, సరైన కెరీర్‌ ప్లానింగ్‌ ఉంటే హీరోయిన్లు వివాహం తర్వాత కూడా తమ ఫామ్‌ను కొనసాగించొచ్చని చెప్పడానికి సమంతే ఓ ఉదాహరణ. అయితే కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉండడం సామ్‌ ప్రత్యేకత. ఏప్రిల్‌ 28 సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon@teamvasundhara
lockdown-dairies-of-bollywood-beauty-sunny-leone

లాక్‌డౌన్‌లో పిల్లలతో ఇలా గడుపుతున్నా..!

లాక్‌డౌన్‌ వల్ల కరోనా నియంత్రణ సంగతేమో గానీ.. కుటుంబమంతా ఒకే చోట ఉండడం వల్ల మహిళలకు పని భారం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా పిల్లలను నియంత్రించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఒక్కరుంటేనే పెద్దలకు చుక్కలు చూపిస్తారు.. అదే ఇక ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే.. టాప్‌ లేచిపోయేలా అల్లరి చేయడం ఖాయం. ఇలాంటి పరిస్థితులు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ కామనే. అందుకే ఇలాంటి పరిస్థితుల్ని ఎలా డీల్‌ చేయాలో మనందరికీ చిట్కాలు అందించింది బాలీవుడ్‌ యమ్మీ మమ్మీ సన్నీలియోని. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తాను తన ముగ్గురు పిల్లలతో పాటు.. ఇంటిని ఎలా బ్యాలన్స్‌ చేసుకుంటోందో ఓ వీడియో ఇంటర్య్వూ ద్వారా చెప్పుకొచ్చిందీ క్యూట్‌ మామ్‌. మరి, ఆ విశేషాలేంటో సన్నీ మాటల్లోనే..

Know More

women icon@teamvasundhara
celebs-pledge-to-heal-the-nature-on-world-earth-day

ప్రేమించే పెద్దమ్మను ఇష్టంగా గుండెకు హత్తుకుందాం..!

‘ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం.. కన్నెర్రయితే నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం..’ అన్నాడో సినీ కవి. ప్రకృతిని, భూమిని కాపాడుకుంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా మన మనుగడ సాగుతుంది.. మన నిర్లక్ష్యంతో వాటిని నాశనం చేయాలని చూస్తే ఆ ప్రకోపానికి మనం బలవక తప్పదు.. అని ఈ పాటలోని అంతరార్థం. అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటోన్న పరిస్థితులు మనకు ఇదే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఇన్నాళ్లూ మన విచక్షణా రహిత చర్యల కారణంగా భూమాతకు, ప్రకృతికి ఎంతో కష్టం, నష్టం కలిగించాం.. ఆ ఫలితాన్ని ఇప్పుడు మనమంతా ఎదుర్కొంటున్నాం.

Know More

women icon@teamvasundhara
tollywood-beauties-participate-in-pass-the-brush-challenge-videos-went-viral

‘నో మేకప్‌’ నుంచి ‘విత్‌ మేకప్‌’.. ఎలాగో చూశారా..?

కరోనా కారణంగా ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఈ వైరస్‌ మనుషులను భౌతికంగా దూరం చేయగలిగింది కానీ, మానసికంగా ఒకరికొకరు చేరువగానే ఉంటున్నారు. ఈ క్రమంలో దాదాపు గత నెల రోజులుగా స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నప్పటికీ.. టెక్నాలజీ సహాయంతో పరోక్షంగా వాళ్లతో సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో వాళ్లతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, వీడియో గేమ్స్‌ ఆడడం.. ఇలా లాక్‌డౌన్‌లో ఉంటూనే రకరకాల పనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతేకాదు, సోషల్‌ మీడియాలో పలు ఛాలెంజ్‌లలో సైతం పలువురు పాల్గొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలో సినీ, టీవీ రంగాలకు చెందిన కొంతమంది తారలు ఇటీవల #Passthebrushchallenge ('పాస్ ది బ్రష్' ఛాలెంజ్‌) లో పాల్గొన్నారు. మరి ఆ విశేషాలేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
have-leftover-rice-at-home?-sameera-reddy-shows-how-to-make-rotla-with-it

అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా రొట్టె చేసేయండి!

అది లంచ్‌లోనైనా, రాత్రి డిన్నర్‌లోనైనా మనం, మనింట్లో కుటుంబ సభ్యులందరూ తినగా అప్పుడప్పుడూ కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని మరుసటి రోజు తినేవారు కొందరైతే.. వృథాగా బయటపడేసే వారు మరికొందరు. అయితే ఇలా మిగిలిపోయిన పదార్థాలతో ఎంతో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చని చెబుతోంది బాలీవుడ్‌ లవ్లీ మామ్‌ సమీరా రెడ్డి. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తోన్న ఈ బబ్లీ బ్యూటీ.. తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కూడా మనందరికీ పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన రొట్టె ఎలా తయారుచేయచ్చో తన అత్తయ్యతో కలిసి రెసిపీ తయారుచేసి చూపించింది సమీర.

Know More

women icon@teamvasundhara
how-lara-dutta-celebrated-her-42nd-virtual-birthday

ఇంతటి అందమైన భర్తనిచ్చినందుకు థ్యాంక్యూ!

లారాదత్తా... బాలీవుడ్‌ సినిమాలు చూసే వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మొదట ‘మిస్‌ యూనివర్స్‌’గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత బాలీవుడ్‌ వెండితెరపై కథానాయికగా తళుక్కుమని మెరిసింది. హీరోయిన్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, ప్రత్యేక గీతాలతోనూ, విభిన్న పాత్రలతోనూ అంతే పేరు సొంతం చేసుకుంది లారా. తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ మిస్‌ యూనివర్స్‌.. తాజాగా 42 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే తన భర్త మహేష్‌ భూపతి, కూతురు సైరాతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొంది.

Know More

women icon@teamvasundhara
lockdown-dairies-of-milky-beauty-tamannaah-bhatia

లాక్‌డౌన్‌లో మన మిల్కీ బ్యూటీ ఏం చేస్తోందో చూశారా?

మిల్కీ బ్యూటీ.. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు కదలాడే పాలరాతి శిల్పం తమన్నా కాక ఇంకెవరు..! తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది తమ్మూ. పాత్రల ఎంపికలో పర్‌ఫెక్ట్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గదు. అందుకే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైనా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోందీ మిల్కీ బేబ్‌. అంతేకాదు.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌, చేసే వ్యాయామాలు, పాత జ్ఞాపకాలు.. ఇలా బోలెడన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తమన్నా పంచుకున్న క్వారంటైన్‌ డైరీస్‌లోని కొన్ని అంశాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
celebrities-childhood-pics-during-lockdown-is-so-cute-to-see